శ్రీకృష్ణ

శ్రీకృష్ణ



శ్రీకృష్ణ జననం

మధురా నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన యాదవ వంశానికి చెందిన వాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉన్నాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె అయినా దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం అయినా తరువాత వసుదేవుడిని,దేవకిని తీసుకొని దేవకీ అన్న కంసుడు ఆమెను అత్తవారి ఇంటిలో దిగబెట్టటానికి వెళతాడు. వారిని రథంలో తీసుకొని వెళుతుండగా దారిలో ఆకాశవాణి "కంసా! నిన్ను చంపేది నీ చెల్లెలు కడుపున్న పుట్టిన ఎనిమిదొవ కుమారుడే" అని చెపుతుంది. అది విన్న కంసుడు కోపంతో రథం మీద నుంచి దిగి దేవకిని రథము మీదనుంచు లాగి ఆమెని చంపబోతాడు. వాసుదేవుడు వెంటనే అడ్డు పడి "ఏమిటి బావ నువ్వు చేస్తున్న పని నీ చెల్లెలిని నువ్వే చంపుతావా నీకు ఇది తగిన పనేనా అయినా నిన్ను చంపేది నీ చెల్లెలి కుమారుడు. నీ చెల్లెలు కాదు. నేను మాట ఇస్తున్నాను. నీ చెల్లెలికి పుట్టిన ప్రతి బిడ్డని నికు తీసుకువచ్చి ఇస్తాను వారిని చంపు నీ చెల్లెలిని వదిలేయి" అంటాడు. అందుకు కంసుడు అంగీకరించి వారిని వారి రాజ్యానికి పంపకుండా కంసుని రాజ్యానికె తీసుకువచ్చి వారిని అంతఃపుర బంధీలుగా చేస్తాడు. కొన్నాళ్లకి దేవకీదేవికి ఒక కుమారుడు జన్మిస్తాడు. వాసుదేవుడు ఇచ్చిన మాటప్రకారం తన కుమారుడిని తీసుకువచ్చి కంసునికి ఇస్తాడు. కంసుడు ఆ బిడ్డ మొఖం చూసి చంపలేక "నన్ను చంపేది ఈబిడ్డ కాదు. మీకు కలిగే ఎనిమిదొవ కుమారుడు. వీడిని నేను  చంపలేను వీడిని సంతోషంగా తీసుకువెళ్ళు" అని అంటాడు. ఇలా కొన్నాళ్లకి వారిని ఆరుగురు కుమారులు జన్మిస్తారు. వారందరిని కంసుడు గారాబంగా చూస్తాడు. ఇలా ఉండగా ఒకరోజు నారదమహర్షి కంసుని దగరకు వచ్చి నువ్వు గత జన్మలో కాలనేమి అనే రాక్షసుడివి అని నిన్ను చంపటానికి శ్రీమహావిష్ణువే అవతరించబోతున్నాడని అతను వచ్చేటపుడు అతని సోదరుడిని కూడా వెంటబెట్టుకొని తీసుకువస్తాడు అని ఇపుడు ఉన్న పిల్లలో ఎవరూ తమ సోదరుడికి సహాయం చేస్తారో తెలియదు అని చేపి వెళ్లిపోతాడు. దానికి కోపం తటుకోలేక కంసుడు వాసుదేవుని అంతఃపురానికి వెళ్లి పిల్లలు అందరిని గిరగిరా తీపి నేలకేసికోటి చంపాడు. అడ్డు వచ్చిన దేవకిని వసుదేవుడిని సంకెళ్లతో చెరసాలలో బంధించాడు. ఏమిటి ఈ అన్యాయం అని అడిగిన ఉగ్రసేనుని బందించి రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. మళ్ళి నారద మహర్షి వచ్చి కంసునితో అయ్యాయో ఎంతపని చేశావయ్యా ఆ ఆరుగురు గత జన్మలో నీ కుమారులే హిరణ్యకశిపుడు వారందరిని మీరు మీ తండ్రి చేతిలోనే చనిపోతారు అని శాపం ఇస్తాడు. ఆ మాట విన్న కంసుడు చాల బాధపడి ఎనిమిదొవ గర్భం కోసం ఎదురు చూస్తున్నాడు. కొంత కాలానికి దేవకీదేవి మళ్ళి గర్భం ధరిస్తుంది. కానీ  దేవకీదేవి గర్భంలో ఉన్న పిండిని యోగమాయ వసుదేవుని మొదటిభార్య ఆయన రోహిణి గర్భంలో ప్రవేశపెడుతుంది. ఎడొవ గర్భం విచ్చినం అయిందని కంసుడు తెలుసుకొని సంతోషిస్తాడు. ఎనిమిదొవ కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాడు.  

యోగ మాయ ద్వారా గర్భం ధరించిన రోహిణికి బలరాముడు పుడతాడు. తరువాత కొన్నాళ్లకి దేవకీదేవి గర్భం ధరిస్తుంది. ఆమె గర్భం ధరించిన దగర నుంచి కంసునికి అన్ని అపశకునాలే కనిపించాయి. రోజు గడుస్తున్నా కొద్దీ కంసుడు భయంతో గడిపాడు. శ్రీమహా విష్ణువు దేవకీగర్బంలో ఉన్నాడు అని తెలిసి దేవతలు, యక్షులు, కీనేరా, కింపురుషులు స్వామిని సేవించటానికి చెరసాలకు అదృశ్య రూపములో వచ్చేవాళ్లు. ఇలా కొన్నాళ్ళు గడిచినతరువాత దేవకీ దేవికి నిండునెలలు వచ్చాయి. కంసుడు భయంతో చెరసాలలో కూడా వారిని స్వచ్ఛగా తిరగనివ్వకుండా వసుదేవుడిని కదలనివ్వకుండా కళ్ళకి చేతులకి సంకెళ్లు వేసాడు. శ్రావణ శుద్ధ అష్టమి రోజునా శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. ఆయన జన్మించగానే వసుదేవుడు బ్రాహ్మణులకి దానాలు ఇస్తాను అని మనసులోనే సంకల్పం చేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించగానే మధుర నగరంలో అందరూ గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. పుట్టిన బాలుడు శ్రీమహావిష్ణువు రూపాని పొంది దేవకీదేవి, వసుదేవులకు నమస్కారం చేసి "నేను పుట్టిన ఇదే సమయంలో నందనవనంలో యోగమాయ యశోద గర్భానా జన్మించింది. నా మాయచేత పశుపక్షాదులు తప్ప మానవులందరు గాఢ నిద్రలో ఉన్నారు. కనుక నువ్వు వెళ్లి నందనవనంలో యశోద పక్కన నన్ను ఉంచి అక్కడ ఉన్న యోగమాయను ఇక్కడికి తీసుకొని రా అనిచెపి అదృశ్యము అయిపోయారు. వెంటనే వసుదేవునికి ఉన్న సంకెళ్లు తెగిపడిపోయాయి. చెరసాల తలుపులు అవే తెరుచుకున్నాయి. దేవకీదేవి ఏడుస్తూ తన బిడ్డను వదలకే పంపించింది. చెరసాల నుంచి బయటకు వచ్చి చుస్తే కుండపోతగా వాన కురుస్తుంది. అంత ఆ పరమాత్మయే చూసుకుంటాడు అని వరదల పొంగుతున్న యమునా నదిని దాటుతూ మనసులో శ్రీహరిని తలుస్తున్నాడు. వసుదేవుడు శ్రీకృష్ణుని తన శిరస్సు మీద పెట్టుకొని నడుస్తున్నాడు. కొంతదూరం వెళ్లక శ్రీకృష్ణుని పాదాలు యమునానదిలో తడవగానే యమునా నది వచ్చింది పరమాత్మ అని తెలుసుకొని రెండు పాయలుగా చీలి ధరిస్తుంది. శ్రీకృష్ణుడు తడుస్తునాడు అని ఆదిశేషుడు పాడగా పట్టాడు. ఇలా వసుదేవుడు యమునానదిని ధాటి నందన వనానికి చేరుతాడు. అక్కడ నందుని ఇంటిలో యశోద దగర శ్రీకృష్ణుని ఉంచు అక్కడ పుట్టిన పాపని తీసుకొని మధుర చెరసాలకు వచ్చాడు. ఆ బిడ్డ ఏడుపు వినపడగానే మాయ తొలగిపోయి అందరికి మెలకువ వచ్చింది. కాపలాదారులు వెంటనే వెళ్లి కంసునికి ఈ విషయం చెపుతారు. కంసుడు వెంటనే వచ్చి ఆ పాపను తీసుకోబోతే దేవకీదేవి కంసుడి కళ్ళు పట్టుకొని అన్నయ ఈ బిడ్డ కుమారుడు కాదు కూతురు. అడ పిల్ల నిన్ను ఏమిచేస్తుంది. ఈమెను వదిలేయి అని బ్రతిమిలాడుతుంది. అయినా కంసుడు వదలకుండా మిగతాపిల్లలను చంపినాటే ఈ పాపని కూడా నేలకేసి విసురుతాడు. ఆ పాపా నేలకేసి వెళ్లకుండా ఆకాశంలోకి వెళ్లి అదిశక్తీ అవతారం ఎత్తి "కంసా!నిన్ను చంపేవాడు వేరొకచోట పెరుగుతున్నాడు" అని చేపి అదృశ్యమయిపోతుంది.

పూతన సంహారం 

యోగమాయ మాయం అవగానే కంసుడు కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కంసుడు వెంటనే మంత్రిమండలిని సమావేశపరిచి "జరిగినది మీకు తెలుసుకదా నన్ను చంపేవాడు తపించుకొని పోయాడు వాడు బ్రతికివుంటే నేను మరణించటం కాయం ఇప్పుడు కర్తవ్యం ఏమిటి?" అని మంత్రి మండలిని అడిగాడు. "యధా రాజా తధా ప్రజా" ఆనటు అందరూ కలిసి "పుట్టిన పసిపిల్లలను అందరిని చంపేయండి" అని చెప్పారు. వారు ఇచ్చిన సలహా బాగుంది అని కంసుడు సంతోషించి పూతన అనే రాక్షసిని పిలిచి రాజ్యములో ఉన్న పసిపిల్లలందరిని చంపేయి అని ఆజ్ఞ ఇచ్చాడు. పూతన రాజ్యములో ఉన్న పసిపిల్లలకు తన విషపు పాలను ఇచ్చి చంపేస్తుంది. ఇలా జరుగుతుండగా ఒకరోజు నందుడు వసుదేవుడిని చూడటానికి చెరసాలకు వస్తాడు. తమకు సంతానం కలిగింది అని చేపి తమ రాజ్యంలో విశేషాలు చెపుతాడు. ఇంతలో వసుదేవుడు నందునితో "నందా! ఎదో అరిష్టం జరుగుతుంది అని నా మనసుకి అనిపిస్తుంది నువ్వు తొందరగా నీ రాజ్యానికి వేళ్ళు" అని నందుడిని పంపించివేస్తాడు. నందుడు వెంటనే బయలుదేరుతాడు. పూతన పసిపిల్లలను చంపుకుంటూవచ్చి శ్రీకృష్ణుడు ఉన్న స్థలానికి వచ్చి వేషం మార్చుకొని శ్రీకృష్ణుడిని చూసి తన మనస్సులో ఈ బాలుడు ఎంత బాగున్నాడు అనుకోని నిద్రపోతున్న కృష్ణుడిని ఎత్తుకొని బయటకు తీసుకువెళ్లి పాలు ఇవ్వబోతుంటే వెనక రోహిణి, యశోద వద్దు వద్దు అని వారిస్తున్నా వినకుండా కృష్ణుడుని నిద్రలేపి పాలు ఇచ్చింది. కృష్ణుడు ఆమె పాలను రెండు గుక్కలు తాగిన్నా వెంటనే ఆమె వదులు వదులు అని అరుస్తూ తన నిజరూపాన్ని ధరించి కిందపడి చనిపోతుంది. ఆమె శరీరం 13 కిలో మీటరులు మేర పడుతుంది. యశోద ఆ శరీరం పైన వెతికి కృష్ణుడుని వెతుకుంతుంది. ఈ లోపు నందుడు నందనవనానికి వస్తాడు. దారిలో ఆడాంగా ఉన్న  పూతన శరీరాని గ్రామస్తుల సహాయంతో కాటేపులలు వేసి తగలబెడతారు. దుర్వాసన వస్తుందని ముక్కుకి ఆడంపెట్టుకుంటారు. కానీ చిత్రంగా ఆమె శరీరం నుంచి అగరబత్తుల వాసనవస్తుంది. దానికి కారణం శ్రీకృష్ణుడు పరమాత్మ పూతన కృష్ణుడు తనని తల్లిలా దగ్గరకి తీసుకుంది కాబట్టి ఆమె పాలు తాగుతుండగా మొదటిగుకలో ఆమె పాపాన్నీ రెండొవ గుక్కలో ఆమెకు మోక్షాన్ని ఇస్తాడు స్వామి.......... 

శేకటాసుర సంహారం

పూతన మరణం తెలుసుకొని కంసుడి కోపం పెరిగిపోతుంది. శేకటాసురుడిని పిలిచి శ్రీ కృష్ణుడిని చంపమని పంపిస్తాడు. ఈ లోపు నందనవనంలో నందుని ఇంట్లో చిన్ని కృష్ణుడు బోర్లాపడతాడు. తల్లి యశోద అదిచూసి నందునితో "స్వామి! నా బిడ పుట్టిన తరువాత మొదటిసారి బోర్లా బడ్డాడు వెంటనే ఉత్సవాలు జరిపించాలి" అని అంటుంది. నందనవనంలో ఉన్న ప్రజలందరినీ పిలిచి విషయం చెపుతుంది. అక్కడే ఉన్న శేకటాసురుడు ఒక బండి రూపం ధరించి నందుని ఇంటి ముందు ఉన్నాడు. నందుడు దానిని చూసి నిజంగా బండే అనుకోని అందులో పాలకుండలు, పెరుగుకుండలు, నెయ్యికుండలు పెట్టారు. దాని పక్కనే యశోదమ్మ చిన్న మంచం వేసి దానిమీద చిన్ని కృష్ణుడిని పొడుకోబెడుతుంది. అవకాశం కోసం చూస్తునా రాక్షసుడిని కృష్ణుడు చూసాడు. చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ, ఆడుకుంటూ ఆ బండిని తన కాలితో తన్నాడు. ఆలా తనంగానే బండి గాలిలోకి వెళ్లి పెద్ద  శబ్దంతో ముక్కలై పడిపోతుంది. లోపల ఉన్న నందుడు, యశోద, గోకులవాసులు కంగారుపడతారు. 

