కాలయవన సంహారం

కాలయవన సంహారం


తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యుని లాగా శ్రీకృష్ణుడు ఎటువంటి ఆయుధాలు లేకుండా మధురానగరం నుండి బయటకు వచ్చి కాలయవనుడికి ఎదురుగా వెళ్లారు. అలా ఆయుధాలు లేకుండా వస్తున్న శ్రీకృష్ణుని చూసి కాలయవనుడు తనవారితో ఏనుగుల గుంపులు లేవు, గుర్రాలు లేవు, సైన్యం లేరు, ధనస్సులు, బాణాలు, ఖడ్గం మొదలైన ఆయుధాలు లేవు. సూర్యుని ప్రకాశంతో వెలిగిపోతున్న మెడలో కౌస్తుభ హారము ధరించి ఒంటరిగా మన వైపే వస్తున్న అతడిని చూశారా. మధుర నగరం పై మనం దండెత్తి చాలా రోజులు అయింది కదా. ఎన్ని రోజులు ఎవరూ రాలేదు. ఇప్పుడు ఇతను ఎవరు ఆయుధాలు లేకుండా వస్తున్నాడు. నన్ను జయించడానికి, రాయబారం మాట్లాడడానికి, ఏదైనా సంపదను అడగటానికి తెలియకుండా చూడండి అన్నారు. అలా దగ్గరికి వస్తున్నా శ్రీకృష్ణుని చూసి పద్మాల వంటి కళ్ళు, సింహం నడుము వంటి నడుము, వక్షస్థల శ్రీలక్ష్మి శ్రీవత్సం అనే పుట్టుమచ్చ, చంద్రుని వంటి మొఖం, పొడవటి చేతులు, చక్కటి వనమాల, భుజకీర్తులు, ముత్యాల దండలు, కంకణాలు, కర్ణకొండ లాలు ధరించిన వాడు అయిన ఈ వీరుడు ఆ నారద ముని చెప్పిన వీరాధివీరుడు అయి ఉండాలి. అనుకొని మితిమీరిన అహంకారంతో శ్రీకృష్ణుడు మీదకి తన గుర్రాన్ని నడిపించాడు. బ్రహ్మదేవుడు మరియు మిగిలిన దేవతలు, మునులు, యోగులు కూడా పట్టుకోలేని లోకరక్షకుడైన శ్రీకృష్ణుని పట్టుకుంటాను అని కాలయవనుడు అరుస్తూ ముందుకు వెళ్లాడు. అలా కాలయవనుడు శ్రీకృష్ణుని పట్టుకోవడానికి వస్తుంటే ఆయన మహా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. కాలయవనుడు శ్రీకృష్ణుని వెంటపడ్డాడు. లా పరుగెడుతున్న శ్రీకృష్ణునితో కాలయవనుడు " ఓ యదువంశ శ్రేష్ఠ! శ్రీకృష్ణ! ఆగు ఆగు. పారిపోకు. నాతో యుద్ధం చేశాడు. నీవు యుద్ధరంగంలో కంసుడు మొదలైన వాళ్లను జయించిన వీరుడు అని విని నీతో యుద్ధం చేయడం ఎంతో ఉత్సాహంగా వచ్చాను. నీవు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు చెడిపోయే లాగా. నీ రాజులు వ్యతిరేకి కి వెన్ను చూపి ఇలా పారిపోతారా?నువ్వేమి సాధారణ రాజు కూడా కాదా?నీకు అపఖ్యాతి వస్తోంది.శ్రీకృష్ణ! భూమి కింద కి వెళ్ళిన, కొండ పైకి ఎక్కి నా, బలి సమీపాన చేరిన, నువ్వు వికార రూపాన్ని ధరించినా, సముద్రాన్ని దాటిన బ్రాహ్మణ మరే ఇతర రూపాలను ధరించి నా సరే నా బలం తో లోకం మెచ్చేలా నేను నిన్ను తప్పక పట్టుకుంటాను. ఇంకా నా గుర్రాల కాలి డెక్కలు ధూళి నిన్ను తాకలేదు. ఆ బాణాలు నీ శరీరానికి తగలలేదు. అయ్యో అప్పుడే పార్టీ పోతున్నావ్ ఏమిటి? ఇంతకుముందు కాళీయుని తో, కేశితో, కువలయ పీడనంతో, మలిజెట్టిలతో, జరాసంధుడితో, కంసుడితో ఎలా పోరాడారు? అని అంటూ కాలయవనుడు వెంటపడుతున్న లెక్కచేయకుండా శ్రీకృష్ణుడు చిరునవ్వుతో తొందర పడకు రా రా అంటూ వెళ్లారు. అడుగో దొరికేసాడు. ఇదిగో దొరికేసాడు అని కాలయవనుడు పట్టుకోవడానికి రాగా శ్రీకృష్ణుడు తప్పించుకున్నాడు. చాలా వేగంగా పరిగెత్తుతున్న నాడు. ఇంకా అతనిని పట్టుకోలేను కాలయవనుడు అనుకోగానే శ్రీ కృష్ణుడు నవ్వుతూ దగ్గరగా వచ్చి నిలబడతారు. కాలయవనుడు పట్టుకోవడానికి వస్తే తప్పించుకొని వెళతారు. అలా శ్రీ కృష్ణుడు కాలయవనుడు పుట్టలు, చెట్లు, సరస్సులు దాటి మధ్యలో నన్ను పట్టుకుంటే నువ్వు మగాడివి అంటూ దోషం తెచ్చుకునేలా చేసి అడవులు, కొండలు దాటి తీసుకెళుతున్నారు. అలా శ్రీకృష్ణుడు కాలయవనుడు ని తీసుకుని భయంకరమైన ఒక కొండగుహలోకి వెళ్లి మాయమయ్యారు. కాలయవనుడు శ్రీకృష్ణుని పట్టుకోవటానికి అని ఆ కొండ గుహలోకి వెళ్ళాడు. అక్కడ అంతా చీకటిగా ఉంది. చీకటిగా ఉన్న ఆ గుహలో అక్కడ ఒక పెద్ద మంచం మీద నిద్రలో ఉన్న ఒక మహాపురుషుడు ని చూసి అతడే శ్రీకృష్ణుడు అనుకోని ఓరి! నాతో యుద్ధం చేయలేక పరిగెత్తుకొని వచ్చి ఆ కొండగుహలో నిద్రపోతున్న వాడిలా నటిస్తున్నావా? నిన్ను వదులుతాను అనుకున్నావా? నువ్వు ఎక్కడా ఎవరికీ చిక్కని నారదుడు చెప్పాడు. ఎందుకో నాకు ఇక్కడ చిక్కావు. ఎక్కడికి వెళ్తావు. నిద్రపోతున్న నిన్ను నిజంగా ఈ కొండ గుహలోనే శాశ్వత నిద్రలోకి పంపిస్తాను తన చావుకి తానే కొనితెచ్చుకున్నాడు అని తెలియక పరిగెత్తుకు వెళ్లి ఎగిరి గట్టిగా నిద్ర పోతున్న ఆ మహాపురుషుడు ని తన కాలితో తన్నాడు. అలా కాలయవనుడు తన నటనతో నిద్రలేచిన ఆ మహాపురుషుడు ఒళ్ళు విరుచుకుంటూ కోపంతో తనను తన్నినది ఎవరు అని చుట్టు చూడక కాలయవనుడు కనిపించాడు. ఏళ్లుగా నిద్రలో ఉన్న ఆమహాపురుషుని కంటి నుంచి వచ్చిన అగ్నిజ్వాలలు కాలయవనుడు ని కాల్చి బూడిద చేశాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...