ఉగాది పండుగ విశిష్టత

ఉగాది పండుగ విశిష్టత




 ఉగాది అంటే సంస్కృతంలో ఉగాది అని కూడా అంటారు. యుగా +అది =యూగాది. ఈ ఉగాది పండుగ రోజును చైత్ర శుద్ధ పాడ్యమి రోజునా జరుపుకుంటారు. ఈ రోజున తెల్లవారుఝామునే నిద్ర లేచి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించుకొని కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. అలా అభ్యంగన స్నానం చేయటం వలన ఇంట్లో ఉన్న అలక్ష్మి పోయి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఆ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పెద్దలు చెప్పారు. స్నానం అయిన తరువాత తన ఇంటి కులదైవాన్ని, వినాయకుడిని, కాలపురుషుని పూజించాలి. రోజున పురుషసూక్తం చదువుకోవడం మంచిది. పూజ అయిన తరువాత ఉగాది పచ్చడి దేవునికి నివేదించాలి. తరువాత దగ్గర్లోని దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవాలి. ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని షడ్రుచులతో చేస్తారు. షడ్రుచులు తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు. ఈ షెడ్యూలులో తీపి కోసం చెరకును పిలుపుకోసం చింతకాయ కారం కోసం మిరియాలను ఒకరు కోసం మామిడి పిందెలు ఉప్పు చేదు కోసం వేపపువ్వును వాడి ఈ ఉగాది పచ్చడిని చేస్తారు. ఈ ఆరు రుచులు మనిషికి కలిగే ఆరు విధాలైన భావాల సమ్మేళనం. ఈ ఆరు భావాలు సంవత్సరం అంతా సమానంగా ఉండాలి అని తీసుకుంటారు. ఈ ఉగాది పచ్చడి ద్వారా ఆరోగ్యం కూడా సమకూరుతుంది. రాఖీ పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పంచాంగ శ్రవణం వినటం వలన తమకు వచ్చే కష్టసుఖాలను తెలుసుకొని తగిన పరిహారాలు చేసుకుంటారు. ఈ ఉగాది పండుగ రోజున వారి స్తోమతను బట్టి దానధర్మాలు చేయటం మంచిది. కుదరక పోయినా కనీసం పక్షులకు నీటిని పెట్టడం చాలా మంచిది ఎందుకంటే వచ్చెది వేసవి కాలం కనుక చాలా పక్షులు దాహానికి నీరు దొరకక అల్లాడుతున్నాయి. ఈ ఉగాది ఈ రోజున జరుపుకోవడానికి కారణమైన ఒక కథ ఉంది తెలుసుకుందాము. రూమ్ ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతను శ్రీమహావిష్ణువు కోసం తీవ్రమైన తపస్సు చేసేవారు. ఆయన కేవలం నీరు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. కృత మాలిక అనే నది ఒడ్డున తపస్సు చేసేవారు. ప్రతిరోజు ఉదయం స్నానమాచరించిన తర్వాత శ్రీమహావిష్ణువుకు నీటితో తర్పణాన్ని వదిలేవారు. ఆ రోజు కూడా అలాగే దర్శనం వదులుతున్న సమయంలో అతని చేతిలోకి ఒకచిన్న చేపపిల్ల వచ్చింది దానిని నీటిలో కి పోతుంటే ఆ చేపపిల్ల మానవ భాషలో సత్యవ్రతుడు తో మాట్లాడింది. సత్యవ్రత నీకు ఇది ధర్మమేనా నన్ను నీటిలో వేర్ ఒక పెద్ద చేప తిందామని చూస్తుంటే తప్పించుకొని నేను నీ చేతిలో కి వచ్చాను నన్ను నన్ను రక్షించుకుండా మళ్లీ నీటిలోకి వదిలేస్తావా అని అడిగింది. అది చూసిన సత్యవ్రతుడు ఆశ్చర్యపోయారు ఇదేమిటి చేపపిల్ల మాట్లాడుతుంది. ఇదేదో దైవలీల అనుకుని ఆ చేప పిల్లలను తీసుకొని తనకు మండలం లో వేశారు. ఒక్క నిమిషం లోనే ఆ చేప పిల్ల కమండలం అంతా సరిపోయే లాగా పెరిగిపోయింది. అప్పుడు ఆ చేప పిల్ల ఓ రాజా ఈ కమండలం నాకు సరిపోవటం లేదు నన్ను పెద్దదాన్ని లో వెయ్యి అంది. ఆ చేప పిల్లలను ఒక పెద్ద కొండల్లో వేసాడు సత్యవ్రతుడు. అక్కడ కూడా ఒక్క నిమిషం లోనే కాకుండా