Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 9

మచ్చిత్తా మద్గతప్రాణా భోధయంతః పరస్పరమ్ |

కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతిచ ||

అర్థం :-

నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నం చేస్తారు. తమ ప్రాణములను, తమ కర్మలన్నింటిని, తమ సర్వస్వము నాకే అంకితం చేస్తారు. వారు పరస్పర చర్చలద్వారా నా మహత్త్వము గూర్చి ఒకరికొకరు తెలుపుకొను, కథలు కథలుగా చెప్పుకొంటు, నిరంతరము సంతుష్టులు అవుతున్నారు. 



Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 8

అహం సర్వస్వ ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే |

ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః |

అర్థం :-

ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూలకారణము. నావలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును భాగా తెలిసిన జ్ఞానులైన భక్తులు భక్తిశ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 7

ఏతం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః |

సో వికంసేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ||

అర్థం :-

ఈ నా పరమైశ్వర్యరూపవిభూతిని, యోగశక్తి యొక్క తత్త్వమును తెలిసికొన్నవాడు నిశ్చలభక్తియుక్తుడగును. ఇందు ఏ మాత్రము సందేహమే లేదు. 



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 6

మహర్షయః సప్త పూర్వే చత్వారోమనవస్తథా |

మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ||

అర్థం :-

సప్తమహర్షులు, వారికంటే పూర్వులైన సనకాదిమహామునులు నలుగురు, స్వాయంభువాది చతుర్ధశ మనువులు మొదలగు వీరందరు నా భక్తులే. అందరూ నాయెడ సద్భావము గలవారే. వీరు నా సంకల్పము వలననే జన్మించారు. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులు వీరి సంతానమే. 



Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 4

బుద్ధిర్ జ్ఞనమసమ్మోహః క్షమః సత్యం దమః శమః |

సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ ||

శ్లోకం 5

అహింసా సమతా తుష్టిః తపో దానం యశో యశః |

భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ||

అర్థం :-

నిశ్చయాత్మకశక్తి, యథర్థజ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖ దుఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, అనునవి ప్రాణుల వివిద భావములు. ఇవి యన్నియును నావలననే కలుగును.




Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 3

యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |

అసమ్మూఢః మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ||

అర్థం:-

నన్ను యథార్థముగా జన్మరహితునిగాను, అనాదియైన వానినిగానుసకలలోక మహేశ్వరునిగాను తెలిసికొనువాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వపాపముల నుండియు విముక్తుడవుతాడు.



Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 2

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః |

అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చసర్వశః ||

అర్థం :-

అవి మిక్కిలి గోప్యమైనవి. మహిమాన్వితమైనవి. నా ఉత్పత్తిని అనగా నా లీలావతారవిశేషములను దేవతలుగాని మహర్షులుగాని తెలిసికోలేరు. ఏలనన, నేనే అన్ని విధాలుగా ఆ దేవతలకు, మహర్షులకు మూలకారణమైనవాడను.



Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 10

అథ దశమో ద్యాయః - విభూతియోగః

శ్లోకం 1

శ్రీ భగవాన్ ఉవాచ

భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః |

యత్తే హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా ||

అర్థం :-

శ్రీ భగవానుడు పలికెను - హే! మహాబాహో! నీవు నా మీద ప్రేమ గలవాడవు. కావున, నీమేలుగోరి నేను మరల చెప్పుచున్న వచనములను వినుము.



Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 34

మన్మనా భవమద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |

మామేవైష్యసి యుక్త్వైవమ్ ఆత్మనం మత్పరాయణః ||

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే శ్రీకృష్ణర్జునసంవాదే రాజవిద్యారాజగుహ్యయోగోనామ నవమోద్యాయః

అర్థం :-

నా యందే నీ మనస్సు లగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము. నన్నే పూజింపుము. నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి, మత్పరయణుడవైనచో నీవు నన్నే పొందగలవు.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 33

కిం పునర్ర్బాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |

అనిత్యమసుఖం లోకమ్ ఇమం ప్రాప్య భజస్వ మామ్ ||

అర్థం :-

ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులును భక్తులును నన్ను శరణుపొందినచో, వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనిలేదు. ఈ మానవశరీరము క్షణభంగురము. సుఖరహితము. ఐనను దుర్లభము. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము. 



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 32

మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే పి స్యుః పాపయోనయః |

స్త్రియో వైశ్యస్తథా శూద్రాః తే పి యాంతి పరాం గతిమ్ ||

అర్థం :-

ఓ అర్జునా! స్త్రీ, వైశ్య, శూద్రులును, అట్లే చండాలాదిపాపయోనిజులు నన్నే శరణుపొంది పరమగతినే పొందుతారు. 



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 31

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి |

కౌంతేయ ప్రతి జానీహి న మే భక్తః ప్రణ్యశ్యతి ||

అర్థం :-

కౌంతేయా! అతడు శీఘ్రముగా ధర్మాత్ముడవుతాడు. శశ్వతమైన పరమశాంతిని పొందుతాడు. 'నా భక్తుడెన్నడు నష్టమునకు గురికాడు' అను విషయాని నిశ్చయముగా తేలుసుకొ.


   
     

శ్రీ కృష్ణ - అఘాసుర వధ

శ్రీ కృష్ణ - అఘాసుర వధ



శ్రీ కృష్ణుడు బకాసుర సంహారం చేసిన తరువాత రోజు మళ్ళీ చద్దన్నం కట్టుకొని లేగదూడలను తీసుకొని అడవికి వెళ్లరు. ఆ రోజు బలరాముడు అడవికి రాలేదు. శ్రీ కృష్ణుడు ముందు నడుస్తుంటే వెనక ఉన్న గోపాలబాలురు అందరూ మన అందరిలో ఎవరైతే ముందువెళ్లి శ్రీ కృష్ణుడిని పట్టుకుంటే వాళ్ళు గెలిచినట్టు అని పందెం పెట్టుకున్నారు. అందరూ పరిగెత్తటం మొదలు పెట్టారు. అందులో శ్రీధాముడు ముందు వెళ్లి శ్రీకృష్ణుడికి పట్టుకున్నారు. నేనే గెలిచాను అని సంతోషంతో శ్రీధాముడు తిరిగాడు. గోపాలబాలురు అందరూ శ్రీ కృష్ణుడితో కలిసి ఆదుకున్నారు. శ్రీ కృష్ణుడి మీద పడి ఆడుకున్నారు. అలా ఆడుకుంటూ వెళుతుండగా గోపాలబాలురుకి ఒక ఎనిమిది కిలోమీటరుల పొడవు ఉన్న కొండ చిలువ అడాసురుడనే రాక్షసుడు నోరు తెరుచుకొని ఉన్నది అది వాళ్ళకి కొండగుహల కనిపిచింది. దాని నుండి ఉచ్ఛస్వ నిశ్వాసలు వేడిగా వస్తున్నాయి. గోపాలబాలురు లోపలి వెళదామని అనుకొన్నారు. అందులో ఒకరు ఒరే ఇది ఏమైనా రాక్షసుడేమోరా లోపలి వెళితే మనలని మింగేస్తుందేమో అనుకున్నాడు. అందరూ శ్రీ కృష్ణుడు ఉండగా మనకు భయమేముంది అని వెనక్కి తిరిగి శ్రీ కృష్ణుడిని చూసారు. శ్రీ కృష్ణుడు నవ్వుతు కనిపించారు. అది చుసిన గోపాలబాలురు ఇంక మనకు భయము లేదు అని లోపలి వెళ్లిపోయారు. గోపాలబాలురు, గోవులు లోపలికి వెళ్లగానే నాలుకతో వాళ్ళని పొట్టలో పడేసుకుంది. లోపలవేడికి గోపాలబాలురు, గోవులు మరణించారు. తరువాత శ్రీ కృష్ణుడు లోపలకి వెళ్లారు. శ్రీ కృష్ణుడు లోపలి వెళ్లగానే అఘాసురుడు నోరు మూసేసాడు. శ్రీ కృష్ణుడు గొంతులోనుంచి లోపలి వెళ్లకుండా అక్కడే ఆగిపోయి పెద్దగా పెరిగిపోయారు. ఆలా పెరిగిన శ్రీ కృష్ణుడు వల్ల గొంతు ముసుకుపోయి ఊపిరి ఆడక చనిపోయాడు అఘాసురుడు. అతని తల నుంచి బొటన వేళ్ళు అంత జ్యోతి వచ్చి ఆకాశంలోకి వెళ్లి నుంచుంది. శ్రీ కృష్ణుడు దాని నోరు తెరచి చనిపోయిన గోపాలబాలురు, గోవులను బయటకు తీసుకువచ్చి ఒకొక్కలని భ్రతికించారు. గోపాలబాలురకు సంతోషం వేసి గంతులువేస్తూ శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ కొమ్ముబూరల ఊదుతూ శ్రీకృష్ణుడి చుట్టు తిరుగుతున్నారు. దేవతలు ఈ దృశ్యం చూసి పులా వాన కురిపించి తపేటలు తాళాలు వాయించారు. ఇలా జరుగుతున్న సమయంలో ఆకాశంలో ఉన్న అఘాసుర జ్యోతి వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. ఈ లీలను గోపాలబాలురు బృందావనంలోని తలితండ్రులకు సంవత్సరం తరువాత చెపుతారు.

