రుక్మిణి శ్రీకృష్ణుల మొదటి సంతానం

రుక్మిణి శ్రీకృష్ణుల మొదటి సంతానం


శ్రీకృష్ణ రుక్మిణిల కళ్యాణం జరిగిన తరువాత చాలా సంతోషంగా గడిపారు. వారిని చూసి ద్వారకా నగరవాసులు ఆనందంగా ఉన్నారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ద్వారకా నగరంలో రుక్మిణిదేవి గా ఉంది. శ్రీమన్నారాయణుడిని లక్ష్మీదేవిని ఒకేసారి సేవ చేసుకోవచ్చు అని ఆనందించారు. ఆమె ఇక సంతానలక్ష్మి అవ్వటమే తరువాయి అనుకున్నారు. కొంతకాలానికి రుక్మిణీదేవి గర్భం ధరించింది. అప్పుడు శ్రీ కృష్ణుని దగ్గరకు మన్మధుడు వచ్చాడు. పూర్వం శివపార్వతులను కలపాలని ఇంద్రుని ఆజ్ఞమేరకు శివుని మీద బాణాలు వేయటానికి శివుడు తపస్సు చేస్తున్న దగ్గరకు వచ్చారు. అప్పుడే పార్వతీమాత శివునికి సేవ చేయడానికి పూలు పండ్లు జపం అక్కడ తామర మాలలు తీసుకొని వచ్చింది. సమయం చూసి శివునిపై బాణం వేయటానికి మన్మధుడు సిద్ధంగా ఉండగా శివుడు అది గమనించి మన్మధుడిని బూడిద చేశారు. ప్రతి దేవి తన భర్త మరణించాడు అని తెలుసుకుని విలపించింది. అందరికీ సౌభాగ్యం అన్ని ప్రసాదించేది అమ్మవారే కనుక తనకి సౌభాగ్యం ప్రసాదించమని అమ్మవారి కోసం తపస్సు చేసింది.. ఆమె తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు రతీదేవి తన భర్తను తనకు తిరిగి ప్రసాదించమని వేడుకుంది. అప్పుడు అమ్మవారు నీ భర్త మన్మధుడు నీకు మాత్రమే కనిపిస్తాడు నీకు ఈ వరం ఇస్తున్నాను. అతను సే విలన్ గా రావాలంటే రాబోయే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రుక్మిణిలకు జన్మించి మళ్ళీ నిన్ను వివాహం చేసుకుంటాడు అని చెప్పి అదృశ్యమైంది. ఈ వృత్తాంతమంతా శ్రీకృష్ణునికి మన్మధుడు వినిపించి జగత్ కళ్యాణ కారక నీకు తెలియని విషయాలు ఉంటాయా. అయినా అమ్మవారి వరం వలన మీరు నన్ను మీ కుమారుడిగా స్వీకరించండి అని వేడుకొన్నారు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి తధాస్తు అన్నారు. మన్మధుడు రుక్మిణిదేవి గర్భంలో ప్రవేశించారు. సంవత్సరం తర్వాత రుక్మిణిదేవి ప్రసవించింది. అతనికి ప్రద్యుమ్నుడు అని నామకరణం చేశారు. జన్మదిన చూసిన ద్వారకా నగరవాసులు అచ్చం శ్రీకృష్ణుని అందంతో శ్రీకృష్ణుని లాగా ఉన్నాడు ఈ పిల్లవాడు అనుకున్నారు. ఒకరోజు రుక్మిణిదేవి పిల్లవాడికి పాలు ఇచ్చి నిద్రపుచ్చింది. తాను నిద్ర పోయింది. ఆ సమయంలో శంబరుడనే రాక్షసుడు ఆ శ్రీకృష్ణుడి కుమారుడి వలన తనకు మరణం అని తెలుసుకొని అసలు ఆ పిల్ల వాడిని ఇప్పుడే చంపేస్తే తనకు ఇక మరణం ఉండదు అని అనుకున్నాడు. తన మాయాశక్తిని ఉపయోగించి ఒక స్త్రీ రూపంలోకి మారి ఆ పిల్లవాడిని అపహరించి తీసుకువెళ్లి సముద్రంలో పడేశాడు. ఆ పిల్లవాడు మరణించాడు అనుకుని సంతోషంతో శంబరుడు వెళ్ళిపోయాడు. కానీ ఆ పిల్లవాడిని ఒక పెద్ద చేప అమాంతం అతనిని మింగింది. తెల్లవారిన తరువాత కొంతమంది