శ్రీ శైల మల్లికార్జున జ్యోతిర్లింగం విశిష్టత

 శ్రీ శైల మల్లికార్జున జ్యోతిర్లింగం విశిష్టత


కైలాసంలో వినాయకుడి వివాహం జరిగింది. ఆ వివాహసానికి కుమారస్వామికి ఆహ్వానం అందలేదు. ఈ విషయం తెలిసి తల్లి తండ్రుల మీద అలిగి శ్రీశైలం కొండకి వచ్చేసారు. అక్కడ కుమారస్వామి కొన్నాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ శ్రీశైల కొండా మీద ఒక కిరాత జాతి ఉండేవారు వారి ప్రధాన వృత్తి వేట. వారిలో కిరాత రాజుకి ఒక కుమార్తె ఉంది. ఆమె శ్రీవల్లి. ఒక రోజు కుమారస్వామి శ్రీవల్లిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అని అడిగారు. అందుకు శ్రీవల్లి దానికి మా తండ్రి గారిని అడగమంది. మీ తండ్రి ఎవరు అని అడిగారు. నా తండ్రి కిరాత రాజు అని చెపింది శ్రీవల్లి. అందుకు కుమారస్వామి కిరాత రాజుకి పెళ్లి అవలేదుగా అతనికి పిల్లలు ఎలా ఉన్నారు. అందుకు శ్రీవల్లి నేను సర్ప రాజు ఆదిశేషుడు కుమారుడు కుముదుడు కుమార్తెని. కిరాత రాజు కుముదుడు, ఆదిశేషుడి పరమ భక్తుడు అయన భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నారు. అందుకు కిరాత రాజు మేము అడవులలో ఉంటాము సర్పాలవల్ల మాకు ఎటువంటి ప్రమాదం జరగకుండా వరం ఇవ్వు అని నాకు పెళ్లి లేదు నాకు ఒక కుమారుడిని ప్రసాధిచామని అడిగారు. అందుకు ఆదిశేషుడు అలాగే మీకు మా సర్పాలవల్ల మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు అన్నారు. ఇక నీకు కుమారుడి యోగం లేదు. నా కుమారుడు కుముదుడికి చాల మంది కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరిని నీకు ఇస్తాను ఆమెను పెంచుకో అని చెప్పారు పేరు శ్రీవల్లి. అది నేనే నా వయసు పదివేల సంవత్సరములు మాకు మరణం లేదు మేము నాగమృతం తాగాము అందులో నేను ఎపుడు 16 సంవత్సరాల వయసులో ఉంటాను. వచ్చి మా తండ్రిగారిని అడుగు అని చేపి వెళిపోయేది. కుమారస్వామి దిగులుగా కూచున్నారు. శివుడు ఇది అంత చూసి కుమారుడిని ఓదార్చటానికి ఒక వృధుడిలా వచ్చారు. కుమారస్వామిని ఓదార్చి నీకు ఆమెతో వివాహం జరుగుతుంది నువ్వు వెళ్లి వాళ్ళ తండ్రిని అడుగు అని పంపిస్తారు. అయన కొన్ని నియమాలు పెడతారు. కుమారస్వామి వెళ్లి కిరాత రాజుని కలుసుకుంటారు. నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని అడుగుతారు. అందుకు కిరాత రాజు అయితే నీవు మాతో కలిసిపోవాలి మా జాతిలో ఒకడిల ఉండాలి అని అంటారు. కుమారస్వామి ఒప్పుకుంటారు. శ్రీవల్లి వచ్చి నేను ఒక సర్పాన్ని అందుకే మీరు నా కోసం సర్పంగా మారతారా అని అడుగుతుంది. కుమారస్వామి వెంటనే ఆరు ముఖముల సర్పముగా మారిపోతారు. అప్పటినుండి కుమారస్వామికి సుబ్రహ్మణ్యుడు అని పేరు వచ్చింది. కిరాతరాజు సంతోషించి మీ తల్లీతండ్రులని తీసుకొని రమ్మని చెప్పారు. కుమారస్వామి దిగులుగా ఆ వృద్దుడి దగరకు వెళ్లి నేను మా తల్లితండ్రుల మీద అలిగి ఎక్కడికి వచ్చాను. ఇపుడు ఎల్లా వాళ్లను వెళ్లి అడగను అని బాధపడరు. అపుడు వృధుడు కాస్త శివుడిగా మారిపోయారు పార్వతి దేవి కూడా వచ్చింది. కుమారస్వామి సంతోషించి తన తల్లితండ్రులను తీసుకొని కిరాత రాజు దగరకు వెళతారు. కిరాత రాజు సంతోషించి నను ఎంత అదృష్టవంతుడిని ఆదిశేషుడిని పూజించటం వాళ్ళ నాకు శివపార్వతుల దర్శనం కలిగింది. నాగ కన్య నాకు కుమార్తె అయింది. శివపార్వతుల కుమారుడు అల్లుడు అయ్యారు అని సంతోషిచారు. వెంటనే బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి పురోహితునిగా మారి కుమారస్వామి శ్రీవల్లిల వివాహం చేసారు. దేవతలందరు వచ్చి శివుడిని ఇక్కడే మీరు జ్యోతిర్లింగంగా వెలిసి మానవుల కష్టాలు తీర్చమని ప్రాదించారు. అందుకు మహాదేవుడు ఒప్పుకున్నారు. నేను ముందు ఎక్కడకు వృద్దుడిగా వచ్చాను కాబట్టి ఎక్కడ కిందన వృధామాలికార్జునగా, కొండపైన మల్లికార్జునస్వామిగా వెలుస్తాను. పార్వతీదేవి ఇంతకుముందే ఇక్కడ అరుణుడు అనే రాక్షసుడిని వధించి భ్రమరాంభగా వెలిసింది. అంతేకాక సతీదేవి అంశ కూడా ఆమెలో కలిసిపోయింది కనుక ఇది శక్తీ పీఠం అయింది. కలిగుగంథం వరకు ఇక్కడే ఉంది భక్తుల కష్టాలు తీరుస్తాము. తరువాత త్రేతాయుగం రాముడు వనవాసం చేస్తున్నపుడు ఎక్కడకు వచ్చి వృధామాలికార్జున లింగం పక్కనే రామలింగాని ప్రతిష్టించారు. ఇంకా సీతాదేవి, లక్ష్మణస్వామి కూడా శివలింగాన్ని ప్రతిష్టించి పూజించారు. తరువాత ద్వాపరయుగంలో పాండవులు వనవాసం చేస్తున్నపుడు ఎక్కడకు వచ్చి పాండవులు ఐదుగురు ద్రౌపది ఇక్కడ శివలింగాలను ప్రతిష్టించి పూజించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...