జూదం ఆడినా రుక్మి బాలరాములు

జూదం ఆడినా రుక్మి బాలరాములు




రుక్మిణి అన్నయ్య రుక్మిణికి శ్రీకృష్ణుడు అంటే అయిష్టం తన చెల్లెలు రుక్మిని అంటే ప్రాణం. అందుకనే తన కుమార్తె అయిన కుమారుడు ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. కొంతకాలం తరువాత వారికి అనిరుద్ధుడు జన్మించాడు. రుక్మి మళ్లీ తన మనవరాలు రుక్మలోచనని అనిరుద్ధుని కి ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. ఈ విషయం రుక్మిణికి తెలియజేశడు. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. వివాహానికి ఒక శుభ ముహూర్తం నిర్ణయించారు. వివాహం కోసం ద్వారకా నగరం నుండి కుండిన పట్టణానికి రుక్మిణి, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, సాంబుడు, అనిరుద్ధుడు మొదలైన రాకుమారులు అందరూ బయలుదేరాలు. కుండిన పురములో రుక్మి సాధారంగా ఆహ్వానం పలికారు. అందరికి అతిధి మర్యాదలు చేసారు. అనిరుద్దుడు రుక్మలోచన వివాహం అంగరంగ వైభావంగా జరిగింది. ఆ వివాహ సమయంలో యధావుల వైభవాని చూసి కొంతమంది రాజులూ తతుకోలేక పోయారు. అందులో కళింగధీశుడు రుక్మితో "శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకు వేలేటప్పుడు నీకు జరిగిన అవమానానికి ఎప్పుడు ప్రతీకారం తిర్చుకో ఆ యాదవులు అందరిని అవమానించు"అని అన్నాడు. అందుకు రుక్మి ఎలా అని అడిగారు. అప్పుడు కళింగదిశుడు రుక్మితో "మనం శ్రీకృష్ణుడి జోలికి ఇవ్వదు ఆయనని ఏమి చేయలేము. బాలరాముడికి జూదం అంటే ఇష్టం. కానీ బాలరాముడికి జూదంలో ప్రావీణ్యం లేదు. నువ్వు వెళ్లి బాలరాముడిని జూదం ఆడటానికి పిలువు అతను కచ్చితంగా ఓడిపోతాడు. అతని ద్వారా యాదవ్వులంధరిని అవమానించచు"అన్నారు.వెంటనే రుక్మి బాలరాముడి దగరకు వెళ్లి "బావ మనం సరదాగా జూదం ఆడదామా"అన్నారు. అందుకు బాలరాముడు "వద్దు రుక్మి జూదం మంచిది కాదు" అన్నాడు. అందుకు రుక్మి "మీ యధావులకు జూదం ఆడటం రాదు"అన్నిబాలరాముడిని అన్నాడు. అందుకు బాలరాముడికి కోపం వచ్చి సరే ఆడదాము రా అన్నారు. రుక్మి బాలరాముడు జూదం ఆడటానికి సిద్దమయ్యరు.బాలరాముడు మాములు మనిషి అనుకోని బాలరాముడిని అతనిద్వారా యాదవులని అవమానిదాము అనుకున్నాడు కానీ తనకు వచ్చే ప్రమాదని గుర్తిచలేకపోయాడు. ఇద్దరు పందాలు పెట్టుకొని జూదం ఆడుxతున్నారు. 10 వరహాలు, 20, 100, 1000, 10,000, అంటూ పందాలు పెంచుకుంటూ పట్టుదrlrలగా ఆడసాగారు. ఆడిన ప్రతి ఆటలో బాలరాముడు ఓడిపోయాడు. రుక్మి గెలిచాడు. అది చుసిన కళింగ రాజు కావాలనే ఆలా రాముడు ఓడిపోయాడు అని పళ్ళు బయాటపడేలా నవ్వాడు. అదిచూసి బాలరాముడికి కోపం వచ్చి ఈసారి లక్ష వరహాలు పందం కాసి గెలిచాడు. ఈసారి బాలరాముడు గెలిచినాకావాలనే కళింగదిశుడు రుక్మిని నేనే గెలిచాను అని చెప్పు అని రెచ్చగొటడు. రుక్మి ముందు వెనక చూసుకోకుండా నేనే గెలిచాను అని అన్నాడు. మళ్ళీ బాలరాముడు లక్ష వరహాలు పందెం కాసి గెలిచాడు. అప్పుడు సభలోని వారందరిని ఇపుడు నిజం చెప్పండి అని బాలరాముడు అడిగారు. అందుకు సభలోని రాజులు రుక్మి మీద అభిమానంతో మౌనం వహించారు. అప్పుడు ఆకాశ వాణి బాలరాముడే గెలిచాడు అని చేపింది. అయినా రుక్మి ఒప్పుకోకుండా మళ్ళీ నేనే గెలిచాను. మీ యాదవులకి మా క్షత్రియులు లాగా జూదం ఆడటం రాదు అని ఎగతాళి చేసాడు. దాంతో బాలరాముడికి కోపం వచ్చి తన నాగలిని పిలిచాడు. నాగలి బాలరాముడి చేతిలో ప్రత్యక్షమైంది. దానితో బాలరాముడు రుక్మి తలను పగలగొటడు. దానితో రుక్మి మరణించాడు. తనని చూసి నవ్విన కళింగదిశుడిని పట్టుకొని పళ్ళు అని ఉడేలా కొట్టాడు. కరెవమంటే కప్పకు కోపం విడవ మంటే పాముకి కోపం అని శ్రీకృష్ణుడు ఈ విషయం మీద ఏమి మాట్లాడకుండా మౌనం వహించారు. తరువాత అందరు వధువారులని తీసుకొని ద్వారకకు వెళ్లిపోయారు. ఈ విధంగా రుక్మి చెడు స్నేహం వలన తన మరణానికి కొని తెచ్చుకున్నాడు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...