నరక చతుర్దశి

దితి, కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. హిరణ్యాక్షుడు బ్రహ్మకోసం తపస్సు చేసి వరాలు పొంది ఆ వరగర్వంతో అని లోకాలను హింసించేవాడు. ఒకనాడు హిరణ్యాక్షుడు భూమిని తీసుకొని సముద్రం లోపల తీసుకెళ్లి దాస్తాడు. విష్ణుమూర్తి భూమాతను కాపాడటానికి వరాహ అవతారం ఎత్తి హిరాణ్యాక్షుడుతో పోరాడి భూమాతను పైకి తీసుకువస్తాడు.  ఆ సమయంలో భూమాతకి విష్ణుమూర్తికి ఒక కుమారుడు జన్మిస్తాడు.  అతనిని చూసి విష్ణుమూర్తి భూమాతతో వీడు అసురసంధ్యలో జన్మించాడు కాబటి ఇతనికి రాక్షసలక్షణాలు వస్తాయి అని చెప్పాడు.  అందుకు భూమాత బాధపడి విష్ణుమూర్తిని వరం కొరుకుంటుంది.  ఇతను తండ్రి చెతిలో కాకుండా తల్లి చెతిలోనె మరణించేల వరం కొరుకుంటుంది.  విష్ణుమూర్తి వరం ఇస్తాడు.  అ బాలునికి నరకుడు అని నమకరణం చెస్తాడు.  అపుడు భూమాత మనసులో ఒక తల్లి కుమారుడిని చంపదుఅని అనుకుంటుంది. 

         తరువాత నరకుడిని జనకమహరాజుకి అపగించి విద్యబుద్దులు నేర్పమని అపగిస్తుంది. జనకమహరాజు అతనిని శక్తి వంతుడిగా  తయరుచెస్తాడు. కామాక్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యొతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగ భావిస్తు చక్కగా పూజచేసెవాడు.తన రాజ్యములోని ప్రజలందరిని ఎంతో చక్కగ పరిపాలించేవాడు.ఈ విధముగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. తర్వాత ద్వాపరయుగములో, అతనికి పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురునితో స్నేహము ఎర్పడుతుంది. అతని ప్రభవం వల్ల నరకుడులోని రక్షసత్వం భయటకు వస్తుంది. స్త్రీని తల్లిగా భావించటమేమిటి అని స్త్రీ ఒక విలాసవస్తువు మాత్రమే అని నూరి పోసాడు బాణాసురుడు. ఇక నరకాసురుడు అని రాజ్యల మీదకు దండెత్తు అక్కడ రాజకుమారిలను అపహరించేవాడు. మొత్తం 16000 మంది కన్యలను అపహరించాడు. లోకలను పిడిస్తు దేవలోకం మిద దండెతి ఇంద్రుడి సింహసనం దకించుకుంటాడు. ఇంద్రుడు శ్రీ కృష్ణుడికి మొరపెటుకునాడు.

         శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా యుద్ధనికి బయలుదేరుతాడు. నరకాసురుని శ్రీకృష్ణుడికి యుద్ధం జరుగుతుండగా సత్యభామ కృష్ణుడికి సహాయం చేస్తుంది. సత్యభామ చేతిలో నరకాసురుడు వధ జరుగుతుంది. తన చేతులతోనే తన కుమారుడిని చంపుకునేందుకు భూమాత విలపించు కనీసం తన కుమారుడి పేరునైనా గుర్తుపెట్టుకునేలా చేయమని వేడుకుంటుంది. అందుకు శ్రీకృష్ణుడు నరకుడు మరణించిన రోజు నరక చతుర్దశిగా ప్రకటిస్తాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...