పారిజాతాపహరణం

పారిజాతాపహరణ



ఆ తరువాత శ్రీకృష్ణుడు దేవేంద్రుని పట్టణమైన అమరావతికి వెళ్లాడు. దేవరాజైన ఇంద్రుడు శ్రీకృష్ణుని సత్యవాణి సాదరంగా ఆహ్వానించారు. దేవమాత అదితి అంతఃపురానికి వెళ్లారు. ఆమె శ్రీకృష్ణుని సత్యభామని సాదరంగా ఆహ్వానించింది. తరువాత శ్రీకృష్ణుడు కాంతులతో సూర్యమండలాన్ని తిరస్కరిస్తున్న ఆమె మణికొండలను ఆమెకు సమర్పించాడు. శశి దేవి ఇంద్రుల వారిచేత సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు పూజలు అందుకున్నాడు. తర్వాత సత్యభామ నందన వనానికి వెళ్ళాదాము అని కోరింది. శ్రీకృష్ణుడు ఆమెను ఆ వనానికి తీసుకొని వెళ్ళాడు. ఆ నందనవనంలో పారిజాత వృక్షాన్ని చూశారు. ముల్లోకాల్లో ప్రజల కోరికలు తీర్చడంలో మిక్కిలి ప్రసిద్ధమైనది పారిజాత వృక్షము. మనోహరమైన దాని పరిమళాలకు దరిచేరి చక్కెరలు తిరుగుతున్న తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి. చిగుళ్లు, అంకురాలు, మొగ్గలు, బొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు మున్నగు వాటితో నిండుగా ఉన్నాయి. ఆ పారిజాత వృక్షాన్ని చూసి పరవశించి నాకు సత్యభామ తనకు కావాలి అని శ్రీకృష్ణుడిని కోరింది. అందుకు శ్రీకృష్ణుడు సరే అని ఆ పారిజాతాన్ని అలాగే చేతిలో పెట్టి లేచి గరుత్మంతుడి వీపు మీద పెట్టాడు. శ్రీకృష్ణుడు ఇలా పారిజాతాన్ని అపహరించి తన ప్రాణ శక్తి అయిన సత్యభామ తో పాటు పక్షి ఇంద్రుడు గరుత్మంతుడి పై ఎక్కి బయలుదేరబోతున్నాడు.

 ఇంద్రుడు తాను త్రిలోకాధిపతీ అని గర్వంతో "శ్రీకృష్ణ దొంగతనంగా పారిజాత వృక్షాన్ని పట్టుకోవద్దు వదిలేయండి" అన్నారు. శ్రీకృష్ణుడు వెళుతుంటే ఆయన దారికి ఇంద్రుడు అడ్డం వచ్చి నుంచున్నాడు. దేవత సైన్యం ఇంద్రుడు శ్రీకృష్ణుని మీద యుద్ధానికి వచ్చింది. ఏ ఎందుకు అయితే నరకాసురుడు పెట్టే బాధలు తట్టుకోలేక శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తే శ్రీకృష్ణుడు దయతలచి నరకాసురుని సంహరించి దేవతలను రక్షించిన సంగతి ఇంద్రుడు మరిచిపోయాడు. ఆయన శ్రీమహావిష్ణువు గా దేవతలకు ఈ సంపదలన్నీ అనుగ్రహించాడు. ఆయనకి సంపదలకు కొదవ. ఈ పాటి వివేకం లేని దేవేంద్ర పదవి ఎందుకు? కాస్త రాక్షసుల బాధలు తీరగానే మల్లె అహంకారం తలకెక్కింది. తనను ఎదిరించిన దేవేంద్రుని ఓడించి శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చి సత్యభామాదేవి ఉద్యానవనంలో నాటించాడు దేవలోకపు తుమ్మెదలు పారిజాత వృక్షాన్ని అనుసరించి భూలోకానికి వచ్చాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...