శ్రీకృష్ణా పరమ శివుడి యుద్ధం

 


అనిరుద్ధుడు వివాహం జరిగిన కొంత కాలం తర్వాత బలి చక్రవర్తి కి ఆరుగురు భార్యలు  వంద మంది సంతానం ఉండేవారు. అందులో ఒక భార్య పేరు వింధ్యావళి, మరొక భార్య పేరు కోటరా ఆమెకు బాణాసురుడు అనే కుమారుడు ఉన్నాడు. బాణాసురుడు మొదటినుంచి పరమ శివభక్తుడు. శివుడిని తప్ప మరొకరు దేవుని పూజించే వాడు కాదు. శివుడు అతని భక్తికి మెచ్చి ప్రతిరోజు కైలాసానికి వచ్చే వరాన్ని ప్రసాదించారు. అందుకని శివుడు ప్రతిరోజు తాండవం చేసే సమయంలో కైలాసానికి వెళ్లి మద్దెల వాయించడం ఇతర సంగీత పరికరాలను వాయించడం చేసేవాడు. శివుడు తాండవం అయిపోయిన తరువాత ఆయన పాదాల పైన పువ్వులు చల్లి పూజించేవాడు. ఒకసారి శివుడిని అతని పూజతో మెప్పించాడు. శివుడు ఆ పూజకి మెచ్చుకొని నీకు ఏమి కావాలో కోరుకో అన్నారు. అందుకు బాణాసురుడు దేవా జగన్నాథ పరమేశ్వర దేవతల అందరిచేత ప్రణామాలు అందుకునే వాడివి. నువ్వు వరాలు ఇవ్వడం తప్ప తీసుకోవటం తెలియని వాడివి. తలపై చందమామ ని పెట్టుకున్న వాడివి. మెడలో విషయాన్ని దాచి జనులను కాపాడిన వాడివి అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. మహాశివ నీ పాద సేవ ఎప్పుడూ నాకు ఉండేటట్టు ప్రసాదించు. శివుడు సంతోషించి నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. అందుకు బాణాసురుడు నాకు వెయ్యి చేతులని ప్రసాదించు ఈ వెయ్యి చేతులు నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నాకు రావాలి. అంతేకాకుండా లోకంలో నన్ను ఎవరూ ఎదిరించే లేని బలం నాకు ప్రసాదించు అని కోరాడు. శివుడు తధాస్తు అన్నారు పరమేశ్వరుడు భోలాశంకరుడు గనుక ఇంకా ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అందుకు బాణాసురుడు ఈరోజు నుంచి నువ్వు నీ భార్య పరివారంతో నా గుమ్మానికి కాపలా కాయ్ ఇదే నాకు కావలసిన వరం అని అడిగాడు. అందుకు శివుడు చిరునవ్వు నవ్వి సరే అన్నారు. నీకు విజయం వరించినా అంత కాలనీ చేతులు వేయి నీకు ఉన్నంతకాలం నీ కుటుంబానికి మేము కాపలా కాస్తాము. ఏ రోజైతే తొలగిపోతాయట ఆ రోజు నుంచి మేము మా కైలాసానికి వెళ్ళి పోతావ్ ఓ ఈ క్షణం నుంచి నీ కోట గుమ్మనికి కాపలా కాస్తాము అని వరం ఇచ్చారు. ఈ విధంగా శివుడు బాణాసురుడిని కోట గుమ్మానికి ఆరు సంవత్సరాలు కాపలా కాశారు. వాన శివుడు శివుడే నా గుమ్మం దగ్గర కాపలా కాస్తున్నారని రెచ్చిపోయి ఇంద్రుడు స్వర్గానికి వెళ్లి అతనిని జయించాడు. ఎక్కడ వీరులు అంటే వారిని ఓడించి చేయించారు. కొంతకాలానికి అతనికి యుద్ధం చేయవలసిన అవసరం లేకుండా అయిపోయింది. ఒకరోజు శివుడి దగ్గరకు వచ్చి   బాణుడు ఇలా అన్నాడు “ఓ పార్వతీపతీ! యుద్ధంలో నన్ను ఎదిరించి నిలిచి తన బాహుబలాన్ని ప్రదర్శింప జాలిన వీరాధివీరుడు ఒక్కడు కూడా ఈ భూమండలంలో ఎంత వెతికినా కనిపించడం లేదు. నీవు ప్రసాదించిన ఈ నా వెయ్యి చేతులు రణకండూతి తీర్చుకొనే ఉపాయం ఏదీ లేదయ్యా. ఈ కండూతి తీరని భారం ఎలా ఓర్చుకోగల నయ్యా? ఈశ్వరా!