తృణవ్రతుడి వధ

నందనవనంలో కొన్నిరోజుల తరువాత ఒకరోజు ఆరుబయట యశోద, రోహిణి కృష్ణుడిని కూర్చుబెట్టుకొని ఉన్నారు. కొంతసేపటికి ఉన్నటుండి కృష్ణుడు బరువు పెరిగిపోయాడు. యశోద కృష్ణుడిని మోయలేక కింద కుర్చోపెటింది. నందనవనంలో ఉన్నటుండి సుడిగాలి వచ్చింది. వస్తూనే కృష్ణుడిని తీసుకెళ్లింది. సుడిగాలినుంచి తేరుకొని చూసేసరికి పక్కన కృష్ణుడు లేడు. యశోద ఏడుస్తూ అంత వెతకసాగింది. ఈలోపు సుడిగాలి రూపములో వచ్చిన తృణవ్రతుడు సంతోషపడుతూ ఎవరూ చంపలేక పోయారు  నేను చంపేస్తునాను కృష్ణుడిని అనుకున్నాడు. కృష్ణుడిని ఇంకా పైకి పైకి తీసుకువెళ్ళుతున్నాడు. ఉన్నటుంది కృష్ణుడు మళ్ళి బరువు పెరిగాడు. తృణవ్రతుడు పైకి వేలేవాడు కాస్త కిందకి పడిపోవటం మొదలు పెట్టాడు. కృష్ణుడు తృణవ్రతుడి పీక పట్టుకొని నలిపి సంహరించాడు. తృణవ్రతుడు ప్రాణాలు కోల్పోయి కింద పడిపోయాడు. రాక్షుసుడి మీద కృష్ణుడు పడి ఆడుకుంటున్నాడు. యశోద ఏడుస్తూ కృష్ణుడిని వెతుకుంటూ వస్తుంది. కృష్ణుడిని తీసుకొని ఇంటికి వెళ్లి ఆవుపేడతోను, గోమాత తోకతోను కృష్ణుడికి అయన 12 నామాలతోనే ఆయనకి దిష్టి తీస్తుంది. 

శ్రీకృష్ణ లీలలు

యశోదమ్మ ఒక రోజు శ్రీకృష్ణుడికి నలుగు పెట్టి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి చిన్ని కృష్ణుడికి చిన్న పట్టు పంచెకట్టి జుత్తుకి చిన్న కొప్పు వేసి ఆ కోప్పుకి తెల్లటి ముత్యాల దండా కట్టి చిన్న నెమలి పించం పెట్టి మేడలో నగలువెసి మూడు నామాల బోటు పెట్టి చేతులకి కడియాలు, కళ్ళకి మువ్వల పటీలు పెట్టి నడుముకి చిన్న కొమ్ముబూర కట్టి తయారు చేసింది. చిన్ని కృష్ణుడు తరువాత అమ్మ దగర నుంచి పాకుతుంటే కొత్తగా పెట్టిన మువ్వల శబ్దానికి భయపడి మళ్ళి అమ్మ వొళ్ళో పొడుకోని అమ్మ ఒంక చుస్తే యశోదమ్మ నవ్వుకొని "నా చిన్ని కన్నయ్య! భయపడదు అవి మువ్వల పటిల్లు నానా అని చెపుతుంది. చిన్ని కృష్ణుడు కూడా ఒక నవ్వు నవ్వుతాడు. శ్రీకృష్ణుడికి పాకటం వచ్చిన తరువాత యశోదమ్మ నుంచోని ఉంటే అక్కడికి పాకుంటువేళ్లి యశోదమ్మ చీరకొంగు పట్టుకొని నుంచోవటానికి ప్రయత్నించేవాడు. పదేపదే ఆలా చీరకొంగు పట్టుకొని లాగుతుంటే యశోదమ్మకు విసుగువచ్చి చీరకొంగును అందకుండా చుట్టుకునేది. అపుడు శ్రీకృష్ణుడు అమ్మ చీరకొంగులా ఏమిఉంది అని వెతికి ఆవు తొకలను పట్టుకొని నుంచునేవాడు ఆవు తోకలను లాగి నుంచుంటే ఆవులు అరిచెవి ఆవుల అరుపులు విని బయటకు వచ్చిన యశోదమ్మ చీసి చిన్ని కృష్ణుడిని అయ్యాయో ఆవు తోకపాడుకొని లాగుతున్నావు దాన్ని డెక్కతో తొకింది అంటే చిన్ని చిన్ని పాదాలు పచ్చడి అయిపోతాయి అని ఇవతలకు లాకోచేది. శ్రీకృష్ణుడు అపుడే తప్పటడుగులు వేస్తున్నాడు. లోకాలకి అడుగులు వేయటం నేర్పిన స్వామి ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాడు అని 33కోట్లమంది దేవతలు మురిసిపోతున్నారు. శ్రీకృష్ణుడికి కథలు అంటే చాల ఇష్టం. ఒకరోజు శ్రీకృష్ణుడి ఊయలలో పొడుకోబెట్టి రామాయణం చెప్పటం ప్రారంభించింది. ఇక్ష్యుకు వంశంలో శ్రీరాముడు ఉండేవాడు. అతను చాల గుణవంతుడు. తండ్రి మాట కోసం అరణ్య వాసానికి వేలాడు. అరణ్యవాసంలో ఉండగా సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయారు అనేసరికి నిద్రపోతున్న శ్రీకృష్ణుడు గబుక్కునలేచి లక్ష్మణ ధనుస్సు పాటుకురా అనేసరికి యశోదమ్మ ఉలిక్కిపడింది. మళ్ళి వెంటనే తేరుకొని శ్రీకృష్ణుడు అమ్మమీద విష్ణు మయా కమేసి ఓహో ఇది కృష్ణావతారం కదా అనికొని మళ్ళి నిద్రపోయాడు.  ఒకరోజు శ్రీకృష్ణుడు తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లి మట్టి మీద పొడుకున్నారు. ఆ మట్టిని తీసుకొని ఒంటిమీదపోసుకుంటుంటే ఒంటికి భాసంరాసుకున్నా శంకరుడే కనపడుతున్నాడు అన్నారు పోతనగారు.  ఆ కంఠములోని మాలలోని మణి కాంతి శంకరుని గరళ కంఠము లాగా అయన ముత్యాల కోపుచూస్తుంటే గంగమని నెత్తిమీదపెట్టుకొని చంద్రవంక ధరించినట్టు అయన మెడలోని నగలు చూస్తుంది శంకరుడి మేడలో పాములులాగా అనిపిస్తున్నాయి అని. శివకేశవులకు భేదం లేదా అని పోతనగారు అనుకున్నారు. శ్రీకృష్ణడికి యశోదమ్మ నడుముకి ఒకచిన్న గంటకడుతుంది. ఒకరోజు ఇంట్లో యశోదమ్మ మంచిపనిలో ఉండగా శ్రీకృష్ణుడు ఆడుకుంటూవచ్చి కుండా పగలకొడతాడు. యశోదమ్మకు కోపంవచ్చి కొడదామని వచ్చి కోటలేక ఈసారి మళ్ళి అలరిచేయి నిను కోటేస్తాను అని మందలిస్తుంది. అంతే శ్రీకృష్ణుడికి కోపంవచ్చి ఒక మూలకి వెళ్లి బుంగ మూతి పెట్టుకొని నేను ఆడుకొని, నేను మాట్లాడాను అని అలిగి కూర్చుంటాడు. ఇంకా ఎంతసేపటికి అమ్మ పిలవటం లేదుగాని ఏడుపుమొఖం పెటేస్తే యశోదమ్మ చూసి నవ్వుకొని ఇక్కడ ఉన్నాడు నా చిన్ని కృష్ణయ్య అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ వోలో పొడుకోని పాలు తాగేసి మాలి ఆడుకోవటానికి వెళ్లిపోయారు. ఆడుకోవటానికి బయటకు వెళ్లిన కృష్ణుడు అందరి ఇళ్లలోకి వెళ్లి వెన్న, నెయ్యి దొంగిలించి తినేసేవాడు. అమ్మకు తెలియకుండా ఉండేందుకు ఆ వెన్న నెయ్యి ఆకులకి, ఆవులకి రాసేవారు. ఆడుకొని వచ్చిన వాడిలాగా ఒంటిమీద మట్టి పూసుకొని వచ్చేవారు. వస్తూనే అమ్మ ఆకలివేస్తుంది అన్న పెట్టు అనేవారు. మళ్ళి అన్నం తినేటపుడు కథ చెప్పమనేవారు. అన్నం తినతరువాత శ్రీకృష్ణుడికి దిష్టి తీసేసేది. తరువాత నిద్రపుచ్చేది. శ్రీకృష్ణుడిని యశోదమ్మ నిద్రపుచ్చుతునపుడు గోకులంలో ఉన్న గొల్లభామలు వచ్చారు. యశోదమ్మ ఏంటి ఇంతమంది వచ్చారు అనుకోని బయటకు వచ్చి కూర్చుంది. ఆమె వెనకాలే శ్రీకృష్ణుడు కూడా వచ్చి అమ్మ ఒడిలో పోసుకుని అమ్మని వచ్చిన వాళ్లని చూస్తుంటాడు. ఇంకా శ్రీకృష్ణుడి మీద ఒక గోపకాంత ఇలా చెప్పసాగింది. బాలింతలకి  పాలులేవు అని పసిపిల్లలకు ఆవుపాలు పడదాము అనుకునేలోపు ఈ కుమారుడు వచ్చి ఆవుల దగరకు దూడలను వదిలేశాడమ్మా(వాళ్ళు దూడలను పాలు తాగనివ్వకుండా వల్ల పిల్లలకి మాత్రమే పాలను తీస్తున్నారు. అయన అందుకే శ్రీకృష్ణుడు ఆలా చేసారు.). వదిలేసింది చూసి మేము కంగారుపడుతుంటే దూరంగా చెట్టుమీద కూర్చొని మమ్మలిని చూసి నవుతున్నాడు యశోదమ్మ. ఇంకో గోపకాంత మా ఇంట్లో పాలను ఎర్రగా కాగబెట్టి వాటిని కుండలలో భద్రం చేసుకుంటే నీ కుమారుడు తన స్నేహితులతో వచ్చి పాలను తాగేసి కుండలను తొక్కుకుంటూ వెళిపోయాడు అని మొరపెట్టుకుంది. ఇంకో గోపకాంత కృష్ణుడు వస్తున్నాడు అని తెలుసుకొని వల్ల ఇంట్లో వెన్న, పాలను ఉట్టి కట్టి పైన పెటింది. ఇంతలో కృష్ణుడు తన స్నేహితులని తీసుకొని ఆ ఇంటికి వస్తాడు. వచ్చి చూసేసరికి కుండ ఉట్టిమీద ఉంటుంది. ఆ కుండని అందుకోవటం కోసం పీటలు, రోళ్ళు వేసిన అందలేదు. అందుకని కృష్ణుడు ఇదిఅంతా ఎందుకు కుండకి కన్నం పెడితే సరిపోతుంది అని కుండకి కన్నం పెడతాడు కుండ కిందనుంచి కారిపోతుంది. కృష్ణుడు తన స్నేహితులతోకలిసి వెన్న, పాలను తాగేసి వెళ్ళిపోతాడు. ఈ విషయం యశోదమ్మకి గోపకాంత చేపి బాధపడుతుంది. ఇంకో గోపకాంత కృష్ణుడిని ఎలాగైనా పట్టుకోవాలని వెన్న కుండను తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టి తలుపు వెనకాల దాకుంటుంది. కృష్ణుడు రానేవచ్చాడు. ఎవరో ఈ ఇంట్లోవాలె గుమ్మం దగ్గర పెట్టారు అని తన స్నేహితులని పిలిచి వాళ్లకి పెట్టి తాను తిందామని తీసుకోగానే ఆ గోపకాంత వచ్చి చెయ్యి పట్టుకుంది.  కృష్ణుడు భయపడకుండా చూస్తున్నాడు. ఆ గోపకాంత కృష్ణుడిని "నువ్వు ఎవరూ పిల్లాడా!" అని అడుగుతుంది. దానికి కృష్ణుడు "నేను బలరాముని తముడిని" అని చెపుతాడు. దానికి గోపకాంత ఇక్కడికి ఎందుకు వచ్చావు" అని అడుగుతుంది. దానికి కృష్ణుడు "నువ్వు ఉండవమ్మా! మా దూడ ఒకటి కనపడటం లేదు వెన్న కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను. నువ్వు అరిస్తే పారిపోతుంది" అన్నాడు. దానికి గోపకాంత ఆశ్చర్యపోతు ఏమిటి దూడ కనిపించటం లేదా వెన్న కుండలో ఉందా అని తెల్లబోయి ఆమె చెయ్యి వదిలేసింది కృష్ణుడు పారిపోయాడు. 

 శ్రీకృష్ణుడు యశోదమ్మకు ఇచ్చిన బహుమతి

మహాజ్ఞానులు కూడా దర్శనం చేయలేని కానుకను అమ్మకు ఇద్దాము అనుకున్నారు చిన్నికృష్ణుడు. ఒక రోజు శ్రీకృష్ణుడు, బలరాముడు, గోపబాలురు దాగుడుమూతలు అట ఆడుకుంటున్నారు. అందరూ వెళ్లి దాకున్నారు. శ్రీకృష్ణుడు ఎవరు చూడటం లేదు అని కొంచం మట్టి తీసుకొని తింటున్నారు. దానిని ఒక గోపబాలురు చూసాడు. చూసి వెళ్లి బలరాముడికి చెప్పారు. బలరాముడు, గోపబాలురు చిన్ని కృష్ణుడిని తీసుకొని యశోదమ్మ దగ్గరకు తీసుకొచ్చారు. బలరాముడు యశోదమ్మతో ' అమ్మ! కృష్ణుడు మట్టి తింటున్నాడు' అని చెప్పారు. యశోదమ్మకు కోపం వచ్చి చిన్ని కృష్ణుడిని దగ్గరకు తీసుకొని ' కృష్ణా! మట్టి ఎందుకు తింటున్నావు. ఇంట్లో నీకు వెన్న, పాలు, పెరుగు లేవా. నీకు ఎన్ని సారులు చెప్పాను మట్టి తినదు అని అసలు మట్టి ఎందుకు తింటున్నావు' అంటుంది. అందుకు శ్రీకృష్ణుడు కోపంతో 'అమ్మ! మట్టి తినటానికి నేను చిన్న పిలాడినా, చేతకానివాడిన, వెరివాడిన వీరి మాటలు నమ్మి నన్ను అంటున్నావా. నన్ను నువ్వు కొట్టాలని వీళ్ళు అలా చెపుతున్నారు. నిజంగా నేను మట్టి తింటే నా నోరు వాసనా వస్తే నన్ను కోటు అమ్మ' అని అంటారు. యశోదమ్మా తేలబోయి ఇదేంటి ఇలా అంటున్నాడు అని నోట్లో వాసనా చూదామని మోకాళ్లమీద కూర్చొని చిన్ని కృష్ణుడి నీటిలోకి చూసింది అంతే అయన నోటిలో సమస్త బ్రహ్మాండాలు, నక్షత్రాలు, గ్రహాలు, సమస్తలోకాలు అందులో ఉన్న భూమి, భూమిలో ఉన్న సమస్త పర్వతాలతో, నదులతో, చెట్టులతో, మనుషులతో, పశువులతో,నందవ్రజంతో తన ఇంటితో తనతో, నందునితో, చిన్ని కృష్ణుడిని నోటిలో చూసి ఆశ్చర్యపోతుంది. యశోదమ్మ ' ఇది కల వైష్ణవమయ, ఏదయినా సంకల్పమా, నిజామా, నేను యశోధనేనా,నేను అసలు ఇంట్లోనే ఉన్నానా  వీడు నా కుమారుడేనా ఇంత చిన్న నోటిలో బ్రహ్మాండాలు ఉన్నాయా ఆలోచిస్తే చాల ఆశ్చర్యంగా ఉంది.  ఆమె ఇలా ఆలోచిస్తుంటే చిన్ని కృష్ణుడు అమ్మ ఇలాగే ఆలోచిస్తే అమ్మకు వైరాగ్యం వస్తుంది నన్ను భగవంతుడు అనుకుంటుంది అనుకోని విష్ణుమాయ కాపేస్తారు. కానీ యశోదమ్మకు ఆ రోజంతా పులకిరింతగానే ఉంటుంది. సాయంత్రం చిన్ని కృష్ణుడికి అన్న పెడుతుంది కానీ ఆలోచిస్తూనే ఉంటుంది అందుకని ఆ ఆలోచనని బాగా తీసేయాలి అనుకోని అప్పటిదాకా తింటున్న అన్నాని మానేసి నాకు అన్నం వద్దు అని మారం చేస్తారు. యశోదమ్మకు కోపం వచ్చి 'కన్నయ్య! నేను పెడితే ఎందుకు తింటావు. కొంచంసేపు అగు మాధవకవళం అని వస్తారు వాళ్లకి ఇచ్చేస్తాను. వాళ్ళు నిన్ను సంచిలో వేసుకుని వెళతారు. వాళ్ళు ఊరంతా అడిగి తెచ్చుకున్న అన్నాని నీకు పెడతారు అపుడు నీకు బుద్ది వస్తుంది నేను పెడితే ఎందుకు నచ్చుతుంది' అని అంటుంది. యశోదమ్మ అలా అంటుంటే చిన్ని కృష్ణుడు బుంగమూతి పెట్టుకుంటాడు. ఈలోపు నిజంగానే మాధవకవళం అంటూ వస్తారు. యశోదమ్మ వచ్చిన వాళ్లకి ఏదో ఒకటి ఇచ్చి  పంపాలి అని వెలబోతుంది. చిన్నికృష్ణుడు వెంటనే చిరకుచ్చిళ్లలో తలపెట్టుకొని అమ్మ వొంక మాధవకవళం వొంక చూస్తారు. యశోదమ్మ నవ్వుకొని 'కన్నయ్య! నేను నిన్ను ఎందుకు వేస్తాను చెప్పు. లేక లేక పుట్టావు. నీవు ఇచ్చేస్తానా ఇవ్వను. బయపడకు ఇక్కడ కూర్చో వచ్చిన వాడికి కొంచం అన్న పెట్టి వస్తాను అని కూర్చోపెట్టి వెళుతుంది. చిన్నికృష్ణుడు అమ్మ మొత్తం మరచిపోయింది అని నవ్వుకుంటారు.  

