తిరుప్పావై

పాశురము 30

        వఞ్గక్కడల్ కడైన్ద మాడవనై క్కేశవనై

        త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళ్ళై యార్ శేన్ణిఱైఞ్ఙ

        అఞ్గప్పఱైకోణ్ణవాత్తై, యణిపుదువై

        పైఙ్గమలత్తణ్దెరియల్ పట్టర్ పిరాన్ కొదైశొన్న

        శజ్ఞత్తమిళ్ మాలై ముప్పుదుమ్ తప్పామే

        ఇఙ్గిప్పరిశురైప్పా రీరిరణ్దు మాల్వరైత్తోళ్

        శేఙ్గిణ్ తిరుముగుత్తు చ్చెల్వ త్తిరుమాలాల్

        ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తుఇంబరువరెమ్బావాయ్

        అణ్దాల్ తిరువడిగళే శరణమ్

అర్ధం :-

ఓడలుగల పాల సముద్రమును దేవతలకోసం మధించి, వారికి అమృతాన్ని ప్రసాదించినవాడును, బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు ఆలంకృతులై చేరి, మంగళాశాసనము చేసి, గోకులమునందు 'పఱై' అను వంకతో స్వామీ కై౦కర్యమును పొందారు.

వీరు పొందిన యీ కై౦కర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినట్టియును, తామర పూసల మాలలను ధరించిన పేరియాళ్ళార్ల (విష్ణుచిత్తుల) పుత్రికయైన గోదాదేవి (అండాళ్ తల్లి) సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగ కూడి అనుభవించిన ప్రబంధమై, ద్రావిడ భాషలో పాశురరూపంగా ప్రవహించింది.

ఈ ముప్పుది పాశురాలను ఒక్కటిని కూడా విడువకుండ యీ సంసారమున అనుసంధి౦చువారు గొప్ప పర్వతవలెనున్న నాల్గు భుజములును ఆశ్రిత వాత్సల్యముచే ఎఱ్ఱబారిన కనుదోయిగల శ్రీముఖమును. ఉభయ విభూతి ఐశ్వర్యములందునుగల శ్రియ: పతియొక్క సాటిలేని దివ్య కృపను పొంది, బ్రహ్మనందముతో కూడినవారై యుండగలరు. శ్రీ గోదా రంగనాథుల అవ్యాజకృపచే యీ 'తిరుప్పావై' ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున' శ్రీసూక్తిమాలిక' గ' ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్యవాత్సల్యమునకు యీ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజలు ఘటిస్తున్నాడు. 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...