శమంతకమణి కథ

శమంతకమణి కథ


సత్రాజిత్తు సూర్యుడిని భక్తితో ఆరాధించాడు. సూర్యభగవానుడు అతని భక్తికి మెచ్చి శమంతకమణి ఇచ్చారు. దీనినే ఇస్తూ ఈ మనీ ప్రతిరోజు ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుంది. ఈ మణి ఉన్న చోట ఉపద్రవాలను దూరం చేస్తోంది సకల శుభాలను కలిగిస్తుంది రోగాలు ఉండవు అని చెప్పి శమంతకమణి సత్రాజిత్తుకు ఇచ్చి ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. సత్రాజిత్తు కి సమంతకమని ని చూసిన కొంతసేపటికి అహంకారం వచ్చింది. ఇక లోకంలో నా కన్నా ధనవంతుడు లేరు నేనే గొప్పవాడిని అని అనుకున్నాడు. ఆ మణిని మెడలో వేసుకొని తన గొప్ప ను చూపించటం కోసం శ్రీకృష్ణుడికి దీనిని చూపించాలి అనుకుంటున్నారు. శ్రీ కృష్ణుడి దగ్గరకు వెళుతుంటే ఆ మణికాంతిని చూసి ద్వారకా నగర ప్రజలు సాక్షాత్తూ సూర్య భగవానుడు వస్తున్నాడు అనుకున్నారు. మన శ్రీకృష్ణభగవానుని చూడటానికి ఎప్పుడూ మునులు దేవతలు వస్తూ ఉంటారు కదా అలాగే ఈ రోజు సూర్య భగవానుడు వస్తున్నాడు అనుకున్నారు. శ్రీ కృష్ణుడి దగ్గరకు వెళ్లి శ్రీకృష్ణా! వాసుదేవ! పరంధామా! ఈ రోజు మిమ్మల్ని చూడటానికి సాక్షాత్తు సూర్యభగవానుడే వస్తున్నాడు అని చెప్పారు. అది విని అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి వస్తుంది సూర్యభగవానుడు కాదు ఆయన నిజంగా భూమి పైకి వస్తే ఈ భూమి నిలవదు. సూర్యభగవానుడి అనుగ్రహంతో సత్రాజిత్తు శమంతకమణి పొందాడు దానిని ధరించి నా దగ్గరికి వస్తున్నాడు అన్నారు. సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దర్శనానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు కుశల ప్రశ్నలడిగి కొంతసేపటి తరువాత శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు రాజుల దగ్గర ఉంటే రాజ్యానికి క్షేమం కలుగుతుంది. దీనిని ఉగ్రసేన మహారాజు ఇస్తావా అన్నారు. అందుకు సత్రాజిత్తు నేను ఇవ్వను అన్నాడు. శ్రీ కృష్ణుడు ఎందుకు శమంతకమణిని అడిగారు అంటే శమంతకమణి అంటే ఆలోచనలను నశింపజేసే మణి అని అదే సత్రాజిత్తు దగ్గర ఉంటే ప్రమాదమని తప్పించాలి అనుకున్నారు. అంతటి పరమాత్మ అడిగినా సత్రాజిత్తు అహంకారంతో ఇవ్వలేదు. తరువాత శ్రీ కృష్ణుడి దగ్గర సెలవు తీసుకొని సత్రాజిత్తు తన భవనానికి వెళ్లి బ్రాహ్మణులతో శాస్త్రోక్తంగా సమంతకమని పూజించారు. సమంతకమని ప్రతిరోజు ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుంది. ఆ బంగారం తో తన భవనాన్ని ఇంట్లోని వస్తువులన్నింటిని బంగారంతో చేయించుకున్నాడు. కానీ భగవత్ కార్యానికి ఉపయోగించలేదు. ఒకరోజు ప్రసేనుడు సత్రాజిత్తు దగ్గరకు వచ్చి అన్నయ్య నేను ఈ మణిని ధరించి వేటకు వెళ్తాను అన్నారు. అందుకు సత్రాజిత్తు ఇది మనదే కదా వేసుకొని వెళ్ళు అన్నారు. ప్రసేనుడు అడవిలో జంతువులను వేటాడుతుండగా