బలరామ రేవతి కళ్యాణం

బలరామ రేవతి కళ్యాణం 



శ్రీకృష్ణ బలరాములు ద్వారకానగరానికి వెళ్ళిన తరవాత కొన్ని రోజులు గడిచాయి. పూర్వం ఐదో మన్వంతరానికి మనవు రైవతుడు. ఆయన కుమార్తె రేవతి. ఆమెకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదు అని ఆమెకు తగిన భర్త ఎవరో బ్రహ్మ లోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని అడిగి తెలుసుకుందాం అని బయలుదేరారు. బ్రహ్మలోకానికి రైవత్తమనువు వెళ్ళేసరికి అక్కడ సభలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. సభ అయిన తర్వాత బ్రహ్మ దేవుడి దగ్గరకు వెళదామని అక్కడ పక్కనే నుంచున్నారు. రెండు గంటల తర్వాత సభ ముగిసింది. తరువాత రైవత మనువు తన కుమార్తె అయిన రేవతి ని తీసుకొని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. బ్రహ్మ దేవుడికి నమస్కరించి ఓ బ్రహ్మదేవా! ఈమె నా కుమార్తె రేవతి. ఆమెకి తగిన వరుడిని మీరే చూపించండి. ఆమెకి ఎన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదు అని అడిగారు.అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చిరునవ్వు నవ్వి రైవత మానువా!మంచిదయింది నీ కుమార్తెను నీతో పాటు ఇక్కడికి తీసుకొచ్చావు.ఇప్పుడు భూలోకంలో ఏం జరుగుతుందో తెలుసా. ఇక్కడ ఎదురుచూసిన రెండు గంటల కాలం అక్కడ భూలోకంలో రెండు మన్వంతరాల కాలం గడిచిపోయింది. నీ రవ్వ తో మనువు మన్వంతరం వెళ్ళిపోయింది. తర్వాత మన్వంతరం చక్షుడి మన్వంతరం కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏడవ మనువు అయిన వైవస్వత మనువు మన్వంతరములో ద్వాపర యుగం నడుస్తోంది. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు దుష్టశిక్షణ కోసం శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించారు. ఆదిశేషుడు బలరామునికి అవతరించారు. రైవత మనువు బ్రహ్మదేవుని దగ్గర సెలవు తీసుకుని భూలోకంలోని ద్వారకా నగరానికి వచ్చారు. అక్కడ శ్రీకృష్ణ బలరాములు కలిసి జరిగింది చెప్పారు. బలరామునికి రేవతి క వివాహం చేశారు. తరువాత రైవత మనువు ఇప్పుడు తన మరణాంతరం కాదు కనుక ఇక్కడ ఉండటానికి కుదరదు అని తిరిగి బ్రహ్మలోకానికి వెళ్లిపోయారు.నీ కుమార్తెకు తగిన భర్త అతని నువ్వు భూలోకంలో ద్వారకానగరానికి వెళ్లి బలరామునికి శ్రీ నీ కుమార్తెను ఇచ్చి వివాహం చేయి బలరాముడు రేవతి కారణజన్ములు అని అన్నారు.ఆ విధంగా బలరామ రేవతి ల వివాహం జరిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...