శ్రీకృష్ణుడు అన్న మాటకి రుక్మిణిదేవి కుప్పకూలింది

శ్రీకృష్ణుడు అన్న మాటకి రుక్మిణిదేవి కుప్పకూలింది



జగన్మాత అయిన లక్ష్మీదేవి భూలోకంలో రుక్మిణిగా పుట్టింది కదా. అలా ఆమె కూడా మాయలో పడిపోయింది శ్రీకృష్ణుడి మొదటి భార్యను పట్టపురాణి అని కొంచెం అహంకారం వచ్చింది. దానిని తొలగించడానికి శ్రీకృష్ణుడు ఒక లీల చేశారు. ఒకరోజు రుక్మిణిదేవి అంతఃపురంలో తెల్లని పానుపు మీద జగదీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు కూర్చొని ఉన్నారు. ఆ శ్రీకృష్ణుని రుక్మిణీదేవి ఆమె చెలికతెలు సేవ చేస్తున్నారు.   రుక్మిణి దేవి చెలికత్తె చేతిలోని వింజామరలు తీసుకుని శ్రీకృష్ణునకు మెల్లిగా విచారణ సాగింది. అలా కృష్ణల వారిని రుక్మిణీదేవి సేవిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి తో చిరునవ్వుతో చమత్కారంగా రుక్మిణి! బలంలో, శౌర్యంలో, రూపంలో, భోగంలో, త్యాగంలో, సంపదలో, సద్గుణాలలో,  శిశుపాలుడు మొదలైనవారు చాలా గొప్పవారు.పరిపూర్ణులు.అటువంటి శిశుపాలుడి తోనే తల్లి తండ్రి సోదరుడు నీకు వివాహం చేద్దాము అనుకుంటే  ఒప్పుకోక నీవు సముద్రగర్భంలో తలదాచుకున్న నన్ను ఎందుకు వివాహమాడావు. మా నడవడి లోకులకు భిన్నమైనది. మా తీరు ఇతరులకు అంతుపట్టదు. బలవంతులతో శత్రుత్వం పెట్టుకుంటాము. రాజ సింహాసనాలు కోసం ఆశపడ్డము. సముద్రమే ఎప్పుడు మాకు నివాసస్థానం. ఏమీలేని వాళ్ళము, ధన హీనుల గుణ హీనులము మేము పేదలతో తప్ప ధనవంతుల తో స్నేహం చేయము.రహస్య వార్తనుఅందుకుంటాము  బిక్షకులను ఆశ్రయిస్తాం. అటువంటి వారిని స్త్రీలు వరిస్తారా? ఇలాంటి గుణాలు ఉన్న నన్ను నీవెందుకు వలచావు. లోకంలో ఎటువంటి వారికైనా ప్రియమైన  సంపద సౌందర్యం అంశం సమానంగా ఉన్నప్పుడే శోభిస్తుంది. లేకపోతే సంబంధాలు సరిగా జరగదు. గుణ హినులతో సంబంధం తగ్గదు కదా. నా సంబంధం తగినది కాదని గ్రహించలేకపోయాను.తెలియక నన్ను వివాహమాడావు. పొరపాటు చేశావు. పోనీలే నీకు తగిన రాజేంద్రుడు ని మరెవరైనా వివాహమాడాడు.  భూపతి జరాసంధుడు చేది రాజు శిశుపాలుడు చెలరేగి ద్వేషంతో నా వెనక పడుతున్నారు. నీ సోదరుడైన రుక్మి బల గర్వంతో మిడిసి పడుతున్నాడు. అహంకారాన్ని అణచడానికి మాత్రమే ఆనాడు నిన్ను బలవంతంగా తీసుకొని వచ్చాను. అంతేగాని ప్రాంతాల పట్ల సంతానం పట్ల ఐశ్వర్యం పట్ల ఆసక్తి లేదు. కామ మోహ ములకు మేములోను కాము. తన ప్రాణ నాధుడుని నోటి నుండి ఇంతకు ముందు ఎన్నడూ వినని మాటలు విని అంతులేని ఆవేదనతో రుక్మిణి దేవి కుప్పకూలింది. అలా నేలపై పడిపోయిన రుక్మిణీదేవి దగ్గరకు వెళ్ళారు. శ్రీకృష్ణుడు ఆమె కోలుకునేలాగా ప్రేమగా సపర్యలు చేశారు. తరువాత ఆమెను ఎత్తుకుని పాన్పు పైకి చేర్చాడు.