కార్తీక పురాణము 23వ రోజు

శ్రీరంగక్షేత్రమున పురంజనుడు ముక్తిని పొందింది

          అగస్యుడు మళ్లీ అత్రిమహర్షిని చూసి "మునిపుంగవా! విజయముపొంచిన పురంజయుడు ఏమిచేసాడు నాకు వివరించండి". అందుకు అత్రిమహాముని ఇలా చెప్పారు. అగస్యమహర్షి! పురంజయుడు కార్తీక మాసవ్రతప్రభావము వలన అసమాన బలోపేతుడై తన శత్రురాజులను అందరిని ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుతున్నాడు. అతని విష్ణు భక్తి ప్రభావం వలన అధర్మ మార్గాన్ని విడి ధర్మ మార్గాన్ని ఆచరిస్తు రాజ్య ప్రజలను పాలిస్తున్నాడు. కొంతకాలానికి పురంజనుడికి అశరీరవాణి ఇలా వినిపించింది పురంజనా!కావేరి నదీతీరమున శ్రీరంగక్షేత్రముంది. దానిని రెండొవ వైకుంఠమని పిలుస్తారు. నువ్వు అక్కడికి వెళ్లి శ్రీరంగనాథస్వామిని అర్చింస్తే నువ్వు సంసాగరమును ధాటి మోక్షప్రాప్తి కలుగుతుంది అని వినిపించింది. 

     తరువాత పురంజయుడు రాజ్యమును మంత్రులకు అప్పగించి రాజ్య సపరివారంగా బయలుదేరి మార్గమధ్యంలో వస్తున్న పుణ్యక్షేత్రాలను దర్శించి, పుణ్య నదులలో స్నానమాచరించు శ్రీరంగానికి చేరుకున్నారు. అక్కడ కావేరి నది రెండు పాయలుగా ప్రవహిస్తుండగా మధ్యలో శ్రీరంగఆలయంలో శేషశయ్యపై పవ్వళించి ఉన్న శ్రీరంగ స్వామిని దర్శించుకున్నారు. కార్తీకమాసమంతా శ్రీరంగమునందే గడిపి తరువాత అయోధ్యకు బయలుదేరారు. కార్తీక మాస వ్రతప్రభావము వలన అతని రాజ్యములోని ప్రజలందరూ సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో ఉన్నారు. అతడు ధర్మాభిలాషుడై దైవభక్తిపరాయణుడై అరిషడ్వార్గాలను జయించి రాజ్యపాలన చేస్తున్నాడు. కొంతకాలానికి అతనికి వృధాప్యము రాగా అతని కుమారుడికి రాజ్యపాలనము అప్పగించి వాన ప్రస్థాశ్రమానికి స్వకరించి అరణ్యానికి వెళ్ళాడు. అతడు వానప్రస్థాశ్రమంలో కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసవ్రతమును ఆచరించి మరణించిన తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. కనుక ఓ అగస్యమహర్షి కార్తీక మాసవ్రత మహత్యం ఫలప్రదమైనది. దానిని ప్రతివారు ఆచరించాలి. ఈ కథ విన్నవారికి చదివిన వారికీ కూడా వైకుంఠప్రాప్తి కలుగుతుంది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...