ప్రసేనుడు మెడలో వేసుకున్న మణిని చూసినా సింహం మాంసపు ముద్ద అనుకొని ప్రసేనుని చంపేసి అ మణిని తీసుకెళ్ళింది. అటుగా వెళుతున్న జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకెళ్లాడు. తన గుహ లోకి వెళ్ళిన తర్వాత ఉయ్యాలలో ఊగుతున్నది తన కుమారుడికి ఆడుకోమని ఇచ్చారు. సత్రాజిత్తు తమ్ముడు ఇంకా రాలేదు అని మనుషులను పంపించి వెతికించారు. ఎక్కడా ప్రసేనుడు కానీ అతని గుర్రము కానీ కనిపించలేదు. సత్రాజిత్తు ఆమని కోసం శ్రీకృష్ణుడే నా తమ్ముడ్ని చంపి తీసుకుని ఉంటారు. ఆరోజు సభలో నన్ను మణిని ఇవ్వమని అడిగారు కానీ బలవంతం చేయలేదు ఇలా తీసుకుందామని అనుకున్నారు తీసేసుకున్నారు అనే కనపడ్డ వారందరికీ ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి శ్రీకృష్ణుడికి తెలిసింది. తాను చేయని పని కి తనమీద నింద పడిందని అని శ్రీకృష్ణుడు బాధపడ్డాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని అడిగారు. ప్రసేనుడు ఆ శమంతక మణిని వేసుకుని అడవికి వెళ్ళారు అని మళ్ళీ తిరిగి రాలేదు అని తెలుసుకున్నారు. శ్రీ కృష్ణుడు తన మీద 18న తొలగించుకోవటానికి బంధుమిత్రులు అందరిని తీసుకొని ప్రసేనుడు వెళ్ళిన వైపు వెళ్లారు. కొంత దూరం వెళ్ళిన తరువాత అక్కడ సింహం గుర్తులు ప్రసేనుడు శవం గుర్రం శవం కనిపించింది. శ్రీకృష్ణుడు భటులను పిలిచి ప్రసేనుడు శవాన్ని సత్రాజిత్తు కి  అప్పగించమని అజ్ఞాత పించారు. శ్రీకృష్ణుడు కొంతదూరం ముందుకు వెళ్లారు. అక్కడ సింహం చనిపోయి కనిపించింది. ఇక్కడి నుండి ఎలుగుబంటి జాడలు కనిపించాయి. ఆ ఎలుగుబంటి వెళ్ళిన గుహను చూశారు. బంధుమిత్రులతో శ్రీకృష్ణుడు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి మణిని తీసుకు వస్తాను అన్నారు. శ్రీకృష్ణుడు లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఉయ్యాలలో ఉన్న ఒక బాలుడు మణితో ఆడుకుంటూ కనిపించారు. శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకుందామని వెళ్లగా అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పరిచారిక మణి తీసుకెళ్తున్నారని కేకలు వేసింది. అది విని నిద్రపోతున్న జాంబవంతుడు కోపంతో అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణుని సామాన్య మానవుడు అని భావించి శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు. వారి యుద్ధం భయంకరంగా 28 రోజులు జరిగింది. చివరికి జాంబవంతుడు అలసిపోయే ఇలా అనుకున్నారు. శ్రీమహా విష్ణువు వామన అవతారం ఎత్తి భూమిని గెలిచినప్పుడు ఆ బ్రహ్మాండం రూపాన్ని 21 సార్లు ప్రదక్షిణ చేశాను. అంతటి బలవంతుడనో నన్ను ఓడించారు అంటే ఈయన శ్రీమహావిష్ణువే. ఆయన రామావతారం లో ఉన్నప్పుడు రాముడు రావణుడితో యుద్ధం చేసినా తీరు నచ్చింది. రాముడు మరణించిన యుద్ధం అయిపోయిన తర్వాత నన్ను