మాఘ పురాణం 7

మాఘ మాసం ఎడొవరోజు  పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం ఎడొవరోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. దిలీపుడుకి వశిష్టి మహర్షి, పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! లోభికి కలిగిన మాఘ స్నానం వృత్తాతం గురించి చెపుతాను. చాల కాలం క్రిందట దక్షిణ ప్రాంతంలో వసంతవాడ అనే ఒక పెద్ద నగరం ఉన్నది. అందులో బంగారుశెట్టి ఒక వైశ్యుడు ఉండేవాడు.అతను ధనవంతుడు, వడ్డీ వ్యాపారి కాని అతను పిసినారి. ఎవరికీ ఏమి పెట్టాడు. ప్రతి దానికి డబ్బు ఖర్చు అవుతుంది ఎందుకు అంటాడు. ఒక రోజు అతను పక్క ఊరు వెళ్ళినపుడు అతని ఇంటికి ఒక ముసలి బ్రాహ్మణుడు ఒకాయన వచ్చారు. బంగారయ్య భార్య తాయారమ్మను అమ్మ నేను మీ అరుగుమీద ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుంటాను మరుసటి రోజే తెల్లవారుజామునే మాఘ స్నానం చేయటానికి వెళతాను. తాయారమ్మ సరే అని ఆయనకు నిద్ర పోవటానికి ఏర్పాటు చేసింది. కాసేపటి తరువాత తాయారమ్మ ఆ బ్రాహ్మణుడి దగరకు వచ్చి అయ్యా ఇందాక మీరు మాఘ స్నానం గురించి చెప్పారు. దానిని గురించి వివరించామన్నది. ఆ పెద్దాయన మాఘస్నానం గురించి చెపుతూ ఈ మాసం అంత నది స్నానం చేసి నారాయణుడిని పూజించి ఒక బ్రాహ్మణుడికి దానం చేసిన వారికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చేపి అయన నిద్ర పోయారు. కొత్త సేపటికి బంగారు శెట్టి వచ్చారు. ఆయనకు మాఘస్నానం గురించి చెపింది. ఆ బంగారుశెట్టి కోపంతో స్నానం లేదు పూజ లేదు అంత ఖర్చు నోరుమూసుకుని ఉండు అని అరిచారు. తయారమ్మకి మాఘస్నానం గురించి మనస్సులో ఉండిపోయింది. ఆమె తన భర్తకి తెలియకుండా ఆ ముసలి బ్రాహ్మణుడి వెళుతుండగా అయన వెనకాలే వెళ్లి మాఘస్నానం ఆచరించింది. బంగారుశెట్టికి మెళకువచ్చి చుస్తే భార్య పక్కన లేదు అని తెలుసుకొని నది దగరకు వేళాడు. అయన తన భార్యను నదిలోనుంచి బయటకు లాకు వచ్చి కొట్టాడు. కొంతకాలానికి వాళ్లిదరు చనిపోయారు. తయారమ్మని తీసుకు వెళ్ళటానికి విష్ణు దూతలు, బంగారుశెట్టిని తీసుకు వెళ్ళటానికి యమదూతలు వచ్చారు. తాయారమ్మ ఆశ్చర్యపోయింది. నన్ను తీసుకువెళ్ళటానికి విష్ణుదూతలు ఎందుకు వచ్చారు అని అడిగింది. అందుకు విష్ణుదూతలు నువ్వు మాఘస్నానం చేసావు అందుకే వైకుంఠ ప్రాప్తి కలిగింది. అతను చేసిన పాపకర్మల అతనిని యమభటులు తీసుకువెళుతున్నారు అని చెప్పారు. అదేమిటి మహానుభావా నేను భక్తితో స్నానము చేస్తే అయన నన్ను తీసుకురావటానికి కోపంతో నదిలోకి దిగారు కదా ఆయనకి మాఘ స్నానము ఫలితము రాలేదా అని దిగులు పడింది. యమలోకానికి వెళ్లిన యమదూతలు విషయం చెప్పారు. చిత్రగుప్తుడు మళ్ళి చూసి ధర్మ సూక్ష్మలో అతనికి మాఘస్నానం ఫలితం ఉంది అని అతన్ని వైకుంఠానికి పంపించారు.  మహాశివుడు పార్వతి మాతతో, వశిష్ఠుడు దిలీపుడితో చెప్పారు. ఈ విషయాన్ని సూత మహర్షి, శౌనకాది ఋషులకు ఆరొవ రోజు అధ్యాయాన్ని పూర్తి చేసారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...