మాఘ పురాణం 8

 మాఘ మాసం ఎనిమిదొవ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం ఎనిమిదోరోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! ఒకసారి దత్తాత్రేయ స్వామి దగరకు అయన శిష్యుడు ఐన కార్తవీర్యార్జునుడు వచ్చారు. కార్తవీర్యజ్ఞుడు దత్తాత్రేయ స్వామికి నమస్కరించి స్వామి! నాకు మాఘమాసం విశిష్టతను వివరించండి అని అడిగారు. అందుకు దత్తాత్రేయ స్వామి మాఘ మాసం విశిష్టత అమోఘమైనది. ఈ మాసంలో మాఘ స్నానం విశిష్టమైనది. సూర్యోదయానికి ముందే నది స్నానం ఆచరించి సూర్యనమస్కారాలు చేసి అక్కడే లక్ష్మి నారాయణులను కానీ, శివ పార్వతులను కానీ, సూర్యభగణుడిని కానీ పూజించాలి. ఈ మాసంలో సత్ బ్రాహ్మణుడికి దానాలు ఇవ్వటం వలన తెలిసి తెలియక చేసిన పాపములు నశించి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. పూర్వ జన్మ ఉండదు. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది చెపుతాను విను. పూర్యం గంగ నది తీరం ఉత్తర భాగములో భాగ్యపురం అనే పట్టణం ఉండేది. ఆ ఊరి పేరుకు తగట్టుగానే ఆ ఊరి వారందరు ధనవంతులు. అందులో హేమాంబరుడనే ఒక వైశ్యడు ఉండేవాడు. అతను కుబేరుడితో సమానమైన ధనవంతుడు. కొంతకాలం తరువాత అయన మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళ తండ్రి చనిపోయిన తరువాత ఆస్తిని చేరి సగం పంచుకొని సంపాదించకుండా ఖర్చుచేయటం మొదలుపెట్టారు. వారికీ అన్ని దృవ్యసనాలు ఉన్నాయి. వేశ్యాలోలత్వం లై ఉండేవారు. వారికీ గురించి తెలిసి ఎవరు పిల్లను ఇచ్చి పెండ్లి చేయటానికి ముందుకురాలేదు. పెద్దవాడు ఒకసారి ఒక వేశ్యతో ఉద్యానవనంలో తిరుగుతుండగా త్రాచుపాము కరిచి చనిపోయాడు. చిన్నవాడు గంగానది దాటుతుండగా గంగలో కొట్టుకుపోయి మరణించాడు. ఇద్దరిని యమభటులు వచ్చి తీసుకువెళ్లారు. యమలోకానికి వెళ్లక చిత్రగుప్తుడు వీళ్ళ పాపపుణ్యాలు దర్శించి పెద్దవాడిని నరకానికి, చిన్న వాడిని స్వర్గానికి పంపామన్నారు. అందులో ఉన్న చిన్నవాడు చిత్రగుప్తుడితో స్వామి! నేను మా అన్నయ ఇద్దరమూ పాపములు చేసాము. ఇద్దరమూ అకాలమరణమే పొందాము కానీ నాకు స్వర్గం, మా అన్నయ్యకు నరకం ఎలావచ్చింది అని అడిగారు. అందుకు చిత్రగుప్తుడు నువ్వు రోజు వేశ్య దగ్గరకి వెళ్లటానికి రోజు గంగానదిని దాటేవాడివి. ఒకోసారి ఈదుకుంటూ వెళ్ళేవాడివి. అలాగా గంగలో స్నానం చేసిన ఫలితం వచ్చింది. నీతోపాటు రోజు నీ స్నేహితుడైన బ్రాహ్మణుడు వచ్చేవాడు. అతనికి రోజు ఎంతో కొంత దానం ఇచ్చేవాడివి. అతను బ్రాహ్మణుడు అవటం వలన నీకు దానం చేసిన ఫలితము వచ్చింది. అంతే కాకుండా అతను రోజు సంధ్య వందనం చేసిన తరువాత నదిని దాటేవాలు ఇద్దరు. నువ్వు అతని కోసం ఎదురుచూసేవాడివి. అతను సంధ్యావందనం చేస్తునపు గాయత్రి మంత్రం చెప్పగా నువ్వు రోజు వినవు. అందువలన నువ్వు చేసిన పాపములు అన్ని నశించి స్వర్గం వచ్చింది. చిన్నవాడు చిత్రగుప్తుడికి నమస్కరించి స్వర్గానికి వెళిపోయాడు. తెలియక చేసిన నదీస్నానం వలన దానం వలన దైవప్రార్ధన వినటం వలన అతనికి స్వగ్రప్రాప్తి లభించింది. అని దత్తాత్రేయ స్వామి కార్తవీర్యజునికి, మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఏవిధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం ఎనిమిదోరోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...