భగవద్గీత

 అధ్యాయం 5

శ్లోకం 23

శక్నోతిహైన యః సోఢుం ప్రాక్ శరీరవిమోక్షణాత్|

కామక్రోధోద్భవం వేగం స యుక్తః స  సిఖీ నరః||

అర్ధం :-

ఈ శరీరమును విడువకముందె అనగా జీవించియుండగానే కామక్రోధాదుల ఊద్వేగములను అదుపులోనుంచుకొనగల సాధకుడే నిజమైన యోగి. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 22

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఎవతే |

ఆద్యంతవంతః కౌతేయ న తేషు రమతే బుధః ||

అర్ధం :-

 విషయేంద్రియసంయోగంవలన  ఉత్పన్నములు భోగములనియును  భోగాలలసులకు సుఖములుగా భాసించినను అని నిసందేహముగా దుఃఖహేతువులే. ఆద్యంతములు గలవి. అనగా అనిత్యములు. కావున, ఓ అర్జునా! వివేకి వాటియందు ఆసక్తుడు కాడు. 

శ్రీకృష్ణ

 శ్రీకృష్ణ లీలలు 

శ్రీకృష్ణుడిని యశోదమ్మ నిద్రపుచ్చుతునపుడు గోకులంలో ఉన్న గొల్లభామలు వచ్చారు. యశోదమ్మ ఏంటి ఇంతమంది వచ్చారు అనుకోని బయటకు వచ్చి కూర్చుంది. ఆమె వెనకాలే శ్రీకృష్ణుడు కూడా వచ్చి అమ్మ ఒడిలో పోసుకుని అమ్మని వచ్చిన వాళ్లని చూస్తుంటాడు. ఇంకా శ్రీకృష్ణుడి మీద ఒక గోపకాంత ఇలా చెప్పసాగింది. బాలింతలకి  పాలులేవు అని పసిపిల్లలకు ఆవుపాలు పడదాము అనుకునేలోపు ఈ కుమారుడు వచ్చి ఆవుల దగరకు దూడలను వదిలేశాడమ్మా(వాళ్ళు దూడలను పాలు తాగనివ్వకుండా వల్ల పిల్లలకి మాత్రమే పాలను తీస్తున్నారు. అయన అందుకే శ్రీకృష్ణుడు ఆలా చేసారు.). వదిలేసింది చూసి మేము కంగారుపడుతుంటే దూరంగా చెట్టుమీద కూర్చొని మమ్మలిని చూసి నవుతున్నాడు యశోదమ్మ. ఇంకో గోపకాంత మా ఇంట్లో పాలను ఎర్రగా కాగబెట్టి వాటిని కుండలలో భద్రం చేసుకుంటే నీ కుమారుడు తన స్నేహితులతో వచ్చి పాలను తాగేసి కుండలను తొక్కుకుంటూ వెళిపోయాడు అని మొరపెట్టుకుంది. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 21

బాహ్యస్పర్శేష్వసక్తత్మా విందత్యాత్మనియత్సుఖమ్|

స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ||

అర్ధం :-

ప్రాపంచిక విషయములయందు అనాసక్తమైన అంతఃకరణముగల సాధకుడు, అత్మస్థితధ్యానజనితమైన సాత్త్మాకాత్మానందమును పొందును. పిదప అతడు సచ్చిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మ ద్యానయోగము నందు అభిన్నభావస్థిహుడై అక్షయానందమును అనుభవించును. 

శ్రీకృష్ణ

ఆడుకోవటానికి బయటకు వెళ్లిన కృష్ణుడు అందరి ఇళ్లలోకి వెళ్లి వెన్న, నెయ్యి దొంగిలించి తినేసేవాడు. అమ్మకు తెలియకుండా ఉండేందుకు ఆ వెన్న నెయ్యి ఆకులకి, ఆవులకి రాసేవారు. ఆడుకొని వచ్చిన వాడిలాగా ఒంటిమీద మట్టి పూసుకొని వచ్చేవారు. వస్తూనే అమ్మ ఆకలివేస్తుంది అన్న పెట్టు అనేవారు. మళ్ళి అన్నం తినేటపుడు కథ చెప్పమనేవారు. అన్నం తినతరువాత శ్రీకృష్ణుడికి దిష్టి తీసేసేది. తరువాత నిద్రపుచ్చేది. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 20

న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ |

స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ర్బహ్మణి స్థితః ||

అర్ధం :-

కనుక, వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. ప్రియలాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు క్రుంగి పోనివాడును, స్తిరమైన బుదిగలవాడును, మొహవివశుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్ఛిదానందఘనపరబ్రహ్మపరమాత్మ యందు సదా ఏకీభావస్థితి యందుండును. 