శ్రీకృష్ణ - దామోదర లీలా

కరోజు యశోదమ్మ చల్ల చిలుకుతుంటే ఎక్కడినుంచి వచ్చారో చిన్ని కృష్ణుడు వచ్చి యశోదమ్మ చిలుకుతున చల్లని చేతితో పట్టుకొని అమ్మ నాకు ఆకలి వేస్తుంది. నాకు పాలు ఇవ్వు నేను మళ్ళి వెళ్లి ఆడుకోవాలి అని అడుగుతారు. యశోదమ్మా చల్ల చిలకటం ఆపేసి చిన్ని కృష్ణుడుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని పాలు ఇస్తున్నారు. ఈ లోపు వంటగదిలో పోయి మీద పాలు పొంగుతుంటే చిన్ని కృష్ణుడిని కిందన పీట వేసి కూర్చోపెట్టి పాలు దింపటానికి వెళ్లారు. అంతే చిన్ని కృష్ణుడికి కోపం వచ్చింది. నాకు పాలు ఇవ్వకుండా మా అమ్మకు పొయ్యిమీద పాలు ముఖ్యమయ్యాయ అని అక్కడ ఉన్న చిన్న రాయి తీసుకొని చల్ల కుండను పగలకోటేసారు. దాంతో కుండలోని మజిగా, వెన్న బయటకు వచ్చేసాయి. అమ్మ నాకు పాలు ఇవ్వలేదు అని ఏడుస్తున్నారు. కొంత సేపటికి ఇదంతా మాజీగా వెన్న అయిపోయాయి అమ్మ చుస్తే కొడుతుంది అని నాలుగు వెన్న ముద్దలు గోబాగోబా నోటిలో పెట్టుకొని ఇంకో రెండు వెన్న ముద్దలు చేతితో తీసుకొని పెరడులోకి పరిగెత్తి అక్కడ రోలు ఉంటె దానిమీదకు ఎక్కి అక్కడే ఉన్న కోతులకు వెన్న పెడుతున్నారు. ఈలోపు యశోదమ్మ పాలు దించి వచ్చి చూసేసరికి ఇలంతా వెన్న మజిగా ఒలికిపోవటాని చూసి యశోదమ్మకి కోపం వచ్చింది. చిన్ని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ పెరడులోకి వేస్తే అక్కడ కోతులకి వెన్న తినిపిస్తున్న చిన్ని కృష్ణుడు కనిపించారు. 

        యశోదమ్మ కోపంతో చిన్ని కృష్ణుడిని పట్టుకోవాలని వచ్చేసరికి చిన్ని కృష్ణుడు పారిపోయారు. చిన్ని కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంటి వరండాలో దాక్కున్నారు. యశోదమ్మ వెనకాలే వచ్చింది. వరండాలో స్తంభాల వెనకాల దాక్కున్నారు. ఆ స్తంభం నుంచి ఈ స్తంభం దగరకు ఈ స్తంభం దగర నుంచి ఆ స్తంభం దగరకు అమ్మకు దొరకుండా పరిగెడుతున్నారు. యశోదమ్మకు పరిగెత్తి పరిగెత్తి అలుపు వచ్చింది. యశోదమ్మ ఒకచోట కుంచుంటే ఏడుస్తూ చిన్ని కృష్ణుడు దగరకు వచ్చారు. వెంటనే యశోదమ్మ చిన్ని కృష్ణుడుని పట్టుకుంది. కొడదామని చేయి ఏతేసరికి చిన్ని కృష్ణుడి ఏడుపు మొహం చూసి కోటలేక తీసుకువెళ్లి రోలుకు కట్టాలని రోలుకి కఠిన తాడుతో చిన్ని కృష్ణుడి నడుముకి కడదామని చుస్తే రెండు అంగుళాలు తక్కువ వచ్చింది. ఇంకోతాడు ఈతాడుకి మళ్ళి కట్టి చుస్తే మళ్ళి రెండు అంగుళాలు తక్కువ వస్తుంది. ఈల చాల సేపటి తరువాత అమ్మ నన్ను కాటేయాలని నాకోసం కష్టపడుతుంది అని  చిన్ని కృష్ణుడికి యశోదమ్మ చేతితో రోలుకు కట్టబడ్డారు. అలా రోలుకు చిన్ని కృష్ణుడిని కటినపుడు చిన్ని కృష్ణుడి నడుము దగ్గర ఒక మచ్చ ఏర్పడింది. అప్పటినుంచే చిన్ని కృష్ణుడికి దామోదరుడు అని పేరు వచ్చింది. అయన చేసిన ఈ లీలను దామోదర లీలా అన్నారు.

శ్రీకృష్ణ - మది చెట్టులా శాపవిమోచన లీల

యశోదమ్మ చిన్ని కృష్ణుడుని రోలుకు కాటేసి ఇంటిలోకి వెళ్లిపోతుంది. చిన్ని కృష్ణుడు రోలుని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఏడుస్తూ ఉన్నారు. కొంతసేపటి తరువాత చిన్ని కృష్ణుడు పాకటం మొదలు పెట్టారు. ఆయనతో పాటు రోలు కూడా దొర్లుకుంటూ వస్తుంది. చిన్ని కృష్ణుడు పాకుతూ రెండు మది చెట్టుల మధ్య నుంచి వెళ్లారు. ఆయనతో పాటు రోలుకూడా వచ్చింది. రోలు మది చెట్టులా నుంచి వెళ్లక చిన్ని కృష్ణుడు గట్టిగా లాగేసరికి మది చెట్టులు రెండు విరిగి పడిపోయి అందులో నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వచ్చారు. వచ్చిన వారు చిన్ని కృష్ణుడు పరబ్రహ్మముగా భావించి స్తోత్రం చేసారు. చిన్ని కృష్ణుడు ఏమి తెలియని వాడిలా అమాయకంగా ఏడుస్తున్నారు. ఆ దివ్య పురుషులకు అసలు శాపం ఎలావచింది.

ఒకరోజు కుబేరుడి కుమారులైన నల్లకుబేర మణిగ్రీవులు ఆకాశ గంగలో గాంధర్వకన్యలతో దిగ్బంగారంగా స్నామము ఆచరిస్తున్నారు. అంతలో అటువైపు ఆకాశమార్గములో నారదమహర్షి వెళుతున్నారు. నారద మహర్షిని చుసిన గంధర్వకన్యలు వెంటనే వస్త్రాలను కట్టుకొని నారదునికి నమస్కరించారు. నల్లకుబేర మణిగ్రీవులు మాత్రం మద్యం మత్తులో నారదమహర్షిని నమస్కరించలేదు కదా కనీసం పాటించుకోలేదు. అపుడు నారద మహర్షి ఇలా అనుకున్నారు. ధనాధిపతిఅయిన కుబేరుని కుమారులు అతని సంపదకు వారసులు అయ్యారు కానీ అతని సంస్కారానికి వారసులు కాలేకపోయారు. వారిని దారిలోకి తీసుకురావాలి అనుకున్నారు. నల్లకుబేర మణిగ్రీవులతో నారద మహర్షి మీకు పెద్దల పట్ల భయభక్తులు లేవు. మహర్షులు సన్యాసులను గౌరవించాలి అని జ్ఞానం లేదు. పెద్దల ఎదుట ఇలా దిగంబరంగా ఉండకూడదు అని లేదు. మీరు నూరు దివ్య సంవత్సరములు మది చెట్లుగా పడియుండండి. నూరు దివ్య సంవత్సరముల తరువాత శ్రీమహా విష్ణువు భూలోకములో నందవ్రజంలో కృష్ణుడికి అవతరిస్తారు. ఏమి తెలియని అమాయకపు చిన్ని కృష్ణుడికి నమస్కరించే రోజు వస్తుంది అని చేపి నారదుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నల్లకుబేరుల, మణిగ్రీవులు వెంటనే మది చెట్టులుగా మారిపోయారు. ఆలా బయటకు వచ్చిన దివ్య పురుషులు చిన్ని కృష్ణుడికి నమస్కరించి తమ వృతంతాని చేపి స్వామి మీ దయ వల్ల మాకు శాపవిమోచనం కలిగింది. ఎన్ని సంవత్సరాలుగా మీకోసం ఎదురు చూస్తాము అని చేపి చిన్ని కృష్ణుడికి నమస్కరించి వల్ల లోకానికి వెళ్లిపోయారు. మది చెట్టులు పడిన శబ్దం విని అందరూ పరిగెత్తుకు వచ్చారు. చిన్ని కృష్ణుడికి ఏమయిందో అని కంగారు పడుతూ వచ్చారు. యశోదమ్మ ఏడుస్తూ వచ్చి చిన్ని కృష్ణుడిని రోలు నుంచి విడదీస్తుంది. ఇంకా ఎప్పుడు రోలుకి కట్టాను అని ఏడుస్తుంది. చిన్ని కృష్ణుడు తన లీలలను తలుచుకొని నవ్వుకొని యశోదమ్మ ప్రేమను ఆస్వాదిస్తారు.

శ్రీకృష్ణ - బృందావన పయనం

శ్రీకృష్ణుడు మది చెట్లు పడిపోయిన తరువాత అందరికి అనుమానం వచ్చింది. ఇంత పెద్ద చెట్లు ఎలా పడాయి అని ఆలోచించసాగారు. చెట్లను నరకలేదు. గాలివాన రాలేదు. అసలు ఎలా పడాయి అని ఆలోచించసాగారు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు వచ్చి శ్రీ కృష్ణుడు చెట్ల మధ్యలో నుంచి వచ్చారు. ఆ చెట్లు పడిపోయి అందులోనుంచి దేవతలు బయటకు వచ్చి శ్రీ కృష్ణుడిని ప్రార్ధన చేసి వెళ్లిపోయారు. అందరూ చిన్న పిల్లవాడు ఎల్లా చేస్తారు. పిల్లలు ఏదోచెపుతున్నారు. ఏ భూతమో పడేసి ఉంటాయి అని అన్నారు గాని అందరికి మనసులో అనుమానంగా ఉంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని కనిపెట్టి వారందరిని ఈ విషయాలు మరచిపోయేలా చేయాలి అని అనుకున్నారు. ఆ రోజు నుంచి తండ్రి అయినా నందుడు ఇంటికి రాగానే చిన్న పిలాడిలానే ఎదురు వెళ్లి నాన్నని పలకరించడం. పెద్దవాళ్ళు ఎవరైనా మంచినిళ్లు ఎవరంటే ఇచ్చేవారు. ఒకరోజు యశోదమ్మ దగరకు వచ్చి శ్రీ కృష్ణుడు అమ్మ ఎవరో నన్ను కొట్టాలని చుస్తునారు అతను ఆచం నాలాగే ఉన్నారు అని యశోదమ్మను తీసుకెళ్లి నీటితో నిండిన చిన్న తొట్టిని చూపించి ఏడిచాడు. యశోదమ్మ నవ్వు కొన్ని ఎవరు లేరమ్మ అది నీ ప్రతిభింబం అని సర్ధిచెపింది. ఇంకోరోజు యశోదమ్మ దగరకు వచ్చి అమ్మ నాకు అన్నయ్యలాగా జుట్టు లేదు ఎందుకు అని అడిగారు. యశోదమ్మ కన్నయ్య అన్నయ పాలు, పెరుగు బాగా తిట్టాడు అందుకే జుట్టు ఎక్కువగా ఉంది. వెంటనే పక్కనే ఉన్న బిందిలోని పాలను తాగేసి నా జుట్టు పెరిగిందా అని అడిగారు. యశోదమ్మ శ్రీ కృష్ణుడి అమాయకత్వానికి నవ్వుకుంది. ఒకరోజు నందవ్రజంలోకి పండ్లను అమ్ముకుంటానికి ఒక ఆవిడా వచ్చింది. ఆమె పండ్లకు బదులు ధాన్యాన్ని తీసుకుంటుంది. ఆ పండ్ల ఆవిడా యశోదమ్మ ఇంటికి వచ్చింది. యశోదమ్మ ధాన్యాన్ని ఇచ్చి పండ్లని తీసుకుంది. శ్రీకృష్ణుడు కూడా తన చిన్ని చిన్ని చేతులతో ఒక నాలుగు ధాన్యాపు గింజలను తీసుకొని ఆవిడా దగరకు వచ్చి కొన్ని పండ్లను ఇవ్వమన్నారు. ఆవిడా చిన్ని కృష్ణుడి అమాయకత్వానికి మురిసిపోయి అతని చేతుల్లోని నాలుగు ధాన్యపు గింజలను తీసుకొని ఆ చిన్ని చేతుల నిండా పండ్లను ఇచ్చింది. శ్రీ కృష్ణుడు ఆవిడా వైపే చూస్తూ చూస్తూ వెళ్లరు. ఆవిడా వెళ్లటానికి పండ్ల బుట్టని తీసుకొని వెళ్లబోతుంటే బుట్ట బరువుగా అనిపించింది. ఆవిడా దించి చూసుకుంది. బుట్ట నిండా బంగారం, రత్నాలు ఉన్నాయి. ఒకసారి నందవ్రజంలో పెద్దలందరూ సమావేశమయ్యారు. శ్రీకృష్ణుడు పుటిన దగర నుంచి నందవ్రజంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి కూడా శ్రీకృష్ణుడికే జరుగుతున్నాయి. దేవుడు రక్షిస్తున్నారు అనుకోని ఇక్కడే ఉంటె కృష్ణుడికి మరింత ప్రమాదం పెరుగుతుంది. కాబ్బటి మనం శ్రీ కృష్ణుడు కోసంమైన ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలి అన్నారు. నందుడు తమ కుమారుడిపైన నందవ్రజంలో ఉన్న ప్రజలు చూపిస్తున్న ప్రేమకి సంతోషించి మీరు ఎలాగా చెపితే అలాగే చేద్దాము అన్నారు. కానీ మనం కొత్త ప్రదేశానికి వేళలో అంతే మనకి పశుసంపద ఎక్కువ కనుక నీళ్లు గడి ఎక్కువ దొరికే ప్రదేశానికి వేళలో అక్కడ పండ్లచెట్లు కూడా ఎక్కువగా ఉండాలి. ఏమి సంపద లేకపోతే కనీసం పండ్లు అయినా తినిబ్రతకచ్చు అని ఆలోచించసాగారు. పెద్దలు ఇక్కడికి దగరలో బృందావనం ఉంది మనం అక్కడికి వెళదాము అనుకొన్నారు. అందరూ సంతోషించారు. మరుసటి రోజు అందరూ తయారు అయి బండ్లు కట్టుకొని బయలుదేరారు. ఆడవాళ్లు, చిన్న పిల్లలు బండ్లలో వెళ్లరు. వెళుతున్న దారిలో యశోదమ్మ చిన్ని కృష్ణుడి గురించి పాటలు పడుకుంది. బృందావనం రాగానే చిన్ని కృష్ణుడు చాల సంతోషించారు. ప్రజలందరూ తాము వచ్చిన బండ్లను వలయాకారంలో పెట్టి తాము ఇళ్ళు కట్టుకునే వరకు అక్కడే ఉండాలి అని నిశయించుకున్నారు.  