ఓ ఇందుధరా! నా ఈ ప్రచండ బాహుదండాల పరాక్రమకేళిని ఎదిరించగల వీరుడు ఈ ప్రపంచం మొత్తంలో నీవు తప్ప మరెవ్వరూ లేరు.” అంటున్న బాణుడి ప్రగల్భపు  పలికాడు.అప్పుడు శివుడు బాణాసురుడితో మూర్కుడ! తొందరపడకు నీజెండా అకారణంగా ఎప్పుడు భూమిపై కూలిపోతుందో, అప్పుడు నీకు నా అంత వాడితో నీ భుజాలు తెగే యుద్ధం జరుగుతుందిలే.” అని అన్నారు. ఆ పరమేశ్వరుని పలుకులు విని బాణాసురుడు తన కోరిక తీరబోతున్నందుకు చాలా సంతోషించాడు. తన సౌధానికి వెళ్ళిపోయాడు. బాణాసురునికి ఉషాకన్య అనే ఒక ముద్దుల కూతురు ఉంది. ఆమె గొప్ప సౌందర్యరాశి. ఆమె ఒకరోజు తన అంతఃపురములో నిద్రపోతున్నపుడు ఆమెకు కలలో అనిరుద్దునితో వివాహం అయినట్లు అతనితో ఉన్నట్లు కల వచ్చింది. ఆ సౌందర్య వంతుడిని ఇంత వరకు ఎప్పుడు చూడలేదు. కలలోంచి మేలుకొన్న ఉషకన్య కన్నుల వెంట బాష్పకణాలు జాలువారుతున్నాయి. ఆమెకు అది కల కాక వాస్తవ మేమో అనే భ్రాంతి కలిగింది. ఆ సౌందర్యవంతుని అందమైన ఆకారం కన్నుల ఏదుట కన్పిస్తున్నట్లే ఉంది. అప్పటి నుండి ఉష ఎవరితోనూ మాట్లాడక తనలో తానే భాధపడింది. ఈ విధంగా ఆ ఉషా కాలం గడుపుతున్న సమయంలో బలికొడుకు బాణాసురుడి యొక్క మంత్రి అయిన కుంభాండకుని కుమార్తె చంద్రరేఖ ఉషాకన్యకు ప్రాణసఖి, బహిఃప్రాణం. ఆమె ఇదంతా గమనించి ఆ ఇష్టసఖి ఉషా దగ్గరకు వచ్చి ఆమెతో ఇలా అన్నది.“ఓ ప్రియాసఖీ ! నీ ప్రవర్తన చూస్తుంటే ప్రియుడి కోసం దిక్కులు చూస్తూ వెతుకుతున్నట్లూ, ప్రాణేశ్వరుడికి దూరమై బాధ చెందుతున్నట్లూ, చేతికి చిక్కిన వానిని కోల్పోయి భ్రాంతిలో మునిగినట్లూ కనబడుతోంది.సఖీ! నా కంటె దగ్గర వారు నీకు ఎవరు ఉన్నారు చెప్పు. నాకు నీ మనసులోని విషయం చెప్పకపోతే ఒట్టు” అని చిత్రరేఖ పలుకగా ఉషాసుందరి కళ్ళలో సిగ్గుతో కూడిన చిరునవ్వుతో సఖీ! నాకొక కలవచ్చింది. ఆ కలలో
ఒక నవయువకుడు కనిపించాడు. తనతో వివాహం అయినట్టు తనతో వివరించినట్టు కలవచింది. అప్పటి నుండి నా మనస్సు అతనికోసం పరితపిస్తుంది అని ఏడుస్తూ చేపింది. చిత్రరేఖ ఉషాకుమారి సంతాపాన్ని గ్రహించి ఇలా అన్నది."ఉషా! ఎందుకు విచారిస్తావు. నా నేర్పరితనం అంతా చూపిస్తాను. దేవ, మానవ, యక్ష, కిన్నర, సిద్ధ, సాధ్య శ్రేష్ఠుల చిత్రపటాలను వ్రాసి నీకు చూపిస్తాను. వారిలో నీ మనసు దోచుకున్నవాడు ఎవరో నీవు గుర్తిస్తే, ఆ వెంటనే వాడిని నీ చెంతకు తీసుకుని వస్తాను.”