కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు

రధసప్తమి సందర్భముగా కాశీలోని సూర్య భగవానుడి దేవాలయాల గురించి తెలుసుకుందాము.



కాశీలోని సూర్య భగవానుని దేవాలయాలు

పూర్వం కాశీలో సూర్యభగవానుడికి 12 ఆలయాలు ఉండేవి. వాటిలో  కొన్ని దండయాత్రల్లో ధ్వంసమయ్యాయి.  మన పూర్వీకులు వాళ్ళ తపఃశక్తిని  ధారపోసి ఆలయాలను కట్టారు. 

1. లోలార్క ఆదిత్యుడు

పూర్వకథ :-పూర్వం దివందాస్  వారణాసిని  తన గుపేటిలో పెటుకున తరువాత పరమేశ్వరుడు సూర్యుడిని పిలిచి నువ్వు వెళ్లి వారణాసిలో కొంచం స్తానం ఏర్పరచుకో అని ఆజ్ఞాపిస్తాడు. సూర్యడు ఇక్కడికి వచ్చి లోలతతో ఉంటాడు కాబటి ఇక్కడ స్వామికి లోలార్క ఆదిత్యుడు అని పేరు. 

విశేషం :- ఈ స్వామిని ఉపాసిస్తే పాపం వల్ల వచ్చే వ్యాధులు పోతాయి. 

స్థలం :- ఈ ఆలయానికి వెళ్లటానికి అశ్వని ఘాట్ దగరకు వెళ్లి లోలార్కు కుండం దగరకు వెళితే అక్కడ ఉంటుంది. ఇక్కడ గంగ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. 

కాశీలోని 12సూర్య దేవాలయాలలో రెండోవది విమల ఆదిత్యుడు. 

విమల ఆదిత్యుడు

పూర్వకథ :- పూర్వం విమలుడు అనే రాజుకి కుష్టివ్యాధి ఉండేది. అతని రాజ్యములో ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా తగలేదు. ఆ రాజు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చి ఆదిత్యుడు అతని వ్యాధిని తగిస్తాడు. ఆ రాజు తన తపఃశక్తిని ధారపోసి ఇక్కడ ఆదిత్యుడిని ప్రతిష్టిస్తాడు. విమలుడుచే ప్రతిష్టించబడిన ఆదిత్యుడు కాబట్టి విమలాదిత్యుడు. 

విశేషం :- ఆ స్వామిని ఉపాసిస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. 

స్థలం :- కాశీలోని జంగంవాడి మఠం ఎదురు నుంచోని ఎడమచేతివైపు సందులోకి వెలితే కుడిచేతి మూడో సందులో ఒక ఎర్రటి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం వెనుక భాగంలో ఉంటుంది. 

కాశీలోని 12సూర్య దేవాలయాలలో మూడొవది సాంబ ఆదిత్యుడు 

సాంబ ఆదిత్యుడు 

పూర్వకథ :- శ్రీకృష్ణుడు, జాంబవతి కుమారుడు సాంబుడు. అతని అల్లరి చేష్టలకి తట్టుకోలేక ఒకసారి నారద మహర్షి కుష్ఠిరోగివికమని సాంబుడిని శపిస్తాడు. సాంబుడు శ్రీకృష్ణుడు దగరకు వెళితే శ్రీకృష్ణుడు నువ్వు నా కుమారుడివి అయినా కర్మఫలితం అనుభవించాలసిందే కనుక తపస్సు చేయమని చెపుతాడు. అపుడు సాంబుడు ఇక్కడికి వచ్చి ఆదిత్యుడి గురించి గోరాతపస్సు చేస్తాడు. ఆదిత్యుడు ఇతని తపస్సుకు మెచ్చి కుష్టి వ్యాధిని తగిస్తాడు. ఈ ఆదిత్యుడినే సాంబ ఆదిత్యుడు అంటారు. 

విశేషం :- ఈ ఆదిత్యుడిని ఉపాసిస్తే చర్మవ్యాధులు పోతాయి. 

స్థలం :-  ఈ ఆలయం సూరజ్ కుండం దగర ఉంది. సూరజ్ కుండంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు పోతాయి. 