శ్రీకృష్ణ - వత్సాసుర వధ

నందవ్రజంలో నుంచి గోపాలకులు బృందావనం వెళ్లరు. కొన్నాళ్లకి నందుడు, గోపాలకులు అందరూ ఇల్లు నిర్మించుకొని నివసించసాగారు. శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడు, స్నేహితులతో కలిసి ఆడుకొనసాగారు. నందుడు తన కుమారులకు ఆవుల్ని పోషించటం నేర్పించాలని లేగ దూడలను బృందావనానికి కొంచం దూరంగా ఉన్న చిన్న అడవిలో మెపూకురమని చెప్పారు. యశోదమ్మ భయపడింది. అసలే కొత్త ప్రదేశం శ్రీ కృష్ణుడు ఇంకా చిన్న పిల్లవాడు, అల్లరివాడు. ఏ జంతువన్న లాక్కుపోతుందేమో అని పంపనంది. శ్రీకృష్ణుడు తన తల్లికి ధర్యం చెపుతూ. అమ్మ మేము ఎక్కువ దూరం వెళ్ళాము. ఇంట్లో ఉంటె ఏమి తోయటం లేదు. మేము జాగ్రత్తగా వెళ్లి వస్తాము అన్నారు. యశోదమ్మ మరుసటి రోజు పిల్లలిద్దరికి చద్దన్నం కటిచ్చి లేగ దూడలను ఇచ్చి పంపించింది. శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి అడవిలో ఉండగా అక్కడికి ఒక లేగ దూడ వచ్చింది. అది మందలోనిది కాదు. చూడటానికి చాల అందంగా ఉంది. శ్రీకృష్ణుడు దానిని చూడగానే వచ్చింది ఎవరో కనిపెటేసారు. తన స్నేహితులను పిలిచి "గోపాలులారా! ఇటు చుడండి ఈ లేగదూడ ఎంత బాగుందో దీని తోక దీని కళ్ళు దీని కాళ్ళు ఎంత అందంగా ఉందొ చుడండి" అని చెపుతూ దాని దగరకు వచ్చి ఎవరు ఉహిచని విధంగా దాని నాలుగు కాళ్లను దాని తోకతో చుట్టి గిరగిరా తీపి పక్కనే ఉన్న వెలగా చెట్టుమీద వేశారు. గోపాలబాలురు కృష్ణా, కృష్ణా అంటుండగానే అంత జరిగిపోయింది. దూడ పడిన బరువుకి వెలగ చెట్లు ఒక దాని మీద ఒకటి పడి ఎనభై చెట్లు పడిపోయాయి. గోపాలురు ఏమిటి కృష్ణ దూడని చంపేసావు అని అనేలోపే ఆ దూడ కాస్త ఆరు కిలో మీటర్ల పొడవున్న వత్సాసురుడు అనే రాక్షసురికి మారిపోయాడు. గోపాల బాలురు అందరూ మా కృష్ణుడు ఏమి చేసిన మన మంచికే చేస్తాడు ఒక వెల్ల కృష్ణుడు ఆ రాక్షసుడిని చంపకపోతే వాడు మనలనందరిని చంపేసి తేనేసేవాడేమో అని భయపడరు. చనిపోయి పడిఉన్న రాక్షసుడి శరీరం చుటూ తిరుగుతూ ఆదుకున్నారు. శ్రీ కృష్ణుడు, బలరాముడు, గోపాలబాలురు అందరూ చీకటి పడక ముందే ఇళ్ళకి వెళ్లిపోయారు. శ్రీ కృష్ణుడు ఇంటికి వెళుతూనే వెనకే వచ్చిన గోపాల బాలురు అందరూ యశోదమ్మతో "యశోదమ్మ! ఈ రోజు శ్రీ కృష్ణుడు ఏమి చేసాడో తెలుసా ఒక రాక్షుసుడు లేగదూడ రూపములో వచ్చాడు. శ్రీ కృష్ణుడు దానిని చంపేశాడు" అని చెప్పారు. యశోదమ్మ భయపడుతూ ఆ నారాయణ స్వామికి "హే నారాయణ! నా కుమారుడిని వెంటే ఉంది రక్షించినందుకు నీకు కోటి కోటి ప్రణామాలు తండ్రి" అని క్షణం పెటింది. ఈ లోపు నందుడు, ఉప నందుడు అక్కడికి వచ్చారు. ఈ విషయం తెలుసుకొని శ్రీ కృష్ణుడికి ఇంత దూరం వచ్చిన ఆపదలు తప్పటం లేదు అనుకున్నారు కానీ వారికీ ఏదో దైవ శక్తీ వచ్చి శ్రీ కృష్ణుడిని రక్షిస్తుంది అని భావించారు. శ్రీకృష్ణుడు ఈమాటలు అన్ని విని నవ్వుకొని ఊరుకున్నారు.

శ్రీకృష్ణ - బకాసుర వధ

శ్రీకృష్ణుడు వత్సాసురుడిని వధించిన తరువాత రోజునే మల్లి శ్రీకృష్ణుడు, బలరాముడు, గోపాలబాలురు లేగదూడలను తీసుకొని మళ్ళీ అడవుల్లోకి వెళ్లరు. ఈ రోజు బలరాముడు, గోపాలబాలురు వెనక నడుస్తుంటే కొంచం ముందు శ్రీకృష్ణుడు ముందు నడుస్తున్నారు. అక్కడ పర్వతమంత ఎత్తున ఉన్న ఒక తెల్ల కొంగ జపం చేస్తునట్టు కదలకుండా నోరు తెరుచుకొని దీక్షగా కూర్చుంది. ఈ కొంగ బకాసురుడు అనే రాక్షసుడు. పూతన అనే రాక్షసికి సోదరుడు. తన సోదరిని చంపినా శ్రీకృష్ణుడిని చంపటానికి కంసుడు పంపగా వచ్చాడు. శ్రీకృష్ణుడు దానిని చూసారు. ఆ వచ్చింది రాక్షసుడు అని తెలుసు కొని దాని దగరకు వెళ్లరు. శ్రీకృష్ణుడు దగరకు రావటంతో వెంటనే నోటిలో వేసేసుకుంది. ఈ దృశ్యం చుసిన బలరాముడు, గోపాలబాలురు కదలిక లేకుండా పడిపోయారు. శ్రీకృష్ణుడు ఏది చూసి కొంగ గొంతులో అడంగా ఉండి అగ్ని గోళంగా మారారు. కొంగా ఆ వేడిని తట్టుకోలేక శ్రీకృష్ణుడు బయటకు వదిలేసింది. బయటకు కృష్ణుడు రాగానే కింద పడిపోయిన బలరాముడు, గోపాలబాలురకు మెలకువ వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే శ్రీకృష్ణుడు కొంగ ముక్కును రెండుగా చీల్చారు. కొంగ రూపంలో ఉన్న బకాసురుడు మరణించాడు. బకాసురుడు మరణించగానే అతనిలోనుంచి ఒక తేజస్సు బయటకు వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడు, బలరాముడు, గోపాలబాలురు సాయంత్రం ఇంటికి రాగానే యశోదమ్మకు జరిగిన విషయం చెప్పారు. యశోదమ్మ ఈ సారి భయపడలేదు. రాక్షసులు ఇలాగే వస్తుంటారులే నా కృష్ణుడికి ఏమి కాదు అని అనుకోను ఊరుకుంది. 

శ్రీకృష్ణ - అఘాసుర వధ

శ్రీకృష్ణుడు బకాసుర సంహారం చేసిన తరువాత రోజు మళ్ళీ చద్దన్నం కట్టుకొని లేగదూడలను తీసుకొని అడవికి వెళ్లరు. ఆ రోజు బలరాముడు అడవికి రాలేదు. శ్రీకృష్ణుడు ముందు నడుస్తుంటే వెనక ఉన్న గోపాలబాలురు అందరూ మన అందరిలో ఎవరైతే ముందువెళ్లి శ్రీకృష్ణుడిని పట్టుకుంటే వాళ్ళు గెలిచినట్టు అని పందెం పెట్టుకున్నారు. అందరూ పరిగెత్తటం మొదలు పెట్టారు. అందులో శ్రీధాముడు ముందు వెళ్లి శ్రీకృష్ణుడికి పట్టుకున్నారు. నేనే గెలిచాను అని సంతోషంతో శ్రీధాముడు తిరిగాడు. గోపాలబాలురు అందరూ శ్రీకృష్ణుడితో కలిసి ఆదుకున్నారు. శ్రీకృష్ణుడి మీద పడి ఆడుకున్నారు. అలా ఆడుకుంటూ వెళుతుండగా గోపాలబాలురుకి ఒక ఎనిమిది కిలోమీటరుల పొడవు ఉన్న కొండ చిలువ అడాసురుడనే రాక్షసుడు నోరు తెరుచుకొని ఉన్నది అది వాళ్ళకి కొండగుహల కనిపిచింది. దాని నుండి ఉచ్ఛస్వ నిశ్వాసలు వేడిగా వస్తున్నాయి. గోపాలబాలురు లోపలి వెళదామని అనుకొన్నారు. అందులో ఒకరు ఒరే ఇది ఏమైనా రాక్షసుడేమోరా లోపలి వెళితే మనలని మింగేస్తుందేమో అనుకున్నాడు. అందరూ శ్రీకృష్ణుడు ఉండగా మనకు భయమేముంది అని వెనక్కి తిరిగి శ్రీకృష్ణుడిని చూసారు. శ్రీకృష్ణుడు నవ్వుతు కనిపించారు. అది చుసిన గోపాలబాలురు ఇంక మనకు భయము లేదు అని లోపలి వెళ్లిపోయారు. గోపాలబాలురు, గోవులు లోపలికి వెళ్లగానే నాలుకతో వాళ్ళని పొట్టలో పడేసుకుంది. లోపలవేడికి గోపాలబాలురు, గోవులు మరణించారు. తరువాత శ్రీకృష్ణుడు లోపలకి వెళ్లారు. శ్రీకృష్ణుడు లోపలి వెళ్లగానే అఘాసురుడు నోరు మూసేసాడు. శ్రీకృష్ణుడు గొంతులోనుంచి లోపలి వెళ్లకుండా అక్కడే ఆగిపోయి పెద్దగా పెరిగిపోయారు. ఆలా పెరిగిన శ్రీకృష్ణుడు వల్ల గొంతు ముసుకుపోయి ఊపిరి ఆడక చనిపోయాడు అఘాసురుడు. అతని తల నుంచి బొటన వేళ్ళు అంత జ్యోతి వచ్చి ఆకాశంలోకి వెళ్లి నుంచుంది. శ్రీకృష్ణుడు దాని నోరు తెరచి చనిపోయిన గోపాలబాలురు, గోవులను బయటకు తీసుకువచ్చి ఒకొక్కలని భ్రతికించారు. గోపాలబాలురకు సంతోషం వేసి గంతులువేస్తూ శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ కొమ్ముబూరల ఊదుతూ శ్రీకృష్ణుడి చుట్టు తిరుగుతున్నారు. దేవతలు ఈ దృశ్యం చూసి పులా వాన కురిపించి తపేటలు తాళాలు వాయించారు. ఇలా జరుగుతున్న సమయంలో ఆకాశంలో ఉన్న అఘాసుర జ్యోతి వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. ఈ లీలను గోపాలబాలురు బృందావనంలోని తలితండ్రులకు సంవత్సరం తరువాత చెపుతారు.

పరమాత్మతో గోపాలబాలురి భోజనం

ఇక్కడ వ్యాసభగవానుడు, పోతనగారు గోపాల బాలురు తిన్న చద్దాన్నని అంతగా వివరించటానికి కారణం పరమాత్మ స్వరూపుడైన శ్రీ కృష్ణ భగవానుడితో గోపాలబాలురు తినటమే. శ్రీమహా విష్ణువు కేవలం యజ్ఞయాగాది క్రతువులతో వేదమంత్రాలతో హవిస్సులను పవిత్రంగా ఇస్తేనే స్వీకరిస్తారు. అటువంటిది ఇప్పుడు గోపాలబాలురతో చద్దన్నం తింటున్నారు కనుక అది అమృత భోజనం అయింది. పరమాత్మతో భోజనం తినే గోపాలబాలురు ఎంత అదృష్టవంతులో కదా! గర్గసంహితలో ఈ గోపాలబాలురు మూడు కోట్ల సంవత్సరాలు భాగవతం విన్నారు. అందుకనే వీరికి శ్రీకృష్ణుడితో కలిసి తినే, ఆడుకొనే, కలిసి తిరిగే అదృష్టం కలిగింది.