అది ఎలాగో వచ్చేభాగంలో తెలుసుకుందాము. 

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 30

అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ |

సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ||

అర్థం :-

మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన, యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మరియోకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 29

సమో హం సర్వభూతేషు నమే ద్వేష్యో స్తి న ప్రియః |

యో భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ||

అర్థం :-

నేను సకలభూతముల యందును సమభావముతో వ్యాపించి యుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని, నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారియందు ప్రత్యక్షముగా ఉందును. 



Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 28

శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః |

సన్న్యసమోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి||

అర్థం :-

ఈ విధముగా సన్న్యాసయోగమునందు స్థిరచిత్తుడవై, అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుభాశుభఫలరూప కర్మబంధముల నుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే చేరగలవు.





శ్రీ కృష్ణ - బకాసుర వధ

శ్రీ కృష్ణ - బకాసుర వధ



శ్రీ కృష్ణుడు వత్సాసురుడిని వధించిన తరువాత రోజునే మల్లి శ్రీ కృష్ణుడు, బలరాముడు, గోపాలబాలురు లేగదూడలను తీసుకొని మళ్ళీ అడవుల్లోకి వెళ్లరు. ఈ రోజు బలరాముడు, గోపాలబాలురు వెనక నడుస్తుంటే కొంచం ముందు శ్రీ కృష్ణుడు ముందు నడుస్తున్నారు. అక్కడ పర్వతమంత ఎత్తున ఉన్న ఒక తెల్ల కొంగ జపం చేస్తునట్టు కదలకుండా నోరు తెరుచుకొని దీక్షగా కూర్చుంది. ఈ కొంగ బకాసురుడు అనే రాక్షసుడు. పూతన అనే రాక్షసికి సోదరుడు. తన సోదరిని చంపినా శ్రీ కృష్ణుడిని చంపటానికి కంసుడు పంపగా వచ్చాడు. శ్రీ కృష్ణుడు దానిని చూసారు. ఆ వచ్చింది రాక్షసుడు అని తెలుసు కొని దాని దగరకు వెళ్లరు. శ్రీ కృష్ణుడు దగరకు రావటంతో వెంటనే నోటిలో వేసేసుకుంది. ఈ దృశ్యం చుసిన బలరాముడు, గోపాలబాలురు కదలిక లేకుండా పడిపోయారు. శ్రీ కృష్ణుడు ఏది చూసి కొంగ గొంతులో అడంగా ఉండి అగ్ని గోళంగా మారారు. కొంగా ఆ వేడిని తట్టుకోలేక శ్రీ కృష్ణుడు బయటకు వదిలేసింది. బయటకు కృష్ణుడు రాగానే కింద పడిపోయిన బలరాముడు, గోపాలబాలురకు మెలకువ వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే శ్రీ కృష్ణుడు కొంగ ముక్కును రెండుగా చీల్చారు. కొంగ రూపంలో ఉన్న బకాసురుడు మరణించాడు. బకాసురుడు మరణించగానే అతనిలోనుంచి ఒక తేజస్సు బయటకు వచ్చి శ్రీ కృష్ణుడిలో కలిసిపోయింది. శ్రీ కృష్ణుడు, బలరాముడు, గోపాలబాలురు సాయంత్రం ఇంటికి రాగానే యశోదమ్మకు జరిగిన విషయం చెప్పారు. యశోదమ్మ ఈ సారి భయపడలేదు. రాక్షసులు ఇలాగే వస్తుంటారులే నా కృష్ణుడికి ఏమి కాదు అని అనుకోను ఊరుకుంది. 

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 27

యత్యరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |

యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ||

అర్థం :-

ఓ కౌంతేయా! నీవు ఆచరించు కర్మను, భుజించేడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము.




శ్రీ కృష్ణ - వత్సాసుర వధ

శ్రీ కృష్ణ - వత్సాసుర వధ



నందవ్రజంలో నుంచి గోపాలకులు బృందావనం వెళ్లరు. కొన్నాళ్లకి నందుడు, గోపాలకులు అందరూ ఇల్లు నిర్మించుకొని నివసించసాగారు. శ్రీ కృష్ణుడు తన అన్న బలరాముడు, స్నేహితులతో కలిసి ఆడుకొనసాగారు. నందుడు తన కుమారులకు ఆవుల్ని పోషించటం నేర్పించాలని లేగ దూడలను బృందావనానికి కొంచం దూరంగా ఉన్న చిన్న అడవిలో మెపూకురమని చెప్పారు. యశోదమ్మ భయపడింది. అసలే కొత్త ప్రదేశం శ్రీ కృష్ణుడు ఇంకా చిన్న పిల్లవాడు, అల్లరివాడు. ఏ జంతువన్న లాక్కుపోతుందేమో అని పంపనంది. శ్రీ కృష్ణుడు తన తల్లికి ధర్యం చెపుతూ. అమ్మ మేము ఎక్కువ దూరం వెళ్ళాము. ఇంట్లో ఉంటె ఏమి తోయటం లేదు. మేము జాగ్రత్తగా వెళ్లి వస్తాము అన్నారు. యశోదమ్మ మరుసటి రోజు పిల్లలిద్దరికి చద్దన్నం కటిచ్చి లేగ దూడలను ఇచ్చి పంపించింది. శ్రీ కృష్ణుడు తన స్నేహితులతో కలిసి అడవిలో ఉండగా అక్కడికి ఒక లేగ దూడ వచ్చింది. అది మందలోనిది కాదు. చూడటానికి చాల అందంగా ఉంది. శ్రీ కృష్ణుడు దానిని చూడగానే వచ్చింది ఎవరో కనిపెటేసారు. తన స్నేహితులను పిలిచి "గోపాలులారా! ఇటు చుడండి ఈ లేగదూడ ఎంత బాగుందో దీని తోక దీని కళ్ళు దీని కాళ్ళు ఎంత అందంగా ఉందొ చుడండి" అని చెపుతూ దాని దగరకు వచ్చి ఎవరు ఉహిచని విధంగా దాని నాలుగు కాళ్లను దాని తోకతో చుట్టి గిరగిరా తీపి పక్కనే ఉన్న వెలగా చెట్టుమీద వేశారు. గోపాలబాలురు కృష్ణా, కృష్ణా అంటుండగానే అంత జరిగిపోయింది. దూడ పడిన బరువుకి వెలగ చెట్లు ఒక దాని మీద ఒకటి పడి ఎనభై చెట్లు పడిపోయాయి. గోపాలురు ఏమిటి కృష్ణ దూడని చంపేసావు అని అనేలోపే ఆ దూడ కాస్త ఆరు కిలో మీటర్ల పొడవున్న వత్సాసురుడు అనే రాక్షసురికి మారిపోయాడు. గోపాల బాలురు అందరూ మా కృష్ణుడు ఏమి చేసిన మన మంచికే చేస్తాడు ఒక వెల్ల కృష్ణుడు ఆ రాక్షసుడిని చంపకపోతే వాడు మనలనందరిని చంపేసి తేనేసేవాడేమో అని భయపడరు. చనిపోయి పడిఉన్న రాక్షసుడి శరీరం చుటూ తిరుగుతూ ఆదుకున్నారు. శ్రీ కృష్ణుడు, బలరాముడు, గోపాలబాలురు అందరూ చీకటి పడక ముందే ఇళ్ళకి వెళ్లిపోయారు. శ్రీ కృష్ణుడు ఇంటికి వెళుతూనే వెనకే వచ్చిన గోపాల బాలురు అందరూ యశోదమ్మతో "యశోదమ్మ! ఈ రోజు శ్రీ కృష్ణుడు ఏమి చేసాడో తెలుసా ఒక రాక్షుసుడు లేగదూడ రూపములో వచ్చాడు. శ్రీ కృష్ణుడు దానిని చంపేశాడు" అని చెప్పారు. యశోదమ్మ భయపడుతూ ఆ నారాయణ స్వామికి "హే నారాయణ! నా కుమారుడిని వెంటే ఉంది రక్షించినందుకు నీకు కోటి కోటి ప్రణామాలు తండ్రి" అని క్షణం పెటింది. ఈ లోపు నందుడు, ఉప నందుడు అక్కడికి వచ్చారు. ఈ విషయం తెలుసుకొని శ్రీ కృష్ణుడికి ఇంత దూరం వచ్చిన ఆపదలు తప్పటం లేదు అనుకున్నారు కానీ వారికీ ఏదో దైవ శక్తీ వచ్చి శ్రీ కృష్ణుడిని రక్షిస్తుంది అని భావించారు. శ్రీ కృష్ణుడు ఈమాటలు అన్ని విని నవ్వుకొని ఊరుకున్నారు.