మేము క్రియరహిత తులము పరిపూ పరిపూర్ణానులము వ్రాసిన నాలుగు గోడల మధ్య దీపంలాగా నిత్య ఆత్మబుద్ధి తో వెలుగుతూ ఉంటాను. అటువంటి మమ్మల్ని పట్టుకొని ఎందుకు బాధ పడతావు. అని శ్రీకృష్ణుడు పలికారు.శ్రీకృష్ణుడు ఇలా మాట్లాడుతున్న సమయంలో పట్టపురాణి అనే గర్వం తో ఉన్న రుక్మిణిదేవి ఆత్మాభిమానం అంత నేర్పుగా తొలగించారు.సేద్ధతిరిన రుక్మిణి దేవి శ్రీకృష్ణుడితో భక్తులను వాత్సల్యముతో రక్షించు దేవాదిదేవా శ్రీకృష్ణా! నీవు అన్ని రకాలుగానూ అనంత తేజోమూర్తివి. జ్ఞానము సుఖము బలము ఐశ్వర్య మున్నగు సద్గుణాలు సర్వ నీలోనే నెలకొని ఉన్నాయి. నీకు నేను తగినదాననా? నీవు ప్రకృతి పురుషులకు కాలానికి ఈశ్వరుడు. కళకే సేలం తో శోభించే నీ మనోహరమైన రూపము ఎక్కడ?త్రీ గుణాలతో గూడిన మూడు రాళ్లను నేనెక్కడ? నీ సద్గుణ సంపద దానం కీర్తించబడుతున్నాయి అనే సందోహంతో ఎవ్వరికీ అందకుండా పాలసముద్రంలో శేషతల్పంపై పవళించి చేస్తున్నావ్ ఏమో అటువంటి నీ లీలలు దివ్యములైనవి.పాపములను తొలగించును వాడా! మునీంద్రుల చేయు యోగీశ్వరుల చేసే దేవతలచే వర్ణమైన ప్రభావము కలిగిన నీవు జియో లో సర్వులకు విజ్ఞానమును ఇచ్చువాడు. నేను నిన్నే ఆమె తంగా వివరించాను. శత్రురాజులను ఓడించి నీ సూరత్వంతో అయినా నన్ను గ్రహించావు. రణరంగంలో రాజు పురుగులను ఎదిరించ లేనట్టుగా నటిస్తూ భయపడుతున్నట్లు నీవు సముద్ర మధ్యాలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇది నీ మాయ కాక వాస్తవమా? యోగులు మునులు, ఋషులు సమస్త సంపదలు వదిలేసిన సత్పురుషులు నిన్ను నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. అటువంటి నిన్ను సేవించకుండా చెడు బుద్ధి కలిగిన మానవుడిని ఎవరు సేవిస్తారు. ఇంకా నిన్ను భూలోకంలోనూ వైకుంఠం లోని సమస్త ప్రదేశాలలో నేను వివిధ రూపాలు స్వీకరించి నిన్నే సేవిస్తుంటారు. అందుకే నీకు తెలియని ధర్మం లేదు అన్నీ రుక్మిణి విన్నవించుకుంది. శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించి రుక్మిణితో నేను నవ్వులాటకు అన్న మాటలకు నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు. వేటలో రణరంగంలో భార్యాభర్తలు ఏకాంతంలో సూటిపోటి మాటలు మాట్లాడినా తప్పుగా భావించరాదు.నీ మనసును తెలుసుకోవడం కోసం ఇలా అన్నాను ఈ పాటికి నువ్వు బాధ పడవద్దు అని అన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...