కార్తీక పురాణము 25వ రోజు

దూర్వాసుడు అంబరీషుని శపించుట 

అంబరీషా!పూర్వజన్మలో కొంత పాపవిశేషం వలన నికి యనర్ధము వచ్చింది. నీ బుద్ధిచే దీర్ఘముగా అలోచించి నీకెలా అనిపిస్తుందో అలానే చేయి. ఇక మాకు సెలవు ఇపించండి. అని పండితులు పలికారు. తరువాత అంబరీషుడు పండితులారా! నా అభిప్రాయును విని వెళ్ళండి. ద్వాదశీనిష్టను విడిచి పెట్టటం కన్నా, బ్రాహ్మణశాపమును పొందటం మేలు కొద్దిగా నీళ్లు తాగటం వలన బ్రాహ్మణుని అవమానించటం కాదు. ద్వాదశిని విడిచి పెట్టటం కాదు. అప్పుడు నన్ను ఎందుకు నిందిస్తాడు? నిందించడు. నా తొలి పుణ్యఫలమును నశించదు. కనుక జలపానమొనరించి ఉరుకుంటాను. అని వారి ఎదురుగానే నీళ్లు తాగుతాను. 

           అంబరీషుడు నీళ్లు తగిన వెంటనే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చారు. వచ్చిన వెంటనే ఆ ముని కోపముతో అంబరీషుడిని నన్ను భోజనానికి రమ్మని, నేను రాకుండానే నీవేల భోజనము చేసావు. ఎంత దుర్మార్గము? ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిథికి అన్నము పెడతానని పెట్టకుండా నువ్వు తింటావా. అట్టి అధముడు మరుజన్మలో పురుగైపుట్టును. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివి హరిభక్తుడవు ఇలా అవుతావు? శ్రీహరి బ్రాహ్మణుడిని అవమానించటమే. నీవంటి హరినిందపరుడు వేరొకడు లేడు. నువ్వు మహా భక్తుడనని నీకు గర్వము కలవాడివై ఉన్నావు. ఆ గర్వముతో నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా నీళ్లు పుచ్చుకున్నావు. అంబరీష నీవు ఎలా పవిత్రకుటుంబములో పుట్టావు. నీ వంశము కళంకం కాలేదా. అని కోపం నోటికివచ్చినటు తిట్టాడు. అంబరీషుడు మునికోపమునకు గడగడా వణుకుతూ నమస్కరించి మునివర్యా నను క్షమించండి. నేను ధర్మహీనుడిని. నా అజ్ఞానముతో ఈ పని చేశాను. నన్ను రక్షించండి. బ్రాహ్మణునకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షణ్యాలు గలవారు. నను కాపాడండి. అని అతని పాదాలపై పడి, దయలేని వాడై దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తని "నువ్వు దోషివి దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు. నువ్వు మొదటి జన్మలో చేపగాను, రెండొవజన్మలో తాబేలుగాను, మూడవజన్మలో పందిగాను, నాలుగోవజన్మలో సింహముగాను, ఐదొవజన్మలో వామనుడిగాను, ఆరొవజన్మలో క్రూరుడైన బ్రాహ్మణుడిగాను ఎడొవజన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదొవ జన్మలో రాజ్యముగాని సింహాసనము లేనట్టి రాజుగాను, తొమ్మిదొవజన్మలో పాషండ మతస్థునిగాను, పదోవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడిగాను పుట్టాలి గాక "అని వెనక ముందు ఆలోచించకుండా శపించాడు. ఇంకా కోపం తగనందు వల్ల మళ్లి శపించటానికి చూస్తుండగా, శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధాకాకూడదు అని తన భక్తునికి ఈ అపాయము కలగకూడదని అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా అలాగే నీ శాపమును అనుభవిస్తాను అని ప్రాధేయపడాడు. కానీ దూర్వాసుడు ఇంకా కోపంపెంచుకొని మళ్లీ శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చెక్రాని అడుపెట్టారు. సుదర్శన చెక్రము నిప్పులు కక్కుతూ దుర్వాసునిపై పడబోయింది. దూర్వాసుడు ఆ చెక్రము తనను మసిచేస్తుంది అని తలచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడినుండి పరిగెత్తాడు. తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహా మునులను దేవలోకంలో ఉన్న దేవేంద్రుడిని, బ్రహ్మలోకములో ఉన్న బ్రహ్మను, కైలాసమునకు వెళ్లి ఎంత ప్రదించిన వారు సైతము ఛేక్రాయుధము బారి నుంచి దుర్వాసుడిని కాపాడలేకపోయారు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...