పొగడ్తలకు పొంగిపోతే వచ్చే ప్రమాదం!

 పొగడ్తలకు పొంగిపోతే వచ్చే ప్రమాదం!

కాళికా దేవి పురాణంలోని కథ. పూర్వం ఒక అమ్మవారి భక్తుడు ఉండేవాడు అతను లలిత పరమేశ్వరి అమ్మవారి మణిద్విపంలో శాశ్వత నివాసం ఏర్పచుకోవాలి అని అమ్మవారి బీజాక్షరంతో తపస్సు చేయటం మొదలుపెట్టారు. అయన కఠోరదీక్షకి కొన్నాళ్లకి అష్టసిద్దులలో ఒకొక్క సిద్ధి సాధించాయి. ఆయనకు లోకములో ఏమూల ఏమి జరుగుతుందో తెలియటం మొదలుపెటింది. ఎలా ఒక రోజు ఒక రైతు అయన దగరకు వచ్చి నమస్కరించి స్వామి మీరు త్రికాలజ్ఞానిలాగా ఉన్నారు. నా సొమ్ము పోయింది. అది ఎక్కడ ఉన్నదో నాకు కొంచం చెప్పండి. అందుకు ఆ స్వామి పాలనచోట ఉన్నదీ అన్నారు. అయన వెళ్లి వెతికితే అక్కడే ఉన్నదీ. అయన పరుగు పరుగునా వచ్చి మీరు మహానుభావులు మీరేదేవుడు అన్నారు. ఆ రైతు ఆ ఊరిలోవల్ల అందరికి చెప్పాడు. అప్పటి నుండి వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పారు. పోనిలే పాపం అని వాళ్ళ కష్టాలు తీర్చేవారు. కొంతకాలానికి ప్రజలు మీరే అమ్మవారు, మీరే దేవుడు అని ఆయనకు పూజలు చేసారు. ఆయనకు కూడా అది నిజమే అని నేనే అమ్మవారు. అమ్మవారి నేను అనుకోను తపస్సు మానేశారు. అసలు అయన దేనికోసం తపస్సు మొదలు పెట్టారో మరచిపోయారు. భక్తులు కానుకలు సమర్పిస్తుంటే వాటితో ఆస్తులను సంపాదించుకున్నారు. కొంతకాలానికి అయన తపస్సు అంత కరిగి పోయేది. మరికొంతకాలానికి అయన కాలం చేసారు. యమాధర్మరాజు ఆయనతో నువ్వు ఈ లక్ష్యంలో తపస్సు మొదలు పెట్టావు. చివరికి ఏమిచేసావు. నువ్వు పొగడ్తలకు పొంగిపోవటం వలన వచ్చిన ప్రమాదం ఇది. జ్ఞాని అనే వాడు పొగడ్తకు పొంగిపోడు విమర్శలకు కుంగిపోడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిశ్చిలంగా ఉంటాడు. తపస్సువలన సాధించిన శక్తులను దుర్వినియోగం చేసావు కనుక తరువాత జన్మలో నువ్వు పందివై జన్మించు అన్నారు యమధర్మరాజు.


ఓం శ్రీమాత్రే నమః       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...