ఈ విధంగా ఉషాకు చెప్పి ఒప్పించిన చిత్రరేఖ, తెల్లని పటాన్ని పొందుపరచింది. ఐదు రంగులను బంగారు వెండి పాత్రలలో నింపుకున్నది. కుంచెను చేత పట్టి, ఏకాంతప్రదేశానికి వెళ్ళి ముల్లోకాలలో ప్రసిద్ధిగాంచిన సౌందర్యవంతుల చిత్రాలను, వారి వారి గోత్రనామాలతోపాటు సిద్ధం చేసింది. ఆ పటాన్ని ఉషకు తెచ్చి చూపించి "ఈ చిత్రపటంలో లేనివాడు ఈ లోకంలో లేడు వీరిని గూర్చి వివరిస్తాను విను". అని చిత్రరేఖ ఇలా వీరు కమనీయ సంగీత విద్య యందు విశారదులైన గంధర్వ, కిన్నర. కింపురుషులు; వీరు నిత్యయౌవనులూ, స్వేచ్ఛావిహారులూ అయిన సిద్ధ, సాధ్య, చారణులు; ఇదిగో వీరు అమితమైన సౌఖ్యాలలో తేలియాడే అమరులు, మరుత్తులు, యక్షులు, రాక్షసులు; వీరు కామరూపులై గణుతిగాంచిన కళానిధులు నాగకుమారులు; వీరిని చూడు” అని చిత్రరేఖ చూపగా, ఉషాకు వారిలో కలలో కనిపించిన యువకుడు కనిపించ లేదు. అప్పుడు చిత్రరేఖ భూలోకవాసు లైన రాకుమారులను చూపించడం మొదలు పెట్టింది.వీరిని చూడు మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాధీశ్వరులు వీరు.ఇడుగో ఇతడు బృహదశ్వుని పుత్రుడు మగధరాజైన జరాసంధుడు. సఖీ! చంద్రవంశ ప్రదీపకు లైన పంచపాండవులు వీరు; ఇతడు ధర్మరాజు; ఇతడు భీముడు; ఇతడు అర్జునుడు; వీరిద్దరూ నకుల సహదేవులు; ఈ పాండవులు బ్రాహ్మణభక్తిపరులు; సత్యవ్రతులు; భుజబలసంపన్నులు; విజయశీలులు; బుద్ధిమంతులు; యుద్ధరంగంలో ఆరితేరిన వీరశిరోమణులు.ఇతడు సోదరులతో ఉన్న సుయోధనుడు.చిత్రరేఖ, యాదవవంశస్థులైన శూరసేనుడు, వసుదేవుడు, ఉద్ధవుడు మొదలైనవారిని కూడా చూపించింది.ఉషా! శరత్కాల మేఘం, శంఖం, ఘనసారం, చంద్రుడు, చందనం వంటి వర్ణంతో శోభిస్తున్న ఈ వీరుడు బలరాముడు; ఇతడు ఉత్తమ నాయకుడు; ప్రమత్తులైన శత్రురాజులు అనే అరణ్యాల పాలిట అగ్నిదేవుని వంటివాడు; ప్రలంబుడనే దైత్యుని సంహరించిన మహావీరుడు; కామపాలుడు; ఇతడే హలాయుధుడు అయిన యదువంశశేఖరుడు.ఇటుచూడు ఇతడు శ్రీకృష్ణుడు; మనోహరగాత్రుడు; పద్మనేత్రుడు; పావనచరిత్రుడు; సత్యసంకల్పుడు; దుష్టరాక్షసవిరోధి; శివునికి సైతం ఆరాధ్యుడు; శేషశయనుడు; కౌస్తుభమణిధారి; గంభీరభాషణుడు; ఆశ్రితజనపోషణకుడు; నీలమేఘశ్యాముడు; పీతాంబరుడు; వేదవేద్యుడు; సుజనవిధేయుడు; తీర్థపాదుడు; జయశీలుడు; సుగుణాలవాలుడు.ఇతడు రుక్మిణీ సుతుడు ప్రద్యుమ్నుడు తమ్మెదల నారి సారించి వదలిన పుష్పబాణాల దెబ్బతో బ్రహ్మాది దేవతలనే భయపెట్టగలిగిన మన్మథుని అవతారమే ఈ ప్రద్యుమ్నుడు.”ఈలాగున చిత్రరేఖ యాదవవీరులను చూపించే సమయంలో కుమారుడైన ప్రద్యుమ్నుడిని చూసి తనకు కలలో కనిపించినవాడు ఇతడే అని అనుమానించింది. కాని పిమ్మట చిత్రరేఖ చూపించిన పద్మనేత్రుడూ, నవమన్మథాకారుడూ అయిన అనిరుద్ధుడిని చూసి సంతోషంతో ఇలా అన్నది. ఇతనే నా కలలోకి వచిన రాకుమారుడు అతని గురించి ఇంకా  వివరాలు చెప్పు అని ఉషాసుందరి చిత్రరేఖను అడిగింది. ఆమె ఉషాసుందరికి ఆ సుకుమారుడి వివరాలు ఇలా తెలిపింది “సఖీ! ఇతడు యాదవవంశ నిండుచంద్రుడు; శ్రీకృష్ణుడి మనుమడు; ఉదారచరిత్రుడు; సింహపరాక్రముడు; శత్రుసైన్యం అనే చీకటి పాలిటి సూర్యుడు; ఇతని పేరు అనిరుద్ధుడు.”