శ్రీకృష్ణ

శ్రీకృష్ణడికి యశోదమ్మ నడుముకి ఒకచిన్న గంటకడుతుంది. ఒకరోజు ఇంట్లో యశోదమ్మ మంచిపనిలో ఉండగా శ్రీకృష్ణుడు ఆడుకుంటూవచ్చి కుండా పగలకొడతాడు. యశోదమ్మకు కోపంవచ్చి కొడదామని వచ్చి కోటలేక ఈసారి మళ్ళి అలరిచేయి నిను కోటేస్తాను అని మందలిస్తుంది. అంతే శ్రీకృష్ణుడికి కోపంవచ్చి ఒక మూలకి వెళ్లి బుంగ మూతి పెట్టుకొని నేను ఆడుకొని, నేను మాట్లాడాను అని అలిగి కూర్చుంటాడు. ఇంకా ఎంతసేపటికి అమ్మ పిలవటం లేదుగాని ఏడుపుమొఖం పెటేస్తే యశోదమ్మ చూసి నవ్వుకొని ఇక్కడ ఉన్నాడు నా చిన్ని కృష్ణయ్య అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ వోలో పొడుకోని పాలు తాగేసి మాలి ఆడుకోవటానికి వెళ్లిపోయారు. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 19

ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః |

నిర్దోషం హి సమ బ్రహ్మ తస్మాద్ బ్రాహ్మణి తే స్థితః ||

అర్ధం :-

సర్వత్ర సమభావస్థితమనస్కులు ఈ జన్మయందే సంపూర్ణజగత్తును జయించిన వారగుదురు. అనగా ప్రాపంచిక విషయాతీతస్థితికి చేరుదురు. సచిదానందఘనపరమాత్మ దోషరహితుడు, సముడు. సమభావస్థితమనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘనపరమాత్మయందుస్థితులు. 

శ్రీకృష్ణ

ఒకరోజు శ్రీకృష్ణుడు తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లి మట్టి మీద పొడుకున్నారు. ఆ మట్టిని తీసుకొని ఒంటిమీదపోసుకుంటుంటే ఒంటికి భాసంరాసుకున్నా శంకరుడే కనపడుతున్నాడు అన్నారు పోతనగారు.  ఆ కంఠములోని మాలలోని మణి కాంతి శంకరుని గరళ కంఠము లాగా అయన ముత్యాల కోపుచూస్తుంటే గంగమని నెత్తిమీదపెట్టుకొని చంద్రవంక ధరించినట్టు అయన మెడలోని నగలు చూస్తుంది శంకరుడి మేడలో పాములులాగా అనిపిస్తున్నాయి అని. శివకేశవులకు భేదం లేదా అని పోతనగారు అనుకున్నారు. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 18

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |

శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ||

అర్ధం :-

జ్ఞానులు విద్యావినయ సంపన్నుడైన బ్రహ్మణునియందును, గోవు, ఏనుగు, కుక్క, మొదలగు వానియందును, చండాలునియందును సమదృష్టినే కలిగియుందురు. 

శ్రీకృష్ణ

శ్రీకృష్ణుడు అపుడే తప్పటడుగులు వేస్తున్నాడు. లోకాలకి అడుగులు వేయటం నేర్పిన స్వామి ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాడు అని 33కోట్లమంది దేవతలు మురిసిపోతున్నారు. శ్రీకృష్ణుడికి కథలు అంటే చాల ఇష్టం. ఒకరోజు శ్రీకృష్ణుడి ఊయలలో పొడుకోబెట్టి రామాయణం చెప్పటం ప్రారంభించింది. ఇక్ష్యుకు వంశంలో శ్రీరాముడు ఉండేవాడు. అతను చాల గుణవంతుడు. తండ్రి మాట కోసం అరణ్య వాసానికి వేలాడు. అరణ్యవాసంలో ఉండగా సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయారు అనేసరికి నిద్రపోతున్న శ్రీకృష్ణుడు గబుక్కునలేచి లక్ష్మణ ధనుస్సు పాటుకురా అనేసరికి యశోదమ్మ ఉలిక్కిపడింది. మళ్ళి వెంటనే తేరుకొని శ్రీకృష్ణుడు అమ్మమీద విష్ణు మయా కమేసి ఓహో ఇది కృష్ణావతారం కదా అనికొని మళ్ళి నిద్రపోయాడు. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 17

తద్భుధ్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః |

గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞనవిర్ధూతకల్మషాః ||

అర్ధం :-

తద్రూపమును పొందిన మనోబుద్ధులుగలవారై, సచ్చిదానందఘనపరమాత్మ యందే నిరంతరము ఏకీభావములో స్థితులై, తత్పరాయణులైన పురుషులు జ్ఞానసాధనతో పాపరహితులై, పునరావృత్తిరహితమైన పరమగతిని పొందుదురు. 

