శ్రీకృష్ణ బలరాము విద్యాబ్యాసం

 శ్రీకృష్ణ బలరాము విద్యాబ్యాసం


దేవకీవసుదేవులు శ్రీకృష్ణ బలరాముల కి ఉపనయనం చేయటానికి వారి పురోహితుడైన గర్గా ఆచార్యుని పిలిపించారు. గర్గ చార్యుల వారు శ్రీకృష్ణ బలరాముల ఉపనయనం చేసి యజ్ఞోపవీతాన్ని ధరింపచేశారు. అప్పటి నుండి శ్రీ కృష్ణ బలరాముల కి ధ్విజరాజ తత్వం వచ్చింది . ఆ రోజు నుంచి సంధ్యావందనం నేర్చుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణ బలరాములు దేవకీవసుదేవుల తో మేము ఇప్పటివరకు విద్యను అభ్యసించే లేదు. అందుకని మేము విద్యాభ్యాసం కోసం కాశీలోని సాందీప మహాముని దగ్గరకు వెళ్తాను. అందుకు దేవకీవసుదేవులు కూడా అంగీకరించి పంపారు. ఆ సాందీప మహాముని ఉజ్జయని లో జన్మించారు. ఆయన పొట్టకూటికోసం కాశీకి వచ్చి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని విద్య కోసం వచ్చే విద్యార్థులకు విద్యను నేర్పిస్తూ వారికి వసతి భోజనం కల్పించేవారు. రోజుకి పది వేల మందికి అన్నసంతర్పణ చేస్తుండేవారు. ఆయన దగ్గర విద్య నేర్చుకునేవారిని దండం అడిగేవారు కాదు. ఎవరైనా అడగకుండా ఇస్తే తీసుకొని ఆశ్రమాన్ని నిర్వహించేవారు. ఈ సాందీప మహాముని ఒక నియమం ఉంది. ఆయన దగ్గరికి విద్య కోసం వచ్చే వారిని ఒక సంవత్సరంపాటు పరీక్షించి వారికి ఏ విద్య పైన ఆసక్తి ఉందో ఆ విద్యను నేర్పించేవారు. అ సందీప మహాముని దగ్గరికి శ్రీకృష్ణ బలరాములు విద్య కోసం వెళ్లారు. సాందీప మహాముని దగ్గరకు వెళ్లి వారికి నమస్కరించి మేము శ్రీ కృష్ణ బలరాముల మీ దగ్గర విద్యను నేర్చుకుంటాము. మాపై దయవుంచి మాకు సకల విద్యలను నేర్పించండి అని అడిగారు. సందీప మహాముని శ్రీ కృష్ణ బలరాముల తేజస్సును చూసి వారికి వెంటనే విద్యలు నేర్పిస్తాను అన్నారు. శ్రీకృష్ణాబలరాములు కేవలం అరవై నాలుగు రోజుల్లో 64 విద్యలను నేర్చుకున్నారు. అది చూసిన సాందీప మహాముని ఆశ్చర్యపోయి అతని మనసులో వీరు సామాన్యులు కాదు ఎవరో దైవస్వరూపి అనుకున్నారు. విద్య తర్వాత ఒకరోజు సందీప మహాముని పిలిచి శ్రీకృష్ణ బలరాములను మీరు 64 మంది విద్యలను కేవలం అరవై నాలుగు రోజుల్లో నేర్చుకున్నారు. అది మానవ మాత్రులకు అసాధ్యం కాదు అందుకే నేను మిమ్మల్ని గురుదక్షిణ అడుగుతున్నాను. నాకు ధనం ఎవరైనా అడగకుండానే ఇస్తున్నారు కానీ నాకు ధనం వద్దు. మీరు చేయగలరని నమ్మకంతో గురుదక్షిణ అడుగుతున్నాను. ఒక శ్రీకృష్ణుడు మీకు ఏమి చెప్పాలో అడగండి గురువు గారు మేము కావాలన్నారు. అప్పుడు సందీప మహాముని ఒక సంవత్సరం క్రితం గ్రహణం రోజున నేను నా భార్య పుత్రుడు గ్రహణానికి సౌరాష్ట్రలోని ప్రయాగ క్షేత్రం లో రచన సముద్రానికి వెళ్ళాము. స్నానం చేసి జపం చేస్తుంటే నా కొడుకు మేము వద్దని చెబుతున్నా వినకుండా సముద్రంలోకి ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ సముద్రంలో మునిగి చనిపోయాడు. మీకు వీలైతే నా బిడ్డను నాకు తీసుకొచ్చి ఇవ్వండి. అదే నాకు గురుదక్షిణ అన్నారు. శ్రీకృష్ణ బలరాములు అలాగే గురువు గారు అని వెంటనే బయలుదేరారు. శ్రీకృష్ణ బలరాములు రథం మీద ఎక్కి పశ్చిమ సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడికి వెళ్లగానే శ్రీకృష్ణుడు సముద్రుని ఇలా పిలిచారు. ఓ సముద్ర దేవ బయటికి రా నువ్వు మా గురువు గారి అబ్బాయి మింగేశారు అతనిని తీసుకొచ్చి మాకు అప్పగించండి లేకపోతే నీ మీద అస్త్రాలు ప్రయోగిస్తాను అన్నారు. సముద్రుడు వెంటనే బయటకు వచ్చాడు. కృష్ణ నీకు తెలియదా నేను మీ గురువు గారి కుమారుని చంపలేదు. నేను కేవలం సముద్రంలో కెరటం తో లోపలికి లాక్కుని మళ్ళీ ఇంకొక కెరటం తో బయటకి పంపిస్తాను అంతే. సముద్ర జలాల్లో పాంచజన్యం అనే రాక్షసుడు ఉన్నాడు. మీ గురువు గారి అబ్బాయిని మింగేశారు. వాడి కడుపు లోని ఇప్పుడు మీ గురువు గారి అబ్బాయి కావాలంటే వాడిని అడిగి తీసుకెళ్ళండి అన్నారు. శ్రీకృష్ణుడు వెంటనే రథాన్ని సముద్రం లోనికి తీసుకెళ్ళారు. నాకు చేతకాని ఏమైనా ఉంటుందా అంతరధం కూడా సముద్రజలాల్లో భూమి మీద నడుస్తున్నట్టు వెళ్ళిపోయింది. సముద్రజలలో లోపలికి 12 మైళ్ళ లోతులో పాంచజన్యము ఉన్నాడు. దగ్గరికి వెళ్ళగానే శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించారు. ఆశంఖం శబ్దానికి పాంచజన్యము అదిరిపడ్డాడు. రా నన్ను భయపడేలా చేసింది మిమ్మల్ని చంపేస్తాను మింగేస్తారు అనుకుంటూ బయటకు వచ్చాడు. నేనే శ్రీకృష్ణుడు అతని మీద ఆగ్నేయాస్త్రాన్ని విడిచిపెట్టారు. అట్లే శాస్త్రం అతని పొట్టను విడిచిపెట్టి మిగిలిన శరీరాన్ని అంతటిని తేల్చేసింది. శ్రీకృష్ణుడు అతని పొట్టను చీల్చి చూశారు. అందులోనే గురువుగారి కుమారుడు ఒక శంఖంలా తయారయ్యారు. ఆ శంఖాన్ని తీసుకున్నారు. ఆ విధంగా శ్రీ కృష్ణుడి దగ్గరకు పాంచజన్య శంఖం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే బలరాముడు అన్నయ్య మనం నరక లోకానికి వెళదాము. ఎందుకంటే ఎవరైనా ప్రమాదవశాత్తు ఆయుష్షు తీరకుండా మరణిస్తే వారు నరకానికి వెళతారు అన్నారు. శ్రీకృష్ణ బలరాములు వెంటనే రథమెక్కి నరక లోకానికి వెళ్లారు. అక్కడ శ్రీకృష్ణుడు యమధర్మరాజుకు వినిపించేలా మళ్ళీ శంఖం నాధాన్ని గట్టిగా పూరించారు. శంఖ నాధం విని ఎవరు నా లోకానికి వచ్చి శంకనాదం చేస్తున్నారు వారిని చంపేస్తానని బూడిద చేస్తాం అని ఆవేశంగా బయటకు వచ్చారు. వచ్చి చూసి వచ్చిన శ్రీ కృష్ణ బలరాముల ను చూసి వచ్చింది పరమాత్మ అని తెలుసుకుని నా ఆవేశాన్ని తగ్గించుకున్నారు. వెంటనే శ్రీకృష్ణ బాలరాములని రావాలని లోపలికి ఆహ్వానించారు. అప్పుడు యమధర్మరాజు మీరు ఇక్కడికి వచ్చారు ఏమిటి స్వామి కాకితో కబురు పెడితే మీ దగ్గరికి వచ్చేవాణ్ణి కదా అన్నారు. శ్రీకృష్ణుడు మా గురువుగారు గురుదక్షిణగా తమ కుమారుని అడిగారు. అతను సంవత్సరం క్రితం మరణించిన నీ దగ్గరే ఉన్నారు. అతనిని మాకు అప్పగిస్తే మేము తీసుకొని వెళ్తాము అన్నారు. యమధర్మరాజు ఆయన భాష్యం చివర ఒక చిన్న జ్యోతిని ఇచ్చి ఇతనే మీ గురువు గారి కుమారుడు అన్నారు. అది శ్రీకృష్ణుడు అతనిని ఇలా చూస్తే ఎవరైనా గుర్తు పడతారా అతని తల్లిదండ్రుల గుర్తుపట్టరు. అతను మరణించినప్పుడు ఉన్న అతని శరీరాన్ని రూపం తో సహా ఇవ్వండి అన్నారు. యమధర్మరాజు అలాగే గురువు గారి కుమారుని బ్రతికించారు. శ్రీకృష్ణ బలరాములు ఆ గురువు గారి కుమారుని తీసుకుని రాశిలోని గురువుగారి ఆశ్రమానికి బయలుదేరారు. ఆశ్రమానికి రాగానే గురువుగారి కుమారుడు అతని తల్లిదండ్రులకు పాదాలకు నమస్కరించారు. సందీప మహాముని అతని భార్య తమ కుమారుని చూసుకొని ఆనందించారు. శ్రీకృష్ణ బలరామ మిమ్మల్ని చూసిన వెంటనే దైవ స్వరూపులు అనుకున్నాను. ఎవరైనా బ్రతికుండగా నరకానికి వెళ్లి తిరిగి రాగలరా. మీరు తీర్చగలరని నమ్మకంతోనే మిమ్మల్ని కోరారని కోరిక కోరాను. మీరు నా కోరికను నెరవేర్చారు. ఇప్పటివరకు ఎవరు ఇచ్చారు అయ్యా ఇలాంటి గురుదక్షణ సాందీప మహాముని కన్నీళ్ల పర్యంతమయ్యారు. మీ కథ తర్వాతికాలంలో పురాణ కథగా చెప్పుకుంటారు అని దీవించారు సాందీప మహాముని. గురువు గారికి శ్రీకృష్ణ బలరాములు వారి అనేకమైన కానుకలిచ్చి తిరిగి మధుర నగరానికి వచ్చారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...