అంత పెద్దగా అయిపోయింది ఆ చేపపిల్ల. అప్పుడు ఆ చేప ఓ రాజా ఇది కూడా నాకు సరిపోవటం లేదు ఇంతకన్నా పెద్ద దాంట్లో నన్ను వెయ్యి అంది. సత్యవ్రతుడు దానిని చెరువులో వేశాడు. ఒక్కడు కూడా ఆ చేప నిమిషంలోనే చెరువు అంత పెద్దది గా అయిపోయింది. సత్యవ్రత ఈ చెరువు కూడా నాకు సరిపోవటం లేదు నన్ను ఇంకా పెద్ద దాంట్లో వెయ్యి అని అడిగింది. సత్యవ్రతుడు ఆ చేపను తీసుకెళ్లి సముద్రంలో వేశారు. అప్పుడు సత్యవ్రతుడు మనసులో ఇన్నాళ్ళు నేను తపస్సు చేసిన శ్రీమహావిష్ణువు ఈ రూపంలో నన్ను అనుగ్రహించడానికి వచ్చారు అనుకున్నారు. భరతుడు ఆ చెప్పకు నమస్కరించి ఓ దేవాదిదేవా మీరు ఎవరో కాదు ఆ శ్రీమహావిష్ణువే నేను ఎన్నాళ్లు నీకోసమే తపస్సు చేశాను. ఈ విరాట్ రూపాన్ని చూడడానికి కానీ మీరు చేప రూపంలో వచ్చాడు కారణం ఏమిటి స్వామీ అని అడిగారు. అప్పుడు శ్రీమహా విష్ణువు సత్యవ్రత బ్రహ్మదేవునికి పగటికాలం ఇంకో 7 రోజుల్లో పూర్తవుతుంది. తరువాత ఆయనకు రాత్రి కాలం వస్తుంది. అంటే సృష్టి మొత్తం ప్రళయకాలంలో నశిస్తుంది. బ్రహ్మదేవుడు యోగనిద్రలోకి వెళ్ళి పోతారు. ఏడు రోజుల తరువాత నీ దగ్గరికి ఒక ఓడ వస్తోంది. అందులోకి నువ్వు కొన్ని ఔషధాలు ధాన్యాలు తీసుకుని రా ఓడలోకి కూర్చో అందులోకి సప్త ఋషులు కూడా ఎక్కుతారు. నువ్వు వాడు ఎక్కిన దగ్గర నుంచి వర్షం మొదలవుతుంది. వర్షం భయంకరంగా వడగళ్ల తో పడి భూమిపై ఉన్న సముద్రాలన్నీ కలిసిపోతాయి. జీవరాసులని నశించిపోయినా నాలో లయం అయిపోతాయి. నా అనుగ్రహం వలన నీవు మాత్రమే బ్రతికి ఉంటావు. నీకు దర్శనమిచ్చిన ఈ చోటుకే ఓడ వస్తుంది నువ్వు ఇక్కడే వేచి ఉండు. ఎవరు ఆ రోజు నుంచీ అక్కడే ఏడు రోజుల వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్రీమహావిష్ణు ఓడ వచ్చింది. దానిలోకి సత్యవ్రతుడు కూర్చున్నారు. వర్షం మొదలైంది కాసేపటికే తీవ్ర రూపం దాల్చింది. సముద్రం లోని కెరటాలు ఎగిసిపడ్డాయి మునిగిపోయే ప్రమాదం వచ్చింది. అప్పుడు శ్రీమహావిష్ణువు మచ్చ రూపంలో ఆ పడవ మునిగి పోకుండా పట్టుకొని రక్షణగా ఉన్నారు. ఈ లోపు సూర్య చంద్రుల గమనం కూడా నిలిచిపోయింది. అంతటా చీకటి వ్యాపించింది. ఆ ఓడ లోనే ఉన్న సప్తఋషుల శరీరం నుంచి తేజస్సు వచ్చి వెలుతురు నిచ్చింది. ఆ మహా ప్రళయం జరుగుతుండగా శ్రీమహావిష్ణువు శ్వేద జలం (చెమట) నుండి ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు. అతను యోగనిద్రలో ఉన్న బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి వేదాలను అపహరించి సముద్రంలో నికి వెళ్ళిపోతాడు. అది చూసిన శ్రీమహావిష్ణువు అతన్ని వధించి ఎటు వాళ్లను ఒక అబ్బాయిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగిస్తారు. బ్రహ్మదేవుడు యోగనిద్ర పూర్తి చేసుకుని మళ్లీ సృష్టిని మొదలుపెడతారు. బ్రహ్మదేవుడు సృష్టి ని మొదలు పెట్టిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. అందుకే ఈ రోజున ఉగాదిని జరుపుకుంటారు.


 శుభాకాంక్షలు అనగా శుభం + కాంక్షలు అంటే ఆశిస్తున్నాము అని అర్థం మీకు శుభం జరగాలి అని ఆశిస్తున్నాము అని అర్థం. అందరం తెలుగులోనే ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుందాం.




 అందరికీ ఉగాది శుభాకాంక్షలు 🌹🙏👍🌹🙏👍🌹🙏👍🌹🙏👍

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...