శ్రీ కృష్ణ - బృందావన పయనం

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 26

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |

తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ||

అర్థం :-

అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. నిర్మలబుద్ధితో, నిష్కామభావముతో పరమభక్తులనిచే సమర్పింపబగిన పత్రమునుగాని, పుష్పమునుగాని, ఫలమునుగాని, జలమును గాని, నేను ప్రత్యక్షముగా ప్రీతితో ఆరగిస్తాను.



మోక్షద ఏకాదశి, గీత జయంతి శుభాకాంక్షలు

మోక్షద ఏకాదశి, గీత జయంతి శుభాకాంక్షలు


మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ రోజునే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను భోదించారు. ఈ రోజున ఏకశసి వ్రతం చేసేవారికి మోక్షం వస్తుందని నమ్ముతారు. 

ఏకాదశి కథ

పద్మ పురాణం ప్రకారం పూర్వం మోర అనే రాక్షసుడు బాధలు పడలేక శ్రీ మహా విష్ణువు దగరకు వెళ్లరు. శ్రీ మహా విష్ణువు వారి మొరలను విని తనలో నుంచి ఒక శక్తీని పుట్టిస్తారు. శ్రీ మహా విష్ణువు ఆ శక్తిని ఏకాదశినాడు పుట్టించారు కాబట్టి ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టారు. ఏకాదశి వెళ్లి మోర అనే రాక్షసుడిని సంహరించింది. శ్రీ మహా విష్ణువు సంతోషించి నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అందుకు ఏకాదశి ఈ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం చేసిన వారికీ మోక్షం ప్రసాదించమని కోరుకుంటుంది శ్రీ మహా విష్ణువు తధాస్తు అని వరమిస్తారు. 

మోక్షద ఏకాదశి కథ 

పూర్వం గోకుల నగరంలో వైఖానసుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక రోజు రాత్రి కలలో అతని తండ్రి నరకంలో శిక్షలు అనుభవిస్తూ కుమారుడిని తనకు మోక్షం వచ్చేలా చేయమని ఈ శిక్షలు అనుభవించలేక పోతున్నాని బాధపడరు. వైఖానసుడు మరుసటిరోజు ఉదయం నిద్ర లేచి చూసుకునే సరికి తనకు వచ్చింది కల అని తెలుస్తుంది. వెంటనే సభను ఏర్పాటు చేసి తన మంత్రులకి చెపుతారు. మంత్రులు ఎలాంటి విషయాలు మునులను, ఋషులను కనుకోవాలని చెప్పారు. రాజు వెళ్లి మునులను ఋషులను అడుగుతారు. వాలందరు ఒకటే చెప్పారు. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేయి ఆ వ్రతఫలితాని మీ తండ్రి గారికి ధారపోయి. అతనికి మోక్షం లభిస్తుంది అని చెప్పారు. అతని అలాగే మార్గశిర శుద్ధ ఏకాదశి వ్రతం చేసి అతని తండ్రికి ధారపోశారు. అతని తండ్రికి మోక్షం లభిస్తుంది. అందుకని ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అన్నారు. 

గీత జయంతి
ప్రపంచ వ్యాప్తంగా హింధువులు అందరూ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజునా గీత జయంతి జరుపుకొంటారు. భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కౌరవ పాండవ యుద్దములో అర్జునుడు తన బంధువులను చూసి నిరసించి యుద్ధం చేయనని కూర్చున్నాడు. శ్రీ కృష్ణుడు, అర్జునుడిని కార్యన్ముఖుడిని చేయటానికి భగవద్గితను భోదించారు. అర్జునుడికే కాదు, కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకి సందిగ్దతకి సమాధానంగా భగవద్గీత ఈ నాటికీ ఏ నాటికీ ప్రమాణంగా నిలుస్తుంది. శ్రీ కృష్ణ భగవానుడు మానవులకు అందించిన వరం భగవద్గీత. మానవులకు మానవత్వం గురించి నేర్పిచిన గ్రంధం భగవద్గీత. మానవులు వచ్చే ప్రతి సమస్యకు పరిస్కారం ఈ భగవద్గీత. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి. నేను గీతను ఆశ్రయించి ఉంటాను. గీత నా నివాసం. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం).ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.

భగవద్గీత నుండి మార్గదర్శకత్వము పొందినవరిలో ఎందరో యోగులు, తాత్త్వికులు ఉన్నారు. వారిలో శ్రీ చైతన్య మహాప్రభు ఒకరు. ఈయన "హరే కృష్ణ" మంత్రోపాసకులు. 

మహాత్మ గాంధి తన అహింస సిద్ధాంతానికి గీత నుండే స్ఫూర్తిని పొందారు. గాంధీ మహాభారత యుద్ధాన్ని నిత్య జీవితంలో జరిగే సంఘర్షణలన్నిటికి వేదిక వంటిదని వర్ణించారు. అంతిమంగా గీత సారము ఆయనకు బ్రిటిష్ వారి వలస పాలనను ఎదిరించడానికి ఒక ఆయుధము వంటి స్ఫూర్తిని ఇచ్చింది. నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిరోజు దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు.

శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులలో అగ్రగణ్యుడైన స్వామి వివేకానంద గీతలోని భక్తి, జ్ఞాన, కర్మ రాజ యోగాలకు ఎంతో విపులంగా నూతన భాష్యాన్ని వ్రాశారు. యోగులు కాదలచిన వారు గీతలోని ప్రతి అధ్యాయాన్ని వివరంగా చదవమని స్వామి శివానంద బోధించారు. ఒక యోగి ఆత్మ కథ రచయిత అయిన పరమహంస యోగానంద, గీతను ప్రపంచములోని అత్యుత్తమ పవిత్ర గ్రంథముగా పేర్కొన్నారు.




Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 25

యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితౄవ్రతాః |

భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజివో పి మామ్ ||

అర్థం :-

దేవతలను పూజించువారు దేవలోకములను చేరుతారు. పితరులను సేవించువారు పితృలోకాలకు వెళ్ళతారు. భూతప్రేతములను అర్చించువారు భూతరూపములను పొందుతారు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుతారు.



