మాఘ పురాణం 5

మాఘ మాసం ఐదొవ పారాయణం



సౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం ఐదొవరోజు పరాయణాని  చెప్పటం మొదలు పెట్టారు. దిలీపుడుకి వశిష్టి మహర్షి, పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! మాఘ సుధా దశమినాడు మాఘస్నానం చేసి లక్ష్మీనారాయణులను పూజించాలి. పూజ చేసేచోటు శుభ్రం చేసి మండపాన్ని నిర్మించి అంధోలో లక్ష్మీనారాయణులను ప్రతిష్టించి షోడశోపచారాలతో పూజించి ఎవరైనా సత్ బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని దానం చేయాలి. మాఘ సిద దశమినాడు చేసి పూజకు ఫలితాన్ని తెలియజేసే ఒక కదా ఉన్నది. గౌతమ మహర్షి తీర్ధ యాత్రలు చేయటానికి బయలుదేరారు. దారిలో కృష్ణ నది దగర ఆగి శిష్యులతో మాఘమాసం వ్రతం చెందామని నిర్ణయించుకొని చేస్తున్నారు. మాఘ సుధా దశమి నాడు నదిలో స్నానం చేసి రవి చెట్టు మొదటిలో శ్రీ లక్ష్మీనారాయణులకి పూజించి మాఘ పురాణం చెపుకుంటుండగా అక్కడికి ఒక కుక్క వచ్చింది. శిష్యులు దానిని అదిలించి వెళ్లగొట్టారు. అది ఆచెట్టు తిరికి మల్లి అక్కడికి వచ్చి కూర్చుంది. శిష్యులు మల్లి మరిమికొట్టారు. ఇలా మూడు సార్లు జరిగింది. వెంటనే ఆ కుక్క ఒక రాజుగా మారిపోయింది. గౌతమ మహర్షి ఆశ్చర్య పోయి మీరు ఎవరు అని అడిగారు. అందుకు ఆ రాజు మహానుభావా నేను కల్లింగ దేశానికీ రాజుని నేను ధర్మాత్ముడ్ని, అనేక యాగాలు, యజ్ఞాలు, వ్రతములు, దానాలు అన్నసమారాధనలు, చెరువులు తటాకాలు తావిన్చాను. ఇలా ఉండగా ఒక రోజు నా దగరకు ఒక బ్రాహ్మణుడు వచ్చారు. అయన ఒక మహా యజ్ఞం తలపెట్టారు. అయన నన్ను సంబరములు అడిగారు. నేను ఇస్తాను అన్నాను. ఆ బ్రాహ్మణుడు రాజా! ఇపుడు మాఘ మాసం మీరు సూర్యోదయానే నిద్ర లేచి నది స్నానం ఆచరించి సూర్యభగవానుడికి అర్ఘ్యము ఇచ్చి లక్ష్మీనారాయణులను, శివ పార్వతులను పూజించి బ్రాహ్మణులకు దానములు ఇవ్వాలి అని చెప్పారు. నేను అయన చూపిన దానిని విని ఊరుకోకుండా అవహేళన చేస్తూ నేను ఏపాటి వరకు చాల దానధర్మాలు చేశాను. కొత్తగా నేను ఏది చేయను అని అన్నాను. దానికి ఆబ్రాహ్మణుడికి కోపం వచ్చింది. నాదగ్గర యజ్ఞ సంబరములు కూడా తీసుకోకుండా వెళ్లిపోయారు. నేను ఏడూ జన్మలుగా కుక్క లగే జీవిస్తున్నాను. ఆకలి అలసిపోయాను. ఇక్కడికి నేను ఆహారం కోసం వచ్చాను. మీ శిష్యులు నన్ను తరినందువలన నేను మీరు పూజించిన రావిచెట్టు చుటూ మూడు సార్లు తిరిగాను.. అందువలన నాకు పూర్వజన్మ జ్ఞానం వచ్చి నా పూర్వ రూపం వచ్చింది. రాజు ఇలా చెపుతుండగా ఆ రావి చెట్టు తొర్రలోనుంచి ఒక కప్పు గౌతమ మహర్షి పాదాలపై పడి బెకబెకమని అరుస్తుంది. అది వెంటనే ఒక ముని కాంతగా మారిపోయింది అని మహాశివుడు పార్వతిమాతతో, దిలీపుడుకి వశిష్ఠమహర్షి చెప్పారు. సూతమహర్షి సౌనకాది మునులకు ఐదొవ రోజు పారాయణాని పూర్తి చేసారు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...