నాగుల చవితి సందర్భముగా మనసా దేవి విశిష్టత

నాగుల చవితి సందర్భముగా మనసా దేవి విశిష్టత


మానసా దేవి ఈమె కశ్యపుని కుమార్తె. కశ్యప ప్రజాపతి కద్రువకి జన్మిస్తుంది. కద్రువ ఒకసారి ఆమెకు అందరూ మొగపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్ల ఉంటె బాగుంటుంది అనుకోని ఒక విగ్రహాన్ని తాయారు చేసి చూస్తుంది. అపుడే శివపార్వతులు ఆకాశంలో విహరిస్తుండగా శివుని తేజస్సు ఆ విగ్రహములో చేరి ఒక అమ్మాయిగా మారిపోతుంది. శివుని మనస్సు నుండి పుటింది కాబట్టి ఆమె పేరు మానస దేవి అని శివుని మానస పుత్రిక అని పేరు. కద్రువ మానస దేవి పుట్టాక ముందు తన పుత్రులను శపిస్తుంది. దానిని నివారించటానికి ఆమె జన్మించింది అని తెలుసుకుంటుంది. మానసా దేవి అవతరించటనికి కారణం ఒకప్పుడు భుమిపైన నాగుల బెడద విపరీతంగా ఉండేది. కాలు కదిపితే పాము తగిలేది. నాగుల బెడద పడలేక కొందరు మునులు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మతో మానవుల బాధలు చెపుకున్నారు. నాగజాతి కూడ కశ్యపుని సంతానమే అని తలచి బ్రహ్మ, కశ్యప ప్రజపతిని పిలిపించారు. మనవుల బాధలకు ఉపాయం చుడమని ఆజ్ఞాపించారు.

          తరువాత మానస దేవి ఆదేశానుసారం భూమిపై విచ్చలవిడిగా సంచరిస్తున్న వేలది నాగులు నాగలోకానికి తిరిగి వచ్చేశాయి.   

        ఆమె పుటిన కొన్నాళ్లకి తల్లితండ్రులకి నమస్కరించి శివుని కోసం తపస్సుకి వెళ్లిపోతుంది. ఆమె తపస్సుకి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె తపస్సుకి మెచ్చిన శివుడు ఆమె కొరినవిధంగా నాగులను అభరనాలుగా ధరించి నాగాజాతికి  సముచిత గౌరవం కల్పిస్తానని వరమిచాడు. తపస్సు వాళ్ళ దేహం నిరసించడంతో ఆమెని జరత్కారువు అని పిలిచారు. శివుడు మానస దేవితో కొన్నాళ్లకి నీకు జరత్కారువుతో వివాహం జరుగుతుంది. నీకు అస్తుకుడు అనే కుమారుడు పుడతారు. లోక కళ్యాణం జరిగినతరువాత నీవు మరల ఎక్కడికి వచ్చి మానస దేవిగా వెలిసి భక్తుల కోరికలు నెరవేరుస్తావు అని వరం ఇచ్చి అదృశ్యమవుతారు. (మనసా దేవి తపస్సు చేసిన ప్రదేశం హరిద్వార్లో ఉంది అక్కడే మనసా దేవి గుడి ఉంది.)

     మానసా దేవి తరువాత జరత్కారుడు అనే మహామునిని వివాహం చేసుకొని గృహిణిగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. కొంత కాలం గడిచాక వీరికి  ఒక కుమారుడు జన్మించెను. ఆతని పేరు ఆస్తీకుడు. ఇతడు శివుని కోసం తపస్సును చేసి శివనుగ్రహము చేత సర్వశస్త్ర విశారదుడు అయేను.

   తరువాతి కాలంలో జనమేజయుడు చేస్తున్నా  సర్పయాగాని ఆస్తీకుడు నిలిపి వేసాను. ఇతని వల్ల నాగజాతి రక్షించబడింది. తన కుమారుడు వలన మానసా దేవి జన్మధన్యమైంది.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...