అధ్యాయం 5
శ్లోకం 8
నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేతాతత్త్వవిత్ |
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గుఛ్చాన్ స్వపన్ శ్వసన్ ||
శ్లోకం 9
ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ నిమిషాన్నపి |
ఇంద్రియాణీంద్రియా ర్థేషు వర్తంత ఇతి ధారయన్ ||
అర్ధం :-
తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆఘ్రాణించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరచుచు, మూయుచు ఉన్నను, ఇంద్రియములు తమతమ విషయములయందు వర్తించుచున్నవనియు, తానేమియు చేయుటలేదనియు భావించును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి