శ్రీకృష్ణుడు వచ్చేస్తున్నాడు అని కంపించిన కంసుడు

శ్రీకృష్ణుడు వచ్చేస్తున్నాడు అని కంపించిన కంసుడు



కంసుడు అకృరుడిని పంపించాడే గాని శ్రీకృష్ణుడు వచేస్తున్నాడు తనని చంపేస్తాడు అని అస్సలు శ్రీకృష్ణుడు రాక ముందే చంపేయాలి అని ఏర్పాట్లు చేయటం మొదలు పెట్టాడు. కేశని, వృషబాసూరుడు అనే ఇద్దరు రాక్షసులను పిలిచాడు. మీరు వెళ్లి కృష్ణుడు ఎక్కడికి రాకముందే మీరే బృందవనం వెళ్లి శ్రీకృష్ణుడిని చంపేయండి అని పంపించాడు. వారిని పంపిన తరువాత కంసుడు ఒక మావటి వాడిని పిలిచి ఒకవేళ శ్రీకృష్ణుడు కేశని, వృషబాసూరుడిని చంపేసి మధురకి వస్తే మధుర ద్వారందగ్గర మనదగ్గర ఉన్న కువలయ పీడం అనే ఏనుగు ఉంది దానిని తీసుకువెళ్లి ద్వారం దగ్గరపెట్టు దానితో శ్రీకృష్ణుడిని తోకించి చంపించేయ్యి. అదే ఎందుకు అంటే అది ఇప్పటి వరకు యుద్ధంలో 10,000ఏనుగులను చంపింది. దాని దాంతములతో కొండలను పిండి చేసింది అని మావటి వాడిని మధుర ద్వారం దగరకు పంపించ్చాడు. ఇక నమ్మకం లేక శ్రీకృష్ణుడు అక్కడ కూడా తపించుకుంటే అనుకోని చాణురుడు, ముష్టికుడు,దోశలుడు, అక్రస్తుడు, ధార్థరాస్టుడు మొదలయినా 116మంది మల్లులను పిలిచాడు. శ్రీకృష్ణుడు, బాలరాముడు మన ఏనుగు కువలయ పిడనం దగ్గర తపించుకుంటే మీరు వారిని యుద్ధనికి ఆహ్వానించి వారిని చంపేయండి అని చెప్పారు. అప్పుడు వారు మీకు ఎందుకు మహారాజ వారిని నళిని నలిపినటు నలుపుతాము అన్నారు. కంసుడు ఇక నమ్మకం కలుగక తన అంగరక్షకులను కూడా పిలిపించి ఒకవేళ వారిదగ్గర కూడా శ్రీకృష్ణుడు తపించుకుంటే మీరు చంపేయండి అన్నారు. ఈలోగా యజ్ఞనికి కావలసిన వస్తువులను బ్రాహ్మణులను పిలిపించారు. ఎన్ని ఏర్పాట్లు చేసిన శ్రీకృష్ణుడు వచేస్తున్నాడు తనని చంపేస్తాడు అనే భయపడుతున్నాడు. ఎవరికీ తెలియకుండా ఇద్దరు భటులను పిలిచి నేను ఎన్ని ఏర్పాటులను చేశాను గాని నాకు నమ్మకం కలగటం లేదు. ఒకవేళ నా మీదకు శ్రీకృష్ణుడు వచ్చేస్తే అప్పుడు దేవకీ వాసుదేవులను తీసుకువచ్చి నన్ను విడిచి పెట్టకపోతే వాళ్లని చంపేస్తాం అని బెదిరించండి. అవసరం అయితే చంపేయండి అని అజ్ఞాపించాడు. ఆ రోజు నుంచి కంసుడికి శ్రీకృష్ణుడు వచేస్తున్నాడు తనను చంపేస్తాడు అని కలవరిస్తూనే ఉన్నాడు. నిద్రపోతున్న, మెలకువగా ఉన్న, తింటున్న, తినకున్న, కూర్చునా, నుంచున్న, ఏపని చేస్తున్న శ్రీకృష్ణుడు వచేస్తున్నాడు వచేస్తున్నాడు అని కలవరపడిపోతాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...