మాఘ పురాణం 24

మాఘమాసం 24వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 24వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో సత్యజిత్తుకి దర్శనం ఇచ్చినపుడు శ్రీమహా విష్ణువు ఏకాదశి వ్రతం గురించి తులసి మహత్యం గురించి చెప్పారు. ముందుగా ఏకాదశి వ్రతం గురించి చెపుతాను. దశమినాడు రాత్రి ఉపవాసం ఉండి మరుసటి రోజు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి జాగరణలు  ద్వాదశి నాడు ఉదయం నన్ను పూజించి ఎవరైనా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తరువాత శక్తికొలది దానధర్మాలు చేసి వారు భోజనం చేసి ద్వాదశి రోజున రాత్రి మళ్ళీ ఉపవాసం ఉండాలి. ఇలా ఏడాదిలో మొత్తం 24  ఏకాదశులు రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసములతో కలిసి మొత్తం 26  ఏకాదశులు చేసిన వారు నన్ను చేరుకుంటారు. వారి వంశములోని అందరూ నా భక్తులై నన్ను పూజించి తరిస్తారు అని చెప్పారు. సత్యజిత్తు దేవతలకు పారిజాత వృక్షాన్ని, శ్రీమహావిష్ణువుకి తులసిని ఇచ్చారు. శ్రీమహావిష్ణువు చేతిలోకి తులసి వెళ్ళగానే స్వామికి నమస్కరించి నన్ను స్వకరించి మీ పాదములపై ధరించండి అని అడిగింది.అందుకు శ్రీమహావిష్ణువు తులసితో నీవు పవిత్రురాలివి. పవిత్రతను కలిగిస్తావు. నిన్ను నేను నా హృదయముపై మాలగా ధరిస్తాను. నిన్ను నిండు దళములతో చుసిన వారికీ గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మ ఉండదు. అమృతం నుండి పుటిన నీ దళములను నాకు మాలగా వేసిన వారికీ నా వైకుంఠములో చాలాకాలం వరకు ఉండి తరువాత నాలో ఐక్యం అవుతారు. నిన్ను తమ ఇంటిలో గాని తోటలోగాని పెంచిన వారికీ పాపములు అంటావు. నిద్ర లేచిన తరువాత మొదటిగా నిన్ను చుసిన వారికీ ఆ రోజు సుఖ సంతోషములు అనుభవిస్తారు. తులసి దళాలతో నీటిని తమ శరీరంపై చలుకున్నవారికి పవిత్రుడవుతారు. నీ చెట్టు యొక్క మొదట్లో మట్టిని తీసి తిలకంగా ధరించిన వారికీ సర్వసుఖములు లభించి యక్ష రాక్షస పిశాచాల వలన వారికీ భాధలు ఉండవు. నిన్ను లక్ష్మితో సమాసంగా భావిస్తాను. శ్రీమహావిష్ణువు స్పర్శ వలన తులసి పవిత్రమై కాంతివంతముగా అందమైన స్త్రీ రూపాన్ని పొంది శ్రీమహావిష్ణువు అంశాన్ని పొందింది. జగదీశ్వరుడైన శ్రీమహావిష్ణువు లోకసంరక్షణార్ధం నియమించారు. శ్రీమహావిష్ణువు ఎడమచేతితో స్పర్శించిన భాగం కృష్ణవర్ణమై కృష్ణ తులసీగా మారింది. తులసి పక్కన ఉన్న ఇతర వృక్షములు కూడా పవిత్రమైనాయి. శ్రీమహావిష్ణువు ఈ విధముగా ఏకాదశి వ్రతం, తులసి విశిష్టతను చెప్పారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 24వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...