చిత్రరేఖ ఇలా చెప్పి, “నేను వెంటనే వేగంగా వెళ్ళి ఈ కుమారరత్నాన్ని తీసుకుని వస్తాను. అంతవరకూ నీవు విచారించకుండా ఉండు.” అని ఆ క్షణంలోనే ఆకాశమార్గాన బయలుదేరి ముందుకు వెళ్ళిశ్రీకృష్ణుడి పట్టణం ద్వారకను చేరింది. చిత్రరేఖ ఆ పట్టణ సౌందర్యానికి సంతోషించింది. రాత్రి సమయంలో మారువేషంలో ద్వారకలో ప్రవేశించింది. స్త్రీల మణిమంజీరాలతో మారుమ్రోగే సౌధాలతో స్వర్గాన్ని తిరస్కరించే ఆ ద్వారకాపట్టణంలో, బంగారు కుంభాలతో గూడిన xxvvరాజప్రాసాదం మీద, మణిదీపాలతో ప్రకాశిస్తున్న చంద్రకాంత శిలాభవనంలో, చంద్రకాంతిని ధిక్కరించే హంసతూలికాతల్పం మీద నిద్రిస్తున్న అనిరుద్ధుడి చెంతకు చేరింది. తన యోగవిద్యా నైపుణ్యంతో అతడిని ఎత్తుకుని మనోవేగంతో శోణపురం వచ్చింది. వచ్చి ఆ బాణాసురుని కుమార్తె ఉషాసుందరి పాన్పు మీద అనిరుద్ధుడిని పరుండ బెట్టింది. అలా చేసి ఉషాబాలతో చిత్రరేఖ ఇలా అన్నది.అనిరుద్ధ కుమారుడు ఇతనే. అప్పుడు ఉష సఖి! నీవు నాకు చాలా సహాయం చేసారు. నా దుఃఖన్ని పోగొటవు. నీకు క్రితజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఉషాబాల చిత్రరేఖను తన ఇంటికి పంపింది. పరపురుషులు ప్రవేశింపరాని ఆ అంతఃపురములో అనిరుద్ధుడు నిద్రమేల్కొని ఆ ఉషాసుందరిని చూసాడు. జరిగినది ఉష అనిరుద్దుడికి చేపింది. అప్పటి నుండి మూడవ కంటికి కనపడకుండా అనిరుద్దుడు ఉషతో ఉండిపోయాడు.అలా కొంత కాలం గడిచిన తరువాత ఉష గర్భం ధరించింది. ఈ విషయం తెలుసుకున్న చెలికతెలు వెంటనే భాణాసురుడి దగరకు వేళారు.“ఓ ప్రభూ! దానవేంద్రా! కుమారి అంతఃపురాన్ని మేము జాగ్రత్తగా  కావలికాస్తూ ఉండగా, దోమ అయినా లోపలికి వెళ్ళడం కష్ట సాధ్యమే..ప్రభూ! ఈ పరిస్థితిలో, అదేమి కనికట్టో ఏమిటో జాగ్రత్తగా కాపాలా కాస్తున్న మాకు ఎవరికి తెలియదు కాని. నీ కుమార్తె గర్భం ధరించింది” అని చెప్పగానే విని బాణాసురుడికి కోపం వచ్చింది. తన కత్తిని ధరించి ఆగ్రహావేశాలతో అత్యంత వేగంగా అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ అంతఃపురంలో అనిరుద్ధుడు విలాసంగా జూదము ఆడుతుండాగా ఆ రాక్షసరాజు చూసాడు. విపరీతమైన కోపంతో మండిపడుతూ ఆ దేవద్వేషి బాణుడు భటులతో “ఈ మానవాధముడిని బంధించండి! కొట్టండి!” అని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షసభటులు ఆయుధాలతో అనిరుద్ధుని బంధించడానికి వెళ్ళారు. ఆ అనిరుద్దుడు తన చేవ, బల, దర్పములు చూపుతూ అనివార్య శౌర్యసాహసాలతో ఇనుపకట్ల గుదియను చేపట్టి, ప్రళయకాల భైరవుడిలా మహోగ్రంగా విజృంభించి, మిక్కిలి