మోక్షద ఏకాదశి, గీత జయంతి శుభాకాంక్షలు

మోక్షద ఏకాదశి, గీత జయంతి శుభాకాంక్షలు


మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ రోజునే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను భోదించారు. ఈ రోజున ఏకశసి వ్రతం చేసేవారికి మోక్షం వస్తుందని నమ్ముతారు. 

ఏకాదశి కథ

పద్మ పురాణం ప్రకారం పూర్వం మోర అనే రాక్షసుడు బాధలు పడలేక శ్రీ మహా విష్ణువు దగరకు వెళ్లరు. శ్రీ మహా విష్ణువు వారి మొరలను విని తనలో నుంచి ఒక శక్తీని పుట్టిస్తారు. శ్రీ మహా విష్ణువు ఆ శక్తిని ఏకాదశినాడు పుట్టించారు కాబట్టి ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టారు. ఏకాదశి వెళ్లి మోర అనే రాక్షసుడిని సంహరించింది. శ్రీ మహా విష్ణువు సంతోషించి నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అందుకు ఏకాదశి ఈ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం చేసిన వారికీ మోక్షం ప్రసాదించమని కోరుకుంటుంది శ్రీ మహా విష్ణువు తధాస్తు అని వరమిస్తారు. 

మోక్షద ఏకాదశి కథ 

పూర్వం గోకుల నగరంలో వైఖానసుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక రోజు రాత్రి కలలో అతని తండ్రి నరకంలో శిక్షలు అనుభవిస్తూ కుమారుడిని తనకు మోక్షం వచ్చేలా చేయమని ఈ శిక్షలు అనుభవించలేక పోతున్నాని బాధపడరు. వైఖానసుడు మరుసటిరోజు ఉదయం నిద్ర లేచి చూసుకునే సరికి తనకు వచ్చింది కల అని తెలుస్తుంది. వెంటనే సభను ఏర్పాటు చేసి తన మంత్రులకి చెపుతారు. మంత్రులు ఎలాంటి విషయాలు మునులను, ఋషులను కనుకోవాలని చెప్పారు. రాజు వెళ్లి మునులను ఋషులను అడుగుతారు. వాలందరు ఒకటే చెప్పారు. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేయి ఆ వ్రతఫలితాని మీ తండ్రి గారికి ధారపోయి. అతనికి మోక్షం లభిస్తుంది అని చెప్పారు. అతని అలాగే మార్గశిర శుద్ధ ఏకాదశి వ్రతం చేసి అతని తండ్రికి ధారపోశారు. అతని తండ్రికి మోక్షం లభిస్తుంది. అందుకని ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అన్నారు. 

గీత జయంతి
ప్రపంచ వ్యాప్తంగా హింధువులు అందరూ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజునా గీత జయంతి జరుపుకొంటారు. భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కౌరవ పాండవ యుద్దములో అర్జునుడు తన బంధువులను చూసి నిరసించి యుద్ధం చేయనని కూర్చున్నాడు. శ్రీ కృష్ణుడు, అర్జునుడిని కార్యన్ముఖుడిని చేయటానికి భగవద్గితను భోదించారు. అర్జునుడికే కాదు, కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకి సందిగ్దతకి సమాధానంగా భగవద్గీత ఈ నాటికీ ఏ నాటికీ ప్రమాణంగా నిలుస్తుంది. శ్రీ కృష్ణ భగవానుడు మానవులకు అందించిన వరం భగవద్గీత. మానవులకు మానవత్వం గురించి నేర్పిచిన గ్రంధం భగవద్గీత. మానవులు వచ్చే ప్రతి సమస్యకు పరిస్కారం ఈ భగవద్గీత. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి. నేను గీతను ఆశ్రయించి ఉంటాను. గీత నా నివాసం. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం).ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.

భగవద్గీత నుండి మార్గదర్శకత్వము పొందినవరిలో ఎందరో యోగులు, తాత్త్వికులు ఉన్నారు. వారిలో శ్రీ చైతన్య మహాప్రభు ఒకరు. ఈయన "హరే కృష్ణ" మంత్రోపాసకులు. 

మహాత్మ గాంధి తన అహింస సిద్ధాంతానికి గీత నుండే స్ఫూర్తిని పొందారు. గాంధీ మహాభారత యుద్ధాన్ని నిత్య జీవితంలో జరిగే సంఘర్షణలన్నిటికి వేదిక వంటిదని వర్ణించారు. అంతిమంగా గీత సారము ఆయనకు బ్రిటిష్ వారి వలస పాలనను ఎదిరించడానికి ఒక ఆయుధము వంటి స్ఫూర్తిని ఇచ్చింది. నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిరోజు దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు.

శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులలో అగ్రగణ్యుడైన స్వామి వివేకానంద గీతలోని భక్తి, జ్ఞాన, కర్మ రాజ యోగాలకు ఎంతో విపులంగా నూతన భాష్యాన్ని వ్రాశారు. యోగులు కాదలచిన వారు గీతలోని ప్రతి అధ్యాయాన్ని వివరంగా చదవమని స్వామి శివానంద బోధించారు. ఒక యోగి ఆత్మ కథ రచయిత అయిన పరమహంస యోగానంద, గీతను ప్రపంచములోని అత్యుత్తమ పవిత్ర గ్రంథముగా పేర్కొన్నారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...