పిలిచి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అందుకు నేను శ్రీరామ మీరు యుద్ధం చేస్తున్న తీరు నాకు నచ్చింది నేను మీతో యుద్ధం చేయాలి అన్నాను. అప్పుడు శ్రీరాముడు నేను ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గా వస్తాను. అప్పుడు నీ కోరిక నెరవేరుస్తాను అన్నారు. ఆ విషయం గుర్తుకు వచ్చిన వెంటనే శ్రీకృష్ణుని పాదాలపై పడ్డారు. జాంబవంతుడు తన తప్పును తెలుసుకుని క్షమించమని వేడుకొన్నారు. జాంబవంతుడి శరీరం శ్రీకృష్ణుడు కొట్టిన దెబ్బలకే కమిలిపోయి ఉంది. శ్రీకృష్ణుడు దయతో ఆయన శరీరాన్ని నిమిరారు. వెంటనే అతని శరీరం మందులాగా మారిపోయింది. జాంబవంతుడు స్వామి నా మీద దయ ఉంచి నేను కోరిన కోరికలు తీర్చడానికి నాతో తన్నులు తిన్నావా. నేను అపచారం చేశాను. నా స్వామికి నొప్పి కలిగించాను. స్వామి ఆ శమంతక మణిని నువ్వే తీసుకో దానితోపాటు నా కుమార్తె జాంబవతిని కూడా వివాహం చేసుకో అన్నారు. అక్కడ దోహా బయట ఉన్న శ్రీకృష్ణుని బంధుమిత్రులు 12 రోజుల వరకు చూసి శ్రీకృష్ణుడు తిరిగి రాకపోయేసరికి అతను ఏదో ఆపదలో ఉన్నాడు అనుకుని ద్వారకానగరానికి వెళ్లిపోయారు. ద్వారకా నగరంలో అందరికీ శ్రీకృష్ణుడు ఆపద లో ఉన్నారు అని చెప్పారు. అప్పుడు రుక్మిణీదేవి దేవకీవసుదేవులు ద్వారకా నగరవాసులు దుర్గామాతను పూజించారు. దుర్గామాత వారి పూజలకు ఆకాశవాణి గా శ్రీకృష్ణుడు ఆపదలో లేడు విజయంతో మణితో తిరిగి వస్తారు అని చెప్పింది. దుర్గామాత చెప్పినట్టుగానే శ్రీకృష్ణుడు శమంతకమణితో కన్యామణీతో తిరిగివచ్చారు. ద్వారక కు వచ్చిన తర్వాత సభను ఏర్పాటు చేసి సత్రాజిత్తుని పిలిచి శమంతకమణిని దగ్గర ఉంది అని ఇదిగో తీసుకో అని ఇచ్చారు. అప్పుడు కూడా సత్రాజిత్తు మణి శ్రీ కృష్ణునికి ఇవ్వలేదు. ఆ తరువాత అందరి సమక్షంలో జాంబవతిని వివాహం చేసుకున్నారు. సత్రాజిత్తు కి కొన్నాళ్ళ తరువాత కనబడిన వారు అందరూ జాగ్రత్తగా మళ్ళీ ఎవరికీ ఇవ్వకు మా కృష్ణుని మీద నింద వేయకు అన్నారు. అవి అన్ని వినీవినీ కొంత కాలానికి సత్రాజిత్తు పశ్చాత్తాపం మొదలైంది. తాను చేసిన పనికి సిగ్గు పడ్డాడు. బలవంతులైన వారితో విరోధం వచ్చిందే అని భయపడ్డాడు. దేనిని మార్చటానికి దారి ఏది అని ఆలోచించసాగాడు. చివరికి జాంబవంతుడు చేసిన పనిని నేను చేస్తాను అనుకున్నారు. నేను నా కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం చేసి మణిని కూడా శ్రీకృష్ణుడికి అప్ప చెపుతాను అనుకున్నారు. శ్రీకృష్ణుడికి తన కుమార్తె అయిన సత్యభామని ఇచ్చి వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత శమంతకమణి తీసుకొని శ్రీ కృష్ణుడికి ఇచ్చారు సత్రాజిత్తు. అప్పుడు శ్రీకృష్ణుడు శమంతకమణిని నాకు వద్దు నాకు మీ కన్యామణీని ఇచ్చారు చాలు. మాకు మణులకు కొదవలేదు అని తిరిగి సత్రాజిత్తుకు శమంతకమణి