పోరాట పటిమతో దానవసేనను ఎదిరించాడు. తన శక్తియుక్తులను శౌర్యధైర్యాలనూ ప్రదర్శించాడు. ఆ వీరుడితో యుద్ధం చేయలేక దైత్యసైనికులు రణరంగం నుండి వెనుదిరిగి పారిపోయారు. చివరికి బాణాసురుడు శౌర్యక్రోధాలతో అనిరుద్ధుని ఎదిరించి భీకర యుద్ధం చేసాడు. ఈవిధంగా బాణాసురుడు కోపంతో విజృంభించి, వంటినిండా నాటిన బాణాలతో ఉన్న అయిన అనిరుద్ధుడిని నాగపాశంతో బంధించాడు. తన ప్రియుడైన అనిరుద్ధుడిని తన తండ్రి ఈవిధంగా బంధించటం చూసిన ఉషాకాంత శోకసంతప్త హృదయరాలైంది. ఇంతలో అదే సమయంలో, ఏ కారణం లేకుండానే బలంగా వీచిన గాలిదెబ్బకే నీలవస్త్రంతో సువిశాల మైన బాణాసురుని జెండా భయంకర ధ్వని చేస్తూ నేలకూలింది. అలా పడిన తన జెండాకొయ్యను చూసిన ఆ దానవరాజు సంతోషపడి, “ఆ మహేశ్వరుడు పలికిన మాటలు నిజమయ్యే సమయం వచ్చింది. ఇక తనకు తగిన వాడితో పోరు దొరుకుతుం” దని భావించి ఎంతో ఆశక్తితో ఎదురుచూడసాగాడుఆ సమయంలో అక్కడ ద్వారకలో అనిరుద్ధుడు మాయమై నందుకు యాదవులు అంతా విచారించారు. వారికి నాలుగు నెలల గడచినా అనిరుద్ధుడిని గురించి ఏ వార్తే తెలియ లేదు. అలా అనిరుద్ధుని జాడకై యాదవులు ఎదురుచూస్తున్న ఆ సమయంలో మహానుభావుడు నారదమునీంద్రుడు, అపార దయాసముద్రుడు శ్రీకృష్ణుడిని పూజించే కుతూహలంతో ద్వారకకు విచ్చేసాడు. అప్పుడు శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన మణులతో విశేషంగా నిర్మింపబడిన ఆ దివ్య సుధర్మసభ యందు యదు వృష్టి భోజాంధక వీరులతో కొలువుతీరి ఉన్నాడు. అప్పుడు విచ్చేసిన నారదమునీంద్రునకు శ్రీకృష్ణుడు వెంటనే లేచి ఎదురు వెళ్ళాడు. అర్ఘ్యపాద్యాదులతో పూజించి బంగారు ఆసనంపై ఆసీనుడిని చేసాడు. పిమ్మట నారదమునీంద్రుడు పురుషోత్తముడిని స్తుతించి అనిరుద్ధుడి వృత్తాంతం అంతా వివరించాడు. అనంతరం పుండరీకాక్షుని చెంత సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అటుపిమ్మట శ్రీకృష్ణుడు ఒక శుభముహుర్తంలో బాణాసురునిపై దండయాత్ర చేయడానికి ప్రయాణభేరి వేయించాడు. సైన్యాన్ని సిద్ధం చేయించి, తాను చతురంగబలాలతో యుద్ధరంగానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. శైబ్యము, సుగ్రీవము, మేఘ పుష్పకము, వలాహకము అనే నాలుగు గుఱ్ఱాలను కట్టిన రథాన్ని సిద్ధం చేసి దారుకుడు తీసుకుని వచ్చాడు; సూర్యుడు ఉదయ పర్వతాన్ని ఆరోహించినట్లు, శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించాడు. బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు మొదలైన యాదవ వీరులు,  శత్రువీరులను అణచివేయాలనే అఖండ బలోత్సాహాలతో చతురంగ బలాలను సమకూర్చుకుని యుద్ధభేరి మ్రోగించారు. ఆ భేరీల ధ్వనితో శ్రీకృష్ణుని రథం వెంట బయలుదేరిన పన్నెండు అక్షౌహిణుల సైన్యం  బయలుదేరింది.




