సాంబుడు లక్షణ వివాహం

సాంబుడు లక్షణ వివాహం

శ్రీకృష్ణుడు జాంబవతి కుమారుడు సాంబుడు. దుర్యోధనుని కుమార్తె పేరు లక్షణ. సాంబుడు లక్షణనెత్తకొచ్చుట గురించి ఒకరంటే ఒకరికి ఇష్టం. ఈ విషయం తెలిసిన దుర్యోధనుడు అహంకారంతో ఆ యాదవులకు నా బిడ్డను ఎలా ఇస్తాను అని స్వయంవరం చాటాడు. దానికి సాంబుడిని తప్ప అందరి రాజులకి ఆహ్వానం పంపారు. ఈ విషయం తెలుసుకున్న సాంబుడు ద్వారకలో ఎవ్వరికి చెప్పకుండా రథం మీద బయలుదేరాడు. హస్తినాపురంలో స్వయంవరం జరుగుతుండగా అక్కడికి స్వయంవరం ప్రాంగణంలోకి రధాన్ని పోనిచ్చి లక్షణాలు ఎత్తుకొని తీసుకువచ్చారు. దుర్యోధనుడికి ఇది చూసి కోపం వచ్చి సాంబుడిని వెంబడించాడు. దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు మొదలైన వారు అనుసరించారు. సాంబుడు ని పట్టుకొని బంధించి చెరసాలలో వేశాడు. సాంబుడు ద్వారకలో లేని విషయం తెలుసుకున్న కృష్ణుడు అర్జునుడు మొదలైనవారు హస్తినాపురం పై యుద్ధానికి బయలుదేరారు. ఇది తెలుసుకున్న బలరాముడు వారిని ఆపి దుర్యోధనుడు నా శిష్యుడు అతనికి నేను నచ్చజెప్పి అతనికి నేను నచ్చజెప్పి సాంబుని విడిపించి లక్షణాలు ఇచ్చి వివాహం చేసి వస్తాను అని బయలుదేరాడు. హస్తినాపురానికి వచ్చిన బలరాముడిని చూసి దుర్యోధనుడు సాదరంగా ఆహ్వానించారు. బలరాముడు దుర్యోధనుడితో మా సాంబుడిని బంధించావు కదా అతనినివిడిపించి కుమార్తె లక్షణను ఇచ్చి వివాహం చేయి అని అన్నారు    . అప్పటివరకు వినయం నటిస్తున్న దుర్యోధనుడు కోపంలో భోగి పోతు మేము క్షత్రియులము మీరు పశువుల కాపరులు మీతో మేము వియం తీసుకోము. ఆ సాంబుడు జాంబవతి కుమారుడు కోతి జాతికి చెందినవాడు అని బలరాముడిని కృష్ణుడిని యాదవుల అందరినీ తిట్ట సాగాడు. అర్జున్ విని బలరాముడికి కోపం వచ్చి తన నాగలిని ప్రత్యక్షం చేసి దానిని హస్తినాపురానికి చివరి వరకు వెళ్ళేలా చేసి భూమి లోపల గురించి హస్తినాపురాన్ని మొతన్నియమునా నదిలో ముంచెత్తే బోయారు. ఇటు బలరాముడి సంకల్పం తెలిసిన యమునానది కూడా పెద్ద పెద్ద కెరటాలతో హస్తినాపురం మీద పడసాగింది. యమునా నది ఉగ్రరూపం చూసి భూమి కదిలి పోతుంటే చూసి దుర్యోధనాదులు భయపడి క్షమించమని బలరాముడి కాళ్ల మీద పడ్డారు. మీరు చెప్పినట్టే చేస్తాము. బలరాముడి కోపం తాటాకు మంట వెంటనే తగ్గిపోయింది సాంబుడిని చెరసాల నుండి తీసుకొచ్చి లక్షణం ఇచ్చి వివాహం చేసి పంపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...