మాఘ పురాణం 28

మాఘ పురాణం  28 రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 28వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వ తి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో మాఘ మాసం చతుర్దశి మహా శివరాత్రి సందర్భముగా శివరాత్రి మహత్యాన్ని చెప్పుకుందాము. మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు శివునికి భక్తి శ్రద్ధతో పూజించి శివుని ధ్యానం, ఉపవాసం, జాగరణం చేసి శివుని మహిమలను చెపుకున్నవారికి సాక్షాత్తు శివసానిధ్యం దొరుకుతుంది. ఒక కథ ఉంది చెపుతాను విను. పూర్వం ఒక కిరాతకుడు జంతువులను వేటాడి జీవనాన్ని సాగించేవాడు. అతనికి ఏ రోజు వేట ఆరోజే సరిపోయేది. వేట లేనిరోజు అతను అతని కుటుంబం ఉపవాసం ఉండవలసి వచ్చేది. ఒక రోజు అతను వేటకు బయలుదేరాడు. అతనికి ఆరోజు ఎంత వెతికిన ఒక జంతువు కూడా దొరకలేదు. అతను పొద్దున్ననుంచి సాయంత్రం వరకు వెతికి ఏమి దొరకక చివరికి చీకటి పడటంతో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టుపక్కన ఒక సెలయేరు ఉంది. అక్కడికి తెల్లవారుజామున జంతువులు నీళ్లు తాగతానికి వస్తాయి. అప్పుడు వేటాడుదామని కూర్చున్నాడు. ఆ రాత్రి అంత నిద్ర పోకుండా జంతువు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. నిద్ర రాకుండా ఉండటానికి ఆ చెట్టు ఆకులు తుంచి కిందకి వేస్తున్నాడు. ఇంతలో తెల్లవారింది. అతనికి వేట దొరికింది. వేటాడి సంతోషంగా ఇంటికి వేళాడు. ఆ వేటగాడు ముసలివాడు అయినా తరువాత సహజ మరణంతో మరణించాడు. యమభటులు వచ్చి తీసుకువెళుతుంటే అక్కడికి శివగణాలు వచ్చి లాకొని తీసుకువెళ్లారు. యమభటులు ఏమి అనలేక వెళ్లి యమధర్మ రాజుకి చెప్పారు. యమధర్మ రాజు విని అది ఎలా సాధ్యం అతను క్రూరుడు. నిత్యం జీవహింస చేసేవాడు.ఏనాడూ ఎవరికీ మంచి చేయలేదు. దీని గురించి ఆ పరమేశ్వరుడిని అడిగి తెలుసుకుందాము అని యమధర్మరాజు కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో పరమేశ్వరుడు ప్రమథగణాలతో పూజలు అందుకుంటున్నారు. యమధర్మరాజు శివునికి నమస్కరించి తనకు కలిగిన సందేహాన్ని వెల్లబుచ్చారు. అందుకు పరమేశ్వరుడు చిద్విలాసంగా నవ్వి ఓ యమధర్మరాజా! నువ్వు చెపింది నిజమే ఆ కిరాతుడు బ్రతికి ఉండగా జీవహింస మానలేదు. కానీ అతనికి ఒకరోజు వేటదొరకలేదు కదా. ఆ రోజు మహాశివరాత్రి అతనికి తెలియకుండానే అతను ఉపవాసం ఉన్నాడు. ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు కదా. అది బిల్వదళం చెట్టు అతను ఆ రాత్రి అంత నిద్ర పోకుండా జాగరణ చేసాడు. నిద్ర రాకుండా ఉండటానికి బిల్వదళాలను తుంచి కింద వేసాడు. ఆ చెట్టు మొదలులో నా శివలింగం ఉంది. ఆ బిల్వదళాలు నా శివలింగం మీద పడాయి. అందువలన అతనికి శివరాత్రి రోజు ఉపవాసం, జాగారం, బిల్వదళ అర్చన చేసిన పుణ్య ఫలం వచ్చింది. తెలిసి ముట్టుకున్నా తెలియక ముటుక్కున అగ్ని కాలాక మానదు. అలాగే నా పూజ తెలిసి చేసిన తెలియక చేసిన పుణ్యం లభిస్తుంది అని చెప్పారు. యమధర్మ రాజు మళ్ళీ ఒకసారి పరమేశ్వరునికి నమస్కరించి వెళ్లిపోయారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 28వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...