మాఘ పురాణం 4

మాఘ పురాణం నాలుగోవ రోజు పారాయణం


సూతమహర్షి శౌనకాది మునులకు మాఘమాస నాలుగోవ రోజు మాఘపురాణం చెప్పటం మొదలుపెట్టారు. పార్వతిమాత మహాశివుడితో స్వామి! పండితుడి కుమార్తె బుద్ధి తెచ్చుకొని మారి మాఘమాసం వ్రతం చేసి సద్గతిని పొందింది. మరి గురు పుత్రికతో సంగమించిన సుమిత్రుడు ఏమయ్యాడు అని అడిగారు. అందుకు మహాశివుడు మార్వతిమాతతో ఇలా చెప్పసాగారు. పార్వతి! సుమిత్రుడు ఆ రోజు అడవి నుంచి వచ్చిన తరువాత తాను తప్పు చేశాను అను గురుగారికి మొఖం చూపించలేక గురుకులం నుంచి పారిపోయారు. అక్కడి నుంచి ఎన్ని చోటులకు తిరిగిన అతనికి మనశాంతి కలగలేదు. కొంతకాలానికి మళ్ళి గురువుగారి దగ్గరకు వచ్చి అయన పాదాలపై పడి ప్రాధేయపడుతూ జరిగిన విషయాన్ని వివరించి నాకు ప్రాయచిత్తానికి ఉపాయం తెలిపామని అడిగారు. అప్పటికే యోగి ధ్వారా తెలుసుకొని ఉన్నారు. కావాలని చేసిన ఇతరుల బలవంతం మీద చేసిన పాపం పాపమే. కనుక తీర్ధంలో కెల్లా పవిత్రమైనది గంగా నది. గంగా తీరానికి వెళ్లి శ్రీహరి గురించి 12 సంవత్సరములు తపస్సు చేసి నీకు ప్రాయశ్చితం కలుగుతుంది. సుమిత్రుడు వెంటనే గురువు గారికి నమస్కరించి బయలుదేరారు. అతను కొంత దూరం వెళ్లిన తరువాత ఒక ఆశ్రమము కనిపించింది. వారందరు మాఘస్నానం చేసి మాఘ పురాణం వింటున్నారు. ఇతను కూడా అక్కడికి వెళ్లి వారికీ నమస్కరించి మీరు ఏమి వ్రతం చేస్తున్నారు నాకు తెలుపండి అని అడిగారు. వారిలో సత్యవ్రతుడు అనే అతను ఇలా చెప్పసాగారు. అయ్యా! సూర్యుడు మకరరాశిలో ఉండగా ప్రాతఃకాలమున నదీస్నానం చేసి శ్రీహరికి ఇష్టుడు అవుతారు. నది, సరస్సులో స్నానం ఆచరించి నది తీరమున శ్రీమహావిష్ణువుని పూజించి పురాణములన్ని విని మాఘమాసం అంత చేయుట పుణ్యప్రదము. మాఘ స్నానం మానిన వాడు, సత్య సౌచములు విడిచిన వాడు పరులను నిందిచువాడు బ్రహ్మహత్య చేసిన వాడితో సామానులు.బాధ సాక్ష్యం చేపినవాడు, దురాచారుడు స్త్రీ సాంగత్య లోలుడు, మాఘస్నానం మానిన వాడు(తెలిసికూడా చేయనివాడు) బ్రహ్మహత్య చేసిన వాడితో సామానులు. తోటలను కూల్చిన వాడు కన్యలను, అశ్యములను అమినవాడు.చెరువుగటును తెగితినా వాడు, దేవద్ర్యమును అపహరించువాడు,తానిచ్చిన సొమ్మునే దోగిలించువాడు, మద్యపాన లోలుడు, అసత్యం చెప్పువాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నముని తినువాడు, పితృశేషణ భోజనుడు, భోజనం చేస్తూ అపవిత్రమైన మాటలను వినేవాడు, అనేవాడు పురాణం శ్రావణమును వివాహాది శుభకార్యములు పాడుచేయువాడు తల్లి తండ్రులను ద్వేషించువాడు విరుఅందరు పాపాత్ములే. ఇలాంటి పాపాత్ములందరు కూడా ఈ మాఘమాస వ్రతాన్ని కనుక చేస్తే వారి పాపా నివృత్తి అవుతుంది. మళ్ళి అటువంటి పాపములు చేయరు. వారి పాపములు నశించి పుణ్యములను పొందుతారు. మాఘ స్నానం చేసి నదీతీరమున తులసి దళములతో అర్చించిన వారి పుణ్యం అమిత అవుతుంది. ఈ వ్రత అనంతరం చేసిన అన్నదానము అత్యంత ఫలప్రదము. ఈ వ్రతమును ఆచరించిన వారికీ పునర్జన్మ ఉండదు. ఈవిధముగా సత్యవ్రతుడు, సుమిత్రుడితో మాఘస్నానం, వ్రతం గురుంచి వివరించారు. సుమిత్రుడు, సత్యవ్రతుడుతో తాను చేసిన పాపమును గురువు చేపిన ప్రాయశ్చిత్తము వివరించారు. మాఘ స్నానం మూడు రోజులు చేసిన సర్వపాపములు పోతాయి. మాఘమాసం ఇంకా మూడు రోజులు ఉంది కనుక నివ్వు ఈ మూడు రోజులు ఇక్కడే ఉండి మాఘ స్నానం ఆచరించి ప్రాయశ్చిత్తానికి గంగాతీరానికి వేళ్ళు అని చెప్పారు. సుమిత్రుడు అలాగే చేసి మూడు రోజుల తరువాత తపస్సు గంగా తీరానికి శ్రీహరి గురించి తపస్సు చేసుకోవటానికి వెళ్లారు. అల సుముత్రుడి తపస్సు 12 సంవత్సరాలు గడిచింది. అయినా అతను తపస్సును మానక జీవిత పర్యంతం చేస్తూనే ఉన్నారు. శ్రీమహా విష్ణువు కృపకు పాత్రుడు అయి మాఘస్నాన ఫలితముగా పాపా ప్రాయశ్చిత్తమే కాకా మరణాంతరం అతనికి ముక్తి లభించింది. అని మహాశివుడు పార్వతిమాతతో చెప్పారు. మహాశివుడు ఇంకా ఇలా చెప్పసాగారు. పార్వతి! మాఘస్నానం శ్రీహరి పూజ  అనంతరం ఎవరైతే ఈ సుమిత్రుడు కథను విన్న చదివిన వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...