మాఘ పురాణం 19

మాఘమాసం 19వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 19వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో గోమతి నది తీరంలో పవిత్రమైన నైమిశారణ్యంలో ఉంది. అక్కడ ఒకసారి మహర్షులు, ఋషులు అందరూ కలిసి ఒక యజ్ఞం చేయాలనీ అనుకున్నారు. ఎందుకంటే అది మాఘమాసం అవటం వలన ఆ మాసమంతా మాఘమాస వ్రతం ఇంకా శ్రీమన్నారాయణుడికి యజ్ఞము చేయవచ్చు అని అనుకున్నారు. యజ్ఞం కొనసాగుతుంది కొంతకాలం తరువాత మహర్షులు, ఋషులు వారిలో వారే మేము గొప్ప అంటే మేము గొప్ప అని వాదనలు చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న నారద మహర్షి అక్కడకి వచ్చి వారికీ సర్దిచెప్పటానికి చూసారు. కానీ వారు మాటవినలేదు. ఇంకా నారదమహర్షి చేసేది లేక వైకుంఠానికి వెళ్లి శ్రీమన్నారాయణుడి చెప్పారు. శ్రీమన్నారాయణుడు జరిగినది తెలుసుకొని బాధపడి వారి గొడవని తీర్చటానికి ఒక ఉపాయం ఆలోచించారు. నారదమహర్షితో మీరు వెళ్లి సనకసనందనాదులను నైమిశారణ్యానికి వెళ్ళమను. అలాగే వాళ్లకంటే ముందు మార్కండేయమహర్షిని అక్కడికి వెళ్ళమను. నువ్వు కూడా నైమిశారణ్యానికి వేళ్ళు అని శ్రీమన్నారాయణుడు చెప్పారు. సప్త కల్పాల వయస్సు ఉన్న మార్కండేయ మహర్షి నైమిశారణ్యానికి వెళ్లారు. మార్కండేయ మహర్షిని చుసిన ఋషులు, మహర్షులు అన్యమనస్కంగానే మర్యాదలు చేసారు. కొంతసమయం తరువాత అక్కడికి శ్రీహరి నామస్మరణచేస్తూ అక్కడికి సనకానందనాదులు వచ్చారు. వారు రాగానే మార్కండేయ మహర్షి వారికీ నమస్కరించి వినయంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యములను ఇచ్చి కూర్చోపెట్టారు. అక్కడ ఉన్న మహర్షులు, ఋషులు అది అంత చూసి ఆశ్చర్యపోయారు. సనకసనందనాదులు మార్కండేయ మహర్షి మేము నీకన్నా చిన్నవాళ్లము నీ వయస్సు సప్త కల్పాలు మా కన్నా పెద్దవాడివి. నువ్వు మాకు నమస్కరిస్తున్నావేమిటి అని అడుగుతారు. దానికి మార్కండేయ మహర్షి మహానుభావులారా! మీరు బ్రహ్మ ముఖం నుండి జన్మిచారు. మీరు బ్రహ్మ మానస పుత్రులు. నిరంతరం శ్రీహరి నామసంకీర్తన చేస్తుంటారు. నిరంతర పరమాత్మతో కలిసే ఉంటారు. నాకు ఎప్పటికైనా మరణం సంభవిస్తుంది. కానీ మీరు అలాకాదు ఎప్పుడు శ్రీమనారాయణుడితో ఉంటారు. ఆయనకు ఇష్టులు. కాబ్బటి నేను మీకు నమస్కరిస్తున్నాను అని చెప్పారు. ఇదంతా విన్న ఇదంతా విన్న మహర్షులు, ఋషులు తాము చేసిన తప్పు తెలుసుకొని బాధపడి మార్కండేయ మహర్షికి, సనకసనందనాదులకి క్షమాపణలు చెప్పారు. ఆగిపోయిన మాఘమాస వ్రతాన్ని, శ్రీమన్నారాయణుడి యజ్ఞాన్ని మళ్ళీ ప్రారంభించి పూర్తిచేశారు. జరిగినదంతా నారదమహర్షి వైకుంఠములో ఉన్న శ్రీమన్నారాయణుడి తెలియజేసారు. శ్రీమన్నారాయణుడు విని తన పిల్లలు అంత మళ్ళీ కలిసిపోయి లోక క్షేమం కోసం యజ్ఞం చేస్తునందుకు సంతోషించారు. ఎంతయినా మనమందరూ ఆ భగవంతునికి పిల్లలం కదా. మన తప్పులను అయన కాకా ఇంకెవరు సరిచేస్తారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 19వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...