భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 56

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |

వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ||

అర్ధం :- 

దుఃఖములకు క్రుంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివడు, ఆసక్తిని, భయక్రోధములను వీడినవాడును ఐనట్టి ముని స్థితప్రజ్ఞుడు అనబడును.

భగవద్గీత

అధ్యాయం 2
శ్లోకం 55

శ్రీభగవాన్ ఉవాచ

ప్రజహతి యదా కామాన్ సర్వన్ పార్థ మనోగతాన్ |

ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||

అర్ధం :- 

శ్రీభగవానుడు పలికెను :- ఓ అర్జునా మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వారా ఆత్మయందుసంతుష్టుడైనవానిని, అనగా పరమత్మ సంయోగమువలన ఆత్మానందమును పొందినవానిని స్థితరగ్ఞుడని యందురు.


భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 54

అర్జున ఉవాచ

స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థిస్య కేశవ |

స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ ||

అర్ధం :- 

అర్జునుడు పలికెను :- ఓ కేశవా! సమాధిస్థితుడై పరమాత్మప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి? అతడు ఎట్లు భాషించును? ఎట్లు నడుచును?

భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 53

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |

సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి ||

అర్ధం :- 

నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా, నీకు పరమాత్మతో నిత్య సంయోగము ఏర్పడును. 

భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 52

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |

తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||

అర్ధం :- 

మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటబడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోకసంబంధమైన సమస్తభోగములనుండి వైరాగ్యమును పొందగలవు.

భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 51

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |

జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ||

అర్ధం :- 

అనగా కర్మబంధములనుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము. ఏలనన, సమబుద్ధియుక్తులైన, జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణబంధములనుండి ముక్తులయ్యెదరు. అంతేగాక, వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు.

భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 50

బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |

తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ||

అర్ధం :-       

సమత్వ బుద్ధియుక్తుడైనవాడు పుణ్యపాపములను పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక, నీవు సమత్వబుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియో కర్మాచరణమునందు కౌశలము.

భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 49

దూరేణ హ్యవరం కర్మ భుద్ధియోగాద్ధనంజయ |

బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ||

 అర్ధం :-       

కావున, ఓ ధనంజయా! నీవు సమత్వబుద్ధియోగమునే ఆశ్రయింపుము ఏలనన, ఫలాసక్తితో కర్మలు చేయువారు ఆత్యంతదీనులు, కృపణులు

భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 48

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్యాధనంజయ |

సిద్ద్యసిద్ద్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||

అర్ధం :-

ఓ దనంజయా! యోగస్థితుడవై ఆసక్తిని వీడి, సిద్ధి-అసిద్ధుల యెడ సమత్వ భావమును కలిగియుండి, సకామకర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు. ఈ సమత్వబుద్ధియోగముకంటెను సకామకర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది.

భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 47

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |

మాకర్మఫలహేతుర్భూః మా తే సంగో స్త్వకర్మణి ||

అర్ధం :-

కర్తవ్యకర్మమునాచరించుటయందే నీకు అధికారముగలదు. ఎన్నటికినీ దాని ఫలములయందులేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్షరహితుడవై కర్తవ్యబుద్ధితో కర్మలనాచరింపుము.

భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 46

యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే |

తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ||

అర్ధం :-

అన్నివైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులో నున్న వానికి, చిన్న చిన్న జలాశయములవలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తిపొంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదములవలన అంతియే ప్రయోజనము.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం45

అధ్యాయం 2

శ్లోకం 45

త్రైగుణ్యవిషయా వేదా నిస్ర్తైగుణ్యో భవార్ణున |

నిర్ద్యంద్వో నిత్యసత్వసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ||

అర్ధం :-

ఓ అర్జునా! వేదములు సత్త్వరజస్తమోగుణములైన సమస్త భోగములను గూర్చియు, వాటిని పొందుటకై చేయవలసిన సాదనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగములయెడలను, వాటి సాదనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్షశోకాదిద్వంద్వములకు అతితుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొఱకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం44

అధ్యాయం 2

శ్లోకం 44

భోగైశ్వర్యప్రసక్తనాం తయపహృతచేతసామ్ |

వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ||

అర్ధం :-

ఆ ఇచ్చకపుమాటల ఉచ్చులలోబడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానులబుద్ధులు భగవంతుడు లక్ష్యముగాగల సమాధియందు స్థిరముగా ఉండవు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం43

అధ్యాయం 2

శ్లోకం 43

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ |

క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి |

అర్ధం :-

స్వర్గమునకు మించినదేదియును లేదనియు, అదియే పరమప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రపంచిక భోగైశ్వర్యములయందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలుకుతారు. 

