మాఘ పురాణం 6

మాఘ మాసం ఆరోవరోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం ఆరోవరోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. దిలీపుడుకి వశిష్టి మహర్షి, పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! నిన్నటి మాఘ పురాణంలో గౌతమ మహర్షి పాదాల పై పడిన కప్పా ఒక ముని కాంతగా మారింది. ఆమె తన పూర్వజన్మ వృత్తంతం చెపుతూ స్వామి నేను గోదావరి నది ప్రాతంలోని ఒక కుగ్రమం నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను కావేరి నది తీరమున నివస్తున జ్ఞానందుడు అనే అతనికి ఇచ్చి వివాహం చేసారు. అతను జ్ఞానవంతుడు, సత్యవంతుడు. మా వివాహం అయినా కొంతకాలానికి మాఘమాసం వచ్చింది అప్పుడు నా భర్త మంజులా రేపటి నుంచి మాఘమాసం ఇంతకు ముందు మాఘమాస వ్రతమును ఆచరించేకాడిని కానీ ఇప్పుడు నాకు వివాహం అయింది. కనుక నువ్వు నాతోపాటు రేపటి నుంచి మాఘమాస వ్రతం చేదాము అని అడిగారు. నేను అతనిని ఎగతాళి చేస్తూ మాఘ వ్రతం చేయాలా నేను ఉదయానే నిద్ర లేవాల అని మాట్లాడాను. అయన నాకు నచ్చచెప్పాలని చూసారు నాకు నేను వినలేదు. ఆయనకి కోపం వచ్చి నన్ను మూర్ఖురాలు నూకి నా ఏంటికి వచ్చి నన్ను నా వంశాన్ని ధన్యం చేస్తావు అనుకున్న కానీ నువ్వు దైవ వ్యతిరేకివి అనుకోలేదు. నువ్వు కప్పా వై జీవించి అని శపించారు. ఇన్ని రోజులకు నాకు శాపవిమోచనం నాకు కలిగింది. నేను చేసిన తప్పు కూడా నాకు తెలిసి వచ్చింది. నా భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పమని కోరింది. అందుకు గౌతమ మహర్షి తన దివ్య దృష్టితో చూసి నీ భర్త వైకుంఠం చేరారు అని చెప్పారు. మహాశివుడు పార్వతి మాతతో, వశిష్ఠుడు దిలీపుడితో చెప్పారు. ఈ విషయాన్ని సూత మహర్షి, శౌనకాది ఋషులకు ఆరొవ రోజు అధ్యాయాన్ని పూర్తి చేసారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...