చంద్రఘంటా

          దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం చంద్రఘంటా . చంద్రఖండ, చండికా, రణచండీ అని కూడా ఈ అమ్మవారిని పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రాకారంతో, గంట కలగి ఉన్నది అని అర్ధం. చంద్రఘంటా దేవి ధైర్యానికీ, శక్తికీ, తేజస్సుకూ ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించినవారి పాపాలు, ఈతిబాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది.

          శివుడు, పార్వతి దేవిని వివాహం చేసుకోవటానికి ఒప్పుకున్నా తరువాత మేనకా, హిమవంతులు కూడా సంతోషించారు. పెళ్లి రోజున శివుడు దేవతలు,  మునులు, తనగణములు, శ్మశానంలో తనతో ఉండే భూత, ప్రేత, పిశాచాలతోను, తరలి విడిదికి వస్తాడు. వారందరిని,  శివుని వేషాన్ని చూసి మేనకా కళ్ళు తిరిగి పడిపోతుంది. పార్వతిమాత చంద్రఘంటా దేవి రూపంలో  శివునికి దర్శనం ఇస్తుంది. తన కుటుంబం భయపడకుండా ఉండేలా శివుడిని రూపం మార్చుకోమని కోరుతుంది. ఆమె కోరికను మనించి శివుడు రాజకుమారుడిలా తయారవుతాడు.  వివాహ సమయంలో మొదటి సారి పార్వతీధరిస్తుంది దేవి చంద్రఘంటా దేవి అవతారం ధరిస్తుంది. 

శివ, పార్వతులకు కౌషికి అనే కుమార్తె జన్మిస్తుంది. శుంభ, నిశుంభులను సంహరించామని పార్వతిమాతను ప్రాదించారు. అమ్మవారు యుద్ధం చేస్తుండగా, ఆమె అందం చూసి రాక్షుసులు మోహితులు అవుతారు. ఆమెను తన తమ్మునికి నిశంభునికి ఇచ్చి వివాహంచేయాలని శంభుడు అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ధూమ్రలోచనుణ్ణి కౌశికిని ఎత్తుకు రమ్మని పంపిస్తారు. అమ్మవారు మరల రెండొవసారి చంద్రఘంటా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి అతని పరివారాన్ని సంహరిస్తుంది.

              చంద్రఘంటా దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది. పులి మీదగానీ, సింహంమీదగానీ ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికీ ప్రతీకలు.  అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా, ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూంటుంది.

         చంద్రఘంటా దేవిని ఈరోజు యోగులు మణిపూరక చక్రంలో సాధన చేస్తారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...