ఇచ్చి వేశారు. ఇంతలో అక్కడ లక్క ఇంట్లో పాండవులు కుంతీ దేవి చనిపోయారు అని శ్రీకృష్ణుడు విన్నారు. సర్వము తెలిసిన శ్రీకృష్ణుడు ఏమి అనకుండా బలరాముడి తో పాటు హస్తినాపురానికి వెళ్లారు. అక్కడ కృపా, విదురా, గాంధారి, భీష్మద్రొనులను ఓదార్పునిచారు. శ్రీకృష్ణుడు ద్వారక లో లేరు అని తెలుసుకొని శ్రీకృష్ణుని పరమభక్తుడైన అక్రూరుడు కృతవర్మ కలిసి మాట్లాడుకున్నారు. ఆ సత్రాజిత్తు మన స్వామి పైన నిందలు వేసాడు. అప్పటినుండి నా మనసు రగిలిపోతోంది. శ్రీ కృష్ణునికి సత్యభామని ఇచ్చి వివాహం చేసి తాను చేసిన పనికి పుచ్చుకోవాలి అనుకున్నారు. స్వామి కూడా అతనిని క్షమించినా మనం క్షమించకూడదు. అసలు ఇదంతా ఆ సమంతకమని వలన వచ్చింది. ఆ శమంతకమణి సత్రాజిత్తుకు దగ్గర లేకుండా చేయాలి అనుకున్నారు. వెంటనే శత ధన్యుడిని కలిసి " దుర్మార్గుడైన సత్రాజిత్తు సత్యభామను నీకు ఇస్తానని చెప్పి శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేసి మాట తప్పారు. అతనిపై పగ తీర్చుకో సమంతకమని నువ్వు తీసుకో" అన్నారు. అసలే సత్యబామ తో వివాహం జరగలేదని శతధన్వుడు కోపంలో ఉన్నాడు వెంటనే సత్రాజిత్తు ఇంటికి వెళ్లి అతని నిద్రపోతున్న సమయంలో చంపివేశాడు. చనిపోతున్నప్పుడు సత్రాజిత్తు కేకలు విని అతని భార్యలు వచ్చి ఏడుస్తుండగా శమంతకమణిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అప్పుడు కృతవర్మ శతాబ్దంనుండి తో అయ్యో ఎంతపని చేశావు శ్రీకృష్ణ బలరాములు మహానుభావులు వారిని ఎదుర్కొని కీడు చేయగల సమర్థులు ఇక్కడ ఎవరూ లేరు. వారు ఎంతో మంది రాజులను ఓడించారు వారి పరాక్రమాలు మనకు కొత్తవేమీ కాదు. అయినా శమంతకమణిని తీసుకోమని చెప్పావు గాని సత్రాజిత్తును చంపమని అనలేదు. నేను నీకు సహాయం చేయలేను వెళ్ళు అన్నారు.  శతధన్వుడు  అక్కడి నుండి అక్రూరుడు ఇంటికి వెళ్లారు. ఆ క్రూరుడు శతాబ్దంలో మీరు చేసిన పనికి బాధపడి శ్రీకృష్ణుడు పరమాత్మ ఈ ప్రపంచాన్ని పొట్టి నుంచి పోషించి రక్షించి నశింప చేస్తాడో? ఎవరి మాయ ఈ లోకాన్ని మోహింప చేస్తుందో? అట్టి మహానుభావుడైన వాసు దేవుడికి నేను నమస్కరించే వారి మెకానిక్ వైరానికి రాము నువ్వు మరొక మార్గం చూసుకో నీ స్నేహం వలన మాకు జరిగింది చాలు అన్నారు. అప్పుడు శతధన్వుడు కనీసం ఈ శమంతకమణిని అయినా తీసుకో దీని ప్రకాశం నేను ఎక్కడున్నా శ్రీకృష్ణుడికి తెలియజేస్తూది అన్నారు. అక్రూరుడు తీసుకోను అన్నాడు. అప్పటికే శతధన్వుడు కి  శ్రీకృష్ణుడితో విరోధం అనుకుని బాగా భయపడిపోయి ఆమె ఇంట్లో పడేసి గుర్రం ఎక్కి పారిపోయాడు. తన తండ్రి మరణించాడు అని తెలుసుకొని సత్యభామ అతడి ఇంటికి వెళ్లి జరిగింది తెలుసుకుని తన తండ్రి శవాన్ని నూనెలో భద్రపరిచి శ్రీకృష్ణుడికి వర్తమానం పంపింది. శ్రీకృష్ణ బలరాములు వెంటనే ద్వారకకు చేరుకున్నారు. జరిగినది తెలుసుకొన్నారు. శతాబ్ధం వాడిని సంహరిస్తాను అని శ్రీకృష్ణుడు బయలుదేరారు. ఆయన వెనకే బలరాముడు కూడా బయలుదేరారు. శతధన్వుడు భయంతో పారిపోయి మిధిలా నగరం వరకూ చేరాడు. ఎక్కడ శతధన్వుడు గుర్రం తిరిగి వేగంగా పారిపోతుండగా శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించి సంహరించారు. శ్రీకృష్ణుడు వెంటనే అతని దగ్గరకు వెళ్లి వెతక సమంతకమని దొరకలేదు. ఈలోగా బలరాముడు అక్కడికి వచ్చారు. శమంతకమణి అతని  దగ్గర లేదు అని శ్రీకృష్ణుడు బలరాముడికి చెప్పారు బలరాముడు మనసులో శ్రీకృష్ణుడు శమంతకమణిని తీసుకొని లేదు అంటున్నాడు అనుకున్నారు. పైకి మాత్రం అతని దగ్గర లేకపోతే అతని స్నేహితులైన అక్రూరుడు కృతవర్మ దగ్గర ఉంటుంది అన్నారు. శ్రీకృష్ణుడు అన్నయ్య బలరాముడి మనస్సులోని విషయాన్ని గ్రహించి ఇది అంత శమంతకమణి ప్రభావం అనుకున్నారు. బలరాముడు తిరిగి ద్వారకకు రాకుండా మిథిలా నగరపు రాజు జనకుడి ని చూడాలని ఉంది నేను వెళ్లి వస్తాను నువ్వు ద్వారక వెళ్ళు అన్నారు. మిథిలా నగర రాజు జనకుడు బలరాముడిని సాదరంగా ఆహ్వానించి కొంతకాలం అక్కడే ఉండమని వేడుకొన్నారు. శ్రీకృష్ణుడు వెంటనే తిరిగి భారత కు వచ్చారు. అక్కడే రోడ్డు కృతవర్మ మణి తన దగ్గర ఉంది అంటే స్వామి మనల్ని అసహ్యించుకుంటారు ఏమో అనుకొని ఎవరికీ చెప్పకుండా కాశీకి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు తమ మామగారైన సత్రాజిత్తు కి ఉత్తరక్రియలు జరిపించారు. శ్రీకృష్ణుడు పక్కన లేకుండా బలరాముడు ఒంటరిగా మిధిలా నగరం లో ఉన్నాడు అని తెలుసుకొని మాయలమారి శకుని దుర్యోధనుని తీసుకొని మిథిలా నగరానికి వెళ్ళాడు. మిథిలా నగర రాజు చెక్కుని దుర్యోధనుని సాదరంగా ఆహ్వానించారు. సమయం చూసుకొని బలరాముడిని ప్రసన్నం చేసుకుని దుర్యోధనుడు బలరాముని దగ్గర గదా యుద్ధం నేర్చుకున్నాడు. అక్రూరుడు ద్వారకలో లేకపోవటంతో ద్వారకలో ఉత్పాతాలు సంభవించాయి. వర్షాలు పడటం ఆగిపోయాయి. అప్పుడు ద్వారకా నగరం లోని ప్రజలు భయపడి శ్రీకృష్ణుడితో ఇలా అన్నారు. శ్రీకృష్ణ! పరమాత్మ! నీవు ఉండగా మాకు ఎన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి. మమ్మల్ని కాపాడు స్వామి అని వేడుకొన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకానగర ప్రజలతో ఆ క్రూరుడు నా భక్తుడు అతని భక్తి గొప్పది. ధర్మం నిష్టుడు. మహాతపస్వి. అతను తిరిగి వస్తే ఈ ఉపద్రవాలు తొలగిపోతాయి వానలు కురుస్తాయి. అతను ఇప్పుడు కాశీలో ఉన్నారని తెలిసింది నేను కొంతమందిని పంపాను అక్రూరుని గౌరవంగా తీసుకురమ్మని చెప్పాను. వారు అక్రూరుడు ని తీసుకు వస్తారు మీరు దిగులు పడకండి అన్నారు. అప్పుడు ద్వారకా నగర ప్రజలు పరమాత్మ! నువ్వు ఉండగా ఆకులు ఎందుకు నువ్వు తలుచుకుంటే వానలు కురుస్తాయి కదా అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు