మాఘ పురాణం 3

మాఘ పురాణం మూడవ రోజు పారాయణం



సూతమహర్షి శౌనకాది మునులకు మాఘమాస మూడవరోజు మాఘపురాణం చెప్పటం మొదలుపెట్టారు. మహాదేవుడు పార్వతిమాతతో మాఘమాస స్నానం వ్రతం ఆచరించిన ఒక తప్పుచేసిన బ్రాహ్మణా స్త్రీ తన తప్పును తెలుసుకొని మాఘమాస వ్రతం చేసి మరణాంతరం విష్ణు సాన్నిధ్యాని పొందారు. అప్పుడు పార్వతిమాత మహాశివునితో ఎవరు స్వామి ఆమె. ఆమె కథను వివరించండి అని అడిగింది. మహాశివుడు ఇలా వివరించసాగారు. పూర్వం ఔరాష్ట్ర దేశం, బృంద్రారకం అనే గ్రామంలో సుదేహుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదశాస్త్ర పండితుడు. అయన గురుకులని నడిపేవారు. అయన దగరకు చుట్టుపక్కల రాజ్యం నుంచి విద్యాబ్యాసం కోసం వచ్చేవారు. ఆయనకి ఒక కుమార్తె ఉండేది. ఆమె చాల అందమైనది. ఆమెకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. అయన దగర సుమిత్రుడు అనే శిష్యుడు ఉండేవాడు. సుమిత్రుడు ఒకరోజు అడవికి షర్బలు తీసుకురావటానికి వెళ్లారు. అతని వెంట సుదేహుని కుమార్తె కూడా వేలింది. అడవిలో ఉన్న దర్భలను ఏరుతూ చాలాదూరం వెళ్లరు. అలసటతో ఒక చోట ఆగారు. సుదేహుని కుమార్తె అక్కడ ఏకాంతంగా ఉన్న చోట సుమిత్రుడి దగరకు వచ్చింది. నేను అంటే నీకు ఇష్టమేనా అని అడిగింది. అమ్మ నువ్వు నాకు గురు పుత్రికావి. నాకు సోదరి సమానురాలివి. నీకు ఎలాంటి ఆలోచన ఉండకూడదు. మనం గురుకులని వెళదాము అని మందలించాడు. అయినా ఆమె వినకుండా నువ్వు ఎప్పుడు నా కోరికను కాదు అంటే నేను ఇక్కడే చెరువులో దూకి మరణిస్తాను. చేసేది లేక అతను ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కొన్నాళ్లకి తండ్రి ఆమెకు కాశీలోని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేసారు. కానీ వివాహం అయినా కొన్నాళ్లకి ఆమె భర్త మరణించాడు. ఆమె తండ్రి ఎంతో దూకించారు. అయన దుఃఖాన్ని చూసి అక్కడకి ఒక యోగి వచ్చారు. యోగితో అయ్యా నేను ఏమి పాపం చేశాను నా కూతురికి ఎలాంటి దుస్థితివచ్చింది. నువ్వు పాపం చేయలేదు నీ కూతురు ముందు జన్మలో క్షత్రియ కుమార్తె ఆమె తన బుద్ధి పెడదారి పాటి ఇతర మొగవారితో చెడు స్నేహాలు చేసింది. అది చాలక తన భర్తను ఇతర స్నేహితులతో కలిసి కోటి చంపింది. తన భర్తకు గాయాలవల్ల వచ్చిన రక్తాన్ని చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. భర్తను చంపినా పాపం, ఆత్మహత్య చేసుకున్న పాపం వలన ఎలా జరిగింది. ఆమె మల్లి జన్మని తీసుకున్న తన బుద్ధిని మార్చుకోకుండా నీ శిషులతో దుర్మగంగా ప్రవర్థించి కన్యత్యాన్ని పోగొట్టుకుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంత పాపం చేసిన ఆమెకు ఎలాంటి మంచి జన్మ ఎలావచింది అని అడిగారు.అందుకు యోగి ఆమె పూర్వ జన్మలో ఒకసారి ముత్తైదువులు అందరూ మాఘమాస స్నానం ఆచరించి ఆ నది ఒడ్డునే గౌరీదేవిని షోడశోపచారాలతో పూజించారు. వాళ్ళతో పాటు ఆమె కూడా ఆ వ్రతం చేసింది. నీ కుమార్తె మారి మల్లి మాఘమాస స్నానం గౌరీ వ్రతములు చేయించి ముత్తయిదువులకు వాయనాలు ఈపిస్తే నీ అల్లుడు బ్రతుకుతాడు అని చేపి వెళ్లిపోయారు. ఆ బ్రాహ్మణుడు అలాగే చేసారు. ఆమె ఆమెభర్త తరువాత మరణాంతరం విష్ణు సాన్నిధ్యాని పొందారు అని మహాశివుడు పార్వతిమాతతో, సూతమహర్షి శౌనకాది మునులకు వివరించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...