ధనత్రయోదశి

          ధనత్రయోదశి ఆశ్వయుజమాస శుక్లపక్షము త్రయోదశి రోజు  వస్తుంది.  ఈ రోజునా లక్ష్మీదేవికి, కుబేరుడికి, ధన్వంతరికి పూజ చేస్తారు. 

                ధన త్రయోదశి అనేది యమధర్మరాజునకు ప్రీతికరమైన రోజు.ఈ రోజు ఆయనను పూజించడం వలన మరియు దీపం పెట్టడం వలన అపమృత్యు దోషాలు తొలగించి నరకలోక ప్రాప్త తొలగిపోతుంది.

              పూర్వకాలంలో హిమరాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు జన్మించాడు. రాజు సంతోషించి యువరాజు జాతకాన్ని చూపించటానికి రాజ్యంలో ఉన్న పండితులని పిలిపించారు. యువరాజు జాతకాన్ని చుసిన పండితులు ఈ బాబుకి అపమృత్యుదోషం ఉంది అని చెప్పారు. యువరాజుకు పెళ్లి ఆయన నాలుగోవరోజునే మరణిస్తాడు అని చెప్పారు. యువరాజుకు యుక్తవయసు రానేవచ్చింది. అతనికి రాజాకుమారిని ఇచ్చి వివాహం చేసారు. మహారాజు అందరి పండితులను పిలిపించి తన కుమారుడిని కాపాడమని వేడుకున్నారు. ఆరోజు రానేవచ్చింది. రాజకుమారి తన భర్త ప్రాణాలను కాపాడుకోవటానికి పెద్దలు చేపినప్రకారం ఆ రోజు ధన త్రయోదశి రోజున సాయంత్రం వేళ్ళ గుమ్మం ముందు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి వారి చుటూ బంగారం, వజ్రాల రాశులుగా పోసి రాత్రి అంత తను తనభర్త కలిసి భగవత్ కథలు వింటూ జాగరణ చేసారు. ఉదయం యమధర్మరాజు యువరాజు అతని ప్రాణాలను తీసుకోవటానికి వచ్చి ఆ దీపాల వెలుగులో అతనికి ఎవరు కనిపించక యమధర్మరాజు వెనక్కి తిరిగి వెళ్లిపోతారు. ఆ విధంగా ధనత్రయోదశిరోజు రాజకుమారి యువరాజు ప్రాణాలను కాపాడుకుంటుంది. 

         ఈ రోజు బంగారం కానీ వెండిగాని కొని లక్ష్మి దేవిని పూజ చేస్తే ఇంట్లో సిరిసంపదలు వెళ్లి విరుస్తాయి అని నముతారు.

        ధనత్రయోదశి రోజు ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. క్షిరసాగర మధనంలో ఈ రోజునే దేవవైద్యుడు ఆయన ధన్వంతరి బయటకు వచ్చారు. ఈ రోజునా ఈ స్వామిని పూజ చేస్తే ఆయుషు, ఆరోగ్యము, సిరిసంపదలు ప్రసాదిస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...