పూర్వం ఒకసారి కాశీ లో కూడా వర్షాలు కురవ లేదు. అప్పుడు అక్రూరుని తండ్రి అయినా  శ్వఫక్కుని తీసుకురమ్మని పండితులు కాశిరాజుకి చెప్పారు. అతను భగవద్ భక్తుడు భాగవతోత్తముడు మహా తపస్వి. వారు వారి కోసం కాక లోకం కోసం ఆలోచిస్తారు. లోకానికి మేలు చెయ్యాలని చూస్తారు. అతనిని తిరిగి తీసుకురండి అన్నారు. అప్పుడు కాశీరాజు శ్వఫక్కుని కాశీ రాజ్యానికి  తీసుకు వచ్చారు. అప్పుడు కాశీ రాజ్యంలో వర్షాలు పడ్డాయి. అందుకు సంతోషించిన కాశీరాజు తన కుమార్తె అయిన కాంతిని ఇచ్చి వివాహం చేశారు. వారికి అక్రూరుడు జన్మించాడు. అతను పుట్టుకతోనే భాగవతోత్తములు మహాతపస్వి. నేను తప్ప అన్యం ఎరుగరు. ఇప్పుడు నా మీద భక్తి అతిభక్తి గా మారి నేను నిన్ను ఫాలో అయ్యాను అనుకొని అతను చిన్న పొరపాటు చేసినా ముఖం చూపించలేక వెళ్ళిపోయాడు. అతను వస్తాడు అందుకేనా భక్తుల భక్తి నా కన్నా గొప్పది అన్నారు. శ్రీకృష్ణుడు అన్నట్టుగానే అక్రూరుని గౌరవంగా తీసుకువచ్చారు. ఆ కుర్రాడిని సత్కరించి శ్రీకృష్ణుడు అతని భయం పోయేలాగా ప్రేమగా మాట్లాడే సాగారు. ఆ క్రూర శతధన్వుడు తాను పారిపోతూ సమంతకమని నీ ఇంట్లో వదిలేసి వెళ్లాడు అని నాకు తెలుసు. సత్రాజిత్తు కి కుమారులు లేరు అతనికి సత్యభామ ఒక్కతే కుమార్తె. అందుకని వారసత్వంగా ఆమణి ఆమెకే చెందుతుంది. కానీ మాకు ఆ మణి వద్దు. ఒక్కసారి ఆ శమంతక మణిని సభలోని వారందరూ నా బంధుమిత్రులందరికీ చూపించు. నా అన్నయ్య బలరాముడు ఆ శమంతకమణిని నేనే తీసుకున్నాను అనుకుంటున్నాడు. అప్పుడు అక్రూరుడు తాను చేసిన తప్పు తెలుసుకుని తన దగ్గర ఉన్న శమంతకమణి ని శ్రీకృష్ణుడికి సమర్పించారు. శ్రీకృష్ణుడు ఆ మణిని సభలోని వారందరికీ చూపించారు. దానిని మళ్లీ అకృరునికి ఇచ్చి దీనిని నీ ఇంట్లో బంగారు సింహాసనంపై ఉంచి రోజు పూజించు. ఏమని ద్వారా వచ్చిన బంగారాన్ని యజ్ఞయాగాది క్రతువులకు నిర్వహించు దానధర్మాలు చేయి అన్నదానాలు చేయి. వీలైనన్ని భగవత్ కార్యాలకు ఉపయోగించు అన్నారు. శ్రీకృష్ణుడు తన భయపడ్డ నిందితులను తొలగించి తన నిర్మలత్వాన్ని అందరికీ నిరూపించుకున్నారు. వేగుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బలరాముడు శ్రీకృష్ణుడు అని అనుమానించి నందుకు బాధపడ్డాడు. ( ఆ సమంతకమని శ్రీకృష్ణుడు నిర్ణయానికి వెళుతుండగా తనతో తీసుకువెళ్ళి దారిమధ్యలో దానిని ఉద్యోగులకు ఇచ్చి నగరంలో అని చెప్పారు అని కలియుగాంతంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితి పూర్తిగా పాడైపోతుంది అని కల్కి అవతారం తరువాత కలియుగం అంతమయ్యేది కృత యుగం ప్రారంభం అవుతుంది అప్పుడు ప్రపంచ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి దేనిని ఉపయోగిస్తారు అని యోగుల విశ్వాసం )




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...