బ్రహ్మచారిణి

          నవదుర్గ స్వరూపములలో రెండోవ స్వరూపము బ్రహ్మచారిణి. ఆమె తెల్లని చీర ధరించి, కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది. 

          పార్వతి దేవి శివుడిని వివాహం చేసుకోవాలి అనుకుంటుంది. ఈ విషయం తల్లితండ్రులైన మేనకా, హిమవంతులకి ఈవిషయం చెపుతుంది. దానికి వారు సంతోషించి పార్వతిని తీసుకొని శివుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళతారు. హిమవంతుడు శివుడితో మీరు అనుమతిస్తే నా కుమార్తె పార్వతీదేవి మీకు సపర్యలు చేస్తుంది అని కోరతారు. దానికి శివుడు అంగీకరిస్తాడు.  అప్పటినుండి పార్వతి దేవి శివునికి సేవ చేస్తుంది. 

              ఈ విషయం తెలుసుకున్న తారాకాసురుడు ఊరుకున్నాడు. ఎందుకంతే తారకాసురుడు బ్రాహ్మ కోసం తపస్సు చేసి తనకి శివ సంతానమే తనని వదిచాలని వరం కోరతాడు.  అతని ధీమా ఏమిటంతే సతీదేవి మరణించిన తరువాత శివుడు వైరాగ్యము చెంది తపస్సు చేసుకుంటున్నాడు. శివుడు మళ్ళీ వివాహం చేసుకోరని అతని నమ్మకం. 

         ఇంకోవైపు తారకాసురుడు ఆగడాలు ఎక్కువ అయ్యాయి. అందుకు దేవతలు బ్రహ్మను ప్రదించారు. అందుకు బ్రహ్మ దేవతలకు అభయం ఇచ్చి పార్వతి దేవికి శివునికి వివాహం జరిగితే తప్ప మీ కష్టాలు తీరవు అని చేపి మన్మధుడిని పిలిచి నీవు వెళ్లి శివునిమీద పూలబాణం వేయమని పంపారు. పూలబాణం వేసిన మన్మధుడిని శివుడు దగ్ధం చేస్తాడు.  శివుడు ఇంకా స్త్రీ గాలి సోకని ప్రదేశానికి తపస్సుకు వెళ్లిపోతాడు. 

         నిరాశ చెందిన పార్వతి దేవి శివునికోసం తపస్సుకు వెళుతుంది. సన్యాసిని వల్లనే వస్త్రములు ధరించి బ్రహ్మచారిణి అయి 5000 సంవత్సరములు తపస్సు చేస్తుంది. బ్రహ్మచారిణి తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను పరీక్షించటానికి సాధువు వేషం ధరించి వచ్చి శివుని నిందచేస్తాడు ఇది విన పార్వతి సాధువు మాటలు నమ్మక మళ్ళీ తపస్సు చేసుకుంటుంది. శివుని నిజరూప దర్శనం ఇచ్చి బ్రహ్మచారిణితో ని తపస్సుకు మెచ్చినాను. త్వరలో వచ్చి నిను వివాహం చేసుకుంటాను. నీవు ఇంకా ఇంటికి వెళ్ళు అని చెపుతాడు. సంతోషించిన బ్రహ్మచారిణి మాత మళ్ళీ పార్వతి అయి ఇంటికి వెళుతుంది.

          స్వాధిష్ఠానచక్రానికి అదిష్టానదేవత బ్రహ్మచారిణి మాత. నవరాత్రుల్లో రెండొవరోజు యోగులకు, సాధువులకు ముఖ్యమైన రోజు స్వాధిష్ఠాన చక్రంలో బ్రహ్మచారిణి మాతను దర్శించి పూజిస్తారు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...