కాశీలోని 12సూర్య దేవాలయాలలో నాలుగోవది ద్రుపద ఆదిత్యుడు. 

4. ద్రుపద ఆదిత్యుడు

పూర్వకథ :- ద్రౌపది దేవి పూర్వజన్మలో ఇక్కడే తపస్సు చేసి పరమశివుడిని మేపించి పతి కావాలి అని వరం కోరుకుంది. ఆమె ఆపకుండా 5సార్లు పతి అని అనటం వలనే ఆమెకు మరు జన్మలో 5గురు భర్తలు వచ్చారు అని మహాభారతంలోని కథ. అంతే కాకుండా వనవాసంలో ఉండగా ధర్మరాజు, ద్రౌపతి కూడా ఇక్కడ సూర్యుడి కోసం తపస్సు చేసారు ఆహారం కోసం సూర్యుడు వారి తపస్సుకి మెచ్చి అక్షయ పాత్రా ప్రసాదించాడు. 

విశేషం :- ఈ స్వామిని పూజించిన వారికీ జన్మలో ఆహారానికి లోటు రాదు అని ప్రతీతి. 

స్థలం :- ఈ ఆలయానికి వెళ్లటానికి వెళ్లే ఒకటో నెంబర్ గేటులో నుంచి లోపలికి వెళితే టుంటి గణపతి ఆలయం వస్తుంది. కొంచెం ముందుకు వెళితే అన్నపూర్ణ దేవి ఆలయం వస్తుంది. ఇంకాకొంచం ముందుకు వెళితే అక్షయవటవృక్షం వస్తుంది. అక్కడ చుట్టు వెతికితే ఒక మూల చిన్న శిలలాగా వుంది. దానిపైన చిన్న ఆదిత్యుడి విగ్రహం ఉంటుంది. 

కాశీలోని 12సూర్య దేవాలయాలలో ఐదోవది వృధాప్య ఆదిత్యుడు. 

5. వృధాప్య ఆదిత్యుడు

పూర్వకథ :- ఒక వృధుడు సూర్య భగవానుడి కోసం ఇక్కడ తపస్సు చేసారు. స్వామి ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి అని అడిగారు. అందుకు ఆ వృధుడు స్వామి వృధాప్యం వల్ల వచ్చే బాధల వలన మిమ్మలిని సరిగా ఉపాసించలేక పోతున్నాను. కాబ్బటి నాకు వృధాప్య భాధలు లేకుండా శక్తిని ప్రసాదించండి అని కోరాడు. 

విశేషం :- ఈ స్వామిని ఉపాసించిన వారికీ వృధాప్య భాదలు దరిచేరవు. 

స్థలం:- ఈ స్వామి దగరకు వెళ్లటానికి గంగానదిలోని నిర్ ఘాట్ దగ్గర దిగి పైకి వెళ్లేకొద్ది ఎడమ చేతి వైపు ఉంటుంది. 

కాశీలోని 12సూర్య దేవాలయాలలో ఆరోవాది గంగా ఆదిత్యుడు. 

6. గంగా ఆదిత్యుడు

పూర్వకథ :- సూర్యడు ఇక్కడ గంగా నది కోసం తపస్సు చేసాడు. 

విశేషం :- ఈ స్వామిని ఉపాసించటం వల్ల ఎవరి వల్ల మోసపోవటం జరగదు. 

స్థలం :- సంకట్ ఘాట్, పశుపతి ఘాట్ దగ్గర దిగి నేపాలీ పశుపతినాధ్ దేవాలయ దగ్గర కుడిచేతిపక్కన కిందకి మెట్లు దిగి అక్కడ చిన్న గుడిలో ఉంటాడు ఈ గంగా ఆదిత్యుడు. 

కాశీలోని 12సూర్య దేవాలయాలలో ఎడొవది యామ  ఆదిత్యుడు. 

7. యామ ఆదిత్యుడు 

పూర్వకథ :- ఇక్కడే యమధర్మ రాజు తన తండ్రి అయిన సూర్యుడి కోసం తపస్సు చేసాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఇక్కడ వెలిసాడు. 