గోపాల బాలురు అఘాసురుడు చనిపోయిన ప్రదేశము నుంచి కొంచం ముందుకు నడుచుకుంటూ వెళ్లరు. అక్కడ ఒక చెరువు ఉంది. శ్రీకృష్ణుడు గోపాలబాలురతో స్నేహితులారా! మనం ఇక్కడే భోజనం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ దూడలకు నీరు తాగటానికి నీరు ఉన్నాయి. మనం భోజనం చేయటానికి నీడ ఉన్నది. మనం ఇక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాము అని అన్నారు. గోపాలబాలురు సరే అన్నారు. అప్పుడు గోపాలబాలురు అందరూ శ్రీకృష్ణుడు మాకు ఎదురుగా కూర్చోవాలి అని కోరారు. శ్రీకృష్ణుడిని మధ్యలో కూర్చోపెట్టి గోపాలబాలురు చుట్టూ కూర్చున్నారు. గోపాలబాలురు కొంతమంది చద్దన్నంలో మీగడగడ్డపెరుగు వేసుకొని అందులో ఆవకాయ, మాగాయ, గోంగూర ఇలా రకరకాల పచ్చడులు వేసుకొని వచ్చారు. కొందరు లడ్డులు, తీపి పదార్ధములు తీసుకొచ్చారు. కొందరు గోపాలబాలురు అరె మనం ఎవరు తెచ్చిన భోజనం వాళ్ళు తింటే ఎలాగా అందరము భోజనాన్ని ఒకచోట పెట్టి అందరము తిందాము అన్నారు. అందరూ సరే అన్నారు. గోపాలబాలురు తామరాకులు, గడ్డిపరకలు, తామరరేఖలు పరిచి ఒకచోట పెరుగన్నని, ఇంకోచోట ఆవకాయ పచ్చడిని, ఇంకోచోట మాగాయి పచ్చడిని, ఇంకోచోట గోంగూర పచ్చడిని వేసి ఇంకోచోట తీపి పదార్ధములు,వేసి అందరూ వరుసలో కూర్చొని అన్ని పదార్ధాలను వడ్డించుకొని తినసాగారు. ఇంకా శ్రీకృష్ణుడు గోపాలబాలురా మధ్యలో కూర్చున్నారు. అయన నీలిమేగా చాయగా ఉన్నారు. అయన చేతులు, అరికాళ్ళు పాదములు,అయన పెదవులు లేత ఎరుపు రంగులో ఉన్నాయి. అయన దూడలను కొట్టటానికి ఒక వెదురు కర్రకు బంగారు పూత పూసిన కర్రను చంకలో పెట్టుకున్నారు. శ్రీకృష్ణుడు చేతి వేళ్ళ మధ్యలో మాగాయి ముక్కలు, ఆవకాయ ముక్కలు పెట్టుకొని గోంగూర పచ్చడి నంచుకుని మీగడగడ్డపెరుగు చద్దన్నం తింటున్నారు. ఇలా తింటున్నపుడు అక్కడే వదిలిన లేగ దూడలు కనిపించలేదు. తింటున్న శ్రీకృష్ణుడు గోపాలబాలురా! మీరు తింటూ ఉండండి నేను వెళ్లి దూడలను వెతికి తీసుకువస్తాను అని చేపి శ్రీకృష్ణుడు వెదురు కర్రను తీసుకొని బయలుదేరారు. 

కొడుకు తండ్రిని పరీక్షించుట 

గిరజాల జుట్టుతో చేతిలో పెరుగన్నం ముద్దతో దూడలను వెతకటానికి బయలుదేరారు శ్రీకృష్ణడు. శ్రీకృష్ణుడు దూడలను వాటి పాదగుర్తుల ఆధారంగా వెతుకుంటూ వెళ్లరు. చీటిఅడవులు, గుంతలు, సెలయేరులు, కొండలు అని వెతికారు. ఎక్కడ కనిపించలేదు. తిరిగి గోపాలబాలుర దగరకు వచ్చారు. అక్కడ గోపాలబాలురు కూడా కనిపించలేదు. శ్రీకృష్ణుడికి ఆశ్చర్యం చేసింది.అసలు ఏమిజరిగిందో తెలుసుకుందామని తన దివ్య దృష్టితో చూసారు. అసలు ఏమి జరిగింది అంటే శ్రీకృష్ణుడు అఘాసురుడిని చంపి చనిపోయిన గోపాలబాలురను బ్రతికించిన ఈ బాలుడు ఎవరు అని బ్రహ్మ దేవుడికి సందేహం వచ్చింది. వెంటనే దూడలను తీసుకెళ్లి ఒక కొండగుహలలో నిద్రపోయేలా చేసారు. శ్రీకృష్ణుడు గోవులను వెతకటానికి వెళ్లినపుడే ఇక్కడ బ్రహ్మ దేవుడు గోపాలబాలురని కూడా తీసుకెళ్లి కొండగుహలో నిద్రపుచేసారు. ఇదంతా దివ్యదృష్టితో చుసిన  శ్రీకృష్ణుడు బ్రహ్మదేవా ఎంతపని చేసావు. ఎక్కడైనా కొడుకు తండ్రిని పరిక్షిస్తాడా ఏమైనా నువ్వు నా కొడుకువు నీ కొరికే నెరవేరనీవు అని ఒకసారి తన సంకల్పంతో తానే గోపాలబాలురై, గోవులై బృందావనానికి వెళ్లరు. చిత్రంగా రోజు శ్రీకృష్ణుడిని పలకరించిన తరువాతే తమ పిల్లలను చూసేవాళ్లు ఈ రోజు ఎవరు కూడా శ్రీకృష్ణుడిని పఠించుకోలేదు. అందరూ తమ పిల్లలనే ముందు చేసారు. ఆవులు కూడా దూడలను ప్రేమగా దగరకు తీసుకున్నాయి. ఇది అంత చుసిన బలరాముడికి ఆశ్చర్యం వేసింది. అసలు ఏమి జరిగిందో తెలుసుకుందామని తన దివ్య దృష్టితో చుసిన తెలియలేదు. ఇంకా లాభం లేదు అని శ్రీకృష్ణుడినే అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు జరిగినవిషయం చెప్పారు. ఇలా ఒక సంవత్సరం జరిగింది. బ్రహ్మ దేవుడికి ఒక లిప్త కలం జరిగింది. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడు ఏమి చేస్తున్నారో చూదామని వచ్చారు. శ్రీకృష్ణుడు అతని స్నేహితులు అయినా గోపాలబాలురు ఆవు దూడలు కనిపించాయి. వెంటనే బ్రహ్మదేవుడు గోపాలబాలురను ఆవుదూడలను కొండా గుహలో ఉన్నాయో లేదో చూసారు. అక్కడే ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు. బ్రహ్మదేవుడికి అర్ధం అయిపోయింది ఇక్కడ బాలుని రూపములో ఉన్నదీ తన తండ్రి అయినా శ్రీమహా విష్ణువే అని తెలుసుకున్నారు. బ్రహ్మ దేవుడు వెంటనే వెళ్లి శ్రీకృష్ణుడి పాదాలపైనా పడి తనని క్షమించమని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు కరుణించి తాను సృష్టించిన గోపాలబాలురు, ఆవుదూడలు వెళ్లి ఆయనలో కలిసిపోయాయి. బ్రహ్మదేవుడు తీసుకుని వెళ్లిన గోపాలబాలురను, ఆవుదూడలను మల్లి యధావిధిగా తీసుకొచ్చి పొడుకోపెట్టారు. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి వెళ్లిపోయారు. గోపాలబాలురు ఆవుదూడలు నిద్రలేచారు. గోపాలబాలురు సంవత్సరం క్రిత్రం శ్రీకృష్ణుడిని చేతిలో పెరుగు ముద్దతో కనిపించారు. గోపాలబాలురు ఆవుదూడలు తిరిగి బృందావనం వెళ్లరు. వెళ్లి యశోదమ్మకు శ్రీకృష్ణుడు ఈ రోజు ఒక పెద్దపాముని చంపేశారు మమ్మలిని రక్షించారు అని చెప్పారు. ఈ రోజు బృందావన ప్రజలు మాములుగా ముందు శ్రీకృష్ణుడినే పలకరించారు. 

గోపాలబాలురి కోరికను నెరవేర్చిన శ్రీకృష్ణబలరాములు

గోపాలబాలురితో శ్రీకృష్ణుడు అడవిలో తిరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు బలరాముడితో అన్నయ్య! ఈ చెట్లు చూడు ఎంత అందంగా ఉన్నాయో అని చెప్పారు. ఇంకా చెపుతూ ఈ చెట్లకి వినయం ఎక్కువ అవి నీకు సేవచేస్తున్నాయి అన్నారు. ఒక చోట మామిడి చెట్లకి బాగా పండ్లు కాసి చెట్టు కొమ్మలు కిందకు వొంగాయి. అవి బలరాముడు కాళ్లకుతగిలాయి. అది చూసి శ్రీకృష్ణుడు అన్నయ్య! ఈ చెట్లు బాగా పండ్లు కాసి ఈ పండ్లోతో తమ కొమ్మలని ఇలా వొంచాయి. చెట్లకి కొమ్మలు చేతులు కృష్ణ బలరామ మీరు తొందరగా మా దగరకు రండి ఇవిగో మా చేతులతో ఈ పండ్లను మీ చేతులకి ఇస్తున్నాము మాకు పండ్ల బరువు ఎక్కువైపోయింది మాకు ఎందుకు ఈ పండ్లు వీటిని మిరే స్వీకరించండి. ఈ పండ్లు మీరు స్వీకరిస్తే మా జీవితం ధన్యం అవుతుంది అని అన్నారు. అక్కడే ఉన్న ఇంకో గోపాలబాలురు అదేమిటి కృష్ణ చెట్లు వొంగాయి. పండ్లు కిందకి వేలాడుతున్నాయి. కానీ చెట్లు ఎప్పుడు మాట్లాడాయి అని అడిగారు. అందుకు శ్రీకృష్ణుడు చెట్లపైన చిలుకలు ఉన్నాయి కదా అవి చెట్లు మాట్లాడినవి నాకు చెపుతున్నాయి అని చెప్పారు. మళ్లీ శ్రీకృష్ణుడు అన్నయ్య! ఆ పండ్లను తీసుకొని తిని వాటికీ మోక్షాన్ని అనుగ్రహించు అన్నారు. అప్పుడు బలరాముడు ఆ పండ్లను తీసుకొని అందరికి పంచి కొంచం పండుని శ్రీకృష్ణుడికి తినిపించి తాను తిన్నారు. ఇంకొంచం ముందుకు వెళ్లారు. అక్కడ గడ్డిపరకలు ఉన్నాయి. వాటిపై శ్రీకృష్ణుడు బలరాముడు కాళ్ళు పెట్టారు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నయ్య! ఈ గడ్డిపరకలు ఎంత అదృష్టం చేసుకున్నాయి కదా. వాటికీ నీ పాద స్పర్శ తగిలి అడవి జన్మ ధన్యం అయింది. ఇంకొంచం ముందుకు వెళ్లారు. అక్కడ కొన్ని చిన్ని చిన్నచిన్న పిట్టలు, ఎలుకలు, కుందేలు అటుఇటు పరుగెడుతూ బలరాముడు కాళ్లకు తగిలాయి. అన్నయ ఇందాక గడిపారకాలని అనుగ్రహించవు. ఇపుడు ఎలుకాలని, కుందేలని, పిట్టలని అనుగ్రహించవు. ఇపుడు వీటిని కూడా అనుగ్రహించు అని అన్నారు శ్రీకృష్ణుడు. ఇలా శ్రీకృష్ణుడు అన్నయ్య బలరాముడితో మాట్లాడుతూ ఉండగా ఆవుదూడలు గడ్డిని మేస్తూ దూరంగా వెళ్లాయి. అవి ఏ క్రూరజంతువు బారిన పడతాయోనని వాటిని శ్రీకృష్ణుడు ఇలా పిలవసాగారు. ఓ మహాలక్ష్మి, సర్వ మంగళ, మంగళ, పూర్ణచంద్రిక, భగీరధి, గంగా, సరస్వతి, మందాకిని, సుబంగి, ధరిత్రి, భారతి, మేఘమాలిక, చింతామణి, సురభి, గౌతమి, మనోహారిణి రా రా రండి రండి అని పిలిచారు. శ్రీకృష్ణుడు పిలుపు విన ఆవుదూడలు వెంటనే అంబ అంబ అంటూ చెంగు చెంగున పరిగెత్తుకు వచ్చాయి. శ్రీకృష్ణుడిని చుట్టు తిరగసాగాయి. అది చుసిన దేవతలు శ్రీకృష్ణ ఆ ఆవుదూడలు ఎంత పుణ్యం చేసుకున్నాయి. నీచేత పేర్లు పెటించుకొని పిలుచుకుంటున్నాయి. మాకు ఆ అదృష్టం లేదుకదా అనుకోని పైనుంచి పుష్ప వర్షం కురిపించారు.బ్రహ్మదేవుడు అయితే ఈయనేనా మా నాన్న గారు సమస్త బ్రహ్మాండాలను సృష్టించి పోషించి లయం చేసే ఈయన ఈ రోజు ఒక చిన్న బాలుడి రూపములో బృందావనంలో గోపబాలురితో ఆవుదూడలతో ఆడుకుంటున్నారా ఎన్ని లీలలు చేస్తున్నారో. ఎందుకు ఈ బ్రహ్మ పదవి అనుకున్నారు. కొంత సేపటి తరువాత ఆవుదూడలతో ఆడుకుంటూ ఉండగా గోపాలబాలురు శ్రీకృష్ణుడి దగరకు వచ్చి శ్రీకృష్ణ మేము అలసిపోయాము అక్కడైనా విశ్రాంతి తీసుకుందాము అన్నారు.  శ్రీకృష్ణుడు గోపాలబాలురని తీసుకొని వెళ్లి ఒక కొండగుహ దగ్గర కాసేపు పొడుకోబెట్టారు.ఆ కొండగుహ  అనుకుందా. ఆహా ఏమి నా అదృష్టం నేను బండరాయిగా పుట్టాను అనుకున్నాను. కానీ ఈ రోజు శ్రీకృష్ణుడి పాదస్పర్శ తగిలి నా జన్మ ధన్యం అయింది. బ్రహ్మలోకంలో ఉన్న సరస్వతి దేవి ఇలా అనుకుంది. ఉపనిషత్తుల వర్ణనలో ఉండే అయన ఇప్పుడు వైకుంఠాన్ని వదిలి ముళ్ళతో, బండరాళ్లతో కూడిన అడవులలో తిరుగుతున్నారు. ఎప్పుడు మెత్తగా ఉండే ఆదిశేషుడి పరుపుపైన పోసుకునే స్వామి ఇపుడు అడవిలోని ఈ కొండగుహలో ఆకులను పరుచుకొని పొడుకున్నారు. యోగుల హృదయాలలో ఉండే అయన ఈ రోజు అడవిలోని కొండగుహలలో విహరిస్తున్నారు. లక్ష్మీదేవితో సరదాగా కుస్తీపట్లు పట్టుకొని ఆడుకుంటూ తిరిగే అయన ఈ రోజు గోపాలబాలురితో కుస్తీపట్లు పడుతున్నారు. యజ్ఞంలో పూర్ణాహుతిని స్వీకరించే స్వామి ఇప్పుడు అడవిలో పండ్లను తీసి వాటిని దీవిస్తున్నారు. అన్ని లోకాలకి అభయం ఇచ్చే స్వామి ఇప్పుడు అలసిపోయి చెట్ల నీడలో నిదురిస్తున్నారు. నీతో తిరిగే భాగ్యం నాకు కలగలేదు కదా అనుకుంది. అలా వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకోగానే శ్రీకృష్ణుడి దగ్గరకి బలరాముడు దగరకు పిలలువచ్చారు. ఇద్దరు పిల్లలు శ్రీకృష్ణుడి పదాలు వొత్తుతున్నారు. ఇంకో ఇద్దరు బలరాముడు పాదములు ఒత్తుతున్నారు.  బలరామ, శ్రీకృష్ణ మీరు కరణ జన్ములు మహానుభావులు మీరు తలచుకుంటే చేయలేనిది లేదు. మాకు చాలాకాలం నుంచి ఒక కోరిక ఉంది ఆ కోరికను తీర్చండి అన్నారు. వాళ్ళ పేరులు శ్రీధాముడు, సుదాముడు, స్వధాముడు, సూధముడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అన్నయ్యని అడగండి తీరుస్తాడు అన్నారు. బలరామ కొండంత బలం కలిగిన వాడివి. నీ బలం వల్ల మాకు ఆనందం కలిగిస్తావు. అందుకే అడుగుతున్నాము. మా కోరికను నిజంగా తీరుస్తావా అని అడిగారు. అప్పుడు బలరాముడు ఏమిటో చెప్పండి తీరుస్తాను అన్నారు. అప్పుడు గోపాలబాలురు అక్కడ దూరంగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో పెద్ద తాటి చెట్లు ఉన్నాయి. ఆ తాటి చెట్లతో కూడిన ఆ వనం తాలవనం. ఆ తాటిచెట్లకి మంచి తాటిపండ్లు కాసాయి. ఆ పండ్లు ముగిపోయి కోసేవాళ్లు లేక కిందపడిపోతున్నాయి. అన్ని తాటిపండ్లు ఉన్న తినటానికి ఎవరు అక్కడికి వెళ్లరు. ఆ వనంలో గాడిద రూపంలో ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడి పేరు ధేనుకాసురుడు. వాడికి ఇద్దరు భార్యలు. వాళ్ళు గాడిదలే. వాళ్ళకి పదివేలమంది సంతానం ఉన్నారు. వాళ్ళు గాడిదలే. వాడికి సోదరులు, వారి భార్యలు, పిల్లలు అందరూ గాడిదలే. వాళ్ళ వల్ల ఆ వనంలోకి ఎవరు వెళ్లిన వాళ్లని చంపేస్తూ ఉంటారు అందుకే ఎవరు వెళ్లలేక పోతున్నారు. మాకు చాలాకాలం నుంచి ఆ పక్కగా వెళుతునపుడు ఆ పండ్ల వాసనకు వాటిని తినాలని కోరిక కలిగింది. మాకు కొంచం తాటి పండ్లు పెటించారా అన్ని కోరారు. అందుకు శ్రీకృష్ణుడు బలరాముడు నవ్వుకొని సరే తీరుస్తాను అన్ని చెప్పారు. శ్రీకృష్ణ, బలరాముడు గోపాలబాలురని వెంటపెట్టుకొని ఆ వనంలోకి వెళ్లారు. వాళ్ళు వెళ్లే సమయానికి చెట్ల నుంచి పండ్లు కింద పడుతున్నాయి. అది చుసిన గోపాలబాలురు బలరామ బలరామ తినేస్తున్నాము. నువ్వే చూసుకో ఆ రాక్షసుడి సంగతి అన్ని తినటం మొదలుపెట్టారు. ఆ ధేనుకాసురుడిని చంపాలని శ్రీకృష్ణుడు బలరాముడికి చెప్పారు. అందుకని బలరాముడు ఆ ధేనుకాసురుడిని బయటకు రాపించటానికి అన్ని తాటిచెట్లను గట్టిగ పట్టుకొని వాటిని ఊపుతూ పండ్లను రాల్చటం మొదలుపెట్టారు. 

