కాశీలోని ఉగ్రవారాహీ అమ్మవారి దేవాలయం

కాశీలోని ఉగ్రవారాహీ అమ్మవారి దేవాలయం ఉదయం 4:30గం||ల నుంచి ఉదయం 8గం ||ల వరకు తెరిచి ఉంటుంది. ఈ అమ్మవారిని గుడి కిటికీలోనుంచి మాత్రమే దర్శనం చేసుకుంటారు. అమ్మవారిని నేరుగా ఎవరూ చూడలేరు. ఎందుకంటే ఈ అమ్మవారు ఉగ్రరూపములో ఉంటారు. ఈ అమ్మవారు కాశీకి గ్రామదేవత. కాశీలోకి ఎటువంటి దుష్టశక్తి ప్రవేశించకుండా సాయంత్రం నుంచి ఉదయం వరకు నగర సంచారం చేస్తుంది. ఉదయం విశ్రాంతి తీసుకుంటుంది. అందుకే ఈ అమ్మవారి గుడి ఉదయం 8గం||ల వరకే తెరిచి ఉంటుంది. ఉగ్రవారాహీ అమ్మవారు వరాహ స్వామి అంశా. ఈ అమ్మవారి గురించి ఒక కథ ఉంది. పోతనగారు రాస్తున్న భాగవతాన్ని తమకు అంకితం ఇవ్వమని చాలామంది రాజులూ అడిగారు. కానీ పోతనగారు శ్రీరామునికి తప్ప ఇంకెవరికి అంకితం ఇవ్వను అన్నారు. కానీ ఒకరాజు పోతనగారి భాగవతాన్ని బలవంతంగా తనకు అంకితం ఇపించుకోవాలని తన సైన్యాన్ని పంపించారు. సైన్యం పోతనగారి ఆశ్రమానికి వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద అడవి పంది(వరాహం)ఉంది.  దానిని ఎదిరించలేక దానిని ధాటి రాలేక సైన్యం వెనక్కి వెలిపోయింది. మరుసటిరోజు రాజు తన అహంకారం తగి పోతనగారిని క్షమాపణ చెప్పటానికి వచ్చి జరిగినదంతా పోతనగారి చెప్పారు. పోతనగారు ఆహా రాజా మీరు ఎంత అదృష్టవంతులు నిన్న నేను యజ్ఞ వరాహ ఆవిర్భావం రాస్తున్నాను. సాక్షాత్తు ఆ వారాహి అమ్మవారే వచ్చి రక్షించారు అనిచెప్పారు. ఈ అమ్మవారిని దర్శించుకునేవారికి కోర్టు కేసులు తీరతాయి, శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...