ఈ విధంగా పయనమైన యదువీరులు కొన్నాళ్ళకు శోణపురం చేరి, పొలిమేర దాటారు. యాదవవీరులు అత్యుత్సాహంగా శోణపురంలోని నదులను, సరోవరాలను, ఉద్యానవనాలను, యజ్ఞవాటికలను చిందరవందర చేశారు; అగడ్తలను పూడ్చివేశారు; యంత్రాలను చెడగొట్టారు; కోటలను పడగొట్టారు; గోపురాలను కూలద్రోశారు; సౌధాలను, ప్రాకారాలను నేలకూల్చారు; కవచాలు విరగగొట్టారు. ఈ ప్రకారంగా యాదవవీరులు శోణపురాన్ని చుట్టుముట్టి రకరకాలుగా వేధిస్తూ విజృంభించారు. అది చూసిన బాణుడు మిక్కిలి ఆగ్రహంతో సమర సన్నాహంచేసి విజృంభించి యుద్ధభేరి వేయించాడు. పరమేశ్వరుడు బాణాసురుని తన కన్నకొడుకుల కన్నా అధికంగా అభిమానిస్తాడు. కనుక, బాణుని పక్షాన యుద్ధం చేయాడానికి ప్రమథులు, గుహుడూ, తన అనుచర భూతకోటి వెంటరాగా భయంకరమైన శూలాన్ని ధరించి బయలుదేరాడు. నందీశ్వరునిపై ఎక్కి శంకరుడు యుద్ధరంగానికి వచ్చాడు. నందీశ్వరుని కాలిగిట్టల తాకిడికి పైకిలేచిన దుమ్ము సూర్యబింబాన్ని క్రమ్మివేసింది; తోక కదలిక వలన పుట్టిన గాలిదెబ్బకు మేఘాలు చెదరిపోయాయి; వాడి కొమ్ముల ధాటికి బ్రహ్మాండభాండం బ్రద్దలయింది; ఖణిల్లని విలాసంగా వేసిన రంకెకు రోదసీకుహరం దద్దరిల్లింది; మెడలోని గంటల గణగణ ధ్వనులకు సర్వదిక్కులూ పెటపెటలాడాయి. పరమశివుడు ఇలా బయలుదేరి యుద్ధోత్సాహంతో ప్రతిపక్షంతో తలపడ్డాడు. అప్పుడు ఇరుపక్షాలవారికీ ద్వంద్వయుద్ధం జరిగింది. ఆ పురాతన యోధుల యుద్ధాన్ని చూడడానికి బ్రహ్మాది దేవతలు, మునీంద్రులు, యక్ష, రాక్షస, సిద్ధ, చారణ, గంధర్వ, కిన్నరాదులు తమ తమ విమానాలు ఎక్కి ఆకాశంలో గుమికూడారు. అప్పుడు శివ కేశవులూ; కుమార ప్రద్యుమ్నులూ; కూపకర్ణ కుంభాండులూ; బలరాముడూ సాంబుడూ; బాణనందనుడు బలుడూ బాణసాత్యకులూ; ఒండొరులతో తలపడ్డారు. రథికులు రథికులతోనూ; అశ్వికులు అశ్వికులతోనూ; గజారోహకులు గజారోహకులతోనూ; పదాతులు పదాతులతోనూ యుద్ధం ప్రారంభించారు. ఖడ్గాల రాపిడికి నిప్పులు రాలుతున్నాయి; సింహనాదాలతో, ధనుష్టంకారాలతో, ఏనుగు ఘీంకారాలతో, గుఱ్ఱాల సకిలింపులతో, పటహము భేరి కాహళము మృదంగము శంఖమూ మున్నగు వాయిద్యాల సంకుల ధ్వనులతో బ్రహ్మాండం దద్దరిల్లి పోయింది. శ్రీకృష్ణుడు సింహనాదంచేసి శార్జ్గమనే తన ధనస్సును ఎక్కుపెట్టి, బాణవర్షాన్ని కురిపించి, యుద్ధవిశారదు లైన ప్రమథగణాలనూ, భూత, పిశాచ, ఢాకినీ వీరులను దిగ్భ్రాంతి చెంది పారిపోయేలా చేసాడు. ఇలా బాణప్రయోగం చేసి విజృంభించిన శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని సహించలేక, పరమేశ్వరుడు నిప్పులు క్రక్కే శరపరంపరలను పీతాంబరుడైన కృష్ణుడిమీద ప్రయోగించాడు. ఆ బాణాలు అన్నింటిని, మధ్యలోనే శ్రీకృష్ణుడు చూర్ణం చేసాడు. పరమశివుడు, పరిస్థితిని గమనించి, త్రిలోకపూజ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు కూడ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని మరలించాడు. ఇది చూసిన దేవేంద్రాది దేవతలు ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుని స్తుతించారు. మిక్కిలి కోపంతో పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని వింట సంధించాడు. చక్రాయుధుడు లోకభయంకరమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పాశుపతాన్ని మరలించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పరమశివుని అస్త్రాలు అన్నింటినీ రూపుమాపాడు. పరమేశ్వరుడు నిరుత్సాహం చెందాడు. ఆ సమయం కనిపెట్టి జయశీలి అయిన శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. అలా ప్రయోగించడంతో ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావం వలన శరీరం స్వాధీనం తప్పి, శంకరుడు నందీశ్వరుని మూపురంపైకి వ్రాలిపోయాడు. శివుడు స్పృహ తప్పుట చూసి, చక్రధారి అయిన కృష్ణుడు శత్రుసైన్యాన్ని శరపరంపరలతో చిందరవందర చేసాడు. కొందరిని గదాఘాతాలతో తుత్తుమురు చేసాడు. ఈవిధంగా శత్రుసైన్యాన్ని హతమార్చాడు. సమయంలో ప్రద్యుమ్నుడు అనివార్య శౌర్యంతో కుమారస్వామిని ఎదుర్కున్నాడు. పట్టుదలతో తీవ్రమైన బాణాలను ప్రయోగించాడు. అంతట, నెత్తురు ముద్దగా మారిన కుమారస్వామి శత్రువులు సింహనాదాలు చేస్తుండగా యుద్ధరంగం నుండి పరాజితుడై నెమలివాహనం మీద వెనుదిరిగాడు. శత్రు భయంకరుడైన సాంబుడు విజృంభించి తీవ్రక్రోధంతో వాడి బాణాలను ప్రయోగించగా, బాణుడి కొడుకు బెదరి శౌర్యం కోల్పోయి శత్రువీరులు హేళనచేస్తుండగా పలాయనం చిత్తగించాడు. పరాక్రమశాలియైన బలరాముడు వజ్రాయుధంతో సమానమైన తన రోకలిని చేపట్టి, కుంభాండక కూపకర్ణులను ఎదురుకొన్నాడు. ఆ ఆయుధం దెబ్బలకు వారిద్దరూ నెత్తురు కక్కుకుని అసువులు వీడారు. అప్పుడు బాణాసురుడు మిక్కిలి కోపంతో తన రథాన్ని ముందుకు నడిపించి, సహస్ర బాహువులు ఉన్నాయనే అహంకారంతో, శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. బాణాసురుడు తన ఐదువందల చేతులతో ఐదువందల ధనుస్సులను ధరించి తక్కిన ఐదువందల హస్తాలతో రెండేసి చొప్పున బాణాలను సంధించబోతుంటే, అంతలోనే, శ్రీకృష్ణుడు అవక్రవిక్రమంతో విజృంభించి ఆ ధనుస్సులను ధ్వంసం చేసాడు; సంకోచించకుండా సారథిని సంహరించాడు; బాణుని రథాన్ని నుగ్గునుగ్గు గావించాడు. అలా చేసిన శ్రీకృష్ణుడు, ప్రళయకాలం నాటి మేఘగర్జనం అంత గట్టిగా తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. శ్రీకృష్ణుని భయంకర పరాక్రమానికి దైన్యము చెంది, బాణాసురుడు ఏమీచేయలేక భయపడగా సమయంలో బాణాసురుడు  యాదవులు పరిహసిస్తుండగా  తన పట్టణానికి పారిపోయాడు. అప్పుడు భూతగణాలు కూడా యుద్ధరంగం వీడిపోయాయి. మూడు శిరస్సులతో; మూడు పాదాలతో; తీవ్ర క్రోధంతో; శివజ్వరం భయంకర ఆకారంతో వచ్చింది. దానిని చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, వైష్ణవజ్వరాన్ని ప్రయోగించాడు. ఆ శైవవైష్ణవ జ్వరాలు తమ తమ శక్తిసామర్థ్యాలతో ఘోరంగా పోరాడాయి. ఆ సంగ్రామంలో వైష్ణవజ్వర తాకిడికి శివజ్వరం ఓడి పారిపోయింది. అప్పుడు దానిని వైష్ణవజ్వరం వెంబడించి తరమసాగింది. శివజ్వరానికి ఎటూ పారిపోవడానికి దిక్కుతోచక దుఃఖిస్తూ, పంకజాక్షుడైన కృష్ణుడి పాదాలపైపడి, ప్రణామంచేసి, నుదుట చేతులు జోడించి రక్షించమని ప్రార్థించింది. శివజ్వరం శ్రీకృష్ణుడిని ఇలా స్తోత్రం చేసింది. డైన కృష్ణుడు శివజ్వరంతో ఇలా అన్నాడు “నా పరాక్రమం అనన్య నివారణమని గమనించి నీవు ఆర్తితో నా శరణం కోరావు. కనుక, నా జ్వరం నిన్నుబాధింపదు. అని ఇంకా ఇలా అన్నాడు “ఈ శైవ వైష్ణవ జ్వరాల వివాద వృత్తాంతాన్నీ; నీవు నన్ను శరణుకోరిన విధానాన్ని; మనస్సులో స్మరిస్తారో, అటువంటి పుణ్యాత్ములకు శీతోష్ణ జ్వరాది