సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా

సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా



సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యశ్వరుడు జన్మించిన రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు. సుబ్రహ్మణ్యడు జన్మించిన వివరణ స్కాందపురాణంలో, రామాయణంలోని బాలకాండలో విశ్వమిత్రుడు, రామలక్ష్మణులకు వివరించినట్టు ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం ఘోరతపస్సు చేసి శివుడి నుంచి మరణం లేకుండా వరం కావాలి అని కోరుకున్నారు. శివుడు మరణం లేకుండా వరం ఇవ్వటం కుదరదు ఇంకేమన్నా కోరుకోమన్నారు. తారకాసురుడు ఇలా ఆలోచించసాగాడు. అప్పటికే సతీదేవి యోగాగ్నితో మరణించింది. శివుడు మళ్ళి ఇప్పుడే వివాహం చేసుకోరు అని అనుకోని శివుడితో స్వామి! నాకు మీ కుమారుని వల్లనే నాకు మరణం రావాలి అని కోరుకుంటారు. శివుడు తధాస్తు అంటారు. తారకాసురుడు అహంకారంతో దేవతలను, మానవులను అందరిని పీడించటం మొదలు పెట్టారు. దేవతలు అతని బాధలు తట్టుకోలేక బ్రహ్మ దేవుని దగరకు వెళ్లరు. బ్రహ్మ దేవుడు దేవతల బాధలను విని తారకాసురుడు కేవలం శివుని కుమారుడిని వల్లనే మరణిస్తాడు. కానీ శివుడు సతీదేవి వియోగంతో తీర్వమైన తపస్సు చేస్తున్నారు. ఇంకా సతీదేవి పార్వతీదేవి రూపంలో హిమవంతుని కుమార్తెగా జన్మించింది. శివపార్వతులు వివాహం జరిగితే మీ బాధలు తీరుతాయి అని బ్రహ్మ దేవుడు చెప్పారు. పార్వతి దేవి శివుని కోసం తీర్వ తపస్సు చేసి శివుని మేపించి వివాహం చేసుకుంటుంది. తరువాత శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో దేవతలు శివునికి మొరపెట్టుకుంటానికి వచ్చారు. అదేసమయంలో శివుడు తన తేజస్సుని పార్వతికి ప్రసాదిస్తున్నారు. దేవతల మహాదేవ సదాశివ కాపాడండి కాపాడండి అని మొరపెట్టుకొని గట్టిగా అరిచారు. శివునికి ధ్యాన భంగం అయింది. శివుడు బయటకు వచ్చి ఎంతపని చేసారు దేవతలారా మేము మీకోసమే యోగమార్గము ద్వారా సంతాన ఉత్పత్తి చేస్తున్నాము మీరు దానిని పాడు చేసారు. ఇంకో వంద సంవత్సరముల వరకు నేను మళ్ళి సంతాన తేజస్సును ఉత్పత్తి చేయలేను అన్నారు. దేవతలు క్షమించండి స్వామి మేము తారకాసుర బాధలు భరించలేక ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అని అడిగారు. శివుడు నేను చేయగలిగింది ఏమి లేదు ఇంకో వంద సంవత్సరములు ఓపిక పట్టాలి అని శివుడు వెళ్లిపోయారు. దేవతలు తమ తొదరపాటు తనానికి విచారిస్తూ తిరిగి వెళ్లిపోయారు. మళ్ళి వంద సంవత్సరముల తరువాత మళ్ళి పార్వతి పరమేశ్వరులు ఏకాంతములోకి వెళ్లరు. శివపార్వతులు ధ్యానంలో యోగ మార్గం ద్వారా సంతానమును సంపాందించి తేజస్సును ఉత్పత్తి చేసారు.