శ్రీకృష్ణ

శ్రీకృష్ణుడికి పాకటం వచ్చిన తరువాత యశోదమ్మ నుంచోని ఉంటే అక్కడికి పాకుంటువేళ్లి యశోదమ్మ చీరకొంగు పట్టుకొని నుంచోవటానికి ప్రయత్నించేవాడు. పదేపదే ఆలా చీరకొంగు పట్టుకొని లాగుతుంటే యశోదమ్మకు విసుగువచ్చి చీరకొంగును అందకుండా చుట్టుకునేది. అపుడు శ్రీకృష్ణుడు అమ్మ చీరకొంగులా ఏమిఉంది అని వెతికి ఆవు తొకలను పట్టుకొని నుంచునేవాడు ఆవు తోకలను లాగి నుంచుంటే ఆవులు అరిచెవి ఆవుల అరుపులు విని బయటకు వచ్చిన యశోదమ్మ చీసి చిన్ని కృష్ణుడిని అయ్యాయో ఆవు తోకపాడుకొని లాగుతున్నావు దాన్ని డెక్కతో తొకింది అంటే చిన్ని చిన్ని పాదాలు పచ్చడి అయిపోతాయి అని ఇవతలకు లాకోచేది. 


కాశీలోని ఉగ్రవారాహీ అమ్మవారి దేవాలయం

కాశీలోని ఉగ్రవారాహీ అమ్మవారి దేవాలయం ఉదయం 4:30గం||ల నుంచి ఉదయం 8గం ||ల వరకు తెరిచి ఉంటుంది. ఈ అమ్మవారిని గుడి కిటికీలోనుంచి మాత్రమే దర్శనం చేసుకుంటారు. అమ్మవారిని నేరుగా ఎవరూ చూడలేరు. ఎందుకంటే ఈ అమ్మవారు ఉగ్రరూపములో ఉంటారు. ఈ అమ్మవారు కాశీకి గ్రామదేవత. కాశీలోకి ఎటువంటి దుష్టశక్తి ప్రవేశించకుండా సాయంత్రం నుంచి ఉదయం వరకు నగర సంచారం చేస్తుంది. ఉదయం విశ్రాంతి తీసుకుంటుంది. అందుకే ఈ అమ్మవారి గుడి ఉదయం 8గం||ల వరకే తెరిచి ఉంటుంది. ఉగ్రవారాహీ అమ్మవారు వరాహ స్వామి అంశా. ఈ అమ్మవారి గురించి ఒక కథ ఉంది. పోతనగారు రాస్తున్న భాగవతాన్ని తమకు అంకితం ఇవ్వమని చాలామంది రాజులూ అడిగారు. కానీ పోతనగారు శ్రీరామునికి తప్ప ఇంకెవరికి అంకితం ఇవ్వను అన్నారు. కానీ ఒకరాజు పోతనగారి భాగవతాన్ని బలవంతంగా తనకు అంకితం ఇపించుకోవాలని తన సైన్యాన్ని పంపించారు. సైన్యం పోతనగారి ఆశ్రమానికి వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద అడవి పంది(వరాహం)ఉంది.  దానిని ఎదిరించలేక దానిని ధాటి రాలేక సైన్యం వెనక్కి వెలిపోయింది. మరుసటిరోజు రాజు తన అహంకారం తగి పోతనగారిని క్షమాపణ చెప్పటానికి వచ్చి జరిగినదంతా పోతనగారి చెప్పారు. పోతనగారు ఆహా రాజా మీరు ఎంత అదృష్టవంతులు నిన్న నేను యజ్ఞ వరాహ ఆవిర్భావం రాస్తున్నాను. సాక్షాత్తు ఆ వారాహి అమ్మవారే వచ్చి రక్షించారు అనిచెప్పారు. ఈ అమ్మవారిని దర్శించుకునేవారికి కోర్టు కేసులు తీరతాయి, శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 16

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః |

తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరత్ ||

అర్ధం :-

కానీ వారి (ప్రాణుల) అజ్ఞానము పరమాత్మ తత్త్మజ్ఞానప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానందఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపజేయును.  

కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు

కాశీలోని 12సూర్య దేవాలయాలలో పన్నెండోది కేశవ ఆదిత్యుడు.