శ్రీకృష్ణ - కాళీయమర్ధనం

క్రమంగా కలం మరి వేసవికాలం వచ్చింది. ఎండలు అందిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణుడు ఉన్న బృందావనంలో మాత్రం ఎప్పుడు వసంత ఋతువే ఉండేది. ఎప్పటిలాగానే ఆవుదూడలను మేపటానికి వేళాటానికి శ్రీకృష్ణుడు బలరాముడికి పిలిచారు. బలరాముడు శ్రీకృష్ణుడితో ఈరోజు ఎండా వేడిగా ఉంది నేను రాలేను మీరు వెళ్లిరండి అని చెప్పారు. అందుకు శ్రీకృష్ణుడు మనస్సులో నువ్వు ఎందుకు రాను అంటున్నావో నాకుతెలుసులే సరే నువ్వు ఈ రోజుకి ఇంట్లోనే ఉండు నేను వెళ్లివస్తాను అని  చేపి గోపాలబాలురతో శ్రీకృష్ణుడు అడవికి వెళ్లారు. అడవిలో ఆవుదూడలు అక్కడక్కడే గడ్డి మేస్తున్నాయి. ఎండలు ఎక్కువగా ఉండటం వలన అందరూ చెట్టుకిందన సేదతీరుతున్నారు. కొంతసేపటికి గోపాలబాలురకి దాహం వేసింది. శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణ మాకు చాలా దాహంగా ఉంది. మేము ఆ మడుగులో నీరు తాగుతాము అని చేపి వెళ్లారు. ఇంతలో శ్రీకృష్ణుడు వద్దు వెళ్ళాడు అని అనేలోపే వాళ్ళు ఆ నీళ్లు తాగేశారు. కొంతసేపటికి వారందరు మరణించారు. అప్పుడు శ్రీకృష్ణుడు అయ్యో ఎంత పని చేసారు మీరు నేను వద్దు అనేలోపే వెళ్లి నీళ్లు తాగేశారు ఇప్పుడు చుడండి ఏమయిందో అని వాలందరిని చూపులతో బ్రతికించారు. ఈ మడుగులో ఉన్న కాళియుడికి కాలం ఆసన్నమైనది. వీడు వదిలిన విషం వలన మడుగు అంత విషపూరితమైనది. ఆ విషపునీరు ఎండకి ఆవిరిలామారి గాలిలో కలసి ఈ మడుగుపై వచ్చిన పక్షులు కూడా చనిపోతున్నాయి. వీడికి గుణపాఠం చెప్పాలి. శ్రీకృష్ణుడు చుట్టూ చూసాడు. ఆయనకి ఒక కదంబ వృక్షం కనిపించింది. గోపాలబాలురతో స్నేహితులారా! ఈ ఇక్కడ ఏమి జరిగిన మీరు ఏమి మాట్లాడవద్దు. మీరు మడుగులోకి రావద్దు అని చెప్పారు. శ్రీకృష్ణుడు మడుగులో దూకటానికి తన ఉత్తరీయాని నడుముకి గట్టిగా కట్టుకున్నారు. నెమలిపించని పడిపోకుండా గట్టిగా తలకు కట్టుకున్నారు. ఇపుడు కాళియుడికి నేను వచ్చిన విషయం తెలియాలి అంటే నేను మడుగులో పెద్ద శబ్దం చేయాలి. కదంబం వృక్షం పైకి ఎక్కారు. అక్కడినుంచి అమాంతం మడుగులోకి దూకారు. శ్రీకృష్ణుడు దూకిన వేగానికి మడుగులో నీళ్లు పనేందు మైళ్ళు ఎత్తుకి కెరటాలు లేచాయి. ఆ శబ్దానికి కాళియుడు ఉలిక్కిపడ్డాడు. ఎవరు నా మడుగులోకి వచ్చే ధర్యం చేసింది అని వచ్చి చూసాడు. చుస్తే ఆరు సంవత్సరాల పిల్లవాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు అని వదిలేస్తే అందరూ నన్ను పిరికివాడు అంటారు. శ్రీకృష్ణుడుని చంపటానికాని అయన మీదకి వచ్చారు. శ్రీకృష్ణుడిని ఏడూ చుట్టాలు చుట్టి పడగా విపి శ్రీకృష్ణుడిని గట్టిగా  నొక్కసాగాడు. శ్రీకృష్ణుడికి ఒక ఆలోచన వచ్చింది. బృందావనం వాసులను తన తల్లీతండ్రులని పరీక్షించాలి అనుకున్నారు. వీరంతా నామీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. వీరి ప్రేమ ఎలాంటిదో ఒకసారి చూడాలి అని శ్రీకృష్ణుడు కాళియుడి చెరలో ఉంది తలను పక్కకు వాల్చేసారు. అది చూసి గోపాలబాలురి గుండె ఆగిపోయింది. శ్రీకృష్ణ అంటూ కుందపడిపోయారు. అదేసమయంలో బృందావనంలో అందరికి ఆడవారికి కుడికన్నుమొగవారికి ఎడమ కన్ను అదిరింది. అందరూ ఒకచోటికి వచ్చి శ్రీకృష్ణుడికి ఎదో ఆపద వచ్చింది. మా మనస్సులు గంగారుగా ఉన్నాయి అని వారు ఎక్కడిపనులు అక్కడే వదిలిపెట్టి ఉన్నపలంగా అందరూ అడవి వైపు వచ్చారు. అక్కడ మడుగులో కాళియుడి చెరలో ఉన్న శ్రీకృష్ణుడిని చూసి అందరూ విలవిలా ఏడిచారు. ఆ కాళియుడిని శాపనార్ధాలు పెట్టారు. యశోదమ్మ, నందుడు మేము కూడా మా పుత్రుడితోపాటే చనిపోతాము అని మడుగులోకి వెలబోతున వారిని బృందావణవాసులు అప్పుతున్నారు. అప్పుడు బలరాముడు మనస్సులో స్వామి నీ లీలావినోదం ఎంతసేపు నీపై ప్రేమతో అందరి ప్రాణాలు మొయేలాగా ఉన్నాయి. వారికీ కరుణించు అని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు చిరు మందహాసం చేసి ఉన్నటుండి తన శరీరాన్ని అమాంతం పెంచేశారు. కాళియుడి శరీరం అంత గాయాలు అయ్యాయి శ్రీకృష్ణుడిని వదిలేసాడు. కాళియుడికి కోపంవచ్చి మళ్ళి  శ్రీకృష్ణుడి మీదకి రాబోయారు. శ్రీకృష్ణుడు కాళియుడి తోకను పట్టుకొని గిరగిరా తిపి ఒక కొండకు వేసికొంటారు. శరీరం అంత రక్తం వస్తున్నా కాళియుడి అహంకారం చవక మళ్ళి మళ్ళి శ్రీకృష్ణుడి మీదకు వచ్చాడు. శ్రీకృష్ణుడు వచ్చిన ప్రతిసారి గిరగిరా తిపి కొట్టారు. ఎలా వంద సార్లు తిపి కొట్టారు. కాళియుడికి నూటైదు పడగలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు వాటిపైకి ఎక్కి నుంచున్నాడు. ఒకోపడగకి ఒకో మణి ఉన్నది. అయన ఈ పడగలపైనా నాట్యం చేయటానికి వేదికలుగా తయారయింది. అన్ని దెబ్బలు తిన్న కాళియుడు కదలలేక ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు మధురమైన మురళిని వాయిస్తూ నాట్యం మొదలు పెట్టారు. శ్రీకృష్ణుడి నాట్యానికి ప్రకృతి పరవశించింది. తుమ్మెదలు శ్రీకృష్ణుడి వేణువుకి అనువుగా జుంకానాథం చేసాయి. యమునా నది తన కెరటాలను పైకి ఎత్తి దాచుతుంటే మృదంగా ధ్వనిలాగా వినిపించాయి. ప్రకృతిలో ఉన్న చిలుకలు, కోయిలలు మధురంగా తమ కుతలను వినిపిస్తున్నాయి. శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్నపుడు అయన కాళ్ళకి ఉన్న గజ్జలు తాళంలా చేస్తున్నాయి. అయన నాట్యం చేస్తుంటే అక్కడి చెట్లు చల్లని వసంత గాలులు వీచాయి. కాళియుడి తలల పైన ఉన్న మణులు ఒకోటి ఒకో రంగులో ఉన్నాయి. నవరత్నాలు రంగులు శ్రీకృష్ణుడు ముఖం పై పడి అయన ఇంకా అందంగా కనిపించరు. ఈ సుందరమైన సంఘటనకు దేవతలు కూడా పరవశించి శ్రీకృష్ణుడి పై పుష్ప వర్షం కురిపించారు. శ్రీకృష్ణుడు నాట్యం చేస్తుంటే అయన పాదముద్రలు కాళియుడి తలలపై పడ్డాయి. తరువాత కాళియుడికి బుద్దు వచ్చింది. నా విషజ్వాలకు దేవతలు సైతం భయపడతారు. నారదుడు ఒకసారి నన్ను హెచ్చరించారు నువ్వు ఇలాగే అహంకారంతో ఉంటె వైకుంఠ వాసుడైన శ్రీకృష్ణుడు నీకు బుద్ధి చెపుతారు అన్నారు. ఈయన ఎవరోకాదు ఆ దేవాధిదేవుడు శ్రీమహావిశువే అని శ్రీకృష్ణుడిని శరణు వేడాడు. శ్రీకృష్ణ శరణు శరణు అని వేడుకున్నారు. కాళియుడికి నూటొక్క మంది భార్యలు. వారందరు స్త్రీ రూపము దాల్చి శ్రీకృష్ణుడిని శరణు వేడారు. శ్రీకృష్ణ శరణు శరణు అని వేడుకున్నారు. స్వామి మా పతిని విడిచిపెట్టు అతని తప్పులను మనించు. దేవదేవుడివైనా నీవు మన్నించకపోతే మమ్మలిని ఇంకా ఎవరు రక్షిస్తారు. మా తండ్రులు ఈ కాళియునికి ఇచ్చి వివాహం చేసారు. ఆదివివాహమే కాదు. నివ్వు మా పతిని విడిచిపెడితే అదేమాకు మరల వివాహం జరిగినట్టు అనుకుంటాము. మాకు పతి బిక్ష పెట్టు అని వేడుకున్నారు. కాళియుడు కూడా స్వామి! నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు అమాయకులను భాదించాను అని వేడుకొన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు కాళియా! ఇది ప్రజలకు ఉపయోగపడే మడుగు దీనిని విడిచి నీ నిజస్థానమైన రమణక ద్విపానికి వెళ్ళు అని అన్నారు. అప్పుడు కాళియుడు స్వామి! నేను అహంకారంతో గరుత్మంతునితో విరోధం తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ మడుగు నుండి నేను వెళితే గరుత్మంతుడు నన్ను సంహరిస్తాడు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కాళియా! నేను నీ శిరస్సు పైన నాట్యం చేయటం వలన నా పాదముద్రలు నీ శిరస్సులపై పడాయి. వాటిని చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు. నీవు ధైరంగా వెళ్ళు అని చెప్పారు. కాళియుడు అతని భార్యలు అతని సంతానం అంత బృందావణ వాసులు అంతా చూస్తుండగానే మాయమయిపోయారు. అంత శ్రీకృష్ణుడి లీలా అనుకున్నారు. శ్రీకృష్ణుడు తన చూపులతో మడుగులో విషాన్ని తిలగించారు. శ్రీకృష్ణుడు వడ్డుకు వచ్చారు. యశోదమ్మ శ్రీకృష్ణుడికి పట్టుకొని తన కనీళ్లతో శ్రీకృష్ణుడి తలకి అభిషేకం చేసేసింది. తన పుత్రుడిని తలచుకొని తరచి తరచి చేసుకుంటేనే గాని ఆమె మనస్సు శాంతించలేదు. బృందావన వాసులంతా శ్రీకృష్ణుడు మళ్ళి నవ్వుతు కనిపించేసరికి శాంతించారు. 