దేవతలు మళ్ళి తొదరపాటు తనంతో ఆ తేజస్సు తారకాసురుడు ఎక్కడ నాశనం చేస్తారో అని అగ్ని దేవుడిని ఆ తేజస్సుని అక్కడినుంచి తీసుకురమ్మని చెపుతారు ఇంద్రుడు. దేవతలు తమ సంతానని తీసుకొని వెళ్లిపోయారు అని తెలుసున్న పార్వతిమాత దేవతలు అందరికి తమ భార్యల ధర సంతానం కలుగదు అని శపించింది. తేజస్సుని తీసుకున్న అగ్ని దేవుడిని నీకు శుద్ధం, అశుద్ధం అని లేకుండా అన్నిటిని దహిస్తావు అని శపించింది. అగ్ని దేవుడు ఆ తేజస్సుని భరించలేక దానిని భూమాతకి అప్పగిస్తారు. ఈ విషయం తెలుసుకున్న భూమాతను నీకు బహు భర్తలు ఉంటారు. భూమిని పాలించేరాజు నీకు భర్త అవుతారు. అప్పటి నుంచే భూమిని పాలించేరాజులకు భూపతి అని పేరు వస్తుంది. భూమాత కుడా కొంతసేపటికి ఆ తేజస్సుని భరించలేకపోయింది. దానిని గంగామాతకి అప్పగించింది. గంగామాత కూడా ఆ తేజస్సుని భరించలేక దానిని హిమవత్ పర్వతం మీద వదిలేసింది. హిమవత్ పర్వతం మీద పడటం వాళ్ళ సుబ్రమణ్య స్వామికి స్కందుడు అని పేరు వచ్చింది.శివుని తేజస్సు హిమవత్ పర్వతం మీద నుంచి జారీ రెళ్ళ పొదలలో పడుతుంది. కొంతసేపటికి శివ తేజస్సు బాలుని రూపములో రూపాంతరం చెందింది. పుట్టటమే అయన ఆరు ముఖములతో జన్మించి నాలుగు వేదములు చదువుతున్నారు. అటుగా వచ్చిన కృత్తికలు ఆ బాలుడిని చూసి దగరకు తీసుకున్నారు. దేవతలు ఆ బాలునికి పలు ఇచ్చి పెంచమని చెప్పారు. కృత్తికలు మేము ఈ బాలునికి పాలు ఇస్తాము కానీ ఇతను మా బిడగానే పేరు పొందాలి అని అడుగుతారు. దేవతలు సరే అంటారు. కొంతకాలానికి కృత్తికలు ఆ బాలుడిని తీసుకొని కైలాసానికి వచ్చి శివపార్వతులకు అప్పగిస్తారు. కృత్తికలు పెంచారు కాబట్టి సుబ్రహ్మణ్యనికి కుమారస్వామి అని కార్తికేయుడని పేరులు వచ్చాయి. శివుడు సుబ్రహ్మణ్యుడికి సకల యుద్ధవిద్యలు నేర్పించారు. శివుడి సుబ్రహ్మణ్యుడి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించారు. పార్వతిమాత సుబ్రహ్మణ్యుడి శక్తీ ఆయుధాన్ని ఇచ్చారు. సుబ్రహ్మణ్యుడిని దేవతలకు సేనాధిపతిగా నియమించి దేవతల సహాయంతో తారకాసురుని మీదకు యుద్ధనికి వెళ్లి తరకాసురుడిని సంహరించారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరిగిపోయాయి. 

సుబ్రహ్మణ్య షష్ఠి రోజునా షణ్ముకోత్పత్తి చదివిన విన్న సంతానం లేని వారికీ సంతానం కలుగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజునా సుబ్రహ్మణ్య స్వామిని నాగేంద్ర స్వామిగా భావించి ఈ రోజునా ఉపవాసం ఉండి పుటలో పాలుపోస్తారు. సుబ్రహ్మణ్య పూజలు నిర్వహిస్తారు. తమిళనాడు ప్రాంతాలలో సుబ్రమణ్య ఆలయాలలో తిరునాళ్లు, ఉత్సవాలు జరుగుతాయి.సుబ్రహ్మణ్య స్వామికి వల్లి, దేవసేన అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామికి ఈ రోజునా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...