విశేషం :- ఇక్కడ పితృకర్మలు చేస్తే గయలో చేసిన ఫలితం వస్తుంది. 

స్థలం :- సంకట్ ఘాట్ దగ్గర దిగి మెట్లపైకి వెళ్లి అక్కడ ఉంటుంది. 

కాశీలోని 12సూర్య దేవాలయాలలో ఎనిమిదొవది మయూఖ ఆదిత్యుడు.

8.మయూఖ అధిత్యుడు 

పూర్వకథ :- పూర్వం సూర్యుడు శివపార్వతుల కోసం ఇక్కడే తపస్సు చేసాడు. తపస్సు వలన సూర్యుడి వేడి పెరిగిపోయాడు. భూమిలో ఉండే ఋషులు పరమేశ్వరుడిని ప్రార్ధించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై సూర్యుడిని తాకగానే చలపడిపోతాడు. అందుకే ఇక్కడ సూర్యుడు 365రోజులు చల్లగా, తేమగా ఉంటాడు. సూర్యుడి కోరిక మేరకు పార్వతి పరమేశ్వరులు ఇక్కడ గభస్తిశ్వరుడు మాంగళ్య గౌరిగా వెలిశారు. 

విశేషం :- ఈ స్వామిని పూజిస్తే భయంకరమైన రోగాలు రాకుండా ఉంటాయి. 

స్థలం :- గంగానదిలో రాజా గ్వాలియర్ ఘాట్ దగ్గర దిగి ప్రక్కన మెట్లపైకి ఎక్కి కుడిచేతివైపు మాంగళ్య గౌరీ ఆలయంలోకి వెళితే కుడిచేతి వైపు చిన్న ఇతడి విగ్రహం ఉంటుంది. 

కాశీలోని 12సూర్య దేవాలయాలలో తోమిదోవది అరుణ ఆదిత్యుడు.

9. అరుణ ఆదిత్యుడు 

పూర్వకథ :- కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ ఇద్దరు భార్యలలో కద్రువకి ఎంతోమంది పాము సంతానం కలుగుతుంది. వినతకి రెండు గుడ్లు మాత్రం ఇవ్వబడతాయి. అవి ఎన్నాళ్లకి బయటకి రాకపోవటంతో సవతి పై అసూయతో వినత ఒక గుడ్డుని పగలగొడుతుంది. అందులో నుంచి కాంతులు వెదజలుతు కాలులేకుండా ఒక పురుషుడు బయటకు వస్తాడు. వస్తూనే తన తల్లిని ని సవతిపై అసూయతో నన్ను పూర్తిగా పెరగనివ్వకుండా బయటకు తీస్తావా నీవు ని సవతికే దాస్యం చేస్తావు అని శపించి ఇక్కడకు వచ్చి సూర్యుడి కోసం తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చి సూర్యుడు అతనిని తన రథానికి సారధిగా చేసుకుంటాడు.

విశేషం :- ఈ స్వామిని ఉపాసించిన వారికీ అంగవైకల్యం పోతుంది. 

స్థలం :- ఆటోలో బిర్లా హాస్పిటల్ దగ్గర దిగి హాస్పిటల్ ఎదురు సందులోకి నడుచుకుంటూ వెళితే రెండు ఆదిత్యుల దేవాలయాలు ఉన్నాయి. అరుణాదిత్యుడు త్రిలోచనేశ్వరుడి దేవాలయములో ఒక మూలా ఉంటుంది. 

కాశీలోని 12సూర్య దేవాలయాలలో పదోవది కాకోక్లా  ఆదిత్యుడు.

10. కాకోక్లా ఆదిత్యుడు

పూర్వకథ :- అరుణుడు శాపం వల్ల వినత తన సవతికి దాసి అవుతుంది. కొన్నాలకి రెండో గూడులో నుంచి శక్తివంతుడైన గరుత్మంతుడు వస్తాడు. ఇంకొన్నాళ్లకి గరుత్మంతుడు తన తల్లి అయినా వినతను దాస్యం నుంచి విముక్తి కలిగిస్తాడు. కానీ వినతకి మనసులో బాధ అలాగే ఉంటుంది. తనవల్ల అరుణుడు అంగవైకల్యుడు అయ్యాడు అని బాధపడుతుంది. మనస్సు శాంతి కోసం ఇక్కడ సూర్యుడిని ప్రతిష్టించి తపస్సు చేస్తుంది. సూర్యుడు ప్రత్యక్షమై ఆమె మనస్సుకు శాంతిని ప్రసాదిస్తాడు. 

