తులసి

 తులసి మాత కథ 








గోలోకం శ్రీరాధ కృష్ణుల నివాసం. శ్రీకృష్ణుడు తన నుండి శ్రీధాముడిని సృష్టిస్తాడు. రాధాదేవి తన నుంచి తులసిని సృష్టిస్తుంది. తులసిదేవి రూపం రాధాదేవి రూపం ఒకలాగా ఉంటుంది. తులసి దేవి కూడా రాధ దేవి లాగానే శ్రీ కృష్ణుడిని ఆరాధిస్తుంది. శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకి మెచ్చి శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అయి ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అపుడు తులసీమత కోరుకునేటపుడు రాధాదేవి అక్కడికి వస్తుంది. తులసీమత శ్రీకృష్ణుడుని భర్తగా కావాలి అని కోరుకుంటుంది. శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకున్నారు. రాధాదేవి ఆ మాట విని కోపంతో నా భర్తనే కావాలి అన్నికోరుకుంటావా! నువ్వు రాక్షసుడికి భార్యవి అవుతావు అని అనిపిస్తుంది. దానికి తులసి దేవి రాధాదేవి పాదాలపై పడి వేడుకుంటుంది. దానికి రాధాదేవి నేను నిన్ను ఊరికే శపించలేదు. నీవల్ల మానవులకి మంచి జరుగుతుంది. ఇంకా నువ్వు అడిగిన వరం కూడా నెరవేరుతుంది. అని చెపుతుంది. 

           కొనాలకి తులసీదేవి భూలోకంలో  మానవ స్త్రీగా జన్మిస్తుంది. ఆమె పేరు బృంద. చిన్ననాటి నుంచి విష్ణుమూర్తిని భక్తిగా పూజిస్తుంది. యుక్త వయస్సు వచ్చిన తరువాత శంఖచూడుడు అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. ఆ శంఖచూడుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి నా భార్య పాతివ్రతగా ఉన్నతకాలం నాకు మరణం రాకూడదు అని వరం కోరుకుంటాడు. బ్రహ్మ తధాస్తు అంటారు. ఆ వరగర్వంతో లోకాలనన్నిటిని బాధిస్తాడు. దేవతలు ఆ బాధాభరించలేక బ్రహ్మదేవుని దగరకు వెళతారు. బ్రహ్మ వారిని తీసుకొని కైలాసానికి వెళతారు. పరమశివుడు వీరి బాధలను విని శంఖచూడుడీతో యుద్ధనికి వెళతాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వలన పరమేశ్వరుడు శంఖచూడుని వధించలేకపోతాడు. అపుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తిని సహాయం కోరుకుంటాడు. విష్ణుమూర్తి శంఖచూడుడి భార్య అయినా బృంద దగరకు శంఖచూడుడి రూపంలో వెళతాడు. అపుడు బృంద వచ్చింది నిజంగా తన భర్తే అనుకోని విష్ణుమూర్తికి పాదపూజచేసి తన భర్తేఅనుకొని ప్రేమదగరకు వెళుతుంది. విష్ణుమూర్తిని ముట్టుకోగానే బృంద పాత్రవత్యం పోతుంది. అక్కడ యుద్ధంలో పరమేశ్వరుని చేతిలో శంఖచూడుడు మరణిస్తాడు. వచ్చింది తన భర్త కాదు అని తెలుసుకొంటుంది. విష్ణుమూర్తిని కోపంతో నువ్వు నదిలో రాయివై పడియుండు అని శపిస్తుంది. విష్ణుమూర్తి నవ్వి నీ భర్త లోకాలని భాదిస్తునాడు. లోకానికి న్యాయం చేయటానికి నాకు ఈ ధారితప్పా వేరేది కనిపించలేదు. నువ్వి కిందటి జన్మలో తులసీదేవివి నివ్వు అపుడు నన్ను అడిగిన వరం నెరవేరింది. నువ్వు ఈ భూలోకంలో పవిత్రమైన చెట్టువై పూజలు అందుకొంటావు అని వరం ఇస్తారు. విష్ణుమూర్తి వరం వల్ల బృంద భూలోకంలో 108 రకాల తులసిచేట్టులుగా మారుతుంది. అలాగే ఆమె గొల్ల నుంచి ఉసిరి చెట్టు వస్తుంది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...