కార్తీక పురాణము 17వ రోజు

అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వపదేశము 

         ధనలోభి! నీకు కలిగిన సంశయములకు సమాధానం చెపుతాను విను. కర్మవలన ఆత్మ వివిధ శరీరాలను ధరించాల్సి వస్తుంది. కనుక శరీర ధారణకు కర్మ కారణమవుతుంది. శరీరాని ధరించటం వలన ఆత్మ కర్మను చేస్తుంది.  కనుక కర్మ చేయటానికి శరీరమే కారణమవుతుంది. స్థూల, సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం ఏర్పడుతుంది అని మాత పార్వతికి పరమేశ్వరుడు వివరించెను. దానిని మీకు నేను వివరిస్తాను. ఆత్మ అనగా ఈ శరీరాన్ని ధారణ చేసుకొని వ్యవహరించేది. అని అగిరసుడు చెప్పగా........ 

          ఓ మునిచంధ్రా! నేనింతవరకు ఈ శరీరమే ఆత్మ అని భావిస్తున్నాను. నాకు ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్ధమునకు పాదార్థాజ్ఞానము కారణమవుతుంది. కనుక 'అహంబ్రహ్మ'యను వాక్యార్ధమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరుకున్నాడు. 

         ధనలోభా! ఈ శరీరము అంతఃకరణ వృత్తికి సాక్షి. 'నేను-నాది' అని చెప్పబడే జీవాత్మయే 'అహం' అను శబ్దము. సర్వాంర్యామియై పరమాత్మ 'నః'అను శబ్దము, ఆత్మ ఘటాదుల వాలె శరీరానికి అర్ధములేదు. ఆ ఆత్మ సచిదానందా స్వరూపము, బుద్ధి, సాక్షి జ్ఞానరూపమగు శరీర ఇంద్రియాలు మొదలగు వ్యాపకుమలయందు ప్రసరించేలాచేసి వాటి అన్నిటి కంటే వేరుగా ఉన్నదై ఎల్లపుడు ఒకే రీతిన ప్రకాశిస్తూ ఉండేది ఆత్మ. నేను అనేది శరీర ఇంద్రియాలలో ఒకటి కాదు అని తెలుసుకో. ఈ ఇంద్రియాలన్నిటిని ఏదీ ప్రకాశించేలా చేస్తుందో అదే 'నేను' అని తెలుసుకో. అందువలన అశాశ్వతమయిన శరీర ఇంద్రియాలు కూడా నామరూపము నశిస్తాయేగాని, ఇటువంటి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటిని "నేను" "నాది" అను వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించు. 



             ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునటే  శరీరం, ఇంద్రియాలు కూడా ఆత్మను అంటిపెట్టుకొని తిరుగుతాయి. అలాగే అవి ఆత్మవలన తమ పనిని చేస్తాయి. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢనిద్ర పోయి, నిద్రలేచిన తరువాత నేను సుఖముగా నిద్రపోయాను, సుఖముగా ఉన్నాను అని అనుకొనేదే ఆత్మ. 

         దీపము గాజుబుడ్డిలో ఉంది గాజును ఎలా ప్రకాశించేలా చేస్తుందో అలాగే ఆత్మ కూడా శరీర ఇంద్రయాలను ప్రశించేలాచేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపమవటం వలన దానికి ధారా పుత్రాదులు ఇష్టమవుతున్నాయి. అటువంటి విశేష ప్రేమస్పందన కలిగి ఉందొ అదే పరమాత్మ అని గ్రహించు. తత్త్వమసి అను పదము జీవాత్మ పరమాత్మ ఐక్యతను బోధిస్తుంది. ఈ విధముగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా పరమాత్మ స్వరూపము ఒకటే నిలుస్తుంది. శరీరము లక్షణములు-ఉండటం-జన్మించటం-పెరగటం-క్షిణించటం-చనిపోవటం మొదలగు ఆరు భాగాలూ శరీరానికే కానీ ఆత్మకు లేవు. పరమాత్మ స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనిని సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడియున్నదో అదియే 'ఆత్మ'. ఒక కుండను చూసి ఏ విధముగా మట్టితో చేసింది అనుకుంటామో అదేవిధముగా శరీరములో ఉన్న ఆత్మ పరమాత్మ అని తెలుసుకో. 

          జీవుల కర్మఫలం అనుభావుంచేలా చేసేవాడు పరమేశ్వరుడు, జీవుల కర్మఫల అనుభవిస్తారో తెలుసుకో. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై గురుశుశ్రూష చేసేవారు సంసార సంబంధములు ఆశలన్నీ విడచి విముక్తి కలుగుతుంది. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుతారు. అందువలన సత్కర్మనుస్టనము చేయవలెను. మంచిపనులు చేసిన కానీ ముక్తి లభించదు. అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇలా అన్నాడు. 

     ఇంకాఉంది...……………………

1 కామెంట్‌:

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...