సుకన్య

          మనువంశములో శర్వాతి అనే రాజు ఉండేవాడు.  అతనికి ఇద్దరు పిల్లలు.  వారి కుమారుడు అనర్తుడు, కుమార్తె సుకన్య. సుకన్య అత్యంత సౌందర్యరాశి. ఆమె అందాన్ని చూసి ఆమె చెలికతెలు ఆమెను ఏ చక్రవర్తో వరించి వివాహం చేసుకుంటాడు అని చెప్పుకునేవారు.

        శర్వాతి రాజ్యానికి దగరలో ఒక వనము ఉంది. ఆ వనములో చ్యవనుడు అనే ముని ఒక వృక్షము కింద జగన్మాత అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నాడు. చ్యవనుడు తపస్సులో చాల ఏళ్ళు గడిచిపోయాయి. అతను పండు ముసలి అయిపోయాడు.

         ఒకరోజు శర్యాతి కుటుంబం పరివార సహితంగా వన విహారానికి వచ్చారు. వనం అందాలను చూస్తూ తలొక దిక్కు వెళ్లరు. 

        సుకన్య తన పరిచారికలతో కలిసి ఒకవైపు సంచరిస్తుండగా ఆమెకు చ్యవనుడు తపస్సు చేసుకుంటున్న వృక్షం కింద పుటలోనుంచి ఓoకారం వినిపించింది. అది ఏమిటో తెలుసుకోవటానికి సుకన్య చెలికతెలు వారిస్తున్నా వినకుండా పుటల్లోకి తొంగి చూసింది. అందులో మెరుస్తున్న చ్యవనుడి కళ్ళను చూసి మినిగూరు పురుగులు అనుకోని వాటిని దర్భతో పొడిచింది. ఆ భాదను తట్టుకోలేక చ్యవనుడు పుటనుంచి బయటకు వచ్చాడు. ముని ఎక్కడ శాపం ఇస్తాడోనని భయపడి సుకన్య చెలికతెలు మహారాజు దగరకు పరిగెత్తారు. విషయం తెలుసుకున్న రాజు వడివడిగా సుకన్య ఉన్నచోటికి వచ్చారు. శర్యాతి రాజు చ్యవనుడి పాదాలు పట్టుకొని "మునివర్యా మమ్మలిని క్షమించండి. నా కుమార్తె అమాయకురాలు తెలియక చేసింది. ఆమెను శెపించకండి, క్షమించండి" అని వేడుకున్నాడు. అప్పుడు చ్యవనుడు "శాపం ఇచ్చి నా తపస్సును ఖర్చు చేసుకొనే ముర్కుడిని కాదు. కానీ ఇపుడు నేను ముసలివాడిని అంధుడిని కూడా అయ్యాను. నా యోగక్షేమాలు ఎవరు చూస్తారు. ఈ అంధుడిని ఎవరు ఆదరిస్తారు. ఇకపై నా తపస్సును ఎలా కొనసాగించాలి" అని బాధపడాడు.

        ఇది విన సుకన్య ముని వద్దకు వచ్చి " మిములను నేను వివాహం చేసుకుంటాను. పత్ని ధర్మాలను నెరవేరుస్తూ నేను చేసిన తప్పులకు ప్రాయశ్చితం చేసుకుంటాను" అని వేడుకుంది. మహారాజు కూడా అంగీకరించి మునిని వేడుకున్నారు. చ్యవనుడికి సుకన్యకు మహారాజు వివాహం చేసారు. వారు ఆశ్రమవాసానికి వేళారు. 

           సుకన్య పతివ్రత ధర్మాలను నెరవేరుస్తూ చ్యవనుడికి సపర్యలు చేస్తూ జీవనం సాగిస్తుంది. కొంతా కాలం తరువాత సుకన్య ఆశ్రమం ప్రక్కన ఉన్న సరస్సుకి స్నానమాచరించటానికి వెళుతుంది. అక్కడ ఒక వృక్షం కింద అశ్వినీదేవతలు కూర్చొని ఉంటారు. అత్యంత సౌందర్యరాశి అయినా సుకన్యను చూసి మోహించి ఆమె గురించి తెలుసుకుందామని ఆమె వద్దకు వెళ్లి అడుగుతారు. అపుడు ఆమె వృతాంతం చెపుతుంది. 

       "సుకన్య నీ గాధ వింటే మాకు జాలి కలుగుతుంది. మేము నీకు సహాయం చేస్తాము. నీ భర్తకి పోయినా కళ్ళు తిరిగివచ్చి తిరిగి అతనిని యవ్వనవంతుడిని చేస్తాము. కానీ"....అని ఆగారు. ఆగారు ఏమిటి స్వామి చెప్పండి అన్నది. అశ్వని దేవతలు అందుకు మాకు ప్రత్యుపకారంగా నిను చూస్తుంటే పతివ్రత ధర్మాలను నెరవేరుస్తున్నావు. నీవు తలుచుకుంటే మమ్మలిని శెపించగలవు.కానీ మేము చెప్పేది ప్రశాంతంగా వినుము అన్నారు. చెప్పండి స్వామి అన్నది. నీ భర్తకి కళ్ళు, యవ్వనం తెపిస్తాము అందుకు ప్రత్యుపకారంగా నీవు మాలో ఒకరిని వరించాలి అన్నారు. అందుకు సుకన్య నా పాతివ్రత్య దానం వలన నా భర్తకు మంచి జరుగుతుంది అంటే నేను సంతోషంగా చేస్తాను అంటుంది. అయితే వెళ్లి నీ భర్తకు విషయం చెపి అతని అనుమతి తీసుకొని అతనిని ఇక్కడికి తీసుకురమంటారు.

         సుకన్య వెళ్లి తన భర్తకు విషయం చెపుతుంది. ఇది విన చ్యవనుడు ఇది ఏదో ఆ జగన్మాత పరీక్షా వాలే ఉన్నది. అని చ్యవనుడు అంగీకరించి ఆమెతో సరస్సు వద్దకు వస్తారు. సుకన్యను ఒడ్డునే ఉండమని అశ్వనీదేవతలు చ్యవనుడిని తీసుకొని సరస్సులో మునుగుతారు. క్షణా కాలం తరువాత ఆ సరస్సు నుంచి ఒకేలా ఉన్న ముగ్గురు దివ్యతేజోమూర్తులు భయటకు వస్తారు. 

          సుకన్య మాకు మాట ఇచ్చిన ప్రకారం మా ముగ్గురిలో ఒకరిని నీవు వరించాలి అంటారు. సుకన్య తన మనసులో ఆ జగన్మాతను ప్రార్ధిస్తుంది. అమ్మ నీవే నను రక్షించాలి వీరిలో నా భర్తను నువే చూపించి నను రక్షించు మాత అని ప్రదించింది. జగన్మాత సుకన్య ప్రార్ధనలు విని "సుకన్య నీ పతి భక్తికి మెచ్చాను. నా మాయ ఒక క్షణకాలం పాటు ప్రసరించి నీ భర్తకాక మిగిలిన వాళ్ళు కాంతిహినంగా మారుతారు అప్పుడు నీ భర్తను నీవు గుర్తించి అని పలుకుతుంది. సుకన్య కళ్ళు తెరచి చూసేసరికి ఒక క్షణం కాంతిహీనం అవుతుంది. ఆ క్షణా కాలంలో సుకన్య తన భర్తను వరిస్తుంది. అశ్వని దేవతలు వారి నిజరూపాలని ధరించి ఆశీర్వదిస్తారు.




 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...