శ్రీకృష్ణ- అడవిలో దావానలం 

బృందావనంలోని అందరు ఎక్కడివాకదా వదిలేని పరుగుపరుగున వచ్చారు కదా. అందరికి కంగారు ఇంకా గుండెలు బాదుకుని ఏడవటం వలన అందరూ అలసిపోయారు. అందుకని శ్రీకృష్ణుడితో మనం అందరం అలసిపోయాము ఈరోజుకి ఇక్కడే ఉండిపోయి రేపుపొదున వెళదాము అని అనుకున్నారు. శ్రీకృష్ణుడు కూడా సరే అన్నారు. అందరూ ఆహారం కూడా లేకుండా అందరూ ఎక్కడికక్కడే నేలపైన పొడుకున్నారు. మధ్యరాత్రి దాటినా తరువాత అది ఎండాకాలం అవటం వలన కొమ్మ కొమ్మ రాసుకొని అగ్ని అంటుకొని అడవిలో దావానలం అంటుకుంది. నిద్ర పోతున్నవారికి వేడి పొగ తగిలి అందరూ నిద్ర లేచి శ్రీకృష్ణ శ్రీకృష్ణ రక్షించి రక్షించు అని వేడుకున్నారు. బృందావన జనులు పొగాకు ఊపిరి ఆడక తలదిలిపోయారు. వారి అవస్థను చుసిన శ్రీకృష్ణుడు నన్ను నమ్ముతున్నారు కదా అయితే మీరు అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి అన్నారు. బృందావన జనులు అందరూ కళ్ళు మూసుకున్నారు. వెంటనే శ్రీకృష్ణుడు అగ్నిదేవా అడవిని కాల్చింది చాలు వెంటనే నా చేతుల్లోకి రా అని అన్నారు. అగ్ని దేవుడు వెంటనే మహోగ్రరూపమైన తన రూపాని చిన్న దీపంగా మార్చుకొని శ్రీకృష్ణుడి చేతిలోకి వచ్చారు. శ్రీకృష్ణుడు ఆ అగ్నిని మిగేసారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి అని అన్నారు. బృందావన జనులు అందరూ కళ్ళు తెరిచారు. అందరూ చుస్తే ఇంతకు ముందుకన్నా ఇప్పుడు అడవి పచ్చగా ఉంది. అప్పుడు బృందావన జనులకి శ్రీకృష్ణుడికి పైన ఇంకా నమ్మకం పెరిగింది. శ్రీకృష్ణ మమల్ని ఉన్నపలంగా బృందావనం తీసుకువెళ్ళి అందరికి ఆకలిగా ఉంది ఎక్కడిపనులు అక్కడే వదిలేసి వచ్చాము అని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అయితే మళ్ళి అందరూ కళ్ళు మూసుకోండి. అప్పుడు ఒక గోపాలబాలురు శ్రీకృష్ణ నువ్వు ఏమిచేస్తావో నాకు తెలుసు అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ నేను ఏమిచేస్తాను అన్నారు. అప్పుడు గోపాలబాలురు ఇందాక నువ్వు అందరినీ కళ్ళుమూసుకోమన్నారుకదా నేను మాత్రం మూసుకోలేదు. అప్పుడు నువ్వు ఆ అగ్ని వైపు చూసావు నువ్వు చూడగానే ఆ అగ్ని నీ చేతుల్లోకి వచ్చేసింది. దానిని నువ్వు మూగేసారు నేను చూసాను అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నేనూ నిన్ను చూడడు అన్నాను కదా ఎందుకు చూసావు అన్నారు. ఎవరు చూడకపోతే నీమహిమలూ ఎవరుచెపుతారు. శ్రీకృష్ణుడు ఆ గోపబాలురికి ఈసారిమాత్రం అలా పని చేయకు అని మరీమరీ చెప్పారు. అందరి కళ్ళు మూసుకోమని చెప్పారు. అందరూ కళ్ళుమూసుకున్నారు. కాసేపటికి అందరూ కళ్లుతెరచి చూస్తే ఎవరి ఇంట్లో వాలే ఉన్నారు. కళ్ళు తెరచి చుసిన గోపాలుడు మాత్రం అక్కడే అడవిలోనే ఉండిపోయాడు. ఆ గోపాలబాలుడు పడుతూ లేస్తూ ఎనిమిది మైళ్ళు నడిచేసరికి అతనికి బుద్ధి వచ్చింది. వెంటనే శ్రీకృష్ణుడి దగరకు వచ్చి నన్ను క్షమించు నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నీ మాటకు ఎదురు చెప్పాను. నువ్వు అలాచెపితే అలాగేచేస్తాను అని అన్నారు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. శ్రీకృష్ణుడు ఆ గోపబాలురికి ఈసారిమాత్రం అలా పని చేయకు అని మరీమరీ చెప్పారు. అందరి కళ్ళు మూసుకోమని చెప్పారు. అందరూ కళ్ళుమూసుకున్నారు. కాసేపటికి అందరూ కళ్లుతెరచి చూస్తే ఎవరి ఇంట్లో వాలే ఉన్నారు. కళ్ళు తెరచి చుసిన గోపాలుడు మాత్రం అక్కడే అడవిలోనే ఉండిపోయాడు. ఆ గోపాలబాలుడు పడుతూ లేస్తూ ఎనిమిది మైళ్ళు నడిచేసరికి అతనికి బుద్ధి వచ్చింది. వెంటనే శ్రీకృష్ణుడి దగరకు వచ్చి నన్ను క్షమించు నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నీ మాటకు ఎదురు చెప్పాను. నువ్వు అలాచెపితే అలాగేచేస్తాను అని అన్నారు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. శ్రీకృష్ణుడు ఆ గోపబాలురికి ఈసారిమాత్రం అలా పని చేయకు అని మరీమరీ చెప్పారు. అందరి కళ్ళు మూసుకోమని చెప్పారు. అందరూ కళ్ళుమూసుకున్నారు. కాసేపటికి అందరూ కళ్లుతెరచి చూస్తే ఎవరి ఇంట్లో వాలే ఉన్నారు. కళ్ళు తెరచి చుసిన గోపాలుడు మాత్రం అక్కడే అడవిలోనే ఉండిపోయాడు. ఆ గోపాలబాలుడు పడుతూ లేస్తూ ఎనిమిది మైళ్ళు నడిచేసరికి అతనికి బుద్ధి వచ్చింది. వెంటనే శ్రీకృష్ణుడి దగరకు వచ్చి నన్ను క్షమించు నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నీ మాటకు ఎదురు చెప్పాను. నువ్వు అలాచెపితే అలాగేచేస్తాను అని అన్నారు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. వెంటనే శ్రీకృష్ణుడి దగరకు వచ్చి నన్ను క్షమించు నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నీ మాటకు ఎదురు చెప్పాను. నువ్వు అలాచెపితే అలాగేచేస్తాను అని అన్నారు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. వెంటనే శ్రీకృష్ణుడి దగరకు వచ్చి నన్ను క్షమించు నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నీ మాటకు ఎదురు చెప్పాను. నువ్వు అలాచెపితే అలాగేచేస్తాను అని అన్నారు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. 

గోపాలబాలుడి రూపంలో వచ్చిన రాక్షసుడు - శ్రీకృష్ణుడు ఏమి చేసారు

ఒకరోజు శ్రీకృష్ణుడుబలరాముడు గోపాలబాలురితో ఆవుదూడలను కాస్తూ అడవిలో ఉన్నారు. అక్కడికి ఒక గోపాలబాలుడు వచ్చాడు. అతనిని చూడగానే శ్రీకృష్ణుడు మనస్సులో కంసుడు పంపిన రాక్షసుడు ప్రలంబాసురుడు నన్ను వధించటానికి వచ్చాడు అంతని పని చెప్పాలి అనికొని శ్రీకృష్ణుడు ఎవరునువ్వు అని దగరకు వెళ్లి మాట్లాడారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోపాలబాలురు అందరిని పిలిచి అందరము ఒక ఆట ఆడదాము అన్నారు. గోపాలబాలురు ఏమి ఆట అన్నారు. ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా అందరము రెండు రెండు జట్లుగా విడిపోదాము. జట్టులో ఇద్దరు ఒకరి తరువాత ఒకరు పది రాళ్లతో మామిడికాయలు కొట్టాలి. ఎవరు ఎక్కువసార్లు కొడతారో వల్లే గెలుస్తారు. గెలిచినా వాళ్ళను ఓడినవాళ్లు వీపుమీద ఏకించుకొని బాండిరకవట వృక్షం దగరకు వెళ్లిన తరువాత దింపాలి అన్నారు. అప్పుడు ప్రలంబాసురుడు ఆలోచించుకున్నారు. శ్రీకృషుడిని చంపటానికి చాలామంది రాక్షసులు వచ్చారు కానీ ఎవరు చంపలేకపోయారు. నేను ఈ సారి ఆ పొరపాటు చేయను నేను బలరాముడికి చంపుతాను లేదా కంసుడికి అప్పగిస్తాను ఆయనే చూసుకుంటాడు. బలరాముడు మాములు మానవుడు, బలహీనుడు నన్ను ఏమి చేయలేడు అని అనుకోని నేను బలరాముడు జట్టులో ఉంటాను అన్నాడు. శ్రీకృష్ణుడి జట్టు సుదాముడు, బలరాముడు జట్టు ప్రలంబాసురుడు మిగిలిన గోపాలబాలురు ఇద్దరు ఇద్దరుగా విడిపోయారు. ముందుగా శ్రీకృష్ణుడు రాళ్లను విసిరారు. వేసిన పదిరాళ్లు మామిడి పళ్లకు తగిలాయి. తరువాత సుదాముడు వేసాడు కానీ ఓడిపోయాడు. ఇప్పుడు బలరాముడు పదిరాళ్లను వేసాడు. పది రాళ్ళూ తగిలాయి. ప్రలంబాసురుడు కావాలనే రాళ్లను పక్కకువేసి ఓడిపోయాడు. ఎందుకంటే బలరాముడిని వీపుపై ఎక్కించుకొని ఆకాశంలోకి తీసుకువెళ్లి చంపేయాలి అని అనుకున్నాడు. మిగిలినవలందరు కూడా ఆడారు. ఇప్పుడు ఓడినవాళ్లు గెలిచినా వాళ్ళను వీపుపై ఏకించుకోవాలను శ్రీకృష్ణుడుని సుదాముడు, బలరాముడిని ప్రలంబాసురుడు ఎక్కించుకున్నాడు. మిగిలిన గోపాలబాలురుకూడా ఓడిన వాళ్ళు గెలినవాలను వీపుపై ఏకించుకొని నడుస్తున్నారు. శ్రీకృష్ణుడు బలరాముడితో మనస్సులో అన్నయ వీడు కంసుడు పంపించిన రాక్షసుడు వాడిని సంహరించు అని చెప్పారు. బలరాముడు మనస్సులోనే సరే అన్నాడు. అందరూ బాండిరక వట వృక్షం దగ్గరకు వెళ్లి దిగారు. కానీ ప్రలంబాసురుడు బలరాముడిని దించక వృక్షం ధాటి వెళుతూనే ఉన్నాడు. అదిచూసి గోపాలబాలురు ఏమిటి వెళ్ళిపోతున్నావు వృక్షం వచ్చింది దించు అని అరిచారు. ఆ ప్రలంబాసురుడు అది ఏమి వినిపించుకోకుండా తన నిజరూపాన్ని ధరించి ఆకాశంలోకి ఎగిరాడు. ఆ దృశ్యం చూడటాన్ని ఇక ఉంది అంటే నల్లటి మేఘంలో తెల్లటి మెరుపు ఉంది. బలరాముడు తెల్లగా ఉంటాడు కదా. బలరాముడు పైకి వెలనించి తన రెండు చేతులతో పిడికిలి బిగించి ఆ ప్రలంబాసురిడి తలపై ఒక దెబ్బ వేశారు. అంతే ఆ ప్రలంబాసురుడు తల పగిలి అక్కడిక్కడే చనిపోయాడు. ఏవిధముగా బృందావనంలో మరో రాక్షసుడి వధ జరిగింది. 

శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరించేవారు.

కొంతకాలానికి వేసవికాలం పోయింది వర్షాకాలం వచ్చింది వర్షాలు పడాయి. బృందావనంలో వ్యవసాయం చేసేవాళ్లు వ్యవసాయపనులు మొదలు పెట్టారు. అక్కడ నల్లని మేఘాలు కమ్ముకొని వర్షం పడుతుంటే నెమళ్ళు పురివిపి నాట్యం చేసేవి. నేమాలల్లో మగ నెమలి మాత్రమే నాట్యం చేసేవి. అవి పురివిపి నాట్యం చేస్తున్నపుడు ఆడనెమలి అక్కడికి వచ్చి మగనెమలి చుట్టు తిరుగుతూ మగ నెమలి కంటి నుండి నీరు కారుతుంది. ఆ నీటిని తాగి ఆడనెమలి గర్భం ధరించి గుడ్లు పెడుతుంది. ఈ ప్రపంచంలో స్త్రీ పురుషుల సంభోగం ద్వారా సంతానం పొందని అస్కలిత బ్రహ్మచారి కేవలం నెమళ్ళు మాత్రమే. శ్రీకృష్ణుడు అయన కూడా నేను అస్కలిత బ్రహ్మచారిణి అని తెలియచేయటానికే తన తలపైన నెమలి పింఛాన్ని ధరిస్తారు. నేను ఇంతమంది గోపికలతో విహరిస్తున్న నేను అస్కలిత బ్రహ్మచారిని అని తెలియజేసేవారు. బృందావనంలో వర్షలు పడిన తరువాత గోపకులు వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. గోపాలకులు ఎక్కువగా గోధుమలు, సేమకం అనే ధాన్యాన్ని పండించేవారు. వర్షాకాలంలో శ్రీకృష్ణుడు గోవులను తీసుకొని దూరంగా వెళ్లకుండా నదుల పక్కన సెలయాల పక్కన మేపుతూ తిరుగుతుండేవారు. శ్రీకృష్ణుడు బృందావనం నుంచి గోవులను తీసుకొని బయటకు వెళ్ళగానే గోపికలు అంత ఒక చోటచేసి శ్రీకృష్ణుడు గోవులు గోవులు అంటూ వాటిని తీసుకొని వెళ్లిపోతారు మనకి కనపడడు శ్రీకృష్ణుడిని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేక పోతున్నాము అని శ్రీకృష్ణుడి కోసం పరితపించేవాళ్ళు. ఒకసారి మగనెమళ్ళూ  వచ్చి నాట్యం చేయటం మొదలు పెటింది. ఆకాశంలో చుస్తే మేఘం లేదు. ఐన నెమళ్ళు ఎందుకు నాట్యం చేస్తుంది అని చూడగా శ్రీకృష్ణుడు దూరం నుంచి వస్తున్నారు అంట. ఒక గోపకాంత ఇంకో గోపకాంతతో ఓ వనిత! శ్రీకృష్ణుడు నల్లని శరీరం కలిగి ఉంటాడు కదా అందుకే నెమళ్ళు ఆయనను చూసి నల్లని మేఘం అని అయన వాయిస్తున్న మురళీనాదం మేఘ గర్జన అని మనస్సులో బ్రహ్మపొంది నెమలి నాట్యం చేస్తున్నాయి. ఆ విధముగా శ్రీకృష్ణుడిని సేవిస్తున్నాయి. ఆ నెమళ్లకు ఉన్న జ్ఞానం మనకి లేకుండాపోయింది అని వాపోయింది. ఇంకో గోపకాంత ఎంత జ్ఞానం ఉంటె ఏమిటి శ్రీకృష్ణుడు ఇప్పుడు కనిపిస్తే అప్పుడు కనిపించడు. శ్రీకృష్ణుడిని చూస్తూ చనిపోవాలి అనిపిస్తుంది. శ్రీకృష్ణుడిని నిత్యం చూస్తూ, మాట్లాడుతూ, ఆయనతో ఆడుకుంటూ సేవిస్తూ చనిపోవాలి అని ఉంటుంది. కానీ అయన కనిపించడు ఎలా కనిపించి ఆలా మాయం అవుతారు ఎంత క్రూరంగా ఉన్నావు ఎప్పుడూ మీ ఆవిడా లక్ష్మి దేవికేనా మాకు కూడా కనిపించే మేము మాత్రం నీ సృష్టి కాదా అని అన్నది. ఇంకో గోపకాంత బ్రహ్మదేవుడు నాకు కనిపించాలి అయన పని చెపుతాని అయన సృష్టిలో ఎన్నిలోపాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు కళ్ళను సృష్టించారు. కానీ కంటికి రెప్పలను పెట్టారు. శ్రీకృష్ణుడు కనిపించేదే అరుదు కనిపించినపుడే తనివితీరా చూద్దాము అంటే ఈ కంటి రెప్పలు అడ్డువస్తున్నాయి. ఈ కంటి రెప్పలు లేకపోతే ఎంత బాగుండును శ్రీకృష్ణుడిని తనివితీరా చూడవచ్చు అనుకున్నది. ఇంకో గోపకాంత  ఓ లక్ష్మివల్లభ! పగలంతా అడవిలో తిరుగుతావు అందుకని పగటిపూట నిన్ను చూడటానికి కుదరదు అప్పుడు మాకు ఒక నిమిషం కూడా ఒక యుగం లాగా గడుస్తుంది. తీరా సాయంత్రం అయింది నువ్వు వచ్చావు నువ్వు మీ ఇంటిలోకి వెళ్లే లోపు నిన్ను చూడము అనుకునే లోపు ఈ కంటి రెప్పలను అడ్డంగా చేసాడు ఆ విధాత ఎంత క్రూరుడు భారతి మాత మేము పైకి వచ్చిన తరువాత నీకన్నా మొరపెట్టుకుంటాము అను అన్న మా భాధని అర్ధం చేసుకొని నీ భర్తతో చేపి మాకు ఈ రెప్పపాటులు తీయించమ్మ కానీ నీ మాటకూడా అయన వింటాడో లేదో నీ మాట విని తరువాత ఆయనపని అయన చేస్తారేమో. అసలే శ్రీకృష్ణుడిని చూడగానే తన్మయత్వంతో కాంతిలో నేన్ను వస్తాయి అందువల్ల సగం చూడలేము మధ్యలో ఈ కంటి రెప్పలు అడ్డం వస్తున్నాయి అని అనుకుంది.  

గోపికల కాత్యాయని వ్రతం

మార్గశిరం, పుష్యం రెండు మసాలాను హేమంత ఋతువు అంటారు. మొదటిమాసమైన మార్గశిర మాసంలో గోపికలంతా ఒక వ్రతాన్ని చేయటానికి సిద్ధమయ్యారు. నందవ్రజంలో ఉన్న గోపికలంతా కలిసి ఒకసారి అనుకున్నారు. మన అందరికి కృష్ణుడే భర్తగా రావాలి అందుకని కాత్యాయని వ్రతం చేద్దాము. ఆ వ్రతం చేస్తే మంచి భర్త లభిస్తారు అని శాస్త్రాలు చెపుతున్నాయి. అందుకని మనం కాత్యాయని అమ్మవారిని పూజ చేద్దాము. అదికూడా నేతితో నింపిన అన్నని అమ్మవారి యజ్ఞంలో సమర్పించి మిగిలిన అన్నాన్ని ఆహారంగా స్వకరిద్దాము. అనుకోని రోజుకి ఒక పుట మాత్రమే భోజనం చేసారు. చలికాలంలో రోజు తెల్లవారుజామున మూడు గంటలకి నిద్రలేచి బయటకు వచ్చారు. మెలకువ రాక నిద్రపోతున్న వారిని నిద్రలేవమని లేపారు. అందరూ కలసి కట్టుగా యమునా నది దగ్గరకు ఒకరి చేయి మరొకరు పట్టుకొని కృష్ణుడి గురించి పాటలు పాడుకుంటూ యమునా నదిదగ్గరకు వెళ్లారు. యమునా తీరమునకు చేరాక ఎవరు లేని నిర్జన ప్రదేశములో దాగంబరంగా స్నానానికి దిగి స్నానం చేసారు. చేసిన తరువాత ఒడ్డుకు వచ్చి బట్టలు ధరించి కాత్యాయని అమ్మవారి విగ్రహాన్ని ఇసుకతో తయారు చేసారు. అమ్మవారికి చామంతి పువ్వులతో కలువ పువ్వులతో తమర పువ్వులతో పూజించారు. నేతి అన్నాన్ని నివేదించి అమ్మవారికి ఉన్న నామాలన్ని చదువుకున్నారు. పూజ అయినా తరువాత తమకు శ్రీకృష్ణుడిని భర్తని చేయమని అమ్మని అడిగేవారు. ఓ భగవతి కాత్యాయని మా అందరికి త్వోరగా శ్రీకృష్ణుడిని భర్తగా చేయి అమ్మ. మాకు శ్రీకృష్ణుడు హృదయవలభుడు(ఆత్మకు భర్త) అయితే పరమాన్నమును, నేతితో చేసిన లడ్డులతో నైవేద్యము చేసి నేతి హోలీ చేస్తాము. లడ్డులతో జాతర చేస్తాము. అని మొక్కుకున్నారు. ఏ విధముగా గోపికలంతా వృత్తం చేస్తుండగా ఇంకా వ్రతం రెండు మూడు రోజులలో అవుతుందనగా శ్రీకృష్ణుడు గోపబాలురతో రేపు అందరూ మూడు గంటలకే నిద్రలేవండీ అందరం అప్పుడే అడవికి వెళదాము అన్నారు. శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే గోపాలబాలురు ఎదురు చెప్పేవారు కాదు. అయన ఏమి చెపితే అదే చేసేవారు. అందరూ మరుసటి రోజు తెల్లవారుజామున నిద్ర లేచారు. ఆ రోజు బలరాముడుని మాత్రం తీసుకెళ్లలేదు. శ్రీకృష్ణుడు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి హరిచేందనం పూసుకొని తిరునామం దిద్దుకొని అందరూ భయాలుదేరారు. శ్రీకృష్ణుడు క్రమంగా గోపికలు అందరూ స్నానం చేస్తున్న దగ్గరకు వెళ్లారు. గోపాలబాలురని తన కన్ను సైగలతో కదలకుండా నిలిపి వేసి శబ్దం చేయకుండా మెల్లగా గోపికలు స్నానం చేస్తున్న దగ్గరకు వెళ్లి వారి విడిచిన చీరలను అన్ని పట్టుకొని చెట్టు ఎక్కారు. ఆ చెట్టు కదంబ వృక్షం. శ్రీకృష్ణుడి పాదస్పర్శ తగలగానే ఆ చెట్టు నుంచి ఒక దివ్య పూరుషుడు బయటకు వచ్చాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి స్వామి! గోలోకంలో రాధాదేవి ఇచ్చిన శాపం వలన ఈ వృక్షం గా నీ పాదస్పర్శ వలన నాకు శాపవిమోచనం అయింది అని నమస్కరించి గోలోకానికి వెళ్లిపోయారు. శ్రీకృష్ణుడు చీరలు పట్టుకొని ఒడిలో పెట్టుకొని కూర్చున్నారు. అంతలో గోపికలు చూసుకొని శ్రీకృష్ణుడే తమ చీరలు తీసుకువెళ్లారు అని తెలుసుకున్నారు. శ్రీకృష్ణుడిని బ్రతిమిలాడుకొంటున్నారు. శ్రీకృష్ణ మా బట్టలు ఎందుకు తీసుకెళువు. మా మన్నాని ఎందుకు తీసుకెళతావు. మేము దిగంబరంగా నదిలో ఉన్నాము. అసలే ఏది చలికాలం మాకు చలివేస్తుంది. మా బట్టలు మాకు తిరిగి ఇచ్చేయి. ఇవ్వకపోతే నందరాజుకి చెపుతాము. ఆడవాళ్లు స్నానం చేస్తుంటే ఒకవేళ మొగవారు పొరపాటున్న అక్కడికి వస్తే కళ్ళు మూసుకొని వెళ్లిపోవాలి అని అంటారు. ఒకవేళ పొరపాటున వచ్చావు అనుకో తామంతా తాము పక్కకి వెళ్లిపోవాలి కానీ ఎలా చీరలు ఎత్తుకెళతారా. దయ లేకుండా మమల్ని ఏడిపిస్తావా. మా మాట విను కృష్ణ మా బట్టలు మాకు ఈపించావు అంటే నీకు శాశ్వతంగా నీకు రుణపడి ఉంటాము. నీకు దాసులమై నిన్ను సేవిస్తూ ఉంటాము. మమల్ని అనుగ్రహించు మా బట్టలు మాకు ఇపించు అని వేడుకున్నారు. నువ్వు ఎన్నో అవతారాలు ఎత్తాలి. అందరిని రక్షించాలి. లోక సంరక్షణ చేయాలి అంతే కానీ ఆడవాళ్ళ బట్టలు ఎత్తుకెళ్ళటం నీకు ధర్మమా శ్రీకృష్ణ నీకు పుణ్యం ఉంటుంది మా బట్టలు మాకు ఇచ్చేయి. ఇవ్వకపోతే యశోదమ్మకు చెపుతాము అని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అయితే వెళ్లి రండి అని అన్నారు. అప్పుడు గోపికలు వెళ్లలేము కనుకనే నిన్ను బ్రతిపిలాడుకుంటున్నాము. అప్పుడు అన్ని విని శ్రీకృష్ణుడు బయటకు వస్తే మీకు బట్టలు ఇస్తాను అన్నారు. అప్పుడు గోపికలు ఎలావస్తాము శ్రీకృష్ణ అన్నారు. అప్పుడు కృష్ణుడు ఎలా వస్తాము అన్నపుడు నదిలోకి దిగంబరంగా ఎందుకు వెళ్లారు. స్త్రీలు నదిలోకి స్నానానికి వెళితే అలా దిగంబరంగా వెళ్లకూడదు. వస్త్రాలు ధరించి వెళ్ళాలి. ఎవరు రారు అని మీరు అనుకోవద్దు. ఇది నది ఎవరైనా ఎపుడైనా ఎక్కడికి రావచ్చును. ఎటువంటి ప్రదేశానికి వేచి వస్త్రాలు లేకుండా స్నానం చేయవచ్చా. మీ పొరపాటు మీరు గ్రహించక కృష్ణ రాకూడదు. వచ్చిన ఎటు చూడకూడదు అంటారా. మీకు వస్త్రాలు కావాలి అంటే నీటిలోనుంచి బయటకు వచ్చి అడిగితే ఇస్తాను అన్నారు. గోపికలు తమలో తామే చేర్చించుకొని అందరూ ఒక మాట అనుకోని శ్రీకృష్ణుడి కోసమే కదా ఈ వ్రతం చేసాము అయన దగర సిగ్గు ఎందుకు అని అందరూ నీటిలో నుంచి బయటకు వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు రెండు చేతులు ఎత్తి నమస్కరించండి అన్నారు. అప్పుడు గోపికలు రెండుచేతులు ఎత్తి నమస్కరించారు. శ్రీకృష్ణుడు వారి వస్త్రాలు ఇచ్చి గోపికలారా ! మీరు చేస్తున్న వ్రతంలో లోపం ఉన్నదీ. దాని వలన కాత్యాయని మాతకు కోపం వచ్చింది. నేను ఆ లోపాన్ని సరిచేయడానికి వచ్చాను. మీరు నదిలో ఎలా దిగంబరంగా స్నానం చేయకూడదు. ఇంట్లోనే చేయకూడదు అంటే మీరు నదులోనే చేస్తున్నారు ఇది మహాపాపం. మీరు నన్ను ఆరు సంవత్సరాల బాలుడిగా మాములు మనిషిగా అనుకుంటే నేను అల్లాగే ప్రవర్థించేవాడిని. నేను పరమాత్మను, పరబ్రహ్మను అని తెలుసుకున్నారు. అందుకని మీ లోపాలను సరిచేయడానికి వచ్చాను. పరమాత్మ భర్తగా రావాలి అంటే దేహభ్రాంతిని వదిలేయాలి అవధూతగా మారాలి. సృష్టిలోని చిన్న అణువు నుంచి సమస్త బ్రహ్మాండాలలో నేనే నింది ఉన్నాను. నేను చూడని మర్మాలు మీకు ఎక్కడ ఉన్నవి. సమస్త ప్రాణులను  సృష్టించి పోషించి లయం చేసేది నేనే నాకు తెలియని మర్మాలు మిలో ఎక్కడ ఉన్నాయి. ఇకమీదట ఎటువంటి తప్పు చేయకండి. ఎప్పుడు నదిలోకి దిగంబరంగా వెళ్లకండి అని మందలించారు. అప్పుడు గోపికలు మనం ఎంత పొరపాటు చేసాము. వ్రతంలో లోపం జరిగింది. వస్త్రాపహరణం అంటే దేహభ్రాంతి పోవటం, జీవభ్రాంతి పోవటం. శ్రీకృష్ణుడు అంటే జగత్తుకు గురువు అయన చూపిన మాటవినలేదు అందుకనే ఇంకో లోపం వచ్చింది. ఇంకోసారి శ్రీకృష్ణుడిని మనసారా నమస్కరిధ్దము అని మళ్ళి నమస్కరించారు. అలా నమస్కరించంగానే వారిలో ఉన్న జీవాత్మ పరమాత్మ అయినా శ్రీకృష్ణుడిని కలిసింది. వాళ్ళు వస్త్రాలు ధరించి ఇంకా మేము ఇంటికి వెళ్లము అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అలాచేయకూడదు ఇంకా రెండు మూడు రోజులు వ్రతం ఉంది.దానిని పూర్తి చేయండి. నా శరీరం పరమ పవిత్రమైన శరీరం. ఇది కామ శరీరం కాదు యోగ శరీరం. ఐన మీరు భోగాలు కోరుకుంటున్నారు కనుక శరత్ కాలములో మీతో కలిసి నాట్యం చేస్తాను మీ కోరికను నెరవేరుస్తాను. ప్రస్తుతానికి మీరు వెళ్లిపోండి అని చెప్పారు. అప్పుడు గోపికలు శ్రీకృష్ణుడి నుండి సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన తరువాత ఆత్మ పరమాత్మను వదలలేదు అన్నటుగా శ్రీకృష్ణుడిని వదలేక వదలేక వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్లలేక వెళ్లలేక వెళ్లారుఅప్పుడు శ్రీకృష్ణుడు గోపాలబాలురని మాయ నుండి బయటకు తీసుకు వచ్చారు. అప్పుడు గోపాలబాలురు శ్రీకృష్ణ  ఏమైంది అని అడిగారు. ఏమి కాలేదు మనం అడవిలోకి వెళదాము పదండి అని గోపాలబాలురతో శ్రీకృష్ణుడు గోవులను తోలుకుంటూ వెళ్లారు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...