తాపాలు కలుగవు” అని అనగా మహేశ్వర జ్వరం మిక్కిలి సంతోషించి చక్రాయుధుడైన శ్రీకృష్ణునకు సాష్టాంగనమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇంతలో, అక్కడ బలికుమారుడైన బాణాసురుడు మళ్ళీ యుద్ధసన్నద్ధుడై బయలుదేరాడు. బలిపుత్రుడు బాణుడు తన భుజబలం ద్యోతకము అవుతుండగా ముట్టడించి, ఒకే సారి వేయిచేతులతో శ్రీకృష్ణుడిపై వాడి పరమ భయంకరమైన బాణాలను ప్రయోగించాడు. మురాంతకుడు కృష్ణుడు ఆ బాణవర్షాన్ని లెక్కచేయకుండా తన వాడియైన అర్ధచంద్ర బాణాలతో వాటిని అన్నింటిని త్రుంచి వేశాడ. అలా బాణాసురుడి అస్త్రాలు అన్నింటిని త్రుంచి వేసిన సమయంలో శ్రీకృష్ణుడు సుదర్శనచక్రాన్ని బాణాసురుడి మీద ప్రయోగించాడు. శ్రీ కృష్ణుడు సుదర్శనాన్ని బాణాసురుడి మీద ప్రయోగించగా, అది రత్నఖచితా లైన ఆభరణాలతో శోభిస్తూ, మదగజతుండాలలాగ వెలుగొందుతున్న బాణాసురుని వేయిచేతులలో నాల్గింటిని మాత్రం వదలి తక్కిన వాటిని తోటమాలి అరటిచెట్లను నరకివేసినట్లు నరికేసింది. పరమేశ్వరుడికి బాణాసురుడంటే ఎంతో దయ. అందుచేత, ఆయన అతనిని రక్షించడం కోసం లోకనాయకు డైన శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి, పురుషసూక్తం పఠించి, నమస్కరించి, పద్మాక్షుడిని స్తుతించాడ.శ్రీకృష్ణుడు సంతోషించి చిరు నగవుల మోముతో ఇందురేఖాధరుడైన శివుడితో ఇలా అన్నాడు “ఓ శంకరా! నీవు సత్యము పలికావు. నీకు ఇష్టమైన కోరిక కోరుకో తీరుస్తాను. ఈ బాణాసురుడు అవధ్యుడు. ఎందుకంటే, నా భక్తుడైన ప్రహ్లాదుని వంశంవాడు. నీ వంశస్థులను సంహరించను అని ప్రహ్లాదుడికి నేను వరం ఇచ్చాను. అందువలన ఇతడు చంపదగినవాడు కాదు. అందువలన ఇతనిని క్షమించాను. కానీ సమస్త భూభారాన్ని మోస్తున్నాను అని అహంకరించే వీడి భుజగర్వాన్ని అణచివేయక తప్పదు. అందుచేతనే, ఇతనికి నాలుగు చేతులు మాత్రం ఉంచి, తక్కిన హస్తాలను ఖండించాను. ఈ బాణాసురుడు నీ భక్తులలో అగ్రేసురుడుగా స్తుతింపబడుతూ, జరామరణాది భయాలు లేకుండా జీవిస్తాడు.” ఈ మాదిరి శ్రీకృష్ణుడు అనుగ్రహించడంతో పరమేశ్వరుడు ఎంతో ఆనందించాడు. బాణాసురుడు ఈ విధంగా రణరంగం అనే యజ్ఞవేదికపై కృష్ణుడనే దేవుడి సన్నిధిలో భగభగమండుతున్న చక్రాయుధ జ్వాలలతో తన హస్తాలనే సమిధలను రక్తధారలనే ఆజ్య ధారలతో హూంకారాలనే మంత్రాలతో వేల్చి పరిశుద్ధుడు అయ్యాడు. విజ్ఞానదీపం ప్రకాశించడంతో భుజగర్వమనే అంధకారం తొలగింది. నిరంతర పరమేశ్వర ధ్యానానురక్తుడు అయిన బాణుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరదానంతో మనసు నిండా ఆనందించాడు. గోవిందుడి పాదపద్మాలకు నమస్కారాలు చేశాడు.అటుపిమ్మట, బాణుడు తన నగరానికి వెళ్ళి ఉష అనిరుద్ధులకు సంతోషంతో వస్త్రాభరణాలను, దాసీజనులను, విలువైన వస్తువులను ఇచ్చాడు.బంగారురథం మీద ఉషా అనిరుద్ధులను ఎక్కించి, మిక్కిలి వైభవంతో తీసుకుని వచ్చి శ్రీకృష్ణుడు సంతోషించేలా అప్పగించాడు. ఆ తరువాత, కృష్ణుడు  పరమ శివుని వద్ద సెలవు తీసుకుని, బాణాసురుడికి ఇక ఉండ మని చెప్పి. అత్యంత వైభవోపేతంగా పరివార సమేతుడై ఉషా అనిరుద్ధులను తీసుకుని పటహ, కాహాళ, తూర్యాదుల ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేలా మ్రోగుతుండగా ద్వారకానగరానికి బయలుదేరాడు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...