శైలపుత్రి

     

         అవతారాలలో మొదటి అవతారం శైలపుత్రిమాత. ఆదిపరాశక్తిని కూతురిగా పొందటానికి హిమవంతుడు, మేనకా తపస్సును చేసారు. ఆదిపరాశక్తి వారి తపస్సుకు మెచ్చి వారికీ కూతురిగా పుడతాను అని వరం ఇచ్చింది. వారి తపస్సు ఫలించినందుకు వారు సంతోషించారు. ఆ మాత రాక కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఒక శుభదినమున మేనకా గర్భవతి అయినది. అప్పటినుండి మేనకా, హిమవంతులు మహర్షులకు సేవ చేస్తూ అమ్మవారి రాక కోసం ఎదురు చుస్తునారు. ఒక  శుభముహుర్తమున మేనకా ప్రసవించింది. అందుకు హిమవంతుడు సంతోషించి మహర్షులకు దానధర్మాలు చేసారు. పర్వతరాజు పుత్రి పార్వతి అని పిలిచారు.  శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతుని కుమార్తె కాబటి శైలపుత్రి అని పిలిచారు. 



        మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు ఆదిపరాశక్తి శైలపుత్రిదేవిగా వచ్చింది. 

         యోగమార్గంలో ఉన్నవారు ఇంకా ఆధ్యామికంగా ఎదగాలి అనుకునేవారు శైలపుత్రిమాతను ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఉన్నత స్థానాలకు చేరవచ్చు అని దేవి భాగవతం,  శివ పురాణం చెపుతున్నాయి. మూలాధార చక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రిమాత. శైలపుత్రిమాత మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది. 

      శైలపుత్రి మాత శివుని కోసం తపస్సు చేసి భర్తగా పొందింది. ఆమె నందిపై కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకికంగా తండ్రి అయినా హిమవంతుడి నుండి భర్త అయినా శివుని వెతుక్కుంటూ ప్రయాణించింది.

               -: శైలపుత్రి ధ్యానం:-

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరం 

వృషారూఢం శూలధరాం శైలపుత్రీo యశస్వనీమ్

                           -:అర్ధం:-

వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశశ్శు కలిగి భక్తుల మానః వాంఛలను తీర్చే మాత శైలపుత్రీ దుర్గ దేవికి నా వందనం ఆర్పుస్తున్నాను. 

          -:శైలపుత్రీదేవి ఆలయం:-

ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలో మర్హియ ఘాట్ వద్ద శైలపుత్రీ దేవి ఆలయం ఉంది.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...