కేశవ ఆదిత్యుడు 

పూర్వకథ :- ఒకసారి సూర్యుడు ఆకాశమార్గంలో వెళుతుండగా కాశీ క్షేత్రంలో విష్ణుమూర్తి శివునికి పూజ చేస్తూ కనిపించరు. సూర్యుడు వెంటనే కిందకి వచ్చి విష్ణుమూర్తిని స్వామి మీరు శివుడిని పూజ చేస్తున్నారు ఏమిటి అని అడిగారు. అపుడు విష్ణుమూర్తి నాకు శివునికి భేదం లేదు అని తెలియజేయటానికి అని చెపుతారు. 

స్థలం :- వారణాశి జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర ఆదికేశవ దేవాలయం గర్భగుడిలో ఉంటుంది. 

కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు

కాశీలోని 12సూర్య దేవాలయాలలో పదకొండోది ఉత్తరార్క ఆదిత్యుడు.

ఉత్తరార్క ఆదిత్యుడు

పూర్వకథ :- ప్రియవ్రతుడు అనే భార్యాభర్తలకు ఒక సులక్షణ అనే కుమార్తె ఉండేది. ఆమెకి జాతకం సరిగా లేక వివాహం జరగదు. కొనాలకి ఆ భార్యాభర్తలు ఆ బాధతో చనిపోతారు. ఈ సులక్షణ బాధపడి జాతక దోష పరిష్కరం సూర్య ఆరాధన ఒకటే అని మార్గం అని ఇక్కడికి వచ్చి సూర్యుడిని ప్రతిష్టించి ప్రతిరోజు బకిరియా కుండ్ లో స్నానం చేసి తపస్సు చేస్తుంది. ఆమె తపస్సు మొదలు పెట్టగానే ఎక్కడినుంచి వచ్చేదో ఒక మేక ఆమె పక్కన వచ్చి కూర్చునేది. కొన్నాలకి ఈమె తన తపస్సుని తీవ్రతరం చేస్తుంది. ఆ మేకాకుండా ఆమెతోపాటే అక్కడే ఉంటుంది. కొన్నాళ్లకి పార్వతి, ఈశ్వరులకి జాలి కలిగి ఆమెకు దర్శనం ఇచ్చి ఏమివరం కావాలో కోరుకోమని అడిగితే ఆమె నాకు కాదు ఈ మేకకు వరం ఏవండీ అమ్మ కావాలంటే నేను మళ్ళి ఉపాసన చేసి సాధించగలను కానీ మేక అలాగకాదు కదా. దానికి పార్వతీపరమేశ్వరులు ఆమెకు ఉత్తమామనైనా జన్మను ప్రసాదిస్తారు. సులక్షణ భాతదయకు మెచ్చి ఆమెను పార్వతీదేవి తన చెలికతెలలో ఒకరుగా చేసుకుంటుంది. 

విశేషం :- ఈ ఆదిత్యుడిని ఉపాసిస్తే ప్రమోషనులు వస్తాయి. 

స్థలం :- వారణాశి జంక్షన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర బకిరియా కుండ్ దగ్గర ఉంది. 

కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు

కాశీలోని 12సూర్య దేవాలయాలలో పదోవది కాకోక్లా  ఆదిత్యుడు.

కాకోక్లా ఆదిత్యుడు

పూర్వకథ :- అరుణుడు శాపం వల్ల వినత తన సవతికి దాసి అవుతుంది. కొన్నాలకి రెండో గూడులో నుంచి శక్తివంతుడైన గరుత్మంతుడు వస్తాడు. ఇంకొన్నాళ్లకి గరుత్మంతుడు తన తల్లి అయినా వినతను దాస్యం నుంచి విముక్తి కలిగిస్తాడు. కానీ వినతకి మనసులో బాధ అలాగే ఉంటుంది. తనవల్ల అరుణుడు అంగవైకల్యుడు అయ్యాడు అని బాధపడుతుంది. మనస్సు శాంతి కోసం ఇక్కడ సూర్యుడిని ప్రతిష్టించి తపస్సు చేస్తుంది. సూర్యుడు ప్రత్యక్షమై ఆమె మనస్సుకు శాంతిని ప్రసాదిస్తాడు. 

విశేషం :- ఇక్కడ సూర్యుడిని ఉపాసిస్తే మానసిక భాధలు తొలగిపోతాయి. 