శ్రీ కృష్ణ - బృందావన పయనం

శ్రీ కృష్ణ - బృందావన పయనం



శ్రీ కృష్ణుడు మది చెట్లు పడిపోయిన తరువాత అందరికి అనుమానం వచ్చింది. ఇంత పెద్ద చెట్లు ఎలా పడాయి అని ఆలోచించసాగారు. చెట్లను నరకలేదు. గాలివాన రాలేదు. అసలు ఎలా పడాయి అని ఆలోచించసాగారు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు వచ్చి శ్రీ కృష్ణుడు చెట్ల మధ్యలో నుంచి వచ్చారు. ఆ చెట్లు పడిపోయి అందులోనుంచి దేవతలు బయటకు వచ్చి శ్రీ కృష్ణుడిని ప్రార్ధన చేసి వెళ్లిపోయారు. అందరూ చిన్న పిల్లవాడు ఎల్లా చేస్తారు. పిల్లలు ఏదోచెపుతున్నారు. ఏ భూతమో పడేసి ఉంటాయి అని అన్నారు గాని అందరికి మనసులో అనుమానంగా ఉంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని కనిపెట్టి వారందరిని ఈ విషయాలు మరచిపోయేలా చేయాలి అని అనుకున్నారు. ఆ రోజు నుంచి తండ్రి అయినా నందుడు ఇంటికి రాగానే చిన్న పిలాడిలానే ఎదురు వెళ్లి నాన్నని పలకరించడం. పెద్దవాళ్ళు ఎవరైనా మంచినిళ్లు ఎవరంటే ఇచ్చేవారు. ఒకరోజు యశోదమ్మ దగరకు వచ్చి శ్రీ కృష్ణుడు అమ్మ ఎవరో నన్ను కొట్టాలని చుస్తునారు అతను ఆచం నాలాగే ఉన్నారు అని యశోదమ్మను తీసుకెళ్లి నీటితో నిండిన చిన్న తొట్టిని చూపించి ఏడిచాడు. యశోదమ్మ నవ్వు కొన్ని ఎవరు లేరమ్మ అది నీ ప్రతిభింబం అని సర్ధిచెపింది. ఇంకోరోజు యశోదమ్మ దగరకు వచ్చి అమ్మ నాకు అన్నయ్యలాగా జుట్టు లేదు ఎందుకు అని అడిగారు. యశోదమ్మ కన్నయ్య అన్నయ పాలు, పెరుగు బాగా తిట్టాడు అందుకే జుట్టు ఎక్కువగా ఉంది. వెంటనే పక్కనే ఉన్న బిందిలోని పాలను తాగేసి నా జుట్టు పెరిగిందా అని అడిగారు. యశోదమ్మ శ్రీ కృష్ణుడి అమాయకత్వానికి నవ్వుకుంది. ఒకరోజు నందవ్రజంలోకి పండ్లను అమ్ముకుంటానికి ఒక ఆవిడా వచ్చింది. ఆమె పండ్లకు బదులు ధాన్యాన్ని తీసుకుంటుంది. ఆ పండ్ల ఆవిడా యశోదమ్మ ఇంటికి వచ్చింది. యశోదమ్మ ధాన్యాన్ని ఇచ్చి పండ్లని తీసుకుంది. శ్రీ కృష్ణుడు కూడా తన చిన్ని చిన్ని చేతులతో ఒక నాలుగు ధాన్యాపు గింజలను తీసుకొని ఆవిడా దగరకు వచ్చి కొన్ని పండ్లను ఇవ్వమన్నారు. ఆవిడా చిన్ని కృష్ణుడి అమాయకత్వానికి మురిసిపోయి అతని చేతుల్లోని నాలుగు ధాన్యపు గింజలను తీసుకొని ఆ చిన్ని చేతుల నిండా పండ్లను ఇచ్చింది. శ్రీ కృష్ణుడు ఆవిడా వైపే చూస్తూ చూస్తూ వెళ్లరు. ఆవిడా వెళ్లటానికి పండ్ల బుట్టని తీసుకొని వెళ్లబోతుంటే బుట్ట బరువుగా అనిపించింది. ఆవిడా దించి చూసుకుంది. బుట్ట నిండా బంగారం, రత్నాలు ఉన్నాయి. ఒకసారి నందవ్రజంలో పెద్దలందరూ సమావేశమయ్యారు. శ్రీ కృష్ణుడు పుటిన దగర నుంచి నందవ్రజంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి కూడా శ్రీ కృష్ణుడికే జరుగుతున్నాయి. దేవుడు రక్షిస్తున్నారు అనుకోని ఇక్కడే ఉంటె కృష్ణుడికి మరింత ప్రమాదం పెరుగుతుంది. కాబ్బటి మనం శ్రీ కృష్ణుడు కోసంమైన ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలి అన్నారు. నందుడు తమ కుమారుడిపైన నందవ్రజంలో ఉన్న ప్రజలు చూపిస్తున్న ప్రేమకి సంతోషించి మీరు ఎలాగా చెపితే అలాగే చేద్దాము అన్నారు. కానీ మనం కొత్త ప్రదేశానికి వేళలో అంతే మనకి పశుసంపద ఎక్కువ కనుక నీళ్లు గడి ఎక్కువ దొరికే ప్రదేశానికి వేళలో అక్కడ పండ్లచెట్లు కూడా ఎక్కువగా ఉండాలి. ఏమి సంపద లేకపోతే కనీసం పండ్లు అయినా తినిబ్రతకచ్చు అని ఆలోచించసాగారు. పెద్దలు ఇక్కడికి దగరలో బృందావనం ఉంది మనం అక్కడికి వెళదాము అనుకొన్నారు. అందరూ సంతోషించారు. మరుసటి రోజు అందరూ తయారు అయి బండ్లు కట్టుకొని బయలుదేరారు. ఆడవాళ్లు, చిన్న పిల్లలు బండ్లలో వెళ్లరు. వెళుతున్న దారిలో యశోదమ్మ చిన్ని కృష్ణుడి గురించి పాటలు పడుకుంది. బృందావనం రాగానే చిన్ని కృష్ణుడు చాల సంతోషించారు. ప్రజలందరూ తాము వచ్చిన బండ్లను వలయాకారంలో పెట్టి తాము ఇళ్ళు కట్టుకునే వరకు అక్కడే ఉండాలి అని నిశయించుకున్నారు.  

శ్రీ కృష్ణ - మది చెట్టులా శాపవిమోచన లీల

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 24

అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |

న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే ||

అర్థం :-

ఏలనన, సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నా పరమేశ్వర తత్త్వమును ఎరుంగరు, కావున, పతనమగుదురు. అనగా పునర్జన్మను పొందుదురు.





Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 23

యే ప్యన్యదేవతా భక్తా యజంతేశ్రద్ధయాన్వితాః |

తే సి మామేన కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ ||

అర్థం :-

ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతరదేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పూజించినట్లే. కాని, వారిపూజలు అవిధిపూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో కూడినవి. 




మహాస్వామి వారి లీలలు - కాఫీ తెచ్చిన తంటా

మహాస్వామి వారి లీలలు - కాఫీ తెచ్చిన తంటా


చంద్రశేఖర భారతి మహా స్వామి వారికీ కాఫీ అంటే ఇష్టం ఉండేది కాదు. మహాస్వామి వారు తమ భక్తులకు  కాఫి మానేయాలి అని చెప్పేవారు. ఎందుకంటే కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదు అని. ఒక సారి ఒక భక్తురాలు మహాస్వామి వారిని దర్శనం చేసుకుంటానికి వచ్చింది.  మహాస్వామి వారు ఆమెను చూడగానే అమ్మ ఇకనుంచి మీరు మీ కుటుంబ సభ్యులు కాఫీ తాగటం మానేయండి అది ఆరోగ్యానికి మంచిది కాదు అని అన్నారు. ఆ భక్తురాలు తడపడుతూనే అలాగే మహాస్వామి అన్నారు. ఆవిడా ఇంటికి తిరిగి వచ్చి ఆమె భర్తతో మహాస్వామి వారి దర్శనయానానికి వెళ్లి వచ్చాను. మహాస్వామి వారు మనల్ని కాఫీ మానేయమని చెప్పారు అండి. అయన కూడా మహాస్వామి వారి పరమ భక్తుల. ఈ విషయం విని మహాస్వామివారు చెప్పారా సరే అలాగే మానేస్తాను అన్నారు. అయన పొద్దునే నిద్ర లేవగానే కాఫీ, టిఫన్ తినంగానే కాఫీ, ఆఫీసుకి వెళ్ళేటపుడు కాఫీ, ఆఫీసుకి వెళినదగరనుంచి వచ్చేవరకు ఐదు, ఆరు సారులు కాఫీలు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత రాత్రి భోజనం చేసేలోపు మూడు సారులు కాఫీ తాగేవారు. అటువంటి అయన మహాస్వామి చెప్పారు అని మానేస్తాను అని చెప్పారు. కాని కాఫీ బాగా అలవాటు అయిపోవటం వలన కష్టపడి రెండు రోజులు మానేశారు. ఇంకా మూడవరోజు నుంచి ఉండలేక మహాస్వామి వారి పటం ముందు ఆయనకు ప్రసాదంగా వేడివేడి కాఫీ పేటి తరువాత అయన తీసుకునేవారు. ఒక నెల రోజుల తరువాత మహాస్వామి వారి దర్శనానికి ఆ భార్యాభర్తలు వచ్చారు. మహాస్వామి వారు వాళ్లను చూడంగానే ఏమయ్యా నేను మిమ్మలిని కాఫీ మానేయమని చెప్తే అదే నాకు నైవేద్యంగా పెడతావా. ఆ కాఫీ వేడికి నామొఖం మండుతుంది ఇంకా నాకు కాఫీ నైవేద్యం పెట్టకు అన్నారు. ఆ భక్తుడు మహా స్వామి వారి పాదములపైపడి మహాస్వామి! ఇంక నేను కాఫీ తాగాను నన్ను క్షమించండి అని వేడుకున్నారు. ఇంక ఎపుడు అతను కాఫీ తాగలేదు.

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత
అద్యాయం 9
శ్లోకం 22
అనన్యాశ్చింతయంతో మాం యే జనాఃపర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||
అర్థం :-
పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతనచేయుచు, నిష్కామ భావముతో సేవించువారియోగక్షేమములను నేనే వహించుచుందును.




మార్గశిరమాసం గురువారం లక్ష్మిదేవి వ్రతకథ

మార్గశిరమాసం గురువారం లక్ష్మిదేవి వ్రతకథ



పూర్వం కళింగదేశములో ఒక బ్రాహ్మణా కుటుంబం ఉండేది. ఆ దంపతులకు సుశీల అని ఒక కుమార్తె ఉండేది. ఆమె పుటిన కొంత కాలానికి ఆమె తల్లి మరణించింది. తండ్రి మళ్ళి వివాహం చేసుకున్నాడు. సవతి తల్లి ఆమె పిల్లలను ఎత్తుకొని ఆడించామని ఒక బెల్లం ముక్క తినమని ఇచ్చేది. సుశీల ఆ ఊరిలో వారు మార్గ శిరమాసం గురువారం వ్రతం చేసుకోవటం చూసి తనుకూడా చేసుకోవాలని మట్టితో లక్ష్మి ప్రతిమని చేసుకొని పెరడులో ఉన్న జిలేడు పువ్వులను, అక్కడ దొరికిన ఆకులతో లక్ష్మి దేవికి షోడశోపచరాలతో పూజ చేసి ఆమె సవతి తల్లి తనకు తినమని ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెటింది. లక్ష్మి దేవి ఆమె పూజకు మెచ్చి సకలైశ్వర్యములు ఇచ్చింది. కొంతకాలానికి సుశీలకు ఆమె తండ్రి వివాహం చేసి అత్తవారింటికి పంపించారు. సుశీల తాను పూజించుకుంటున లక్ష్మీదేవి ప్రతిమను కూడా తీసుకువెళ్ళింది. 