జాలరులు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లారు. వారు సముద్రంలో వలలు వేశారు. అందులో ప్రద్యుమ్నుడిని మింగిన చేప కూడా చిక్కింది. వాళ్లలో అంత పెద్ద చేపను చూసి దీనిని రాజు గారికి బహుమతిగా ఇద్దాము. రాజుగారు సంతోషిస్తారు అనుకున్నారు. ఆ దేశపు రాజు శంబరుడే. జాలరులు శంబరుడు కి ఆ చేపను బహుమతిగా ఇచ్చారు. శంబరుడు ఆ చేపను వంట వాళ్లకు ఇచ్చి దీనిని ఇవ్వండి తీసుకురండి అన్నారు. వంటశాల కు ఆ చేపను తీసుకువెళ్లి కోయగా దాని పొట్ట లో ఒక చిన్న బాలుడు కనిపించాడు. అక్కడే ఉన్న మాయావతి ఈ పిల్లాడిని తాను పెంచుకుంటాను అనే దగ్గర అనుమతి తీసుకుని పెంచసాగింది. ఆమె తన మాయాశక్తిని ఉపయోగించి ప్రద్యుమ్నుడిని తొందరగా యువకుడిని చేసింది. అతనికి సకల విద్యలు నేర్పించింది. అతను అన్ని విద్యలు అభ్యసించిన తరువాత ఒక రోజు అతని దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడిగాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు నీవు మా అమ్మవు కదా ఇలా అడుగుతున్నావు నీకు ఇది ధర్మమేనా అని అంటారు. అప్పుడు మాయావతి నేను మీ అమ్మను గాను మీరు పూర్వజన్మలో మన్మధుడి నేను నీ భార్య రతీదేవి అని చెప్పింది. మన్మధుడు ఎలా మరణించాడు అమ్మవారి వరం తెలియజేసింది. మీరు మళ్ళీ జన్మించడానికి వెళ్ళిన తర్వాత నారదమహర్షి నా దగ్గరకు వచ్చి మీరు రుక్మిణి దేవి గర్భాన జన్మిస్తాం అని చెప్పారు. కానీ శంబరుడనే రాక్షసుడు మీ చేతిలో మరణం ఉన్నాడని తెలుసుకుని మీకు అపాయం తలపెట్టాలని చూస్తున్నాడని మిమ్మల్ని రక్షించి మీకు సకల విద్యలూ మాయ విద్యలు నేర్పించమని నన్ను ఇక్కడికి పంపించారు. నేను మీ రాక కోసం మాయావతి అనే పేరుతో శంబరుడు రాజ్యం లో ఉంటున్నాను. నేను మీ కోసమే ఇక్కడికి వచ్చాను. మీ తల్లిదండ్రులు శ్రీ కృష్ణుడు రుక్మిణీ దేవి. వారి శ్రీ లక్ష్మీ నారాయణులు అని చెప్పింది. ఈ శంబరుడు దుర్మార్గుడు మాయలమారి దుష్టుడు. యుద్ధాలలో మాయలు పన్ని దేవతలను ఓడించి ఇస్తున్నాడు. నీ తల్లికి నిన్ను దూరం చేశాడు. అక్కడ ఆమె ఎంత విలపిస్తోందో? నా కొడుకు ఏమయ్యాడో ఎక్కడ ఉన్నాడు అని ఆమె ఎంతగా దుఃఖిస్తాడో? మీరు ఏ రాక్షసుడిని సంహరించి మీ దగ్గరకు తొందరగా వెళ్ళాలి. ఆమె దుఃఖాన్ని దూరం చేయాలి అని ప్రద్యుమ్నుడికి సర్వ మాయలను జయించగల మహామాయ అనే విద్యను ఉపదేశించింది. ప్రద్యుమ్నుడు గొప్ప మాయ యుద్ధ ప్రవీణుడు అయ్యాడు. తరువాత ప్రత్యం మరో యుద్ధానికి సిద్ధం అయిన శంబరుడిని ఓరి రాక్షస! నన్ను నా తల్లి నుండి వేరు చేసి నన్ను నడిసముద్రంలో పడేశావు. నా తల్లి ఎంత తొక్కేస్తుందో. ఈరోజు నిన్ను సంహరిస్తాను తొందరగా రా రా అని పిలిచారు. ఆ మాటలు విన్న శంబరుడు కి ఆగ్రహం వచ్చి ముందు వెనకా ఆలోచించకుండా ప్రద్యుమ్నుడి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. ప్రద్యుమ్నుడు రాక్షసరాజు