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం42

అధ్యాయం 2

శ్లోకం 42

యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చతః |

వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ||

అర్ధం :-

ఓ అర్జునా! వివేకహీనులైన జనులు ప్రాపంచికభోగములయందే తలమునకలై యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యములయొక్క బాహ్యర్థములయందే ప్రీతివహింతురు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం41

అధ్యాయం 2

శ్లోకం 41

వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన |

బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినామ్ ||

అర్ధం :-

ఓ అర్జునా! ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మకబుద్ది ఒకటియే యుండును. కాని, భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై, ఒకదారీ తెన్నూ లేక కోరికలవెంట నలువైపులా పరుగులు తీయుచూ అనంతములుగా నుండును.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం40

అధ్యాయం 2

శ్లోకం 40

నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే |

స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ||

అర్ధం :-

ఈ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికిని భీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములే యుండవు. పైగా,ఈ కర్మయోగమును ఏ కొంచెము సాధనచేసినను, అది జన్మమృత్యురూప మహాభయమునుండి కాపాడును.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం39

అధ్యాయం 2

శ్లోకం 39

ఏషా తే భిహితా సాంఖ్యే భుద్ధిర్యోగే త్విమాం శృణు |

బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ||

అర్ధం :-

ఓ పార్థా! ఈ  బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపాను. ఇప్పుడు దానినే కర్మయోగదృక్పథముతో వివరించెదను, విను. దానిని ఆకళింపుచేసికొని, ఆచరించినచో కర్మబంధములనుండి నీవు ముక్తుడవయ్యెదవు.


భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం38

అధ్యాయం 2

శ్లోకం 38

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌజయజయౌ |

తతో యుద్ధయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ||

అర్ధం :-

జయపజయములను, లాభనష్టములను, సుఖదుఃఖములను సమానముగా భావించి, యుద్ధసన్నద్ధుడవుకమ్ము. అప్పుడు నీకు పాపములు అంటవు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం37

అధ్యాయం 2

శ్లోకం 37

హతో నా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసేనహీమ్|

తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్దాయ కృతనిశ్చయః ||

అర్ధం :-

ఓ అర్జునా ! రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రప్తించును. యుద్ధమున జయించినచో రజ్యభోగములను అనుభవింపగలవు. కనుక, కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం36

అధ్యాయం 2

శ్లోకం 36

అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యతి తవాహితాః |

నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ||

అర్ధం :-

నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు, నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటె విచారకరమైన విషయ మేముండును ?

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం35

అధ్యాయం 2

శ్లోకం 35

భయాద్రణాదుపరతం మంస్యంతే త్వం మహారథాః |

యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ||

అర్ధం :-

ఈ మహారథులదృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధవిముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యదవు. అంతేగాక, నీవు పిరికివాడవై యుద్దమునుండి పారిపోయినట్లు వీరు భావిస్తారు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం34

అధ్యాయం 2

శ్లోకం 34

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేవ్యయామ్ |

సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే ||

అర్ధం :-

లోకులెల్లరును బహుకాలమువరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పికొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటె బాధాకరమైనది.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం33

అధ్యాయం 2

శ్లోకం 33

అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |

తతఃస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ||

అర్ధం :-

ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయినవాడవు అగుదువు. దానివలన కీర్తిని కోల్పోవుదువు. పైగా నీవు పాపము చేసినవాడవగుదువు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం32

అధ్యాయం 2

శ్లోకం 32

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |

సిఖినః క్షత్రియా: పార్థ లభంతే యుద్ధమీదృశమ్ || 

అర్ధం :-

ఓ పార్థా ! యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...