స్థలం :- బిర్లా హాస్పిటల్ ఎదురుసందులో నడుచుకుంటూ వెళితే కామేశ్వర మహాదేవ ఆలయంలో పెద్ద చెట్టు వెనకాల ఉన్న మండపంలో ఉంటుంది. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 15

నాధత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః |

అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యతి జంతవః ||

అర్ధం :-

సర్వవ్యాపియైన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి యుండుటవలన ప్రాణులు మోహితులగుచుందురు. 

కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు

కాశీలోని 12సూర్య దేవాలయాలలో తోమిదోవది అరుణ ఆదిత్యుడు.

9. అరుణ ఆదిత్యుడు 

పూర్వకథ :- కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ ఇద్దరు భార్యలలో కద్రువకి ఎంతోమంది పాము సంతానం కలుగుతుంది. వినతకి రెండు గుడ్లు మాత్రం ఇవ్వబడతాయి. అవి ఎన్నాళ్లకి బయటకి రాకపోవటంతో సవతి పై అసూయతో వినత ఒక గుడ్డుని పగలగొడుతుంది. అందులో నుంచి కాంతులు వెదజలుతు కాలులేకుండా ఒక పురుషుడు బయటకు వస్తాడు. వస్తూనే తన తల్లిని ని సవతిపై అసూయతో నన్ను పూర్తిగా పెరగనివ్వకుండా బయటకు తీస్తావా నీవు ని సవతికే దాస్యం చేస్తావు అని శపించి ఇక్కడకు వచ్చి సూర్యుడి కోసం తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చి సూర్యుడు అతనిని తన రథానికి సారధిగా చేసుకుంటాడు.

విశేషం :- ఈ స్వామిని ఉపాసించిన వారికీ అంగవైకల్యం పోతుంది. 

స్థలం :- ఆటోలో బిర్లా హాస్పిటల్ దగ్గర దిగి హాస్పిటల్ ఎదురు సందులోకి నడుచుకుంటూ వెళితే రెండు ఆదిత్యుల దేవాలయాలు ఉన్నాయి. అరుణాదిత్యుడు త్రిలోచనేశ్వరుడి దేవాలయములో ఒక మూలా ఉంటుంది. 

కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు

కాశీలోని 12సూర్య దేవాలయాలలో ఎనిమిదొవది మయూఖ ఆదిత్యుడు.

మయూఖ అధిత్యుడు 

పూర్వకథ :- పూర్వం సూర్యుడు శివపార్వతుల కోసం ఇక్కడే తపస్సు చేసాడు. తపస్సు వలన సూర్యుడి వేడి పెరిగిపోయాడు. భూమిలో ఉండే ఋషులు పరమేశ్వరుడిని ప్రార్ధించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై సూర్యుడిని తాకగానే చలపడిపోతాడు. అందుకే ఇక్కడ సూర్యుడు 365రోజులు చల్లగా, తేమగా ఉంటాడు. సూర్యుడి కోరిక మేరకు పార్వతి పరమేశ్వరులు ఇక్కడ గభస్తిశ్వరుడు మాంగళ్య గౌరిగా వెలిశారు. 

విశేషం :- ఈ స్వామిని పూజిస్తే భయంకరమైన రోగాలు రాకుండా ఉంటాయి. 

స్థలం :- గంగానదిలో రాజా గ్వాలియర్ ఘాట్ దగ్గర దిగి ప్రక్కన మెట్లపైకి ఎక్కి కుడిచేతివైపు మాంగళ్య గౌరీ ఆలయంలోకి వెళితే కుడిచేతి వైపు చిన్న ఇతడి విగ్రహం ఉంటుంది. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 14

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |

న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ||

అర్ధం :- 

పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమునుగాని, వారి కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ యన్నింటిలో ప్రకృతియే ప్రవర్థిల్లును. అనగా గుణములయందు ప్రవర్తిల్లుచుండును. 

కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు

కాశీలోని 12సూర్య దేవాలయాలలో ఎడొవది యామ  ఆదిత్యుడు. 

7. యామ ఆదిత్యుడు 

పూర్వకథ :- ఇక్కడే యమధర్మ రాజు తన తండ్రి అయిన సూర్యుడి కోసం తపస్సు చేసాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఇక్కడ వెలిసాడు. 

విశేషం :- ఇక్కడ పితృకర్మలు చేస్తే గయలో చేసిన ఫలితం వస్తుంది. 

స్థలం :- సంకట్ ఘాట్ దగ్గర దిగి మెట్లపైకి వెళ్లి అక్కడ ఉంటుంది. 

కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు

కాశీలోని 12సూర్య దేవాలయాలలో ఆరోవాది గంగా ఆదిత్యుడు. 