సుశీల వెళ్లిన దగర నుంచి పుటింటి వారి దారిద్ర్యం వచ్చింది. ఈ పని చేసిన కలిసి రాకపోవటం జరిగింది. సుశీల అత్తవారింటికి వెళ్లిన దగర నుంచి వాళ్లకు బాగా కలిసి వచ్చింది. సుశీల సవతి తల్లి వారి దారిద్ర్యం భరించలేక తన కుమారుడిని పిలిచి అక్క దగరకు వెళ్లి మన పరిస్థితిని చేపి అక్కని సహాయం చేయమని అడుగు అని పంపించింది. తమ్ముడు సుశీల దగరకు వచ్చి జరిగిన విషయం చేపి తమ సహాయం చేయమని అడుగుతారు. సుశీల తమ్ముడి మాటలకూ బాధపడి ఒక కర్రను తొలిపించి అందులో వరహాలు నింపి పంపించింది. తమ్ముడు ఆ కర్రను తీసుకొని వెళుతుందగా ఆ కర్ర ఎక్కడో పడిపోయింది. ఇంటికి వెళ్లి అక్క కర్ర ఇచ్చింది అని అది దారిలో పడిపోయింది అని చెప్పాడు. తల్లి బాధపడుతుంది. మరి కొంతకాలానికి మళ్ళి పంపిస్తుంది తమ్ముడు మళ్ళి అక్కదరరకు వెళతాడు. కర్రను ఇంటికి తీసుకువెళ్లలేక పోయాను అని చెపుతాడు. సుశీల బాధపడి ఈ సారి చూపులలో వరహాలు పేటి చెప్పులు కుటించి తమ్ముడికి ఇస్తుంది. తమ్ముడు వాటిని తీసుకువెళ్ళుతూ దారిలో మంచినీరు తాగటానికి చెప్పులను గట్టుమీద పేటి చెరువులోకి దిగుతాడు. మంచి నీరు తాగి వచ్చేసరికి చెప్పులు కనిపించవు. ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లికి చెపుతాడు. తల్లి బాధపడుతుంది. మరి కొంతకాలానికి మళ్ళి తమ్ముడిని అక్క దగరకు పంపిస్తుంది. సుశీల జరిగినది తెలుసుకొని బాధపడి ఒక గుమ్మడి కాయను తొలిపించి దాని నిండా వరహాలు నింపి జాగ్రత్తగా తీసుకువెళ్ళమని తమ్ముడికి చెపుతుంది. తమ్ముడు వెళుతుండగా సంధ్య సమయం అయింది అని సంధ్య వార్చటానికి చెరువులోకి దిగుతారు. సంధ్య వార్చుకొని వచ్చి చుస్తే గట్టుమీద పెట్టిన గుమ్మడికాయ కనిపించదు. ఇంటికి వచ్చి తల్లికి విషయం చెపుతాడు. అయ్యో సుశీల మనకు ఎదో సహాయం చేయాలనీ చూస్తుంది కానీ అది మనకు చేరటం లేదు. 

ఈ సారి నేనే వెళాతాను అని పిల్లలను తీసుకొని బయలుదేరింది. సుశీల దగరకు వచ్చి జరిగినది చేపి బాధపడింది. సుశీల తల్లితో అమ్మ రేపటి నుంచి మార్గశిరమాసం గురువారం నేను లక్ష్మీదేవి పూజ చేస్తాను నువ్వుకూడా చేసుకో అని చెప్పి పూజ అయేంతవరకు ఏమి తినదు అని చెపుతుంది. తల్లి సరే అంటుంది. మరునాడు పిల్లలకి చద్దన్నం పెడుతూ ఒక ముద్ద నోటిలో వేసుకుంటుంది. సుశీల ఈ విషయం తెలుసుకొని తాను ఒకతె లక్ష్మి దేవి పూజ చేసుకుంటుంది. రెండోవారం మళ్ళి చెపుతుంది తల్లికి జాగ్రత్తగా ఉండమని తల్లి సరే అంటుంది. కానీ పిల్లలకి నూనె రాసి తనుకూడా రాసుకుంటుంది. అలా రెండోవారం కూడా కుదరదు. మూడోవారం సుశీల ఇలా కాదు అని తల్లిని ఒక గోతిలో కూర్చోపెట్టి పైన ఒక గంప పెట్టి మూస్తుంది. పిల్లలు అరటి పండ్లు తిని గంపమీద వేస్తారు. తల్లి ఏమి తోయక అరటి తొక్కలలో ఉన్న అరటి పండు గుజ్జుని తింటుంది. మూడోవారం కుదరదు. నాలుగోవారము సుశీల ఈసారి తన తల్లిని కొంగున కట్టుకొని వెంటే తిప్పుకొంటుంది. 

ఈ సరి తల్లి చేత వ్రతాన్ని పూర్తి చేయిస్తుంది. వాయనం అందుకోవటానికి లక్ష్మి దేవిని పిలుస్తుంది. లక్ష్మి దేవి సుశీల ఇచ్చిన వాయనని తీసుకొని ఆమె తల్లి ఇచ్చిన వాయనని తీసుకోనని వెళ్ళిపోతుంది. సుశీల ఏడుస్తూ లక్ష్మి దేవి పాదాలపై పడుతుంది. లక్ష్మి దేవి మీ సవతి తల్లి నువ్వు నా పూజ చేస్తున్నపుడు నిన్ను చుపురుతో కోటింది నేను అనే వాయనని తీసుకోను అన్నది. సుశీల తన తల్లి తప్పును క్షమించమని కోరుతుంది.లక్ష్మి దేవి కనికరించి సరే ఈ సరి మీ అమ్మ చేత వ్రతం చేయించు నేను వాయనం అందుకుంటాను అని చెప్పింది. సుశీల సంతోషించి అలాగే ఐదొవ గురువారం తన తల్లి చేత వ్రతం చేయిస్తుంది. జీవించినంతకాలం అష్టఐశ్వర్యాలతో  జీవించి మరణించిన తరువాత వైకుంఠం ప్రాపిస్తుంది అని దీవించింది లక్ష్మి దేవి.  అప్పటి నుండి పుటింటి వారికీ కూడా సకల అష్టఐశ్వర్యాలు వస్తాయి.సుశీల తల్లి తన తప్పుని తెలుసుకొని తన జీవించి నంతకాలం మార్గశిరమాసం గురువారం లక్ష్మి వ్రతం నియమ నిష్ఠలతో చేస్తాని కుమార్తెకి చెపుతుంది.   

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 21

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుంయేమర్త్యలోకం విశంతి |

ఏవం త్రయీధర్మమనుప్రసన్నా గతాగతం కామకామ లభంతే ||

అర్థం :-

ఆ విశాలస్వర్గమునందు భోగములను అనుభవించి, పుణ్యములు అయిపొగానే మళ్ళి మనవలోకములో ప్రవేశిస్తారు. ఈ విధముగా స్వర్గప్రాప్తిసాధనములైన వేదత్రయవిహితసకామకర్మలను ఆశ్రయించువారు, భోగములను ఆసించుచూ స్వర్గమర్త్యలోకములమధ్య రాకపోకలు సాగించు చుందురు. అనగా పుణ్యప్రభవముచే స్వర్గానికి పొవుదురు. పుణ్యము క్షిణింపగనే మనవలోకమునకు వచ్చేదరు.





        

సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా

సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా



సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యశ్వరుడు జన్మించిన రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు. సుబ్రహ్మణ్యడు జన్మించిన వివరణ స్కాందపురాణంలో, రామాయణంలోని బాలకాండలో విశ్వమిత్రుడు, రామలక్ష్మణులకు వివరించినట్టు ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం ఘోరతపస్సు చేసి శివుడి నుంచి మరణం లేకుండా వరం కావాలి అని కోరుకున్నారు. శివుడు మరణం లేకుండా వరం ఇవ్వటం కుదరదు ఇంకేమన్నా కోరుకోమన్నారు. తారకాసురుడు ఇలా ఆలోచించసాగాడు. అప్పటికే సతీదేవి యోగాగ్నితో మరణించింది. శివుడు మళ్ళి ఇప్పుడే వివాహం చేసుకోరు అని అనుకోని శివుడితో స్వామి! నాకు మీ కుమారుని వల్లనే నాకు మరణం రావాలి అని కోరుకుంటారు. శివుడు తధాస్తు అంటారు. తారకాసురుడు అహంకారంతో దేవతలను, మానవులను అందరిని పీడించటం మొదలు పెట్టారు. దేవతలు అతని బాధలు తట్టుకోలేక బ్రహ్మ దేవుని దగరకు వెళ్లరు. బ్రహ్మ దేవుడు దేవతల బాధలను విని తారకాసురుడు కేవలం శివుని కుమారుడిని వల్లనే మరణిస్తాడు. కానీ శివుడు సతీదేవి వియోగంతో తీర్వమైన తపస్సు చేస్తున్నారు. ఇంకా సతీదేవి పార్వతీదేవి రూపంలో హిమవంతుని కుమార్తెగా జన్మించింది. శివపార్వతులు వివాహం జరిగితే మీ బాధలు తీరుతాయి అని బ్రహ్మ దేవుడు చెప్పారు. పార్వతి దేవి శివుని కోసం తీర్వ తపస్సు చేసి శివుని మేపించి వివాహం చేసుకుంటుంది. తరువాత శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో దేవతలు శివునికి మొరపెట్టుకుంటానికి వచ్చారు. అదేసమయంలో శివుడు తన తేజస్సుని పార్వతికి ప్రసాదిస్తున్నారు. దేవతల మహాదేవ సదాశివ కాపాడండి కాపాడండి అని మొరపెట్టుకొని గట్టిగా అరిచారు. శివునికి ధ్యాన భంగం అయింది. శివుడు బయటకు వచ్చి ఎంతపని చేసారు దేవతలారా మేము మీకోసమే యోగమార్గము ద్వారా సంతాన ఉత్పత్తి చేస్తున్నాము మీరు దానిని పాడు చేసారు. ఇంకో వంద సంవత్సరముల వరకు నేను మళ్ళి సంతాన తేజస్సును ఉత్పత్తి చేయలేను అన్నారు. దేవతలు క్షమించండి స్వామి మేము తారకాసుర బాధలు భరించలేక ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అని అడిగారు. శివుడు నేను చేయగలిగింది ఏమి లేదు ఇంకో వంద సంవత్సరములు ఓపిక పట్టాలి అని శివుడు వెళ్లిపోయారు. దేవతలు తమ తొదరపాటు తనానికి విచారిస్తూ తిరిగి వెళ్లిపోయారు. మళ్ళి వంద సంవత్సరముల తరువాత మళ్ళి పార్వతి పరమేశ్వరులు ఏకాంతములోకి వెళ్లరు. శివపార్వతులు ధ్యానంలో యోగ మార్గం ద్వారా సంతానమును సంపాందించి తేజస్సును ఉత్పత్తి చేసారు.

దేవతలు మళ్ళి తొదరపాటు తనంతో ఆ తేజస్సు తారకాసురుడు ఎక్కడ నాశనం చేస్తారో అని అగ్ని దేవుడిని ఆ తేజస్సుని అక్కడినుంచి తీసుకురమ్మని చెపుతారు ఇంద్రుడు. దేవతలు తమ సంతానని తీసుకొని వెళ్లిపోయారు అని తెలుసున్న పార్వతిమాత దేవతలు అందరికి తమ భార్యల ధర సంతానం కలుగదు అని శపించింది. తేజస్సుని తీసుకున్న అగ్ని దేవుడిని నీకు శుద్ధం, అశుద్ధం అని లేకుండా అన్నిటిని దహిస్తావు అని శపించింది. అగ్ని దేవుడు ఆ తేజస్సుని భరించలేక దానిని భూమాతకి అప్పగిస్తారు. ఈ విషయం తెలుసుకున్న భూమాతను నీకు బహు భర్తలు ఉంటారు. భూమిని పాలించేరాజు నీకు భర్త అవుతారు. అప్పటి నుంచే భూమిని పాలించేరాజులకు భూపతి అని పేరు వస్తుంది. భూమాత కుడా కొంతసేపటికి ఆ తేజస్సుని భరించలేకపోయింది. దానిని గంగామాతకి అప్పగించింది. గంగామాత కూడా ఆ తేజస్సుని భరించలేక దానిని హిమవత్ పర్వతం మీద వదిలేసింది. హిమవత్ పర్వతం మీద పడటం వాళ్ళ సుబ్రమణ్య స్వామికి స్కందుడు అని పేరు వచ్చింది.శివుని తేజస్సు హిమవత్ పర్వతం మీద నుంచి జారీ రెళ్ళ పొదలలో పడుతుంది. కొంతసేపటికి శివ తేజస్సు బాలుని రూపములో రూపాంతరం చెందింది. పుట్టటమే అయన ఆరు ముఖములతో జన్మించి నాలుగు వేదములు చదువుతున్నారు. అటుగా వచ్చిన కృత్తికలు ఆ బాలుడిని చూసి దగరకు తీసుకున్నారు. దేవతలు ఆ బాలునికి పలు ఇచ్చి పెంచమని చెప్పారు. కృత్తికలు మేము ఈ బాలునికి పాలు ఇస్తాము కానీ ఇతను మా బిడగానే పేరు పొందాలి అని అడుగుతారు. దేవతలు సరే అంటారు. కొంతకాలానికి కృత్తికలు ఆ బాలుడిని తీసుకొని కైలాసానికి వచ్చి శివపార్వతులకు అప్పగిస్తారు. కృత్తికలు పెంచారు కాబట్టి సుబ్రహ్మణ్యనికి కుమారస్వామి అని కార్తికేయుడని పేరులు వచ్చాయి. శివుడు సుబ్రహ్మణ్యుడికి సకల యుద్ధవిద్యలు నేర్పించారు. శివుడి సుబ్రహ్మణ్యుడి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించారు. పార్వతిమాత సుబ్రహ్మణ్యుడి శక్తీ ఆయుధాన్ని ఇచ్చారు. సుబ్రహ్మణ్యుడిని దేవతలకు సేనాధిపతిగా నియమించి దేవతల సహాయంతో తారకాసురుని మీదకు యుద్ధనికి వెళ్లి తరకాసురుడిని సంహరించారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరిగిపోయాయి. 

సుబ్రహ్మణ్య షష్ఠి రోజునా షణ్ముకోత్పత్తి చదివిన విన్న సంతానం లేని వారికీ సంతానం కలుగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజునా సుబ్రహ్మణ్య స్వామిని నాగేంద్ర స్వామిగా భావించి ఈ రోజునా ఉపవాసం ఉండి పుటలో పాలుపోస్తారు. సుబ్రహ్మణ్య పూజలు నిర్వహిస్తారు. తమిళనాడు ప్రాంతాలలో సుబ్రమణ్య ఆలయాలలో తిరునాళ్లు, ఉత్సవాలు జరుగుతాయి.సుబ్రహ్మణ్య స్వామికి వల్లి, దేవసేన అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామికి ఈ రోజునా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

 

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 20

త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం పార్థయంతే |

తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమ్ అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ ||

అర్థం :-

ఋగ్యజుస్వామవేదములచేప్రోక్తములైన సకామకర్మలను చేయువారు, సోమరసపానము చేయువారు, పాపరహితుల యజ్ఞములద్వారా నన్ను సేవించి, స్వర్గప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చటి దేవతల దివ్యభోగములను అనుభవింతురు.




Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 19

తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ |

అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ||

అర్థం :-

ఓ అర్జునా! సూర్యరూపమున నేనే తపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి, వర్షరూపమున మరల వదులుతాను. అమృతమును, మృత్యువును గూడ నేనే. శాశ్వతమైన అత్మను, నశ్వరమైన సమస్త వస్తుజాలములు గూడ నేనే.





శ్రీ కృష్ణ - మది చెట్టులా శాపవిమోచన లీల

శ్రీ కృష్ణ

శ్రీ కృష్ణుడు, నల్లకుబేర మణిగ్రీవులకు శాప విముక్తిని ప్రసాదించిన లీల  



యశోదమ్మ చిన్ని కృష్ణుడుని రోలుకు కాటేసి ఇంటిలోకి వెళ్లిపోతుంది. చిన్ని కృష్ణుడు రోలుని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఏడుస్తూ ఉన్నారు. కొంతసేపటి తరువాత చిన్ని కృష్ణుడు పాకటం మొదలు పెట్టారు. ఆయనతో పాటు రోలు కూడా దొర్లుకుంటూ వస్తుంది. చిన్ని కృష్ణుడు పాకుతూ రెండు మది చెట్టుల మధ్య నుంచి వెళ్లారు. ఆయనతో పాటు రోలుకూడా వచ్చింది. రోలు మది చెట్టులా నుంచి వెళ్లక చిన్ని కృష్ణుడు గట్టిగా లాగేసరికి మది చెట్టులు రెండు విరిగి పడిపోయి అందులో నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వచ్చారు. వచ్చిన వారు చిన్ని కృష్ణుడు పరబ్రహ్మముగా భావించి స్తోత్రం చేసారు. చిన్ని కృష్ణుడు ఏమి తెలియని వాడిలా అమాయకంగా ఏడుస్తున్నారు. ఆ దివ్య పురుషులకు అసలు శాపం ఎలావచింది.