గతంలో తన గడపతో విరిచి రాక్షసులు భయపడేలా పెద్దగా అరుస్తూ తన గడపతో రాక్షసుని కొట్టాడు. ఆ బాధ భరించలేక శంబరుడు ఆకాశంలోకి ఎగిరి మాయతో ప్రద్యుమ్నుడి పై బాణాల వర్షం కురిపించాడు. ప్రద్యుమ్నుడు ఆ బాణాల వర్షం నాశనం అయ్యేలా సాత్విక మాయం ఉపయోగించి నాశనం చేశారు. మళ్లీ శంబరుడు ఎన్నో పిశాచ మాయలను చేశాడు. ప్రద్యుమ్నుడు వాటిని అంతటిని నాశనం చేశారు. ప్రద్యుమ్నుడు రెప్పపాటులో శంబరుడు దగ్గరకు వెళ్లి అతని శిరస్సును ఖడ్గంతో ఖండించి సంహరించారు. ఆకాశంలో దేవదూతలు ఈ దృశ్యాన్ని చూసి ఆనందంతో ప్రద్యుమ్నుడి పై పుష్పవర్షం కురిపించారు. ప్రద్యుమ్నుడు వెంటనే రతీదేవి దగ్గరకు వచ్చి మా తల్లి రుక్మిణిదేవి దగ్గరకు తీసుకు వెళ్ళు ఆమెను చూడాలని ఆతృతగా ఉంది. ప్రద్యుమ్నుడు రతీదేవి ఆకాశ మార్గం ద్వారా ద్వారకా నగరం దగ్గరకు వచ్చారు. శ్రీ కృష్ణ రుక్మిణీ దేవి అంతఃపుర మేడ మీదకు వచ్చి చేరారు. హఠాత్తుగా వచ్చిన ప్రద్యుమ్నుడిని చూసి అంతఃపుర స్త్రీలు వచ్చారు శ్రీకృష్ణుడు అనుకుని బ్రమపడ్డారు. కొంతసేపు తరువాత అంతఃపుర స్త్రీలు అతను శ్రీ కృష్ణుడు కాదు శ్రీ కృష్ణుడి పోలికలు ఉన్నాయి అంతే అసలు విషయం తెలుసుకుందాం అనుకున్నారు. ఈ లోపు కాపలా వారి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవిని, దేవకీ వసుదేవులను, బలరాముడిని వెంటబెట్టుకొని అంతపురం బయటకు వచ్చారు. శ్రీకృష్ణుడు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు చిరునవ్వుతో చూస్తున్నాడు. రుక్మిణీదేవి ప్రద్యుమ్నుడిని చూడగానే ఆమె హృదయం ద్రవించి పాల రూపంలో బయటకు వచ్చింది. కన్నీరు కారుస్తూ తన పిల్లవాడిని గుర్తుకు తెచ్చుకుంది. ఆనాడు నేను పాలిచ్చే నిద్రపో చిన్న పిల్లవాడు ఏ పాపాత్ముడు ఎత్తుకుపోయాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అయితే ఇలాగే ఉంటారు కదా. ఒకవేళ ఇతడు నా పుత్రుడేనా! లేకపోతే నా భర్త శ్రీకృష్ణుడి పోలికలు ఎందుకుంటాయి. అతని మీద నాకు పుత్రప్రేమ కలుగుతుంది అనుకుంది. ఈలోగా నారదమహర్షి వచ్చి జరిగిన విషయం అంతా వివరించి ఇతను నీ కుమారుడే అని రుక్మిణీ దేవికి చెప్పారు. అందరూ సంతోషించారు. శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడిని ప్రేమగా దగ్గరకు తీసుకున్న అంతఃపుర కాంతలు, దేవకీవసుదేవులు, బలరాముడు మంచి వస్త్రాలు ఆభరణాలతో రతీదేవి ప్రద్యుమ్నుడిని సత్కరించి సంతోషించారు. రుక్మిణి దేవి తన కొడుకుని కౌగిలించుకొని నాయనా! ఎన్నాళ్ళు ఎలా ఉన్నావయ్య ఆ రాక్షసుడిని ఎలా సంహరించావు. ఎంత కాలానికి ఆ భగవంతునికి నామీద దయ కలిగింది మళ్లీ నిన్ను చూడగలిగాను అని ఎంతో ఆనందించింది. కోడలు అయిన రతీదేవి సుగుణాలను పొగుడుతూ వేడుకలు చేయసాగింది. ఆ అష్టమిని ద్వారకా నగరవాసులు అందరూ ఎంతో సంతోషించారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...