కార్తీక పురాణము 18వ రోజు

సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము



          మునిచంద్ర! మీ దర్శనం వలన ధన్యుడనయను. సందేహాలు తీరేలా జ్ఞాన ఉపదేశం చేసారు. నేటి నుంచి నన్ను మీ శిష్యుడిగా స్వకరించండి. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము మీరే. నా పూర్వ జన్మ పుణ్యము వలన మీ సాంగత్యం లభించింది. లేకపోతే మహా పాపాత్ముడునై అడవిలో చెట్టు మోదుగా పడిఉన్న నేను మీ కరుణ వలనే నాకు మళ్లీ మానవ రూపం లభించింది.  నను మీ శిష్యుడిగా స్వీకరించి సత్కర్మలను మానవులు ఎలా అనుసరించాలి. దాని ఫలితము వివరించేంది అని అడిగారు.  

           ఓ ధనలోభా! నీవు అడిగిన ప్రశ్నలను ఉపయుగకరమైనవే వివరిస్తాను. శ్రద్ధగా విను. ప్రతి మానవుడు ఈ శరీరమే శాశ్వతమని నమ్మి జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదము శరీరానికే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుతానికై సత్కర్మలు చేయాలి అని సకల శాస్త్రాలు గోషిస్తున్నాయి. సత్కర్మలు ఆచరించి వాటి ఫలితములు పరమేశ్వరునికి అర్పించిన జ్ఞానము కలుగుతుంది. మానవుడు ఏ జాతివాడో, అటువంటి కర్మలు తెలుసుకొని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మలు ఆచారించిన అవి వ్యర్ధము అవుతాయి. అటులనే కార్తీకమాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించును. ఈ మూడు మాసములలో తప్పకుండా దగ్గరలో ఉన్న నదిలో ప్రాతఃకాలంలో స్నానము చేయాలి. అలాగా స్నానము అచరించి దేవతార్చన చేసిన తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్యచంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్యదినములయందు, ప్రాతఃకాలమున స్నానమాచరించి సంధ్యావందనము సూర్యనమస్కారాలు చేయాలి. కార్తీక మాసములో అరుణోదయ స్నానమాచరించిన వారికీ చతుర్వేద పురుషార్ధాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసముతో సమానమైన మాసం, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకి సమానమైన తీర్ధములు, ధర్మముతో సమానమైన మిత్రుడు లేదు అని తెలుసుకో. కార్తీక మాసంలో యధావిధిగా స్నానం ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలితము పొంది వైకుంఠానికి వెళతారు.  అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు ఇలా ప్రశ్నించారు. 

       ఓ ముని శ్రేష్టా! చాతుర్మాస వ్రతం అని చెప్పారు కదా? ఏ కారణం చేత దానిని ఆచరించాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా? ఆ వ్రతము చేయటం వలన ఫలితమేమి? వ్రత విధానం ఎలా చేయాలి? వివరంగా వివరించండి? అని కోరాడు. అంగీరసుడు ఇలా చెప్పసాగారు. 

         ధనలోభా! విను. చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాడ మాసం శుద్ధ ఏకాదశి రోజునా  పాల సముద్రంలో శేషుని పాన్పు పై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర లేస్తారు. ఈ నాలుగు మాసాలు చతుర్మాస్యమని పేరు. ఆషాడ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని, ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమని పేర్లు ఉన్నాయి.  ఈ నాలుగు మాసాలు శ్రీహరి ప్రీతికొరకు స్నాన, దాన, జప, తపాలు వంటి సత్కార్యాలు చేస్తే పూర్ణఫలము కలుగుతుంది.  ఈ విషయం శ్రీ మహా విష్ణువు వలన తెలుసుకున్నాను, ఆ విషయాలు నీకు తెలియజేస్తాను.

           తొలి కృతయుగంలో వైకుంఠం నందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత,  సేవించుచుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చొని ఉండగా  ఆ సమయంలో నారదమహర్షి వచ్చి శ్రీమన్నారాయణ గారికి నమస్కరించి నిలబడి ఉన్నాడు. శ్రీహరి నారదునితో నారద!నీవు క్షేమమే కదా! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహా మునుల సత్కర్మలు విజ్ఞములు లేకుండా సాగుతున్నాయి. మానవులందరూ వారికి విధించిన ధర్మాలను పాటిస్తున్నారా. ప్రపంచంలో అరిష్టాలు లేకుండా ఉన్నాయి కదా? అని కుశల ప్రశ్నలు అడిగారు. నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి "ఓ దేవా! ఈ జన్మలో నీకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా. ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వాళ్ళు ఎట్లా విముక్తులవుతారో తెలియట్లేదు. కొందరు భుజించ కోరండి పదార్థాలు పూజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతాలను ఆచరిస్తూ అవి పూర్తికాకుండానే మధ్యలో ఆపేస్తున్నారు. కొందరు సదాచారాలుగా, మరికొందరు అహంకారులుగా, పరనింద చేస్తూ జీవిస్తున్నారు. అట్టి వారిని సంతృప్తి పుణ్యాత్ములను చేసే రక్షించమని ప్రార్థించారు. శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో పాటు గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది ఋషులతో భూలోకానికి వచ్చి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతున్నారు.

           శ్రీమన్నారాయణుడు ముసలి బ్రాహ్మణ రూపంలో సమస్త ప్రాణులను పరీక్షిస్తూ  పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, పుణ్యఆశ్రమాలు తిరుగుతున్నారు. ఈ విధంగా తిరుగుతున్న భగవంతుడిని చూసి కొందరు ముసలివాడు అని ఎగతాళి చేశారు. మరి కొందరు ఈ ముసలి వాని తో మనకేంటి పని ఊరుకున్నారు. కొందరు గర్వంతో ఉన్నారు. మరికొందరు శ్రీహరిని కనీసం కన్నెత్తి అయినా చూడలేదు. ఇది అంత చుసిన శ్రీ మహా విష్ణువు "వీళ్ళందరి ఎలా తరింపచేయాలి" అని ఆలోచిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు ముసలి బ్రాహ్మణ రూపాన్ని వదలి తన నిజరూపం ధరించి శ్రీ మహాలక్ష్మితో భక్తులతో మునులకు ప్రీతికరమైన నైమిశారణ్యానికి వెళ్లారు.

         ఆ వనమందు తపస్సు చేసుకొంటున్న మునులు స్వయంగా తమ ఆశ్రమానికి శ్రీమన్నారాయణుడు వచ్చినందుకు భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఇలా స్తోత్రం చేశారు. 

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం!

విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం!

లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం!

వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథం!

     ఇంకా ఉంది ………………

        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...