ఒకరోజు కుబేరుడి కుమారులైన నల్లకుబేర మణిగ్రీవులు ఆకాశ గంగలో గాంధర్వకన్యలతో దిగ్బంగారంగా స్నామము ఆచరిస్తున్నారు. అంతలో అటువైపు ఆకాశమార్గములో నారదమహర్షి వెళుతున్నారు. నారద మహర్షిని చుసిన గంధర్వకన్యలు వెంటనే వస్త్రాలను కట్టుకొని నారదునికి నమస్కరించారు. నల్లకుబేర మణిగ్రీవులు మాత్రం మద్యం మత్తులో నారదమహర్షిని నమస్కరించలేదు కదా కనీసం పాటించుకోలేదు. అపుడు నారద మహర్షి ఇలా అనుకున్నారు. ధనాధిపతిఅయిన కుబేరుని కుమారులు అతని సంపదకు వారసులు అయ్యారు కానీ అతని సంస్కారానికి వారసులు కాలేకపోయారు. వారిని దారిలోకి తీసుకురావాలి అనుకున్నారు. నల్లకుబేర మణిగ్రీవులతో నారద మహర్షి మీకు పెద్దల పట్ల భయభక్తులు లేవు. మహర్షులు సన్యాసులను గౌరవించాలి అని జ్ఞానం లేదు. పెద్దల ఎదుట ఇలా దిగంబరంగా ఉండకూడదు అని లేదు. మీరు నూరు దివ్య సంవత్సరములు మది చెట్లుగా పడియుండండి. నూరు దివ్య సంవత్సరముల తరువాత శ్రీమహా విష్ణువు భూలోకములో నందవ్రజంలో కృష్ణుడికి అవతరిస్తారు. ఏమి తెలియని అమాయకపు చిన్ని కృష్ణుడికి నమస్కరించే రోజు వస్తుంది అని చేపి నారదుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నల్లకుబేరుల, మణిగ్రీవులు వెంటనే మది చెట్టులుగా మారిపోయారు. ఆలా బయటకు వచ్చిన దివ్య పురుషులు చిన్ని కృష్ణుడికి నమస్కరించి తమ వృతంతాని చేపి స్వామి మీ దయ వల్ల మాకు శాపవిమోచనం కలిగింది. ఎన్ని సంవత్సరాలుగా మీకోసం ఎదురు చూస్తాము అని చేపి చిన్ని కృష్ణుడికి నమస్కరించి వల్ల లోకానికి వెళ్లిపోయారు. మది చెట్టులు పడిన శబ్దం విని అందరూ పరిగెత్తుకు వచ్చారు. చిన్ని కృష్ణుడికి ఏమయిందో అని కంగారు పడుతూ వచ్చారు. యశోదమ్మ ఏడుస్తూ వచ్చి చిన్ని కృష్ణుడిని రోలు నుంచి విడదీస్తుంది. ఇంకా ఎప్పుడు రోలుకి కట్టాను అని ఏడుస్తుంది. చిన్ని కృష్ణుడు తన లీలలను తలుచుకొని నవ్వుకొని యశోదమ్మ ప్రేమను ఆస్వాదిస్తారు.


శ్రీ కృష్ణ -దామోదర లీలా

శ్రీ కృష్ణ

దామోదర లీలా



           ఒకరోజు యశోదమ్మ చల్ల చిలుకుతుంటే ఎక్కడినుంచి వచ్చారో చిన్ని కృష్ణుడు వచ్చి యశోదమ్మ చిలుకుతున చల్లని చేతితో పట్టుకొని అమ్మ నాకు ఆకలి వేస్తుంది. నాకు పాలు ఇవ్వు నేను మళ్ళి వెళ్లి ఆడుకోవాలి అని అడుగుతారు. యశోదమ్మా చల్ల చిలకటం ఆపేసి చిన్ని కృష్ణుడుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని పాలు ఇస్తున్నారు. ఈ లోపు వంటగదిలో పోయి మీద పాలు పొంగుతుంటే చిన్ని కృష్ణుడిని కిందన పీట వేసి కూర్చోపెట్టి పాలు దింపటానికి వెళ్లారు. అంతే చిన్ని కృష్ణుడికి కోపం వచ్చింది. నాకు పాలు ఇవ్వకుండా మా అమ్మకు పొయ్యిమీద పాలు ముఖ్యమయ్యాయ అని అక్కడ ఉన్న చిన్న రాయి తీసుకొని చల్ల కుండను పగలకోటేసారు. దాంతో కుండలోని మజిగా, వెన్న బయటకు వచ్చేసాయి. అమ్మ నాకు పాలు ఇవ్వలేదు అని ఏడుస్తున్నారు. కొంత సేపటికి ఇదంతా మాజీగా వెన్న అయిపోయాయి అమ్మ చుస్తే కొడుతుంది అని నాలుగు వెన్న ముద్దలు గోబాగోబా నోటిలో పెట్టుకొని ఇంకో రెండు వెన్న ముద్దలు చేతితో తీసుకొని పెరడులోకి పరిగెత్తి అక్కడ రోలు ఉంటె దానిమీదకు ఎక్కి అక్కడే ఉన్న కోతులకు వెన్న పెడుతున్నారు. ఈలోపు యశోదమ్మ పాలు దించి వచ్చి చూసేసరికి ఇలంతా వెన్న మజిగా ఒలికిపోవటాని చూసి యశోదమ్మకి కోపం వచ్చింది. చిన్ని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ పెరడులోకి వేస్తే అక్కడ కోతులకి వెన్న తినిపిస్తున్న చిన్ని కృష్ణుడు కనిపించారు. 



        యశోదమ్మ కోపంతో చిన్ని కృష్ణుడిని పట్టుకోవాలని వచ్చేసరికి చిన్ని కృష్ణుడు పారిపోయారు. చిన్ని కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంటి వరండాలో దాక్కున్నారు. యశోదమ్మ వెనకాలే వచ్చింది. వరండాలో స్తంభాల వెనకాల దాక్కున్నారు. ఆ స్తంభం నుంచి ఈ స్తంభం దగరకు ఈ స్తంభం దగర నుంచి ఆ స్తంభం దగరకు అమ్మకు దొరకుండా పరిగెడుతున్నారు. యశోదమ్మకు పరిగెత్తి పరిగెత్తి అలుపు వచ్చింది. యశోదమ్మ ఒకచోట కుంచుంటే ఏడుస్తూ చిన్ని కృష్ణుడు దగరకు వచ్చారు. వెంటనే యశోదమ్మ చిన్ని కృష్ణుడుని పట్టుకుంది. కొడదామని చేయి ఏతేసరికి చిన్ని కృష్ణుడి ఏడుపు మొహం చూసి కోటలేక తీసుకువెళ్లి రోలుకు కట్టాలని రోలుకి కఠిన తాడుతో చిన్ని కృష్ణుడి నడుముకి కడదామని చుస్తే రెండు అంగుళాలు తక్కువ వచ్చింది. ఇంకోతాడు ఈతాడుకి మళ్ళి కట్టి చుస్తే మళ్ళి రెండు అంగుళాలు తక్కువ వస్తుంది. ఈల చాల సేపటి తరువాత అమ్మ నన్ను కాటేయాలని నాకోసం కష్టపడుతుంది అని  చిన్ని కృష్ణుడికి యశోదమ్మ చేతితో రోలుకు కట్టబడ్డారు. అలా రోలుకు చిన్ని కృష్ణుడిని కటినపుడు చిన్ని కృష్ణుడి నడుము దగ్గర ఒక మచ్చ ఏర్పడింది. అప్పటినుంచే చిన్ని కృష్ణుడికి దామోదరుడు అని పేరు వచ్చింది. అయన చేసిన ఈ లీలను దామోదర లీలా అన్నారు.   

శ్రీకృష్ణుడు యశోదమ్మకు ఇచ్చిన బహుమతి

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 18

గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ |

ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ||

అర్థం :-

పరమగతియైనపరమధామమును, జగత్తును భరించి, పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరిశుభాశుభములను చూచువాడను నేనే, అందరికిని నివసస్థానమును, శరణుపొందదగినవాడను నేనే, ప్రత్యుపకారమును ఆసింపక హితమొనర్చువాడను, అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వతకారణమును నేనే.





మార్గశిర మాసం విశిష్టత

మార్గశిర మాసం విశిష్టత 

మాసాలోకేలా శ్రేష్టమైనది, ముఖ్యమైనది, శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది మార్గశిరమాసం. ఈ మాసములో ఏమైనా భగవంతునికి సంబంధిచిన ఉపాసనలు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి అని ప్రతీతి. 



బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ |

మాసానాం మార్గ శీర్షోహమ్ ఋతూనాం కుసుమాకరః ||

గానము చేయుటకు అనువైన శ్రుతులతో బృహత్సోమా మును నేను. చంధస్సులలో " గాయత్రిచంధస్సు"ను నేను. మాసములో మార్గశీరమాసమును, ఋతువులలో వసంతఋతువును నేనే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో భగవద్గితలోని విభూతి యోగంలో వివరించారు. 


