కాత్యాయని దేవి

      నవదుర్గ అవతారాలలో ఆరొవ అవతారం కాత్యాయని దేవి. కాత్యాయనుడు అను మహర్షి అమ్మవారి కోసం తపస్సు చేసాడు. అమ్మవారు ఆ మహర్షిని అనుగ్రహించటానికి ఒక బాలిక రూపములో అతని ఇంట్లో కొంతకాలం నడయాడింది. అందుకని ఆ అమ్మవారికి కాత్యాయని అని పేరు వచ్చింది. 

           మహిషాసురయుద్ధంలో అమ్మవారు ఆరో రోజున కాత్యాయని అవతారంలో వెలింది. ఈ అమ్మవారి వాహనం పెద్దపులి.

       ద్వాపర యుగంలో గోపికలు, కృష్ణుడిని ఆత్మభర్తగా పొందటానికి కాత్యాయని అమ్మవారి వ్రతం చేస్తారు. ఆ వ్రతా ఫలితాన్ని పొందుతారు. కాత్యాయని వ్రతం పెళ్లికాని ఆడపిల్లలు మంచి భర్త రావాలని చేస్తారు.

          కాత్యాయని దేవి ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత. యోగులు ఈ రోజున ఆజ్ఞా చక్రంలో కాత్యాయని మాతను ఉపాసన చేస్తారు.




         





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...