మాఘ పురాణం 26

మాఘ పురాణం  26 రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 26వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వ తి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో  మాఘ స్నానం  యొక్క  విశిష్టతను తెలియజేసే ఒక కథ ఉంది. చెబుతాను విను పూర్వం  ద్వాపరయుగంలో అంగ దేశాన్ని పాలించే    సులక్షణడు  అనే రాజు ఉండేవాడు. అతనికి వందమంది భార్యలు ఉండేవారు. అతని రాజ్యం సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఉండేది. కానీ అతనికి సంతానం లేదు. సంతానం కోసం పూజలు యజ్ఞాలు చేశాడు కానీ ఫలితం లేదు. చివరికి తీర్థయాత్రలు చేయటం మొదలుపెట్టాడు. తీర్థయాత్రలు చేస్తూ నైమిశారణ్యానికి  వెళ్లారు. అక్కడి  ఋషులకు  నమస్కరించి తనకు సంతానం కలిగే మార్గాన్ని చెప్పమని  ప్రార్థించాడు. ఋషులు అతనికి  మంత్రించిన ఒక్క పండుని ఇచ్చారు. దీనిని తీసుకువెళ్లి నీ భార్య లకు తినిపించు. నీకు వందమంది కుమారులు కలుగుతారు అని చెప్పి  ఆశీర్వదించారు.  రాజు సంతోషించి రాజ్యానికి ఆ పండుని తీసుకొని  వెళ్లారు.  రాణులందరి  తమకు సంతానం కలుగుతుందని సంతోషించారు. రాజు వారికి పండును ఇవ్వటానికి ముందు విష్ణుమూర్తికి పూజ చేద్దామని అనుకొని పండుని  తన గదిలో పెట్టి స్నానానికి వెళ్లారు. ఇంతలో రాజు అటు వెళ్ళగానే అతని రెండవ భార్య ఎవరికీ తెలియకుండా ఆ పండుని తానే తినేసింది.  ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు.  రాజు స్నానానికి వెళ్లి వచ్చి చూసుకుంటే పండు కనిపించలేదు. తన కోట అంతా  వెతికిన   కనిపించలేదు. రాజు తనకు చేతికి అందిన అదృష్టం పోయిందని బాధపడ్డాడు. మూడు రోజుల తర్వాత ఆ పండుని  తానే తిన్నాను అని రాజుకు చెప్పింది. రాజు ముందు బాధపడిన వందమంది కుమారులు కలగకపోయినా కనీసం ఒక్క కుమారుడైన కలుగుతున్న అందుకు సంతోషించాడు. మిగిలిన రాణులకి ఈ విషయం తెలిసి మన అందరికీ కలగవలసిన అదృష్టాన్ని తాను ఒక్కతే అనుభవించింది అని కోపం తెచ్చుకున్నారు. పండు తిన్న రాణి గర్భం ధరించి ఉంది. మిగిలిన రాణులు అసూయతో ఆ రాణి కి మతిచెల్లించింది. ఆమె కొన్ని రోజుల తరువాత అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడే ఆమె ప్రసవించింది.  తరువాత సింహం ఆమెను చంపి తినేసింది. పిల్లవాడిని ఏమి చేయలేదు. ఆ పిల్లవాడు ఆకలికి ఏడుస్తుంటే హంసలు వచ్చి రెక్కలు చాపి నీడను    ఇచ్చాయి. పిల్లవాడి ఆకలిని తీర్చటానికి నోటిలో తేనెను పళ్లరసాలను ఇచ్చాయి. ఇలా ఒక సంవత్సరం గడిచిన తరువాత అడవిలోకి వైశ్య దంపతులు నదీ స్నానం కోసం వచ్చారు. ఎవరు లేకుండా ఉన్న పిల్లవాడిని చూసి అతని తల్లిదండ్రుల కోసం వెతికి చూశారు. కానీ వారికి ఎవరూ కనిపించలేదు. పిల్లవాడి చుట్టుపక్కల తప్ప ఇంకేమీ లేదు. ఆ పిల్లవాడిని దేవుడిచ్చిన ప్రసాదం గా భావించి ఇంటికి తీసుకు వెళ్లారు.  