6. గంగా ఆదిత్యుడు 

పూర్వకథ :- సూర్యడు ఇక్కడ గంగా నది కోసం తపస్సు చేసాడు. 

విశేషం :- ఈ స్వామిని ఉపాసించటం వల్ల ఎవరి వల్ల మోసపోవటం జరగదు. 

స్థలం :- సంకట్ ఘాట్, పశుపతి ఘాట్ దగ్గర దిగి నేపాలీ పశుపతినాధ్ దేవాలయ దగ్గర కుడిచేతిపక్కన కిందకి మెట్లు దిగి అక్కడ చిన్న గుడిలో ఉంటాడు ఈ గంగా ఆదిత్యుడు. 

కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు 5

కాశీలోని 12సూర్య దేవాలయాలలో ఐదోవది వృధాప్య ఆదిత్యుడు. 

5. వృధాప్య ఆదిత్యుడు

పూర్వకథ :- ఒక వృధుడు సూర్య భగవానుడి కోసం ఇక్కడ తపస్సు చేసారు. స్వామి ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి అని అడిగారు. అందుకు ఆ వృధుడు స్వామి వృధాప్యం వల్ల వచ్చే బాధల వలన మిమ్మలిని సరిగా ఉపాసించలేక పోతున్నాను. కాబ్బటి నాకు వృధాప్య భాధలు లేకుండా శక్తిని ప్రసాదించండి అని కోరాడు. 

విశేషం :- ఈ స్వామిని ఉపాసించిన వారికీ వృధాప్య భాదలు దరిచేరవు. 

స్థలం:- ఈ స్వామి దగరకు వెళ్లటానికి గంగానదిలోని నిర్ ఘాట్ దగ్గర దిగి పైకి వెళ్లేకొద్ది ఎడమ చేతి వైపు ఉంటుంది. 



భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 13

సర్వకర్మాణి మాససా సన్న్యస్యాస్తే సుఖం వశీ |

నవధ్వారే పురే దేహి నైవ కుర్వన్ నాకారయన్ ||

అర్ధం :-

అంతఃకరణమును అదుపులోనుంచుకొని, సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపకయే, ఆచరింపజేయకయే, నవద్వారములుగల  శరీరము నందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి, సచిదానందా ఘనపరమాత్మ స్వరూపమున స్థితుడై, ఆనందమును అనుభవించును. 

కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు

కాశీలోని 12సూర్య దేవాలయాలలో నాలుగోవది ద్రుపద ఆదిత్యుడు. 

4. ద్రుపద ఆదిత్యుడు

పూర్వకథ :- ద్రౌపది దేవి పూర్వజన్మలో ఇక్కడే తపస్సు చేసి పరమశివుడిని మేపించి పతి కావాలి అని వరం కోరుకుంది. ఆమె ఆపకుండా 5సార్లు పతి అని అనటం వలనే ఆమెకు మరు జన్మలో 5గురు భర్తలు వచ్చారు అని మహాభారతంలోని కథ. అంతే కాకుండా వనవాసంలో ఉండగా ధర్మరాజు, ద్రౌపతి కూడా ఇక్కడ సూర్యుడి కోసం తపస్సు చేసారు ఆహారం కోసం సూర్యుడు వారి తపస్సుకి మెచ్చి అక్షయ పాత్రా ప్రసాదించాడు. 

విశేషం :- ఈ స్వామిని పూజించిన వారికీ జన్మలో ఆహారానికి లోటు రాదు అని ప్రతీతి. 

స్థలం :- ఈ ఆలయానికి వెళ్లటానికి వెళ్లే ఒకటో నెంబర్ గేటులో నుంచి లోపలికి వెళితే టుంటి గణపతి ఆలయం వస్తుంది. కొంచెం ముందుకు వెళితే అన్నపూర్ణ దేవి ఆలయం వస్తుంది. ఇంకాకొంచం ముందుకు వెళితే అక్షయవటవృక్షం వస్తుంది. అక్కడ చుట్టు వెతికితే ఒక మూల చిన్న శిలలాగా వుంది. దానిపైన చిన్న ఆదిత్యుడి విగ్రహం ఉంటుంది. 



కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు 3

కాశీలోని 12సూర్య దేవాలయాలలో మూడొవది సాంబ ఆదిత్యుడు 

సాంబ ఆదిత్యుడు 

పూర్వకథ :- శ్రీకృష్ణుడు, జాంబవతి కుమారుడు సాంబుడు. అతని అల్లరి చేష్టలకి తట్టుకోలేక ఒకసారి నారద మహర్షి కుష్ఠిరోగివికమని సాంబుడిని శపిస్తాడు. సాంబుడు శ్రీకృష్ణుడు దగరకు వెళితే శ్రీకృష్ణుడు నువ్వు నా కుమారుడివి అయినా కర్మఫలితం అనుభవించాలసిందే కనుక తపస్సు చేయమని చెపుతాడు. అపుడు సాంబుడు ఇక్కడికి వచ్చి ఆదిత్యుడి గురించి గోరాతపస్సు చేస్తాడు. ఆదిత్యుడు ఇతని తపస్సుకు మెచ్చి కుష్టి వ్యాధిని తగిస్తాడు. ఈ ఆదిత్యుడినే సాంబ ఆదిత్యుడు అంటారు. 

విశేషం :- ఈ ఆదిత్యుడిని ఉపాసిస్తే చర్మవ్యాధులు పోతాయి. 

స్థలం :-  ఈ ఆలయం సూరజ్ కుండం దగర ఉంది. సూరజ్ కుండంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు పోతాయి. 



కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు 2

కాశీలోని 12సూర్య దేవాలయాలలో రెండోవది విమల ఆదిత్యుడు. 

విమల ఆదిత్యుడు

పూర్వకథ :- పూర్వం విమలుడు అనే రాజుకి కుష్టివ్యాధి ఉండేది. అతని రాజ్యములో ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా తగలేదు. ఆ రాజు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చి ఆదిత్యుడు అతని వ్యాధిని తగిస్తాడు. ఆ రాజు తన తపఃశక్తిని ధారపోసి ఇక్కడ ఆదిత్యుడిని ప్రతిష్టిస్తాడు. విమలుడుచే ప్రతిష్టించబడిన ఆదిత్యుడు కాబట్టి విమలాదిత్యుడు. 

విశేషం :- ఆ స్వామిని ఉపాసిస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. 

స్థలం :- కాశీలోని జంగంవాడి మఠం ఎదురు నుంచోని ఎడమచేతివైపు సందులోకి వెలితే కుడిచేతి మూడో సందులో ఒక ఎర్రటి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం వెనుక భాగంలో ఉంటుంది. 



భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 12

యుక్తః కర్మఫలం త్యక్త్యా శాంతిమాప్నోతి వైష్టికీమ్ |

అయుక్తః కామకారేణ ఫలేసక్తో నిబధ్యతే ||

అర్ధం :-

నిష్కామకర్మయోగి కర్మఫలములను త్యజించి, భగత్ర్పాప్తిరూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైనవాడు ఫలేచ్ఛతో కర్మలనాచరించి బద్ధుడగును. 

కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు 1

పూర్వం కాశీలో సూర్యభగవానుడికి 12 ఆలయాలు ఉండేవి. వాటిలో  కొన్ని దండయాత్రల్లో ధ్వంసమయ్యాయి.  మన పూర్వీకులు వాళ్ళ తపఃశక్తిని  ధారపోసి ఆలయాలను కట్టారు. 

1. లోలార్క ఆదిత్యుడు

పూర్వకథ :-పూర్వం దివందాస్  వారణాసిని  తన గుపేటిలో పెటుకున తరువాత పరమేశ్వరుడు సూర్యుడిని పిలిచి నువ్వు వెళ్లి వారణాసిలో కొంచం స్తానం ఏర్పరచుకో అని ఆజ్ఞాపిస్తాడు. సూర్యడు ఇక్కడికి వచ్చి లోలతతో ఉంటాడు కాబటి ఇక్కడ స్వామికి లోలార్క ఆదిత్యుడు అని పేరు. 

విశేషం :- ఈ స్వామిని ఉపాసిస్తే పాపం వల్ల వచ్చే వ్యాధులు పోతాయి. 

స్థలం :- ఈ ఆలయానికి వెళ్లటానికి అశ్వని ఘాట్ దగరకు వెళ్లి లోలార్కు కుండం దగరకు వెళితే అక్కడ ఉంటుంది. ఇక్కడ గంగ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. 



భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 11

కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి |

యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్యాత్మశుధ్ధాయే ||

అర్ధం :-

కర్మయోగులు మమతాసక్తిరహితులై కేవలము ఇంద్రియములు,మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణశుద్ధికై కర్మలను ఆచరింతురు. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 10

బ్రహ్మణ్యధాయ కర్మాణి సంగం త్యక్త్యా కరోతి యః |

లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ||

అర్ధం :-

కర్మలనన్నింటిని భగదర్పణము గావించి, ఆసక్తిరహితముగా కర్మలనాచరించు వానిని తామరాకుపై నీటిబిందువులవలె పాపములు అంటావు. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 8

నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేతాతత్త్వవిత్ |

పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గుఛ్చాన్ స్వపన్ శ్వసన్ ||

శ్లోకం 9

ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ నిమిషాన్నపి |

ఇంద్రియాణీంద్రియా ర్థేషు వర్తంత ఇతి ధారయన్ ||

అర్ధం :- 

తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి  చూచుచు,  వినుచు,  స్పృశించుచు, ఆఘ్రాణించుచు,  భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు,  కనులను తెరచుచు, మూయుచు ఉన్నను, ఇంద్రియములు తమతమ విషయములయందు వర్తించుచున్నవనియు, తానేమియు చేయుటలేదనియు భావించును. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 7

యోగయుక్తో వీశుధ్ధాత్మా విజితాత్మాజితేంద్రియః |

సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే||

అర్ధం :-

మనస్సును వశమునందుంచుకొనినవాడు, జితేంద్రియుడు,  అంతఃకరణశుద్ధి కలవాడు,  సర్వ ప్రాణులలో ఆత్మ స్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నాను ఆకర్మలు వానిని అంటావు. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 6

సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః|

యోగయుక్తో మునిర్ర్బహ్మ నచిరేణాధిగచ్ఛితి||

అర్ధం :-

ఓ అర్జునా! కర్మయోగమును అనుష్ఠింపక సన్న్యాసము  అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరములద్వారా జరుగు కర్మలన్నింటీ యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్స్వరూపమును మననముచేయు కర్మయోగి పరబ్రహ్మపరమాత్మను శీఘ్రముగా పొందగలడు.

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 5

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే|

ఏవం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ||

అర్ధం :-

జ్ఞనయోగులు పొందు పరంధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞనయోగఫలమును, కర్మయోగఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్దమును గ్రహించును. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 4

సాంఖ్యయోగౌ పృథగ్బాలాః  ప్రవదంతి న పండితాః |

ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలమ్||

అర్ధం :-

సాంఖ్య,  కర్మయోగములు వేర్వేరుఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు. పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ  ఒక్కదానినైనని బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 3

జ్ఞయః నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి|

నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే||

అర్ధం :-

మహాబాహూ! ఎవరినీ ద్వేషింపని, దేనినీ కాంక్షింపని కర్మయోగిని నిత్యసన్న్యాసిగా ఎరుంగవలెను. ఏలనన, రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసారబంధములనుండి ముక్తుడగును. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 2

శ్రీ భగవాన్ ఉవాచ

సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ|

తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే||

అర్ధం :-

శ్రీ కృష్ణ భగవానుడు పలికెను:- కర్మసన్న్యాసము, కర్మయోగము అను ఈ రెండును పరామకల్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోను కర్మసన్న్యాసము కంటెను, కర్మయోగము సుగమమగుట వలన శ్రేష్ఠమైనది. 

శ్రీకృష్ణ

శ్రీకృష్ణ లీలలు 

యశోదమ్మ ఒక రోజు శ్రీకృష్ణుడికి నలుగు పెట్టి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి చిన్ని కృష్ణుడికి చిన్న పట్టు పంచెకట్టి జుత్తుకి చిన్న కొప్పు వేసి ఆ కోప్పుకి తెల్లటి ముత్యాల దండా కట్టి చిన్న నెమలి పించం పెట్టి మేడలో నగలువెసి మూడు నామాల బోటు పెట్టి చేతులకి కడియాలు, కళ్ళకి మువ్వల పటీలు పెట్టి నడుముకి చిన్న కొమ్ముబూర కట్టి తయారు చేసింది. చిన్ని కృష్ణుడు తరువాత అమ్మ దగర నుంచి పాకుతుంటే కొత్తగా పెట్టిన మువ్వల శబ్దానికి భయపడి మళ్ళి అమ్మ వొళ్ళో పొడుకోని అమ్మ ఒంక చుస్తే యశోదమ్మ నవ్వుకొని "నా చిన్ని కన్నయ్య! భయపడదు అవి మువ్వల పటిల్లు నానా అని చెపుతుంది. చిన్ని కృష్ణుడు కూడా ఒక నవ్వు నవ్వుతాడు. 

భగవద్గీత

అథ పంచమో ధ్యయః - కర్మసన్న్యాసయోగః 

అర్జున ఉవాచ 

శ్లోకం 1

సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |

యచ్ర్ఛేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్||

అర్ధం :-

అర్జునుడు పలికెను :- ఓ కృష్ణ! ఒక్కసారి కర్మసన్న్యాసమును,  మరియొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు.  నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. 

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...