వసంత నవరాత్రులా విశిష్టత

వసంత నవరాత్రుల విశిష్టత 




ఈ ప్రపంచం మొత్తం ఆ అమ్మవారి స్వరూపం. ఏమాయ శక్తి ప్రభావం వలన మానవులు అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. అటువంటి వారికి కష్టాలు పోయి సుఖంగా జీవించే మార్గం చూపించడానికి దేవీభాగవతంలో సాక్షాత్తు లలితాత్రిపురసుందరీ దేవిని కొన్ని పూజలు వ్రతాలు ఉపదేశించారు. వాటిలో ముఖ్యమైనవి దేవీ నవరాత్రులు. దేవీ నవరాత్రులు నాలుగు సార్లు వస్తాయి. వాటిలో మొదటిది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు. రెండవది ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వారాహీ నవరాత్రులు. మూడవది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శరన్నవరాత్రులు. నాలుగోది మాఘ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శారదా నవరాత్రులు. నలుగు అవుతా నవరాత్రులు చేస్తే అమ్మవారి అనుగ్రహం కి పాత్రులు అని చెప్పారు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో మొదటి వసంత నవరాత్రులు. ఇది చైత్ర మాసం ప్రారంభం రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరుపుకుంటారు. ప్రారంభమైనప్పుడు కాబట్టే ఈ నవరాత్రులు అని వసంత నవరాత్రి ఉత్సవాలు అంటారు. ఈ వసంత నవరాత్రులు చేసుకునే వారు కొన్ని నియమాలు పాటించాలని దేవీభాగవతం చెప్పింది. ఈ తొమ్మిది రోజుల పూజకి నైవేద్యాలు కి కావలసిన సరుకులు పూజసామాగ్రిని ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి.ఎత్తుపల్లాలు లేని సమతల ప్రాంతంలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ మందిరానికి పసుపు రాసి ముగ్గులు పెట్టి కుంకుమ దానిపైన తెల్లని వస్త్రం పరిచి దానిపైన అమ్మవారి విగ్రహాన్ని కానీ పటాన్నిగానీ ప్రతిష్టించాలి. పాడ్యమి నుండి నవమి వరకు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానాలు ముగించుకొని పూజామందిరంలో ముందుగా ఏర్పాటు చేసుకున్న అమ్మవారి విగ్రహం లేద పటం దగ్గర అమ్మవారికి కలశ స్థాపన తరువాత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధానాలతో వివిధ పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. అనంతరం అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం నివేదన చేయాలి. ఈ తొమ్మిది రోజులు నియమనిష్టలతో అమ్మవారిని పూజించి ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ అది అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని మాత్రమే భోజనం చేయాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అయిన తరువాత భుజించాలి. బ్రహ్మచర్యాన్ని పాటించి నేల మీద మాత్రమే నిద్రపోవాలి. ఈ తొమ్మిది రోజులు దేవీ భాగవతం పారాయణం గాని, రామాయణాన్ని గాని పారాయణ చేయాలి. ఎందుకంటే వసంత నవరాత్రి ఆఖరి రోజున శ్రీరామ ఆఖరి రోజున అమ్మవారికి శక్తి కలది చీర జాకెట్ ముక్క తాంబూలం పెట్టాలినవమి వస్తుంది. శ్రీ రాములవారు ఈ ఆఖరి తొమ్మిది రోజులు ఉన్నారు.


లలితా సహస్రనామాలు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు వివరించబడ్డాయి. అవి


1. పాయసాన్నప్రియాయై - పరమాన్నం


2. స్నిగ్దౌదన ప్రియా - కట్టుపొంగలి


3. గుడాన్న ప్రియ - బెల్లంతో పాయసం


4. దాధ్యన్నా సక్త - దాద్యోధనం


5. ముగ్దౌదనా సక్త -పోపు పొంగలి
6. హరిద్రనైక రాసిక - పులిహొర
ఆచారి రోజున అమ్మవారికి శక్తికొద్దీ చీర జాకెట్ ముక్క తాంబూలంతో పెట్టాలి. ఈ తొమ్మిది రోజులు సమయం దొరికినప్పుడల్లా మీకు ఇష్టమైన అమ్మ వారి నామస్మరణ చేస్తే మంచిది అని దేవీభాగవతం చెప్పింది.

అందరికీ వసంత నవరాత్రి శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...