గురు భక్తి | GURUBHAKTHI | Adi Shankaracharya |


గురు భక్తి

ఆదిశంకరాచార్యుల వారికీ చాల మంది శిష్యులు ఉండేవారు. వారిలో సనందనుడు అనే శిష్యుడు పరమ గురు భక్తి కలిగిన వారు. అతను అంటే మిగిలిన శిష్యులకి అసూయగా ఉండేది. ఈ విషయం తెలుసుకున్న అది శంకరాచార్యులవారు వారి గుణపాఠం చెప్పాలి అనుకున్నారు. ఒకరోజు శిష్యులను తీసుకొని పూర్ణ నది ఒడ్డుకు వెళ్లారు. శిష్యులను పిలచి మీరు అందరూ వెళ్లి నదికి అవతలి వైపున ఉన్న దర్భలు కోసుకురండి అని చెప్పారు. శిష్యులందరు మోకాలు లోతు నీళ్లు మాత్రమే ఉన్న నదిని ధాటి అవతిలి ఒడ్డుకు వెళ్లారు. అక్కడ దర్భలు కోస్తున్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పూర్ణ నది ఒక్కసారిగా ఉధృతంగా వరద వచ్చింది. ఆదిశంకరాచార్యులు శిష్యులను పిలచి వెంటనే ఇవతలి ఒడ్డుకు రమ్మన్నారు. శిష్యులందరు దర్భలను కోయటం అపి వెంటనే నదివద్దకు వచ్చారు. నదికి వస్తున్నా వరదను చూసి భయపడిన శిష్యులు గురువుగారు! మేము నది వరద తగిన తరువాత వస్తాము అని చెప్పారు. ఆ శిష్యులలో ఉన్న సనందనుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా నదికి వరద వస్తుంది తాను మునిగిపోతాను అన్న భయం కూడా లేకుండా గురువుగారు చెప్పారు అన్ని నది దాటటం మొదలు పెట్టారు. అతను నది దాటుతుంటే అతని పాదాలు కూడా తడవకుండా అతని పాదాల కింద పద్మాలు వచ్చాయి. అతను నదిని ధాటి గురువుగారి దగరకు వచ్చి అయన పాదాలకు నమస్కరించారు. ఆ రోజు నుంచి సనందనుడు పద్మపాదుడుగా ప్రఖ్యాతి చెందాడు. నదికి వరద ఎలా వచ్చిందో అలాగే తగిపోయింది. మిగిలిన శిష్యులు చిన్నబుచ్చుకొని  నదిదాటి వచ్చి గురువుగారిని క్షమాపణ వేడుకున్నారు. అప్పుడు ఆదిశంకరాచార్యులవారు మిగిలిన శిష్యులతో చూసారా మీరందరు సనందుడిని చూసి అసూయా చెందారు. నిజమైన గురుభక్తి ఎవరికీ ఉన్నదో ఇప్పటికైనా అర్ధమైనదా అని అన్నారు. మీరందరు కలిసిమెలసి ఉండాలి అని అన్నారు. మిగిలిన శిష్యులు తమతప్పు తెలుసుకున్నారు. గురువు మీద భక్తి కలిగిన వారికీ విషం కూడా అమృతం అవుతుంది అంట. ఈ కథలో అది నిజమే అనిపిస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...