ఆ వైశ్యుడికి  ఇద్దరు భార్యలు. వారికి కూడా సంతానం లేదు. ఆ పిల్లవాడిని నా పిల్లవాడు అంటే పిల్లవాడు  అని అతని ఇద్దరు భార్యలు కొట్టుకోసాగారు. ఇలా కొంతకాలం  ఇలా కొంతకాలం గడిచింది. ఆ పిల్లవాడికి మూడు సంవత్సరాలు వచ్చాయి. వైశ్యుడు పెద్దభార్య ఈ గొడవలు అన్నిటికీ కారణం ఈ పిల్లవాడు అని అతనిని తీసుకు వెళ్లి అడవిలో వదిలేసి వచ్చింది. ఆ పిల్లవాడు ఏడుస్తూ తులసి చెట్టు కిందనే కూర్చున్నారు. అతనికి భయం వేసి ఏడవటం మొదలు పెట్టాడు. అతని ఏడుపు విని మళ్లీ పక్షులన్నీ వచ్చాయి. ఆ పక్షులను చూసి పిల్లవాడు కొంతసేపటిక ఏడుపు మానేశాడు.   ఆ పిల్లవాడికి పండ్లు అవి తీసుకొచ్చి ఇచ్చేవి.  ఆ పిల్లవాడు తులసి చెట్టు కిందనే కూర్చోవటం నిద్రపోవటం చేసేవాడు. కొంతకాలానికి అతని బుద్ధి వికసించి అతనికి  వికసించి అతనికి తెలియకుండానే కృష్ణా గోవిందా నారాయణ మాధవ అనేవాడు. ఇదంతా తులసి చెట్టు మహత్యం వల్ల వచ్చింది. అతని వెళ్లి పండ్లు తెచ్చుకుంటాను పక్కనే ఉన్న సరస్సులో స్నానం చేయటం చేసేవాడు. ఆ పిల్లవాడికి ఒకరోజు అశరీరవాణి వినిపించి ఇప్పుడు మాఘ మాసం ప్రారంభమవుతుంది. రోజు సూర్యోదయం ముందే నిద్ర లేచి  ఈ సరస్సులో స్నానం చెయ్యి అని చెప్పింది. స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తిని ధ్యానం చేయమని చెప్పింది. పిల్లవాడు మాఘమాసం అంతా అలాగే చేశాడు.  శ్రీ మహా విష్ణువు ఆ పిల్లవాడికి దర్శనమిచ్చారు. నేను నీ తపస్సుకి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నారు. ఆ పిల్లవాడు చిరకాలం నీ పాద సన్నిధి లో ఉండే అదృష్టాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు. శ్రీ మహావిష్ణువు అలాగే అన్నారు కానీ ముందు నువ్వు భూమండలం అంతా పరిపాలించు తదనంతరం ఉంటావు అని చెప్పారు. ఇప్పుడు నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. శ్రీమహావిష్ణువు తన సేవకుడై సనందనుడిని  పిలిచి  ఈ పిల్లవాడిని అతని తండ్రి దగ్గర విడిచి రమ్మని జరిగింది చెప్పమని చెప్పారు. సనందనుడు ఆ పిల్లవాడిని తీసుకొని అతని తండ్రి అయినా సులక్షణుడి  దగ్గరకు  తిసుకు వెళ్ళి జరిగినదంతా వివరించారు. సులక్షణ డు  అతని కుమారుడిని దగ్గరకు తీసుకుని సంతోషించాడు. కుమారుడికి సుధర్ముడు అని పేరు పెట్టారు. ఆ కుమారుడు విద్యాబుద్ధులు అన్నీ చక్కగా నేర్చుకున్నాడు. అతనికి యుక్త వయసు వచ్చినాక సులక్షణ మహారాజు అతనికి రాజా అభిషేకం చేసి తన 99 మంది భార్యలతో వాన ప్రస్థానానికి వెళ్ళిపోయారు. సుధర్ముడు చక్కగా రాజ్యపాలన చేసేవాడు అంతే కాకుండా అతను జీవితాంతం మాఘస్నానం ఫలితాన్ని మర్చిపోకుండా చేశాడు. తన తదనంతరం విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 26వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...