విశేషం :- ఇక్కడ సూర్యుడిని ఉపాసిస్తే మానసిక భాధలు తొలగిపోతాయి. 

స్థలం :- బిర్లా హాస్పిటల్ ఎదురుసందులో నడుచుకుంటూ వెళితే కామేశ్వర మహాదేవ ఆలయంలో పెద్ద చెట్టు వెనకాల ఉన్న మండపంలో ఉంటుంది. 

కాశీలోని 12సూర్య దేవాలయాలలో పదకొండోది ఉత్తరార్క ఆదిత్యుడు.

11. ఉత్తరార్క ఆదిత్యుడు

పూర్వకథ :- ప్రియవ్రతుడు అనే భార్యాభర్తలకు ఒక సులక్షణ అనే కుమార్తె ఉండేది. ఆమెకి జాతకం సరిగా లేక వివాహం జరగదు. కొనాలకి ఆ భార్యాభర్తలు ఆ బాధతో చనిపోతారు. ఈ సులక్షణ బాధపడి జాతక దోష పరిష్కరం సూర్య ఆరాధన ఒకటే అని మార్గం అని ఇక్కడికి వచ్చి సూర్యుడిని ప్రతిష్టించి ప్రతిరోజు బకిరియా కుండ్ లో స్నానం చేసి తపస్సు చేస్తుంది. ఆమె తపస్సు మొదలు పెట్టగానే ఎక్కడినుంచి వచ్చేదో ఒక మేక ఆమె పక్కన వచ్చి కూర్చునేది. కొన్నాలకి ఈమె తన తపస్సుని తీవ్రతరం చేస్తుంది. ఆ మేకాకుండా ఆమెతోపాటే అక్కడే ఉంటుంది. కొన్నాళ్లకి పార్వతి, ఈశ్వరులకి జాలి కలిగి ఆమెకు దర్శనం ఇచ్చి ఏమివరం కావాలో కోరుకోమని అడిగితే ఆమె నాకు కాదు ఈ మేకకు వరం ఏవండీ అమ్మ కావాలంటే నేను మళ్ళి ఉపాసన చేసి సాధించగలను కానీ మేక అలాగకాదు కదా. దానికి పార్వతీపరమేశ్వరులు ఆమెకు ఉత్తమామనైనా జన్మను ప్రసాదిస్తారు. సులక్షణ భాతదయకు మెచ్చి ఆమెను పార్వతీదేవి తన చెలికతెలలో ఒకరుగా చేసుకుంటుంది. 

విశేషం :- ఈ ఆదిత్యుడిని ఉపాసిస్తే ప్రమోషనులు వస్తాయి. 

స్థలం :- వారణాశి జంక్షన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర బకిరియా కుండ్ దగ్గర ఉంది. 

కాశీలోని 12సూర్య దేవాలయాలలో పన్నెండోది కేశవ ఆదిత్యుడు.

12. కేశవ ఆదిత్యుడు 

పూర్వకథ :- ఒకసారి సూర్యుడు ఆకాశమార్గంలో వెళుతుండగా కాశీ క్షేత్రంలో విష్ణుమూర్తి శివునికి పూజ చేస్తూ కనిపించారు. సూర్యుడు వెంటనే కిందకి వచ్చి విష్ణుమూర్తిని స్వామి మీరు శివుడిని పూజ చేస్తున్నారు ఏమిటి అని అడిగారు. అపుడు విష్ణుమూర్తి నాకు శివునికి భేదం లేదు అని తెలియజేయటానికి అని చెపుతారు. 

స్థలం :- వారణాశి జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర ఆదికేశవ దేవాలయం గర్భగుడిలో ఉంటుంది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...