మాఘ పురాణం 29

మాఘ పురాణం 29రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 29వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వ తి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో తపో సంపన్నుడైన భృగుమహర్షి ఒకసారి హిమాలయాలలో తపస్సు చేసుకోవటానికి వెళ్లారు.  అక్కడే కైలాసానికి పడమటి దిక్కులో  ఒక పర్వతం చరియా ఉంది.  నిత్యం కైలాస పర్వతం పై జ్ఞానులు, సిద్ధులు, ఋషులు పరమేశ్వరుని పూజించి వెళతారు.  కైలాస పర్వతం చుట్టుపక్కల కిన్నెర కింపురుషులు విహారానికి వస్తూవుంటారు. భృగు మహర్షి అక్కడే ఒక ఆశ్రమం నిర్మించుకొని ఉండేవారు. అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అక్కడికి విహారానికి ఒక గంధర్వుల జంట వచ్చింది. అక్కడ భృగు మహర్షి ఆశ్రయం చూసి వచ్చారు. భృగుమహర్షిని చూసి నమస్కరించి అక్కడే కూర్చున్నారు. గంధర్వుడు భృగుమహర్షితో మహాత్మ తమరు తపోశక్తి సంపన్నులు నా కష్టం నుంచి నన్ను రక్షించండి అని వేడుకున్నారు. భృగు మహర్షి గంధర్వుడుతో నీకు వచ్చిన కష్టం ఏమిటి నాకు చెప్పు అన్నారు. నా పూర్వజన్మ పుణ్యం ఫలితంగా నాకు స్వర్గం కూడా ప్రాప్తించింది. కానీ నాకు ఈ పులి మొఖం కలిగింది. నన్ను చూసి భయపడి ఎవరు దగరకు రావటం లేదు. నా భార్య మహాసాధ్వి కనుక నన్ను విడి వెళ్లకుండా ఉంటుంది. నాకు కలిగిన ఈ రూపానికి కారణం ఏమిటి? నాకు ఈ రూపం నుంచి విముక్తిని కలిగించండి. అపుడు  భృగుమహర్షి నివ్వు ఇప్పుడు మాఘమాసంలో నది స్నానము చేయి. ఎలా చేయటం వలన నీకు ఈ పులిమొఖం నుండి విముక్తి కలుగుతుంది. అతను అలాగే చేసాడు. ఆ మాసం చివరి రోజున మాఘస్నానం చేసి బయటకు రాగానే అతనికి పులి మొఖం పోయి అందమైన ముఖం వచ్చింది. అది చూసుకొని గంధర్వుడు అతని భార్య సంతోషించారు. భృగు మహర్షిని వేయినోళ్ల కొనియాడి ఆయనకు పదే పదే ధన్యవాదాలు చెప్పి తన లోకానికి వెళ్లిపోయారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 29వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...