మాస సంక్రమణం

సూర్య భగవానుడు 12 నెలలో ఒక్కో నెల చపున్న ఒక్కో రాశిలో మారుతూ ఉంటారు. ఇలా మారుతూ ఉండటాన్ని " మాస సంక్రమణం" అంటారు. ఇలా ఒకో ఏడాది 12 సంక్రమణలు వస్తాయి. సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి మారటానికి వృశ్చిక సంక్రమణం అంటారు. ఈ మార్గశిరమాసం శ్రీమహాలక్ష్మీదేవికి, శ్రీమహావిష్ణువుకి, సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైనది. 


మార్గశిర మాసంలోని ప్రత్యకమైన రోజులు

ఈ మాసంలో మొదట సుబ్రమణ్యషష్టి వస్తుంది. ఈ రోజున సుబ్రమణ్య స్వామికి పాలుపోసి పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో ప్రతి గురువారం మహాలక్ష్మి దేవిని పూజిస్తారు. ఈ మాసములో ఏకాదశి రోజునా గీతా జయంతి వస్తుంది. శ్రీ కృష్ణ భగవానుడు లోకానికి భగవద్గిత అందించారు. ఈ ఏకాదశినే మోక్ష ఏకాదశి, ముకోటి ఏకాదశి అంటారు. ఈ మాసములో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఆ రోజునే హనుమద్వైతం, ప్రదోష వ్రతం జరుపుకుంటారు. తరువాత ఈ మాసములో దత్తాత్రేయ జయంతి వస్తుంది. తరువాత మార్గశిర పూర్ణమ ఆ తరువాత సంకష్టహర చేతుర్దశి, ఆ రోజునే శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజ ప్రారంభమవుతాయి. తరువాత సఫల ఏకాదశి తరువాత కంచిపరమాచర్య ఆరాధన, రమణ మహర్షి జయంతి. తరువాత ప్రదోష వ్రతం వస్తుంది. తరువాత ఈ మాసం చివరిలో మాసశివరాత్రి వస్తుంది.  

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 17

పితహమస్య జగతో మాతా ధాతా పితామహః |

వేద్యం పవిత్రమోంకర ఋక్సామ యజురేవ చ ||

అర్థం :-

ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అలాగే కర్మ ఫలములను ఇచ్చువాడను నేనే. తల్లిని, తండ్రిని, తాతాను నేనే. తెలుసుకొనదగిన వాడను నేనే. పవిత్రుడుని, ఓంకారమును నేనే. ఋక్సామ యజుర్వేదములు నేనే.



         

పోలి స్వర్గం కథ, పోలి పాడ్యమి పూజ విశిష్టత

పోలి స్వర్గం కథ, పోలి పాడ్యమి పూజ విశిష్టత

పూజ విధానం

పోలి పాడ్యమి పూజ కార్తీక మాసం అమావాస్య పూర్తయి తెల్లవారుజామున పోలి పాడ్యమి  (మార్గశిర పాడ్యమి)పూజను నిర్వహిస్తారు. కార్తీక మాసం అంత పూజ చేయలేనివారు ఈ రోజునా ముపై వత్తులతో అరటి దోనెలలో ఆవునేతితో వెలిగించి నదిలో వదులుతారు. మార్గశిర పాడ్యమి రోజునా తెల్లవారుజామున నిద్ర లేచి నది స్నానానికి వెళ్లి స్నామమాచరించి అరటి దోనెలలో తిప్పలు వెలిగించి నదిలో వదలాలి. నదిలో దీపాలను శివుడు, విష్ణువు, గంగా, ,మహాలక్ష్మి దేవిగా భావిస్తారు. పూజ చేసి కార్తీక దామోదరుడిగా భావిస్తారు. దీపాన్ని వదిలేటపుడు పోలి స్వర్గం కథ చదువుకుంటారు. నదికి వెళ్లలేని వాళ్ళు చెరువుల దగ్గర కానీ, భావి దగ్గర కానీ లేక ఇంటిలోనే ఒక తోటేలో దీపాన్ని వదులుతారు.



పోలి స్వర్గం కథ

పూర్వం కృష్ణ తీరములో పోలమ్మ అనే ఒక మహిళా ఉంది. పోలమ్మ(పోలి) చిన్ననాటి నుంచి దైవ భక్తి ఎక్కువ. ఆమె ఊహ వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసం క్రమం తప్పకుండా చేసేది. ఆమెకు యుక్తి వయస్సు వచ్చిన తరువాత వివాహం జరిగింది. ఆమె అత్తగారి ఇంట్లో ఆమె ముగ్గురు తోడికోడళ్లు ఉండేవారు. ఆమె అత్త గారి మహా గయ్యాళి. పోలమ్మ భక్తి శ్రద్ధలను చూసి ఓర్వలేక పోయింది. పోలమ్మ వివాహం అయినా మొదటి సంవత్సరం కార్తీక మాసం వచ్చింది. ఆమె అత్తగారు ఆమెను పూజ చేసుకోనివ్వలేదు. ఆమె ఇంటిలోనే వదిలి పేటి మిగతా ముగ్గురు కొండలను తీసుకొని కృష్ణ నది స్నానానికి వేలాది. పోలమ్మను పూజ చేయనివ్వకూడదని ఆమెకు పూజ సామాను అందకుండా చేసేది అత్తగారు.  ఆమెకు సమయం ఉండకుండా ఇంటిపనులన్ని చెప్పేది. పోలమ్మ వాటినన్నిటిని ఓర్పుతో చేసి ప్రతి రోజు తెలవరకుండానే భావి దగర స్నానం చేసి పెరడులో పతిచెట్టు దగరకు వెళ్లి పతిని కోసి దానిని వతిగా చేసి ఇంటిలో ఉన్న వెన్నను పతికి రాసి కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికీ కనపడకుండా బూటా బోర్లించేది. ఇలా నెల రోజులు చేసింది. ఆఖరి రోజు కార్తీక అమావాస్య వెళ్లి మార్గశిర పాడ్యమి రోజునా అలాగే చేసింది. ఆమె భక్తికి మెచ్చి శ్రీమహా విష్ణువు ఆమెను సశేరీరంగా వైకుంఠానికి తీసుకుంటామని విష్ణు దూతలను పంపించారు. విష్ణు దూతలు వెంటనే అక్కడికి వచ్చారు. పోలమ్మను వైకుంఠానికి తీసుకువెళతానికి విమానంలో ఏకించుకున్నారు. ఆ విమానాన్ని చుసిన పోలమ్మ అత్తగారు ఆ విమానం తమ కోసమే వచ్చింది అని అనుకోని దగరకు చెలగా అందులో పోలమ్మ కనిపించింది. మాకు దక్కనిది పోలమ్మకు ఎందుకు దక్కాలి అని ఆమె కళ్ళు పట్టుకొని లాగబోయారు. అప్పటికే విమానం పైకి వెళ్లిపోయింది. పోలమ్మ అత్తగారు పోలమ్మ కళ్ళు పట్టుకుంది. ఆ అత్తగారి వెనక ముగ్గురు కోడలు ఒకరికలు ఒకరు పట్టుకొని విమానంతో వెలసాగారు. కొంతదూరం వెళ్లిన తరువాత విష్ణు దూతలు పోలమ్మ అత్తగారి చేతులమీద కొట్టారు వాలు కిందపడి మరణించారు. అందరూ చూస్తుండగా పోలమ్మ సశరీరంగా వైకుంఠానికి వెళ్లిపోయింది. ఆమె అత్తగారు, ఆమె ముగ్గురు తోడికోడళ్లు యమభటులు వచ్చి తీసుకు వెళ్లరు. ఈ కథను దీపాన్ని వదిలేటపుడు చెప్పుకుంటారు. 


Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 16

అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషదమ్|

మంత్రో హమహమేవాజ్యమ్ అహమగ్నిరహం హుతమ్ ||

అర్థం :-

నేనే క్రతువుని. నేనే యజ్ఞాని, పిండమును నేనే, ఓషదులు నేనే. నేనే మంత్రమును, నేనే హవిస్సుని, నేనే అగ్నిని. హోమరూప కర్మను నేనే అయి యున్నను. 




భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 15

జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపానతే |

ఏకత్వేన పృథక్త్యేన బహుధా విశ్వతోముఖమ్ ||

అర్థం :-

మరికొందరు జ్ఞానులు నిర్గుణనిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేదభవముతో ఉపాసిస్తున్నారు. మరికొందరు అనంత రూపాలతో ఉన్న నా విరాట్ స్వరూపమును ద్వైత భావముతో పూజిస్తున్నారు. 



 

భగవద్గీత

 అద్యాయం 9

శ్లోకం 14

సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |

సమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ||

అర్థం :-

ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరం కీర్తిస్తారు. నన్ను చెరాటనికి  ప్రయత్నిస్తారు. పదే పదే ప్రణమిల్లుతారు.సర్వదా నా ద్యానమునందే నిమగ్నులౌతారు. అనన్య భక్తితో నన్ను సేవిస్తున్నారు.



రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...